రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. కాని చిత్రంలోని వ్యంగ్యాన్ని మీరు గమనించలేదనుకుంటాను. వర్షం పడుతుండగా గొడుగు పట్టుకొని చెట్లకు నీళ్ళు పెడుతున్నాడు.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘పుష్పపొద’ అన్నచోట ‘పూలచెట్టు| కవునొ కాదొ...’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘పని యొత్తిడిలో’ సరియైనది. ‘కానివ్వక’ అన్నారు. ఏమి కానివ్వక? ఆటంకమా? అది చెప్పలేదు.. నా సవరణతో మీ పద్యం... పూనిన పని యొత్తిడిలో తానేమో నీరువోసెఁ దల్లడబడుచున్ వానైనను నాటంకము గానివ్వగ మొక్కఁదడుపు కార్యక్రమమున్!
గురుదేవులకు ధన్యవాదములు. నేను 'కానివ్వగ ' అనివ్రాశానండి. నా భావం మొక్కఁ దడుపు కార్యక్రమము పూర్తి చేయడం కోసం వానైనను గొడుగు పట్టాడు అని. మీరు సవరణగా చెప్పిన పద్యంలో 'కానివ్వక' అంటే సరిపోతుందనిపిస్తోంది. గురువుగారూ పరిశీలించ ప్రార్థన.
ఎండకు వానకు గొడుగట
రిప్లయితొలగించండినిండుగ తానీడ నిచ్చు నెయ్యపు మనమున్
పండిన పచ్చని పైరులు
పండుగ జేయంగ జగతి పరిపరి విధముల్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కాని చిత్రంలోని వ్యంగ్యాన్ని మీరు గమనించలేదనుకుంటాను. వర్షం పడుతుండగా గొడుగు పట్టుకొని చెట్లకు నీళ్ళు పెడుతున్నాడు.
ఎట్టి పరిస్థితినైనన్
రిప్లయితొలగించండిచెట్టుకు నీ రందఁజేయఁ జేసితి ప్రతినన్
బిట్టుగ వానలు పడినను
గట్టిగ నామాట నిలుపగా దొరకొంటిన్.
పిచ్చి వాడేమొ చూడగ నచ్చట తడు
రిప్లయితొలగించండిభూమి యంతయు వరదతో మునిగి యుండ
పోయు చుండెను నీటిని పుష్ప పొ దకు
నవునొ కాదోమ ఱి పరి కిం చువన జయట
పూలమొక్క నీట మునిగి పోయినఁగూడ
రిప్లయితొలగించండిపైపుతోడ నీరుపట్టుచుండె
నిచ్చినట్టి పనిని ఖచ్చితమ్ముగఁ జేయ
వలయునన్న స్థిరపు వాంఛతోడ
జోరున వానలు గురియగ
రిప్లయితొలగించండినీ రీతిన గొడుగు బట్టి యీ మొక్కలకున్
నీరమ్ము బోయు నిను గని
నౌరా! యని లోకమంత నబ్బుర మందున్!!!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పుష్పపొద’ అన్నచోట ‘పూలచెట్టు| కవునొ కాదొ...’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పూనిన పని వ(యొ)త్తిడిలో
రిప్లయితొలగించండితానేమో తనను మరచి తల్లటఁ బడుచున్
వానైనను పట్టె గొడుగుఁ
గానివ్వగ మొక్కఁదడుపు కార్యక్రమమున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పని యొత్తిడిలో’ సరియైనది. ‘కానివ్వక’ అన్నారు. ఏమి కానివ్వక? ఆటంకమా? అది చెప్పలేదు.. నా సవరణతో మీ పద్యం...
పూనిన పని యొత్తిడిలో
తానేమో నీరువోసెఁ దల్లడబడుచున్
వానైనను నాటంకము
గానివ్వగ మొక్కఁదడుపు కార్యక్రమమున్!
గురుదేవులకు ధన్యవాదములు. నేను 'కానివ్వగ ' అనివ్రాశానండి. నా భావం మొక్కఁ దడుపు కార్యక్రమము పూర్తి చేయడం కోసం వానైనను గొడుగు పట్టాడు అని. మీరు సవరణగా చెప్పిన పద్యంలో 'కానివ్వక' అంటే సరిపోతుందనిపిస్తోంది. గురువుగారూ పరిశీలించ ప్రార్థన.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
రిప్లయితొలగించండినిజమే సుమా!.. నేను కానివ్వక అనే చదువుకున్నాను. ‘కానివ్వగ’ అంటే ఏ సవరణా అవసరం లేదు. ధన్యవాదాలు. (నా తొందరపాటును మన్నించండి!)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదాచిన నీటిచుక్కలను దానముజేయగ మేఘ మాలికల్
రిప్లయితొలగించండితోచిన రీతి దొర్లుచును తొందర యందున భూమితాపమున్
నోచక జేయుమార్గమొక నోముగ నీరటు నిల్వలుంచినా?
చూచియు వానలో నొకడు “చోద్యము చెట్టుకు నీరుగొట్టుటా?
2.చినుకుల నైఖ్యతే గలసి చిందులు వేసెడి వంక ,వాగులే
అణకువ చేత గుంటలలొ హాయిగ నుండగ?”చెట్లు,చేమలున్
మనుగడ సాధ్య మవ్వునని మౌ నముగాతలలూపు చుండగా”?
దినసరిచర్యగా నొకడు –త్రిప్పుచు నీటిని చల్లుటాయెగా|
కరముగ గురియు వానల గారణమున
రిప్లయితొలగించండిబట్టు చీడల, మందున బాపు నొకక
రమున, ఛత్రము నితరక రమున బట్టె
మొక్క లన్ననా తనికంత ముదమ దేమొ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవని శరీర మంతటికి నాయువునింపెడి వర్ష ధారలే
రిప్లయితొలగించండిభువన మనోహరంబునకు పుట్టుక|భుక్తికి ,శక్తికిమూల హేతువై
కవన వనంబు,లోకులకు కామిత సిద్ధిని బంచిపెట్ట?యీ
యువకుడు జేయుకార్యము?ప్రయోజన మందగ దిద్దు బాటులే|
2.చినుకుల చిత్రసీమ|పరిశీలనజేయ?పవిత్ర ధామమే|
గనపడు చెట్ల సాగుకు-సకాలము నందున వర్ష ధారలే
మనుగడ మంత్ర మౌనుగద|”మాధవ సేవకు పూల మొక్కలే
దినమును తీర్చి దిద్దునని దేనికొ?చెట్టుకు నీరు గొట్టేగా|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాస్టరుగారూ ! మీ ప్రతిజ్ఞా పాలన పూరణ బాగుంది..
రిప్లయితొలగించండినేనూ మీ బాట లోనే....
మీరేమన్నను సరియే
మీరెను తెలివంచు నన్ను " మెచ్చిన " సరియే
నీరును గారగ నీయను
నీరును నే చెట్లకిడెడు నీమంబెపుడున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.