29, జూన్ 2015, సోమవారం

పద్య రచన - 945

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. కన్నుల విందగు చీరలు
  మిన్నంటిన ధరలు జూడ మీరిన కోర్కెన్
  చెన్నుగ కోరిన సతిగని
  మిన్నగ దడపెరిగె నంట మేరువు కనగన్

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. ఉదయమున చీరెగొనుటకు
  ముదితలు పదిమంది రాగ మూటలు విప్పన్
  వదలక రాతిరి వరకును
  వెదకిరి " ఓల్డ్ ఫ్యాష " ననుచు వెడలిరి, హయ్యో !

  రిప్లయితొలగించండి
 4. ఉదయమున చీరెగొనుటకు
  ముదితలు పదిమంది రాగ మూటలు విప్పన్
  వదలక రాతిరి వరకును
  వెదకిరి " ఓల్డ్ మోడ " లనుచు వెడలిరి, హయ్యో !

  రిప్లయితొలగించండి
 5. చీరలు చీరలు చీరలు
  హారతి మఱి దెచ్చె నటకు నమ్ముట కొఱకు
  న్నేరా ,రాములు ! కొనుముర
  మీ రా ధకు నొక్కటైన మెచ్చును నిన్నున్

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. ఆ.వె:పసుపు ఎరుపు నాకుపచ్చరంగులుగల
  అందమైన చీర లమ్మరాగ
  వాయిదాల లోన పైకమొసగ వచ్చు
  రండు కొనగ మీరు రమణులార.
  2 ఆ.వె: అందమైన కోక లమ్మవచ్చెనచట
  సతియు మురిసి చూడ పతియు కినిసె
  చిల్లు తప్పదింక జేబుకనుచు తాను
  చింత తోడ జూసె నింతి వైపు.

  రిప్లయితొలగించండి
 8. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. నిను జూచిన మనసాగక
  కొనుచుందురు కోమలంత కోరిన వెల్లన్
  మనభారత నారులకిల
  ఘనతను కలిగించు చీర కట్టుకు జయహో!!!

  రిప్లయితొలగించండి
 10. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పద్యంలో ‘కారణ మేమియైన...’ అనండి.
  మూడవపద్యంలో ‘చీదరింపులు లేక..’ అనండి. ‘యజమాని’ని ‘ఎజమాని’ అన్నారు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవపాదంలో ‘కొమ్మలంత’ అని ఉండాలనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 11. గురుదేవులకు ప్రణామములు. నిన్నటి పద్యరచన:
  తాళపత్రము లందున తనరు నట్టి
  గ్రంథ రాజములను దాల్చికరమునందు
  చదువ భారమ్ముగా నెంచి సహృదయమున
  వ్యాసపీఠములన్ దీర్చి రార్యులపుడు.

  పుస్తకమ్ములు చిన్నవై పుడమి నందు
  బల్ల పైనుంచియో చేతఁ బట్టి నేడు
  చదువు చుండగ జనులెల్ల వదలినారు
  వ్యాసపీఠమ్ములనువాటి ధ్యాసమరచి.

  నేటి పద్యరచన:
  తరుణీమణులు మంచి తరుణము కోసం ఎదురు చూస్తూ...
  కంచి పట్టు చీర కనకంపు కొంగుతో
  దీరి యుండి యున్న వారికేమి?
  యొకటిఁ గొన్ననుచితమొకటి నిత్తుమనక
  కొలువుఁ దీర్చి యున్నఁ గొనగరారు!

  రిప్లయితొలగించండి
 12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యాలు (నిన్నటివి, నేటిది) బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. నచ్చిన చీరల నడుగగ
  కచ్చితముగ ధరను బెంచి|కనికరములతో
  నిచ్చెద రిబేటు మీకన?
  వచ్చినయజమాని డబ్బు పక్కున నవ్వెన్|
  2.చీరల నంగడందు మనసెంచిన వన్నియు కానుపించినా?
  కారణ మేమి యైన మనకందని ఫై ధరలందు నుండగా?
  ప్రేరణ లేనిబొమ్మలుగ,పెద్దలు జూడగవింత చూపుచే
  ధీరత మాని దీనులుగ దిక్కులు జుచుట మక్కువౌను

  రిప్లయితొలగించండి
 14. పిలువక వెళ్లినా?విలువలు బంచెడి
  ----వెలుగుల వేదిక ప్రీతి గూర్చ|
  మచ్చిక లేకున్న ?మర్యాద జూపుచు
  ----చీధరింపులు లేక చీరలుంచ?
  నచ్చెను చీరలు-వచ్చిన వారన?
  -----ధరలదండన చీటి తగులగట్టి|
  రంగులు నచ్చగ?పొంగగ హృదయము
  -----అంగడి బిల్లుచే నదరగొట్టి|
  తెలియకున్నను తెలివిగా తేట బరచి
  చీర యజమాని లాభాల చింత యందు
  మగ్గ మట్లుగమాటలు మలచితాను|
  చింత దీర్చును కోరిన చీరలుంచి|

  రిప్లయితొలగించండి
 15. పట్టు చీరెల పరచిరి పరుపు పైన
  కొనుట కేతెంచ సొగసైన కొమ్మ లటకు
  పండుగల సమయమునందు దండిగాను
  బట్టలను కొను చుందురు పల్లె జనులు

  రిప్లయితొలగించండి
 16. కె. ఈశ్వరప్ప గారూ,
  సవరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. ఎన్నిచీరలనైన నెన్నుకొన
  కన్నెల చేతగాక చెలియల
  సన్నల కొఱకు వేసటలేకయె
  మన్ననతో నిల్చు మగువలుంద్రు.

  రిప్లయితొలగించండి