పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘మెలగే’ అని వ్యావహరికాన్ని ప్రయోగించారు. ‘మత్తును గను నా| యుద్యోగికి...’ అందామా?
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘హృదయము లాగా’ అన్నదానిని ‘హృదయము పోలెన్’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువుగారూ, పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే? = వహ్వా అంటారు అని అర్థం కదా!
మరి పూరణల్లో చాలా మట్టుకు పద్యమ్మును వ్రాసిన వహ్వా యనరే అని అర్థం వచ్చేలా వ్రాస్తున్నారు. నా అయోమయాన్ని తొలగించగలరు. ఒక పూరణలో విడియున్ అని ఉంది . అంటే విడిచి కూడా అని అర్థం వస్తుందంటారా? అది ఎవరు వ్రాశారని మళ్ళీ చూసినా ఎక్కడుందో కనపడలేదు.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు. చివరి పద్యంలో ‘వ్రాసే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పద్యరచనమన్| విద్యను నేర్వక...’ అంటే ఎలా ఉంటుంది?
నేను తీసుకున్న పరీక్షలలో గాని , వ్రాసిన పద్యాలలో గాని యింత వఱ కెప్పుడూ కాపీ కొట్ట లేదు. కాని యీ దినమా పని చెయ్యాలని అనిపించింది. ( మిస్సన్న గారికి ధన్యవాదములతో , గురువుగారు పట్టుకొనరనే ధీమాతో ,)
సద్యస్స్ఫురణము శూన్యము నాద్యంతము ప్రాసపాట్లు యతులకు వెతలున్ చోద్యము నా పద్యము! నే పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీరు చెప్పకుంటే నేను ఇది మీ పద్యమే అనుకొని “మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు” అనే వాడిని. నాకసలే మతిమరపు. కాకుంటే ఈ పద్యం ఎక్కడో చదివినట్లు ఉందే అనుకొనేవాడిని. అంతేకాని పైకి స్క్రోల్ చేసి చూసేవాడిని మాత్రం కాదు!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, క్షమించాలి... ఎందుకో మీ పూరణ తప్పిపోయింది. ఛందోవ్యాకరణాలు రానివాళ్ళు పద్యాన్ని ఉపేక్షించడం సహజమే. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి మిత్రులు సహదేవుడు గారికి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిపద్యము నేర్పును తానొక
రిప్లయితొలగించండియుద్యమముగ శంకరార్యులుత్సాహముతో
హృద్యమ్ముగ క్రొత్త కవులు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే
సద్యో జాతుడు గురువట
రిప్లయితొలగించండియుద్యతిగా చదువు నేర్పు నుత్సాహముగన్
హృద్యమ్ముగ సవరించుచు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే
సోదరులు శ్రీ సహదేవుడు గారికి జన్మదిన శుభా కాంక్షలు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలు!
శ్రీవాణీగిరిజేశుల
దీవనలు శుభంబు లిడగ దీపించెడు గుం
డా వేంకట సుబ్బయ సహ
దేవుడు! మీ కివియె జన్మదిన శుభకాంక్షల్!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిసుకవి మిత్రులు శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుఁడుగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! వారికి భగవంతుఁ డాయురారోగ్యైశ్వర్యసుఖసంతోషశాంతులను, సత్వర కార్యసాఫల్యతను, సంతృప్తిని, శుభములనుఁ బ్రసాదించుఁగాక!
నా పూరణము:
హృద్యమ్మగు భావము విడి;
సద్యశముం గలుగఁ జేయు చతురత విడియు;
న్నాద్యంతము రసమును విడి
పద్యమ్మును వ్రాయకున్న "వహ్వా!" యనరే!
(లేక)
హృద్యమ్మగు భావముతో;
సద్యశముం గలుగఁ జేయు చతురత తోడన్;
న్నాద్యంతము రసయుతముగ
పద్యమ్మును వ్రాయకున్న "వహ్వా!" యనరే?
