గన్నవరపు నరసింహ మూర్తి గారూ, బహుకాల దర్శనం... సంతోషం! మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘సోముండును’ అనడానికి ‘సోముండుని’ అని టైపాటనుకుంటాను. ‘వేయు’కు ప్రథమపురుష భూతకాలరూపం ‘వేసె’. ‘వేచె’ అంటే ఎదురుచూచె నని అర్థం కదా! దానికిక్కడ అన్వయం కుదరదు.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘తపముకై’ అనరాదు, ‘తపమునకై’ అనాలి. అక్కడ ‘తుద తపమునకై వనమందున్’ అనండి. ‘మోక్షాకాముకులు’ అంటే ‘మోక్ష+అకాముకులు’ అన్న అర్థం వస్తుంది. ‘మోక్షపు కాముకులై’ అనండి.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవపాదం చివర ఒక గురువు తప్పిపోయింది. బహుశా టైపాటు కావచ్చు. ‘ప్రవచించెడి యా’ అని ఉండాలనుకుంటాను. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నా ఒక పొరపాటు చేశారు. సమస్య గురువుతో ప్రారంభమైతే మీరు మిగిలిన పాదాలను లఘువుతో ప్రారంభించారు.
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ క్రొత్త పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీమము వీడక నిరతము
రిప్లయితొలగించండికామారిని పూజించు వారు గంధర్వు లనన్
కామాక్షి నికోరి కొలిచెడి
కాముకులు పవిత్రు లనుట కల్లయెటు లగున్
తామసగుణవర్జితులై
రిప్లయితొలగించండినీమము దప్పక ముకుందునిన్ గొల్చుచు స
న్నాములయి మెలఁగు నిర్వృతి
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
(నిర్వృతి = మోక్షము)
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ, మూడవ పాదాలలో గణదోషం. ‘కామారిని గొలుచు వారు గంధర్వు లనన్| కామాక్షిని పూజించెడి...’ అనండి.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామము సృష్టికి మూలము
రిప్లయితొలగించండికామము సకల జనులకును గతి శీలంబౌ
నీమము ధర్మము దప్పని
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ! మీ పూరణము మా యందఱకును మార్గదర్శకమై యలరారుచున్నది. అభినందనలు!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
కాముడు చేయును గారడి
రిప్లయితొలగించండికామము వీడదు మనిషిని కడవర కెపుడున్
కామమె మోక్షపు మూలము
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్
నా పూరణము:
రిప్లయితొలగించండివేమఱు సత్యముఁ బలుకుచు
నీమముతో నీతి పథము నెఱిఁ దప్పని స
త్ప్రేమోత్కృష్టాహింసా
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
కవిశ్రీ సత్తిబాబు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
ఏమి పదప్రయోగాతిశయం! చాలా బాగున్నది మీ పూరణ. అభినందనలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ! _/\_
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆమని తోడై రాగా
సోముండుని వేచె పూల సూనాస్త్రుండున్
హైమవతి కలత నొందగ
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సోముండును’ అనడానికి ‘సోముండుని’ అని టైపాటనుకుంటాను.
‘వేయు’కు ప్రథమపురుష భూతకాలరూపం ‘వేసె’. ‘వేచె’ అంటే ఎదురుచూచె నని అర్థం కదా! దానికిక్కడ అన్వయం కుదరదు.
భీముని సందియ మిదియే
రిప్లయితొలగించండికాముకులు పవిత్రు లనుట కల్ల యె టులగున్ ?
కామము గలిగిన వారలె
యీ మాదిరి తలతు రెపుడు నీయది నిజమే
సామాన్యునిగా బుట్టియు
రిప్లయితొలగించండివ్యోమమ్మున దిరుగునట్టి యున్నతుడయ్యెన్!
సోమాది గ్రహ యానపు
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
వేమరు దేశము కొరకై
రిప్లయితొలగించండిసేమంబును కోరుచుండి చిత్రపు గతిలో
తాముగ వచ్చెడు స్వేచ్ఛా
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తపముకై’ అనరాదు, ‘తపమునకై’ అనాలి. అక్కడ ‘తుద తపమునకై వనమందున్’ అనండి. ‘మోక్షాకాముకులు’ అంటే ‘మోక్ష+అకాముకులు’ అన్న అర్థం వస్తుంది. ‘మోక్షపు కాముకులై’ అనండి.
సోమరులకు శ్రమ విలువలు
రిప్లయితొలగించండిపామరులకు జ్ఞాన మహిమ ప్రవచించెడి
సామాన్య నీతి మానవ
కాముకులు, పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
రిప్లయితొలగించండిభామల చెరచిన దానవ
కాముకులు పవిత్రులనుట కల్ల. యెటులగున్
మామిడి జెట్టున బదనిక
వెముగ నర్చింప బడున? వివరించంగన్
రిప్లయితొలగించండి2.కామన జనసేవే యను
కాముకులు పవిత్రులనుట కల్ల యెటులగున్?
