చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పచ్చనిదుస్తులున్ దొడిగి|బాలిక లుంచిన పాఠశాలలో నచ్చిన చెట్లు”కొమ్మలప్రణాలికలందున విద్య నేర్చుచున్”| కచ్చిత మైన గాలి, మన కందగ పువ్వులు,పండ్లు నిచ్చుచున్ మెచ్చెడి మార్కు లివ్వకనె?మేధకుశక్తని చెట్లు బెంచుటౌ
పి.యస్.ఆర్. మూర్తి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘పచ్చదనము కొఱకు పాటుపడుటచేత’ అందామా? ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘శక్తి+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. కాకుంటే బ-భ లకు ప్రాస వేశారు.
పచ్చ దనము కొరకు పాటు పడుచునున్న
రిప్లయితొలగించండిభావి పౌరులైన పాపలార
చెట్లు నాటి మీరు చిరుప్రాయమందైరి
ధరణి జనులమార్గదర్శకులుగ
గాంధీ జూపిన బాటను
రిప్లయితొలగించండిబాంధవమున గౌర వించి బందీ లవగన్
పాంధులకు నీడ నీయగ
నాందీ పలుకంగ నిటుల నాటెద మనుచున్
క్ష్మాజములను నరక కాంక్రీటు జంగిలై
రిప్లయితొలగించండిభూమితాపమొంది పొక్కు చుండ
సెలవుదినములందు చిఱుతలందరుఁజేరి
మొక్కలూడ్చుచుండ్రి ముదముతోడ
చెట్లు భూమి తల్లి స్నేహ హస్తమ్ములు
రిప్లయితొలగించండిచెంత జేర నీకు సేవ సేయు
వాటి నాటఁ జేసి వనముల బెంచంగ
ధన్యులైతిరమ్మ తల్లు లార
పర్యావరణ దినోత్సవ
రిప్లయితొలగించండిమర్యాదను తెలుసుకొనుచు మరి బాలికలే
కార్యోన్ముఖులై నాటెడు
కార్యక్రమమును సలిపిరి కడు మోదముతో
వాన కురిసెడి ఋతువని పూని ప్రతిన
బాల లందరు మొక్కలఁ నేలపైన
నాటుచుండిరి యెంతయో పాటుపడుచు
రక్షణముజేయ వలెవాని ప్రతిదినమ్ము!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
.ఆ.వె:బాలబాలికలట పచ్చని మొక్కలు
రిప్లయితొలగించండిదేశమందు నాటి దీక్ష తోడ
పాదు చేసి పెంచ ఫలములొసగు గాన
వృక్షములను పెంచి వృద్ధి గనుడు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
భావి భారత యింతులు భవ్య ముగను
రిప్లయితొలగించండిముద్దు లొలికించు మొగముతో ముద్దు గాను
నాటు చుండిరి మొక్కను నగవు తోడ
చూడ ముచ్చట గగలరు చూడుమార్య !
చక్కగ బాలిక లందరు
రిప్లయితొలగించండిమొక్కల నట నాటుచుండె మురిపెము తోడన్
పెక్కురు నిది జేయు నెడల
మిక్కుటమగు మేలు జరుగు మేదిని యందున్!!!
నీడనొసంగెడు తరువుల
వేడుకతో బెంచవలయు వీధుల యందున్
వీడున బెంచగ పచ్చగ
జూడగ నలరించు గాదె క్షోణీజములే !!!
చెట్లను నాటి భూప్రగతి చెంతకు జేర్చుము లోకమంతటన్
రిప్లయితొలగించండిగట్లకు తూట్లు గాక పరికల్పిత తల్పముచెట్ల భూమి|యి
క్కట్లకుతావు లేదనుచు కాంక్షగ దెల్పిరి బాలబాలికల్
“నోట్లను బంచిపెట్టి,మననోటికి తిండిని గూర్చు వింతగా|
2.మీనవ్వు కంటె చెట్లిడు
పూనవ్వులు పుడమికెపుడు పులకింతగు|వి
జ్ఞానపువిరి జల్లులు సు
జ్ఞానపు వృద్దికొరకు?జన జాగృతి చెట్లే|
3.జీవము నిల్పు యంత్రములు| చిత్ర విచిత్రపు శాస్త్రవేత్తలై
భావన భాగ్య సంపదలు| భావితరాలను పంచి పెంచుచున్|
దీవెన లిచ్చు చెట్లు తగు తీరిక చేతను నాట”బాలురే”|
ఆవిలు వెంచ శక్యమటి?ఆయువు,ఆస్తుల మూలరూపముల్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
జనుల లోభమునకు సరిహద్దు గనరాదు
రిప్లయితొలగించండిభవిత గూర్చి సుంత భయము లేదు
తరువులన్ని తుదకు తరిగె ధరణిలోన
వనము గానరాక వశికమాయె.
చిన్నపిల్లలంత జేరి ముదము తోడ
చెట్టునాటు పనిని జేసినారు
పచ్చదనము కొరకు పాటుపడగ
పెద్ద పేరు దక్కె పెరిమి గాను.
పచ్చనిదుస్తులున్ దొడిగి|బాలిక లుంచిన పాఠశాలలో
రిప్లయితొలగించండినచ్చిన చెట్లు”కొమ్మలప్రణాలికలందున విద్య నేర్చుచున్”|
కచ్చిత మైన గాలి, మన కందగ పువ్వులు,పండ్లు నిచ్చుచున్
మెచ్చెడి మార్కు లివ్వకనె?మేధకుశక్తని చెట్లు బెంచుటౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాబోయే తరమునకై
రిప్లయితొలగించండికాబోయే తల్లులచట కలుపిరి చేతుల్
శోభను గూర్చెడు మొక్కల
నీ భువి పై నాటినంత నిలవేల్పనుచున్!
పి.యస్.ఆర్. మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘పచ్చదనము కొఱకు పాటుపడుటచేత’ అందామా?
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘శక్తి+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కాకుంటే బ-భ లకు ప్రాస వేశారు.