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిసుకవి మిత్రులు శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుఁడుగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! వారికి భగవంతుఁ డాయురారోగ్యైశ్వర్యసుఖసంతోషశాంతులను, సత్వర కార్యసాఫల్యతను, సంతృప్తిని, శుభములనుఁ బ్రసాదించుఁగాక!
నా పూరణము:
హృద్యమ్మగు భావము విడి;
సద్యశముం గలుగఁ జేయు చతురత విడియు;
న్నాద్యంతము రసమును విడి
పద్యమ్మును వ్రాయకున్న "వహ్వా!" యనరే!
(లేక)
హృద్యమ్మగు భావముతో;
సద్యశముం గలుగఁ జేయు చతురత తోడ;
న్నాద్యంతము రసయుతముగ
పద్యమ్మును వ్రాయకున్న "వహ్వా!" యనరే?
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిఇంతకుముందే అన్నాను... ‘మీ కత్తికి రెండువైపులా పదునే’ అని! మీ రెండు (పూరణలు అనరాదు) విధాల పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పద్యము వ్రాయుట నేర్చుకు
రిప్లయితొలగించండిపద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే !
హృద్యముగ వ్రాయువారిని
నాద్యంతము మెచ్చు కొండ్రు హర్షము తోడన్
ధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపూరణ:సేద్యమొనరించె పోతన
ఆద్యుండౌ హరికి కృతిని యంకిత మిచ్చెన్
మద్యాసక్తుల బొగడుచు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా
యనరే
2.విద్యా వివేకహీనుని
మద్యమ్మును గ్రోలి రతుల మత్తున మెలగే
ఉద్యోగిని నిరసించుచు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా
యనరె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మెలగే’ అని వ్యావహరికాన్ని ప్రయోగించారు. ‘మత్తును గను నా| యుద్యోగికి...’ అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూరణ:3. ఖద్యోతను కృపచేతను
రిప్లయితొలగించండిసద్యొ గర్భమున కుంతి సత్పుత్రు గనెన్
వేద్యుడువ్యాసుండీకథ
పద్యమ్మున వ్రాయకున్న వహ్వా యనరే?!
4.విద్యను వ్యాపారముగా
సద్య్హ్ఫలితమ్ము వచ్చు ఛాత్రులకనుచున్
విద్యాశాలల బొగడెడి
పద్యమ్మున వ్రాయకున్న వహ్వా యనరే?!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘హృదయము లాగా’ అన్నదానిని ‘హృదయము పోలెన్’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువుగారూ,
రిప్లయితొలగించండిపద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే? = వహ్వా అంటారు అని అర్థం కదా!
మరి పూరణల్లో చాలా మట్టుకు పద్యమ్మును వ్రాసిన వహ్వా యనరే అని అర్థం వచ్చేలా వ్రాస్తున్నారు. నా అయోమయాన్ని తొలగించగలరు.
ఒక పూరణలో విడియున్ అని ఉంది . అంటే విడిచి కూడా అని అర్థం వస్తుందంటారా? అది ఎవరు వ్రాశారని మళ్ళీ చూసినా ఎక్కడుందో కనపడలేదు.
నాకు జన్మదిన శుభకామనలందజేసిన గురుదేవులకు, సుకవిమిత్రులకెల్లరకును మరియు సోదర వాత్సల్యము చూపిన అక్కయ్యగారికినీ పేరు పేరునా ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమద్యపు వ్యాపారంబున
రిప్లయితొలగించండినుద్యోగికి పద్య విద్య లొనగూడినఁ దా
మద్య ప్రచార పూరక
పద్యమ్మును వ్రాయ కున్న వహ్వా యనరే?
విద్యార్థులు చదువుకొనగ
రిప్లయితొలగించండిపద్యమ్ములనల్లి భావిపౌరుల జేయన్
వేద్యంబగు నొక విలువగు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే!
వేద్యంబగు నంశముతో
చోద్యంబేమియును లేని సొబగులతోడన్
ఆద్యంతము రసమయమగు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే!
