13, జూన్ 2015, శనివారం

పద్య రచన - 931

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. అతివల కైదవ తనమట
    ప్రతియింటను సుదతు లంత పరమ ప్రీతిన్
    లతలను రంజిలు చుక్కలు
    బ్రతుకున గోరింట పండ భాగ్య మటంచున్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పేరంటమునకు బోవగ
    గోరింటను బెట్టుకొనుచు కోమలు లచటన్
    తీరికగా నొకరి కొకరు
    నేరుపుగా దిద్దు చుండె నెయ్యము తోడన్!!!

    రిప్లయితొలగించండి
  4. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అరచేతుల గోరింటను
    మురిపెముగా పెట్టుకొనుచు ముచ్చటగొలిపెన్
    తరుణుల మోములు కళకళ
    మెరయుచు గృహమంత శోభ మిక్కిలుచుండెన్

    రిప్లయితొలగించండి
  6. ఆ.వె: పడతుల కఱచేత పచ్చని గోరింట
    నెంత యేఱ్ఱ నైన నంత సౌఖ్య
    మనుచు సంబరాన మానిను లెల్లరు
    దిద్దు కొంద్రు గనుడు దీక్ష తోడ.

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పెట్టుకొనుట ముచ్చటగొలిపెన్’ అనండి. అన్వయం బాగుంటుంది.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పేరంటపు సమయమ్మున
    గోరింటాకుంచుచుంద్రు కొమ్మలు కయిపై
    పారాణిఁబెట్టి కాళ్ళకు
    కేరింతలఁగొట్టుచుంద్రు గృహములలోనన్

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. చిత్ర మయ్యది జూడుము చిత్ర ! నీవు
    అతివ లచ్చట గుమి గూడి యందముగను
    నొకరి కినొకరు ముదమున నొప్పు గాను
    దనరు గోరింటాకు ను బెట్టు కొనుచు నుండె

    రిప్లయితొలగించండి
  11. ఆ.వె: పడతుల కఱచేత పచ్చని గోరింట
    నెంత యేఱ్ఱ నైన నంత సౌఖ్య
    మనుచు సంబరాన మానిను లెల్లరు
    దిద్దు కొంద్రు గనుడు దీక్ష తోడ.

    రిప్లయితొలగించండి
  12. గోరంట్లాకే బండగ?
    కోరిన మగడందు ననుచు కోర్కెల జేతన్
    తీరిక లందున కన్యలు
    జేరియు కళలందు కళనుచిగురించిరిటన్|
    2.ఐక్యత గుర్చునా?ఆనంద మొసగునా?
    -------ఆకుపసరుకేల అంతఎరుపు?
    చేతుల సొగసుకా?చేయూత ప్రేమకా?
    -------కళలను బెంచేటి కాంత కొరక?
    రోగనివారణా?రూపసి దక్షణా?
    --------ఆకు పాకములందు షోకులేల?
    అభిమాన బంధమా?అనురాగ గంధమా?
    ------పండుగ పబ్బముల్ పండుకొరక?
    వయసు బేధము లేకనే వనితలెల్ల
    ఇష్ట పడగ-గోరంట్లాకు పుష్టియనగ
    అందచందాల కెరువుగా నల్లుకొనియు|
    చేతి రేఖలు మార్చులే జాతి మరచి|

    రిప్లయితొలగించండి
  13. పండుకొను చెల్లి చేతిని
    పండిన నా చిన్నదాని పలుచటి చేతిన్
    పండగ జేయగ బెట్టిరి
    పండుగ గోరింట పండ, భాగ్యము మీదే !

    రిప్లయితొలగించండి
  14. చెలులొక్క చోటఁ జేరియు
    తలపులు తెరిచియు వరించు తరిదాల్పునకై
    పులకలు పోవుచు సరసఁపు
    పలుకుల, గోరింటఁ దీర్చు భంగమలొదువెన్!

    రిప్లయితొలగించండి
  15. నిన్నటినుండి ప్రయాణంలో ఉండి ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘నీవు+అతివ’లన్నప్పుడు సంధి నిత్యం. ‘నీవె యతివ’లనండి.
    ‘గోరింటాకు’ అన్నచోట గణదోషం.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మనోహరంగా ఉన్నాయి మీ పద్యాలు. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి