డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. రెండవపాదంలో ‘దిక్కుల’ అన్నచోట గణదోషం.. అక్కడ ‘దిశల’ అంటే సరి! ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మూడవపాదంలో గణభంగం. ‘నిన్న రూప మేది నేడు చూడగ లేదు’ అందామా? ***** కె. ఈశ్వరప్ప గారూ, చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
గొంగళి దశలను మార్చగ
రిప్లయితొలగించండిరంగుల రెక్కల చిలుకట రంజిల్ల మదిన్
పొంగుచు మకరం దములకు
భృంగము గాతిరుగు చుండు పూవుల పైనన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిచక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
‘చిలుక+అట’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘చిలుకగ’ అనండి.
గొంగళీ పురుగును జూడగ
రిప్లయితొలగించండికంగారుగ మేను లోన కంపము గలుగున్
రంగా ! కొన్ని దినాలకు
సింగారపు వన్నె నెగురు సీతాకోకై .
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి భావంతో చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
చివరిపాదాన్ని ‘సింగారపు సీతకోకచిలుకై యెగురున్’ అంటే బాగుంటుందేమో?!
రిప్లయితొలగించండికం.దశలను మార్చెడి పురుగు ల
నిశమును పైకెగిరిదిక్కుల నెల్లెడ దిరుగన్
మిసమిస లాడెడి రంగుల
కుసుమము పైవాలిన మది కుల్లాస మగున్.
గొంగళి పురుగును జూడుము
రిప్లయితొలగించండికంగారుగ నెక్కు చుండె గనబడు కొమ్మన్
రంగులు మారుచు చివరకు
సింగారపు సీతకోక చిలుకగ మారున్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదంలో ‘దిక్కుల’ అన్నచోట గణదోషం.. అక్కడ ‘దిశల’ అంటే సరి!
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
తీగ పైన సాగు తీరైన గొంగళి
రిప్లయితొలగించండిపలుకు సత్య మేది పంక జాక్ష!
నిన్న రూపమేది నేడు లేదు!
రేపు మారు నాదు రూపమనియె!
పుట్టుక నొకరూపు గిట్టుట వేరైన
రిప్లయితొలగించండి------గొంగళపురుగెంత గొప్పదౌర|
కురుల సైనికులచే కూర్పుల ధైర్యమే
------మందుల తూటాలు మరలిపోవు|
వేల కాళ్ళను జూప?వేగిర మందున
------శాస్త్ర వేత్తల రైలు సాగుటాయె|
ఆకుల షోకులు ఆరగించుట జూచి
------స్వార్థ పరుల నేర్పు వసుధ జేరె|
తినుట కొరకు బుట్టి మనుగడ సాగించి
మారు వేషమందు మరలివచ్చి
రాజకీయ మందు రసమును బీల్చుమా
సీత కోక చిలుక?నేతలాగ
శ్రీ ఈశ్వరప్పగారి పద్యం చమత్కారంగా వుంది.అభినందనలు.
రిప్లయితొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మూడవపాదంలో గణభంగం. ‘నిన్న రూప మేది నేడు చూడగ లేదు’ అందామా?
*****
కె. ఈశ్వరప్ప గారూ,
చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
గొంగళి పురుగును చూసిన
రిప్లయితొలగించండినంగములన్నియు భయమున నదురుచు నుఁడున్
భంగము నొందగ మలిదశ
చెంగున యెగురుచునదికడు చెలువము నొప్పున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నుఁడున్ -> నుండున్... టైపాటు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండితీగ పైన సాగు తీరైన గొంగళి
పలుకు సత్య మేది పంక జాక్ష?
నిన్న రూపమేది నేడు చూడగ లేదు!
రేపు మారు నాదు రూపమనియె!
ఆకులు దిను గొంగళియే
రిప్లయితొలగించండిప్రాకటమగు దశలు దాటి పలు వన్నెలతో
వేకువనే పూవులపై
శ్రీకరమగు సీతకోక చిలుకై వ్రాలున్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు....
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో....
రిప్లయితొలగించండిగొంగళీ పురుగును జూడగ
కంగారుగ మేను లోన కంపము గలుగున్
రంగా ! కొన్ని దినాలకు
సింగారపు సీతకోకచిలుకై యెగురున్