విజయకుమార్ గారూ, చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు. ‘చాంపల్య’మన్న మాట లేదు. అక్కడ చాపల్యము లేదా చాంచల్యము అనండి. (మీ వారగణనం విషయమే మరిచిపోయాను. మన్నించాలి. నేను హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమంలో చేరాను. ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. కాస్త స్తిమితపడ్డాక దానిని బ్లాగులో ప్రకటిస్తాను.)
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ఉత్పలమాల రెండవపాదంలో గణదోషం. ‘...యివేమిటి యన్న...’ అనండి.
మిక్కిలి రుచికర మైనవి
రిప్లయితొలగించండిచక్కిల ములుచేత చుట్టె చాతుర్యమునన్
మక్కువగా తినగోరిన
లెక్కకు మించినవి లేవు లేశమె కనగన్
అతిలాలస సమేత శంకరా !
రిప్లయితొలగించండిచక్కిలము నీ భూలోకము !
యంత్ర మధ్యస్థ కౌమారీ !
నీ సరిజోదు గుండు జిలేబియే !
శుభోదయం
జిలేబి
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
శుభోదయం! నేను కారంకారంగా బొమ్మ పెడితే మీరు తీయతీయగా వ్యాఖ్య పెట్టారు.
వ్యసన మొక్కటి మానుట వశము కాదు
రిప్లయితొలగించండి'చక్ర' చాంపల్య మేరీతి చంప నేర్తు?
అమ్మ నను వీడు గాక - ఆ అమృత హస్త
మంత్ర సైపుణ్య మొక్కింత మరచుటెట్లు?
విజయకుమార్ గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
‘చాంపల్య’మన్న మాట లేదు. అక్కడ చాపల్యము లేదా చాంచల్యము అనండి.
(మీ వారగణనం విషయమే మరిచిపోయాను. మన్నించాలి. నేను హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమంలో చేరాను. ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. కాస్త స్తిమితపడ్డాక దానిని బ్లాగులో ప్రకటిస్తాను.)
గురువు గారూ,
రిప్లయితొలగించండిసవరణకు ధన్యవాదాలు. చాపల్యమే సరి.
చిత్ర మయ్యది జూడుము చిత్ర ! నీవు
రిప్లయితొలగించండిచక్కిలములను జూడగ చక్క నుండె
కార మెక్కువ గలవేమొ ? యేరి యొకటి
తీసి కొనిరమ్ము దయతోడ తిందు నిపుడు
జంతికలరుచి కరము పసందు సుమ్మ
రిప్లయితొలగించండిపిల్లలును పెద్దలును కొంద్రు ప్రీతితోడ
చిఱుతలకు చిరుతిండిగా చేయుచుంద్రు
పల్లెసీమలయందున నెల్లరిండ్ల
మక్కువ మీరగ నందరు
రిప్లయితొలగించండిచక్కగ తినుచుంద్రుజేయ చక్కిలములనే
మిక్కిలిగ జేసి యుంచిన
నిక్కముగా నిల్వయుండు నెక్కువ దినముల్!!!
సంతు సెలవంచుఁ గూడగ
రిప్లయితొలగించండిసంతస మందుచుఁ దినగను సాయంత్రములన్
జంతిక లింటను జేసెడు
నింతులలో తల్లి మనసు నీశ్వరుడెరుగున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఉత్పలమాల రెండవపాదంలో గణదోషం. ‘...యివేమిటి యన్న...’ అనండి.
చుక్కల చీర గట్టుకొని చుక్కలు జూడని శోభనంబునన్
రిప్లయితొలగించండిప్రక్కనజేరి ,చక్కిలలు బట్టి-యివేమిటియన్న?భర్త “నీ
చెక్కిలి ముద్దులన్నియును చేరియు గుండ్రని రూపు దాల్చియే
చక్కిలమన్న నామమున సాగె నటంచును బల్కె భార్యతో.”
2.కరకర నమలగ చెవులట
రిప్లయితొలగించండిగురగుర కంఠాన వచ్చు గురకయు విని?వే
గిరమున చక్కిలములుఓ
అరుగున గనుపించ గానె?ఆగెనుగురకే