సద్యస్స్ఫురణము శూన్యము
రిప్లయితొలగించండినాద్యంతము ప్రాసపాట్లు యతులకు వెతలున్
చోద్యము నా పద్యము! నే
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే!
ఒక సందెహం సమస్య అర్ధం పద్యంవ్రాయకపొతె వహ్వ అనరూ అని అర్ధము మరి కొన్ని పూరనణలలో ఈ భావం వ్యక్తమయ్యిందా చూడగలరు.
రిప్లయితొలగించండిసాహితీ సద్గుణ సంపన్నులైన గుండా వేంకట సుబ్బ
రిప్లయితొలగించండిసహదేవుడుగారికి జన్మ దిన శుభా కాంక్షలు
ఉద్యమ మందున పద్యము
అద్యయనము నందు పట్టు నందించుటకై
సద్యుల సంతస మొసగే
పద్యమ్మును వ్రాయకున్న?వహ్వాయనరే?
2.పద్యము పరుగిడు గుఱ్ఱము
గద్యము రెండెడ్ల బండి కదలిక యగు |ఈ
మద్యన ననువగు రీతిగ
పద్యమ్మును వ్రాయకున్న ?వహ్వా యనరే?
పద్యమ్మను పదకమ్మును
రిప్లయితొలగించండిహృద్యమ్ముగ శంకరయ్య హృదయమువోలెన్
గద్యమ్మందున గాకను
పద్యమ్మును వ్రాయకున్న?వహ్వాయనరే.
కవిమిత్రులు శ్రీ ఈశ్వరప్పగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండికవిమిత్రులు శ్రీ గుండా వేంకట సుబ్బ
రిప్లయితొలగించండిసహదేవుడుగారికి జన్మ దిన శుభా కాంక్షలు
5.హృద్యంబగు ఘజలు లనెడి
పద్యమ్మును వ్రాయకున్న"వహ్వా'యన రే
తద్యోగము సిధ్ధించగ
యుద్యోగింపుడు ఘజలును యుర్దూ భాషన్
గద్యపు ప్రేమికులు సతము
రిప్లయితొలగించండిపద్యము ద్వేషించు చుంద్రు వ్యాకృతి రాకన్
తధ్యము గా నట్టి జనులు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వాయనరే!
కవిమిత్రులు శ్రీ కెంబాయి తిమ్మాజీ గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండి‘ఏ’ శబ్దాన్ని సందర్భానుసారం నిశ్చయార్థకంగా, ప్రశ్నార్థకంగా, ఆశ్చర్యార్థకంగా ప్రయోగించవచ్చు. ‘అనరే’ అన్నశబ్దానికి అంటారుకదా, అనరెందుకు?, అనరా? అనే అర్థాలు చెప్పుకోవచ్చు. (ఒకసారి ఆంధ్రభారతిలో ‘ఏ’ అర్థాలను పరిశీలించండి).
ఇక విడియున్ అన్న పదం ఏ పూరణలో ఉందో నాకూ గుర్తులేదు కాని, దానికి విడిచిపెట్టికూడ, విడిచికూడ అని అర్థాలున్నాయి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పిరాట్ల.వెంకటశివరామ కృష్ణప్రసాదు గారూ,
దయచేసి పైన లక్ష్మీదేవి గారికిచ్చిన సమాధానాన్ని చూడండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘పద్య|మ్మద్యయనము...’, ‘సంతస మొసగెడు’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో ‘ఘజలును+ఉర్దూ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఉద్యోగింపుండు ఘజలు నుర్దూభాషన్’ అనండి.
విద్యాగంధము లలరెడి
రిప్లయితొలగించండియుద్యానవనమ్ము లోన నుద్దీపితమౌ
పద్యసుమావళి మూర్కొని
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే !
నాకు వ్రాయడము కంటె చదువుకొని ఆనందించడమే సౌఖ్యముగా నుంటుంది .
శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండి1) హృద్యమ మీ కవిత లనుచు
పద్యమ్మని యతులు గతులు ప్రాసలు ఛందో
విద్యనెరుంగని కుకవులు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే.