సోముడు సూర్యుండింద్రుడు
కాముకులై ప్రకృతిమాత కావగ రారే
స్వాములు భార్యా పిల్లల
రిప్లయితొలగించండికాముకులై?తుదతపమునకై “వనమందున్
క్షేమపు దీక్షల మోక్షపు
కాముకులు” పవిత్రు లనుట ?కల్లయెటులగున్.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదం చివర ఒక గురువు తప్పిపోయింది. బహుశా టైపాటు కావచ్చు. ‘ప్రవచించెడి యా’ అని ఉండాలనుకుంటాను.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
“ప్రేమలు మార్చుచుసతతము
రిప్లయితొలగించండికాముకులు పవిత్రు లనుటకల్ల”యెటులగున్?
క్షేమంబొసగక,నీతిని
యేమాత్రము లెక్క లేక యిమడకఫలమా?
సమతను కోరుచు సతతము
రిప్లయితొలగించండిసుమధుర వాక్కులనుపల్కుచు, పరుల కెపుడున్
మమతలఁబంచెడు శమనపు
కామికులు పవిత్రులనుట కల్లయెటులగున్
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నా ఒక పొరపాటు చేశారు. సమస్య గురువుతో ప్రారంభమైతే మీరు మిగిలిన పాదాలను లఘువుతో ప్రారంభించారు.
తామిస్రమందు మ్రగ్గెడు
రిప్లయితొలగించండిసామాన్యుల బాగుగోరి జ్ఞానామృతమున్
ప్రేమగ బంచెడు స్వేచ్ఛా
కాముకులు పవిత్రులనుట కల్ల యెటులగున్?
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండికాముకుడగు దేవేంద్రుడు
కాముకుడై నట్టి శశియు గారె పవిత్రుల్
యేమని వారి నుతింతురు
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
కాముకుడై యొకవిప్రుడు
కాముకుడై కౌశికుండు గాంచగ మోక్షం
బామాధవు దర్శనమున
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
కాముని దగ్ధ మొనర్చిన
కామారియు కాముకుండె కాదన గలమా !
కాముకుడై సతిని జేరె
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
భామల(కామపు) దాసులు గాకను
రిప్లయితొలగించండిప్రేమనుపంచుచు ప్రజలకు వివిధ గమములన్
రాముని భజించు మోక్షపు
కామికులు పవిత్రులనుట కల్లయెటులగున్
తామటు లెల్లర కెందున
రిప్లయితొలగించండిసేమము గోరుచు,జనులకు,చేసియు మేలున్
భూమికి శుభంబునిడు నా
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్?
భూమిని శాంతియె వెలుగగ
తామటు లెపుడును తలచుచు,దైవమునెందున్
వేమరు కోరెడి,మోక్షపు
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్?
భూమిని సంసారము గొని
తామటు సంతానము గన,ధార్మిక రీతిన్
భామను గూడెడి,వెసనా
కాముకులు పవిత్రులనుట,కల్లయెటులగున్?
కోమల మతులై ఋషులటు
తామసమును వీడి దివిజ తత్వము నెరిగే
నేమపు వర్తులగు యశ:
కాముకులు పవిత్రులనుట కల్లయెటులగున్?
నేమము తోడన్ లోకపు
రిప్లయితొలగించండిసేమము కొఱకై, నిరతము సృజియించు పరం
ధాముని నమ్మెడు మంగళ
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
కాముడుగాకను మోక్షపు
రిప్లయితొలగించండికాముండవ్వడనుమాట కరము నిజమ్మే
వేమనఁ బోలు పరమపద
కామికులు పవిత్రులనుట కల్లయెటులగున్
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
రిప్లయితొలగించండి*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ క్రొత్త పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేమను లక్ష్మికి పూజలు
రిప్లయితొలగించండిగోముగ జేయించి నోర్లు కొట్టని వారై
కోమటి శ్రేష్ఠులు లాభపు
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
రిప్లయితొలగించండిరాముని నామ జపమ్మును
నీమము తప్పక సలుపుచు నిండుగ మనసా
త్వామనురజామి యయ్యెడి
కాముకులు పవిత్రు లనుట కల్ల యెటు లగున్?
జిలేబి
రాముని రాజ్యము నిలుపుచు
రిప్లయితొలగించండిభూమిని పాలింపగోరి పూజితులవుటన్
సోముని పోలెడు వోటుల
కాముకులు పవిత్రులనుట కల్ల యెటులగున్?
సోముడు = చంద్రశేఖర రావు