7, జూన్ 2015, ఆదివారం

పద్య రచన - 925

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. చేరుచు జూడరే వరుడె శ్రీహరి యంచు తలంచినంతటన్
    దారికి నడ్డు లెమ్ము సిత తామరలందున నిల్చునట్టి యా
    శ్రీరమణీలలామ యిట శ్రీఘ్రము వేదికనెక్క వచ్చెడిన్
    వారధి మేనమామలుగ వన్నెలు చిందుచు నవ్వు రువ్వుచున్!!

    రిప్లయితొలగించండి
  2. జిగురు సత్యనారాయణ గారూ,
    చక్కని పద్యంతో బోణీ చేశారు. మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అక్కకు బుట్టిన పిల్లను
    ఇక్కడ నొక బుట్టనుంచి ఇచ్చుచునుండెన్
    చక్కని వరునికి మామలు
    అక్కరలో బరువు కాదు హాయేయనుచున్.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పిల్లను+ఇక్కడ, మామలు+అక్కర’ అన్నప్పుడు సంధి నిత్యం. విసంధిగానో, యడాగమంతోనో వ్రాయరాదు. మామలు బహువచనం, ఇచ్చుచునుండెన్ ఏకవచన మయింది. ‘హాయి+ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. మీ పద్యానికి నా సవరణ... (వరుడే కాదు, మేనమామలూ చక్కనివారే)
    అక్కకు బుట్టిన కన్యక
    నిక్కడ నొక బుట్టునుంచి యిత్తురుగాదా
    చక్కని మామలు వరునకు
    నక్కరతో బరువు కాదు హాయియె కలుగున్.

    రిప్లయితొలగించండి
  5. గౌరిని పూజ చేసి తన గాటపు ప్రేమలు మించ కన్య తా
    జేరగ వచ్చుచుండినది శ్రీకరలగ్నము నందు నెచ్చెలున్
    మీరిన మాల్మి మామ లదె మెచ్చగ నల్వురు బుట్టనుంచి యిం
    పారగ దెచ్చు వేడ్క యిది వైభవమౌ గన పెండ్లి వేళలో.

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. భామ తీరెనుపెళ్లికూతుగఁ బట్టు చీరను గట్టియున్,
    మామలెల్లరు బుట్ట లోనను మంగళమ్మని దెచ్చినన్,
    శ్రీమనోహరుడంటి వాడట లేమ లక్ష్మిసమమ్మనన్
    హేమపూరిత తాళిఁగట్టగ నింపు గూర్చదె పెళ్లి యున్!

    రిప్లయితొలగించండి
  8. కోమలి పెళ్లి కూతురని కూర్చొన?బుట్టన మేనమామ లౌ
    మామల దీవెనల్ తనకు మంత్రపు జల్లులటంచు నెంచుటే|
    ప్రేమకు పెత్తనంబిడుట|పేదయు,గొప్పనుబేధ భావముల్
    తామస మెంచబో రిచట|తర్క వితర్కము లేని పద్దతే

    రిప్లయితొలగించండి
  9. బుట్ట-తోబుట్టు బిడ్డనే-చుట్టుకొనగ?
    ఎత్త బూనంగ రారండు పెత్తనాన
    బరువు,భాధ్యత మోసెడి తరుణ మిదియె
    మరల రానట్టి కార్యమో మామలార
    చిన్నతనమున ఎత్తిన చేతులనుచు
    ధైర్య,సాహస మున్నచో దరికి రండు
    పెళ్లి కూతురుహాస్వమే కళ్ళ తుడుపు
    మేన మామలప్రేమకు మేలి ముసుగు|

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ మత్తకోకిల మనోహరంగా ఉంది. అభినందనలు.
    మూడవపాదంలో ‘వంటి’ని ‘అంటి’ అన్నారు. ‘లక్ష్మీసమమ్ము’ అని సమాసం చేయాలి. ఆ పాదాన్ని ‘శ్రీమనోహరు డంతవాడట లేమ లక్ష్మికి సాటిగా’ అందామా?
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘మేనమామలౌ మామలు...’?
    ‘ధైర్యసాహసాలున్నచో’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు సూచన...
    మీరు వ్యాఖ్యను టైపు చేసిన తర్వాత క్రింద ‘నేను రోబోటును కాను’ అన్న దానిని పట్టించుకోకండి. క్రింద ఉన్న వ్యాఖ్యను ప్రచురించండి అన్నదానిని క్లిక్ చేస్తే చాలు.

    రిప్లయితొలగించండి

  12. పద్య రచన: గంప పెళ్ళికూతురు

    మామలు, పెళ్ళికూతురను మన్మధ బాణము, గంపవిల్లునన్
    నీమము, నిష్ఠ తెచ్చిరట, నెత్తిని బెల్లము, జీలకఱ్ఱయున్,
    ప్రేమగబెట్టి తాళి తన గ్రీవమునన్ ధరియించి, జీవన
    మ్మాముగ భర్తతోడవగ హాయిని నింపి చరింపగా నిలన్

    రిప్లయితొలగించండి
  13. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురుదేవులకు ధన్యవాదములు.అలా సవరిస్తే నాల్గవపాదమునకు అన్వయం సరిపోదేమోనండి.

    రిప్లయితొలగించండి
  15. మాతుల వర్యులు నల్వురు
    చేతుల బుట్టన నిడుకొని చెన్నగు రీతిన్
    నూతన వధువును దెచ్చిరి
    మోతగ మంగళ రవంబు మ్రోయుచు నుండన్

    రిప్లయితొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    నాకైతే అన్వయలోపం కనిపించడం లేదు. ‘సాటిగా’ అన్నదానిని ‘సాటియౌ’ అన్నా సరిపోతుంది.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురుదేవులు సూచించిన చక్కని సవరణతో :
    భామ తీరెను పెళ్లికూతుగఁ బట్టు చీరను గట్టియున్,
    మామలెల్లరు బుట్ట లోనను మంగళమ్మని దెచ్చినన్,
    శ్రీమనోహరుడంత వాడట! లేమ లక్ష్మికి సాటియౌ!
    హేమ పూరిత తాళిఁ గట్టగ నింపు గూర్చదె పెళ్లియున్!

    రిప్లయితొలగించండి