2) విద్యార్ధి జూపె కై తను
పద్యంబని గణము యతులు ప్రాసల తోడన్
హృద్యమ మై; లోపము గల
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే.
సద్యస్ఫురితంబగు నొక
రిప్లయితొలగించండిపద్యమ్మును వ్రాయకున్న ,వహ్వా యనరే
పద్యప్రియులైన నదియె
విద్యాదేవికి ప్రియమగు, వేడుకఁ గూర్చున్.
గద్యము,పద్యము కలసిన
రిప్లయితొలగించండిహృద్యపు చంపూ కవనము,నేపగు శబ్దాల్
గద్యము నింపుగ వ్రాసిన,
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే!
పద్యము వ్రాయగ,నదియు,న
వద్యము కానిది హరువగు వద్యము నైనన్
హృద్యము కాదను నట్టిది
పద్యమ్మును వ్రాయకున్న వహ్వాయనరే!
పద్యమున నలంకారము,
గద్యము పదముల నడకయు,కవితను మేలౌ
విద్యయ,లేకున్నను తా
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే!
పద్యము ఛందో హృద్యము
పద్యమునది రాగయుతము,పద్యము వ్రాసే
విద్యను నేర్వక,దొసగుల
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే!
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
చివరి పద్యంలో ‘వ్రాసే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పద్యరచనమన్| విద్యను నేర్వక...’ అంటే ఎలా ఉంటుంది?
శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండికవి మిత్రులు సహదేవుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండిఆద్యంతము కవులచ్చట
రిప్లయితొలగించండిచోద్యమ్మే, పద్య శోభ జూడక కవితల్
గద్యమును వ్రాసి నిలువుగ
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే !
గురువర్యులకు నమస్సులు. నా పూరణనుకూడా పరిశీలించండి.
రిప్లయితొలగించండినేను తీసుకున్న పరీక్షలలో గాని , వ్రాసిన పద్యాలలో గాని యింత వఱ కెప్పుడూ కాపీ కొట్ట లేదు. కాని యీ దినమా పని చెయ్యాలని అనిపించింది. ( మిస్సన్న గారికి ధన్యవాదములతో , గురువుగారు పట్టుకొనరనే ధీమాతో ,)
రిప్లయితొలగించండిసద్యస్స్ఫురణము శూన్యము
నాద్యంతము ప్రాసపాట్లు యతులకు వెతలున్
చోద్యము నా పద్యము! నే
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీరు చెప్పకుంటే నేను ఇది మీ పద్యమే అనుకొని “మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు” అనే వాడిని. నాకసలే మతిమరపు. కాకుంటే ఈ పద్యం ఎక్కడో చదివినట్లు ఉందే అనుకొనేవాడిని. అంతేకాని పైకి స్క్రోల్ చేసి చూసేవాడిని మాత్రం కాదు!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిక్షమించాలి... ఎందుకో మీ పూరణ తప్పిపోయింది.
ఛందోవ్యాకరణాలు రానివాళ్ళు పద్యాన్ని ఉపేక్షించడం సహజమే. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమూర్తిమిత్రమా! ఆపద్యంలోని భావం నాకు మాత్రమే అన్వయం అవుతుంది. మీ బోంట్లకు కాదు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచోద్యమ్మగు పదములతో
తొలగించండిహృద్యమ్ముగ వ్రాయమనిన హీహీ యనుచున్
వేద్యమవని దత్తపదిది
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే :)
రిప్లయితొలగించండివేద్యంబగు యత్నింపగ
మద్యంబునకన్న తీపి మధువిది వినుడోయ్
విద్యార్థులార గురువులు
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే:)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహృద్యపు మెప్పుల నందెడు
రిప్లయితొలగించండిసద్యశమును గోరి మెండు చవటడు నైనన్
గద్యము లెన్నియొ వ్రాసిన
పద్యమ్మును వ్రాయకున్న వహ్వా యనరే