13, జూన్ 2015, శనివారం

సమస్యా పూరణము - 1702 (ఇంటికంటె మఠము హిత మొసంగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ఇంటికంటె మఠము హిత మొసంగు.

31 కామెంట్‌లు:

  1. ఇంటికన్న స్వర్గ మేమి యెక్కువ చెప్పు
    మెంత హాయి గొలుపు నింతి చెంత
    ఇంటికంటె మఠము హితమొసంగు ననుచు
    నింతి చేయి వీడ నిడుములొందు

    రిప్లయితొలగించండి
  2. ఇంటి లోన సుఖము నిసుమంత లేకున్న
    సన్య సించి నంత సగము ముక్తి
    యెడ్డె మన్న వినక తెడ్డెమ నెడిభార్య
    ఇంటి కంటె మఠము హిత మొసంగు

    రిప్లయితొలగించండి
  3. ఆ.వె: బద్దకమ్ముతోడ బాధ్యతలను వీడి
    ఇంటి కన్న మఠము హితమొసంగు
    నంచు తెలివి లేక నలుదెసల్ దిరిగినా
    నింటి కన్న స్వర్గ మిలను లేదు.

    రిప్లయితొలగించండి
  4. ఆ.వె: బద్దకమ్ముతోడ బాధ్యతలను వీడి
    ఇంటి కన్న మఠము హితమొసంగు
    నంచు తెలివి లేక నలుదెసల్ దిరిగినా
    నింటి కన్న స్వర్గ మిలను లేదు.

    రిప్లయితొలగించండి
  5. ఈ సారి అక్కయ్య గారు మా పక్షం వహించారు. ఆశ్చర్యము! మన తెలుగు చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నా మనసులోని మాట చెప్పారు. అందుకేకదా నేను వృద్ధాశ్రమంలో చేరింది!
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఇల్లు చంద్రమౌళి సూర్యనారాయణ గారు చెప్పినట్లు ఉంటే స్వర్గమే... కానీ రాజేశ్వరి అక్కయ్య గారు చెప్పినట్లు ఉంటే.. దానికంటె మఠమే మేలు కదా! (నా ప్రస్తుత పరిస్థితి)
    ******
    చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఆలు మగల మధ్య నన్నోన్యముండక
    సంతు వలన సుంత శాంతి లేక
    కలత బడచు బ్రతుకు గడిపెడు వారికి
    యింటి కంటె మఠము హిత మొసంగు!!!

    రిప్లయితొలగించండి

  8. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కలత బడుచు’కు బడచు అని టైపాటనుకుంటాను. ‘వారికి| నింటికంటె...’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    ఒకటిఁ జెప్ప నింక నొక్కటిఁ దాఁ జేసి,
    యెడ్డె మనఁగఁ దెడ్డె మిది యని సతి
    మదిని శాంత మెపుడు మాయమ్ము సేయంగ
    నింటికంటె మఠము హిత మొసంగు!

    రిప్లయితొలగించండి
  10. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  11. స్నానపానములకు,జపతపమ్ములకును
    సాధుసంగమమునకు,సవనమునకు
    స్వామిపూజ చేయ చక్ర పొంగలికిని
    ఇంటికంటె మఠము హితమొసంగు

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ఇంటిఖర్చు బెడఁద యిల్లాలి వెత లేదు
    బంధు జనుల యీసు బాధ లేదు
    గురువు ప్రవచనమిడ గుఱ్ఱుతీయగవచ్చు
    నింటి కంటె మఠము హితమొసంగు.

    రిప్లయితొలగించండి
  14. ప్రేమఁబంచునట్టి లేమశ్రీమతియైన
    సదనమందు కలుగు సంతసమ్ము
    గౌరవమ్ము నిడని కాంత గృహిణియైన
    యింటి కంటె మఠము హితమొసంగు

    రిప్లయితొలగించండి

  15. ఇంటిలోనపిల్లి ఇల్లాలి ముంగిట
    పిల్లపాపలంద రొల్లబోరు
    గారవింప బడును కంఠీరవమ్ముగా
    ఇంటికన్న మఠము హితమొసంగు

    రిప్లయితొలగించండి

  16. ఎన్నికైన నేత లెల్లరి మఠమది
    రాజధాని నగర రాజవాస
    మట లభించునుసక లాతిథ్యయోగమ్ము
    ఇంటికన్న మఠము హితమొసంగు

    రిప్లయితొలగించండి
  17. ఇంటి కంటె మఠ ము హితమొసంగు ననుమాట
    యక్షరాల నిజము హర్ష ! వినుమ
    యింటి లోన పోరు లెక్కువ యైనచో
    నదియ మార్గ మునిక నందరకును

    రిప్లయితొలగించండి
  18. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘హిత మొసంగెడి మాట’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. సమయమెంచి తిండి సమకూరు నచ్చట
    గురుని మంచి బోధ గుణము బెంచు|
    నిశ్చలత్వమైన నిద్దుర సమగూడు
    ఇంటి కంటె మఠము హిత మొసంగు|
    2,ఇంట పోరుకొంత ఇల్లాలి తో కొంత
    బదులు జేర్చు చింత దుడుకు కొడుకు
    మనసుమమత దరుగమరియెట్లుబ్రతుకన?
    ఇంటి కంటె మఠ ము హితమొసంగు|

    రిప్లయితొలగించండి
  21. పూల పాన్పు గాదు పురుషుల మనుగడ
    సర్వ బాధలమయ సాగరమ్ము
    తట్టు కొనని వార్కి, తప్పక తగవుల
    ఇంటికంటె మఠము హిత మొసంగు.

    రిప్లయితొలగించండి
  22. మరీ అంత ఆశ్చర్య పడుతున్నారా ? అబ్బే
    " ఏ ఎండ కాగొడుగు పట్టాలిగా " అదన్నమాట
    సోదరులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  23. ​బాల్యయౌవనములు బాగుగానుండింట
    ​పరిణయమయినాక భార్యతోడ
    వయసుమీరినాక పట్టించుకొనరెవ
    రింటికంటె మఠము హితమొసంగు​​!

    రిప్లయితొలగించండి
  24. ఇంటనుండు బాధ నేమరి యుండినన్
    కంటినిండ నిద్ర కనమె యచట
    పైన మంచిమాట పడునుగా చెవులను
    యింటికంటె మఠము హితమొసంగు

    తింటకింత తిండి,యుంటకు చోటును
    చేయ పనియుదొరకు;చింతలెల్ల
    మరువ,యింటి బాధ మాయంబునగు గదా
    ఇంటికంటె మఠము హితమొసంగు

    ఇంట,భార్య,బిడ్డలెల్లను బరువని
    మఠము జేఱినంత మాయమగునె
    బాధ?-వార్ధకాన పరమును గోరగా
    నింటికంటె మఠము హితమొసంగు

    బాల్యమందు విద్య పలుగతి నేర్చియున్
    జవ్వనాన సుఖము చాలనంది
    వార్ధకానతాను వైరాగ్య మందినన్
    యింటికంటె మఠము హితమొసంగు

    రిప్లయితొలగించండి
  25. ఇంటిలోని పోరు యింతింత కాదని
    వేమనయ్య పలికె వెనుక,నాడె
    వాన ప్రస్థ మిటుల వరుసను మారెగా
    యింటికంటె మఠము హితమొసంగు

    రిప్లయితొలగించండి
  26. అదియు నిదియు వదలి ఆధ్యాత్మికమునంద
    జ్జ్ఞాన, ధ్యాన, భక్తి సరళిఁ దెలియ
    చీకు చింత తోడ నేకాగ్రతనిడని
    యింటికంటె మఠము హితమొసంగు.

    రిప్లయితొలగించండి
  27. కవిమిత్రులు మన్నించాలి. నిన్న మధ్యాహ్నం నుండి తీరికలేని ప్రయాణంవల్ల మీ పూరణలను సమీక్షించలేకపోయాను. ఇప్పుడే ఆశ్రమాన్ని చేరుకున్నాను.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భాధలమయ’ అనరాదు. ‘బాధలు గల’ అనండి.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అయినాక, మీరినాక’ శబ్దాల సాధిత్వాన్ని గురించి ఆలోచించాలి.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జ్ఞాన ధ్యాన’ అన్నప్పుడు ధ్యా కంటె ముందున్న న గురువై గణదోషం. ‘జ్ఞానయోగ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  28. ​​​ గురుదేవులకు నమస్ససులు వరణతో....​

    ​​బాల్యయౌవనములు బాగుగా​ ​నుండింట
    ​​పరిణయమున నింట భార్య సుఖము
    ​వార్ధకమున నెవరు బాగోగులను జూడ
    రింటికంటె మఠము హితమొసంగు!​

    రిప్లయితొలగించండి
  29. గురుదేవులకు ధన్యవాదములు.
    సవరించిన పద్యం :

    అదియు నిదియు వదలి ఆధ్యాత్మికమునంద
    జ్జ్ఞాన, యోగ, భక్తి సరళిఁ దెలియ
    చీకు చింత తోడ నేకాగ్రతనిడని
    యింటికంటె మఠము హితమొసంగు.

    రిప్లయితొలగించండి