16, జూన్ 2015, మంగళవారం

పద్య రచన - 934

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. పిల్లడి సర్వము నీవై
  యెల్లప్పుడు వాని క్షేమమెంచుచు బ్రతికే
  తల్లీ యీలోకములో
  చల్లని నీ యొడినిమించి స్వర్గము కలదా

  రిప్లయితొలగించండి
 2. మరుమల్లెల చిరునవ్వులు
  మురిపించగ తనదు ప్రేమ మోదము నొందన్
  పెరిగిన గడ్డము మాటున
  మరుగున పడిపోవు తల్లి మది ఖణ్డితమై

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘బ్రతికే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘క్షేమ మెంచి బ్రతుకు నొ| తల్లీ...’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. మాతృ పాద యుగళ మహిమనెన్న తరమె
  తత్పదంబుమధ్య తలమునతల
  ననువుగనిడి యమ్మ యభ్యంజనమునకు
  నింద్ర పదవి గూడ నిసుమనందు

  రిప్లయితొలగించండి
 5. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘అని+అందు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పదవిగూడ నిసుమె యందు’ అనండి.

  రిప్లయితొలగించండి
 6. స్నాన మాడించు చుండగ సదరు బాబు
  అమ్మ మోకాళ్ళ మధ్యన హాయి గుండి
  బోసి నవ్వుల తోడను ముద్దు లొలికె
  చిత్ర మందున జూడుము శేష సాయి !

  రిప్లయితొలగించండి
 7. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘సదరు’ అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు. ‘బాబు+అమ్మ’ అని విసంధిగా వ్రాశారు. ‘హాయిగనుండి’ అనవలసి ఉంది. నా సవరణ... ‘స్నానమాడించుచుండగ చంటికుఱ్ఱ| డమ్మ మోకాళ్ళ మధ్యన హాయి నుండి’.

  రిప్లయితొలగించండి


 8. ఆ.వె:కాళ్ళు బార జాపి కన్నొత్తి చెక్కొత్తి
  లాల పోసి తుడిచి లాలి పాడి
  నిదుర బుచ్చి నుదుట నిలువు బొట్టెట్జి
  కనుచు మురిసి పోవు కన్న తల్లి

  రిప్లయితొలగించండి
 9. అమ్మయొడిని చేరి యందాల పాపాయి
  చింద జేయుచుండె చిరునవ్వు మోముపై
  స్నానమాచరించి సంతోషముగ తాను
  గోరుముద్దలుతిను కోర్కెతోడ

  రిప్లయితొలగించండి
 10. లాల బోయు చుండె లక్షణంబుగనమ్మ
  కాళ్ళమధ్య బెట్టి కన్న సుతుని
  తల్లి ప్రేమ లోన తాదాత్మ్య మొందుచు
  నంద బాలు డల్లె నవ్వె బాబు!!!

  రిప్లయితొలగించండి
 11. కాగడాలుబెట్టి వేగాన వెతికినా?
  ఇంతకంటె గొప్పఇష్ట మైన
  చింత దొలగ జేయు సింహాసనంబేల?
  అనుచు బాల నవ్వె కాలి ఫైన|
  2.అనురాగ గంధమే వినియోగ బంధమై
  ---------తల్లితాకుటయందె తరలివచ్చు|
  కనలేని దైవము గనుపించ గుడియందు
  --------సాష్టాంగ మిడుచుండు సాయమెంచి
  కనపడు దైవము మనుగడ జేకూర్చు
  -------అమ్మని|కాళ్ళ ఫై అడిగినట్లు
  అమ్మ|కాళ్లుం చిన?అదియొక స్నానాల
  -------గట్టమై చట్టమై పట్టుగూర్చు
  తల్లి దండ్రుల తాకుటే చెల్లదనిన?
  ప్రేమపుట్టుక నశియించు విజ్ఞు లైన|
  కాలిమెట్టెల, గొలుసుల కాంతి కంటె
  బాల నవ్వుల భాగ్యమే బలముజూడ|


  రిప్లయితొలగించండి
 12. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ‘పెట్టి’ని ‘ఎట్టి’ అనడం గ్రామ్యం. ‘నిలువుబొట్టును పెట్టి’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘చిందజేయుచుండె చిఱునగవుల’ అనండి.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘వలె’ను ‘అల్లె’ అన్నారు. ‘నందబాలుడి వలె నవ్వె బాబు’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. గురువుగారి సవరణ తరువాత

  మాతృ పాద యుగళ మహిమనెన్న తరమె
  తత్పదంబుమధ్య తలమునతల
  ననువుగనిడి యమ్మ యభ్యంజనమునకు
  నింద్ర పదవి గూడ నిసుమెయందు

  రిప్లయితొలగించండి
 14. నీ పాదమ్ముల వాలిచి
  నాపై వాత్సల్యముంచి స్నానము దీర్చన్,
  సోపానమ్ముల నందెడు
  నే పీఠము సాటి రాదు నిక్కము జననీ!

  రిప్లయితొలగించండి
 15. ఎంత గొప్ప చిత్ర మిట్టి దృశ్యమ్ములు
  నేడు కానరావు నిజము దెలియ
  ఒళ్ళు నలుగుపెట్టి యొద్దికగా లాల
  పోయ బాబు పాప హాయి గొనరె?

  మారె కాల మహహ మంచి నూనెయు సున్ని
  పిండి కుంకుడు రస ముండి కూడ
  వాడు వారు కరవు వాడగ బేబీల
  సోపు షాంపు నూనె ప్రాపు పొందె.

  పెద్ద వారిమాట పిల్లల కెక్కదు
  పాత పెద్ద రోత పాప మిపుడు
  సహజసిద్ధమైన సరకులు కూడవు
  తమకు నచ్చునదియె తత్త్వమిపుడు.

  రిప్లయితొలగించండి
 16. గుండా వేంకట సుబ్బ సహదెవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పద్యాలు చాల బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి