రాజేశ్వరి అక్కయ్యా, ముందుగా నేనుకూడ ‘కాకుల’తో సవరణ సూచించాలనుకున్నాను. కాని సమస్యలో ‘కాకా’ అని కాని ‘కావ్‍కావ్’ అని కాని లేకపోవడంతో సందేహించాను. మీ సవరణ బాగుంది. సంతోషం! ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘రాకేశ్+ఇవి’ అన్నప్పుడు యడాగమం రాదుకదా... ‘రాకే శివి యేమి...’ అనవచ్చు కదా! ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవపాదంలో గణదోషం. ‘అందున ధ్వని’ అన్నప్పుడు ‘న’ గురువుకాదు. ఆ పాదాన్ని ‘ఈకందమునందునను ధ్వని యనుకరముల్’ అనండి. ‘అనుకరణముల్+ఏకరువు’ అన్నప్పుడు యడాగమం రాదు. సవరించండి. సవరణ సూచించడానికి విఫలప్రయత్నం చేశాను. ‘అనుకరణముల్| సాకల్యముగా జెప్పిన...’ అంటే ఎలా ఉంటుంది? ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వేకువ’ తరువాత అర్ధానుస్వారం ఎందుకు? ‘వేకువ నరచుచు...’ అనండి. ***** ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, ‘ఏకరువు+ఎట్టి’... ఇందులో ‘ఎట్టి’ అనేది ‘పెట్టి’ అనే అర్థంలో వాడారా? అలా అయితే దోషమే. లేక ‘ఎట్టి = ఎటువంట్’ అనుకుంటే అన్వయం కుదరడం లేదు. వివరించండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణలు (నిన్నటి దత్తపది, ఈనాటి సమస్య) రెండూ బాగున్నవి. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. వితథము అర్థంకోసం ఆంధ్రభారతిలో వెదకవలసి వచ్చింది!
కాకా! వచ్చెనుగా వ
రిప్లయితొలగించండిర్షాకాలమిక! వినపడును రాత్రులలో మం
డూక,శునక, కీటకరొద
కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
సభలలో మన రజకీయ నేతల మాటలు
రిప్లయితొలగించండిలోకులు మెచ్చిన నేతల
పోకడలన్ రాజ్యసభను ముంచిన తెఱగుల్
చీకాకు తెచ్చు మాటలు
కీకీ హిహిహీ బెకబెక కిచ కిచ భౌ భౌ.
కీకా రణ్యము నందున
రిప్లయితొలగించండికీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ
కుకురము కప్పలు కోతులు
నేకతముగ జేరె నంట నిండుగ సభకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅక్కయ్యా! మూడవ పాదాద్యక్షరము గురువు రావాలి కదా...
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కీటకరొద’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘కీటకరుతి’ అనండి.
అక్కయ్య గారి పద్యంలో లోపాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదాన్ని ‘ఆకడ పక్షులును మృగము| లేకతముగ...’ అందామా?
అవునుకదా! మర్చిపోయాను గుర్తు చేసి నందుకు ధన్య వాదములు తమ్ముడు
రిప్లయితొలగించండికీకా రణ్యము నందున
కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ
కాకులు కప్పలు కోతులు
నేకతముగ జేరె నంట నిండుగ సభకున్
చేకొని జంతుల బొమ్మలు
రిప్లయితొలగించండిరాకేశ్ ! యివియేమి ? చెప్ప రారా ! యనగా
ఓకె ! యని జెప్పె బాలుడు
కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
చేకొని ధ్వన్యనుకరణుని(శబ్దానుకరణు)
రిప్లయితొలగించండిసోకుగ పెండ్లాడినట్టి సుందరి యతనిన్
తాకిన యాతండిట్లనె
కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిముందుగా నేనుకూడ ‘కాకుల’తో సవరణ సూచించాలనుకున్నాను. కాని సమస్యలో ‘కాకా’ అని కాని ‘కావ్‍కావ్’ అని కాని లేకపోవడంతో సందేహించాను. మీ సవరణ బాగుంది. సంతోషం!
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రాకేశ్+ఇవి’ అన్నప్పుడు యడాగమం రాదుకదా... ‘రాకే శివి యేమి...’ అనవచ్చు కదా!
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చీకాకు బెట్టు చుండును
రిప్లయితొలగించండివాకిటిలో నుడుత కప్ప భసకము లెల్లన్
వేకువనే కూతలిడుచు
కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ!!!
వ్యాకరణం బునకనువుగ
రిప్లయితొలగించండినీకందమునందునధ్వనియనుకరణముల్
యేకరువుబెట్ట నిట్లగు
కీకీ హిహిహి బెకబెక కిచకిచ భౌభౌ
పకపక నవ్వుట కొఱకై
రిప్లయితొలగించండికీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ
రకరకముల పై కూతలు
సుకరముగా చదువు చుంటి సుజనులు మెచ్చన్
కాకులు దూరని యడవిని
రిప్లయితొలగించండిభీకర భైరవుని నగరు వెరపు గొలుపుచున్
చీకటి పడ వినవచ్చును
కీకీ,హిహిహీ,బెకబెక,కిచకిచ,భౌభౌ.
2.చీకాకులు,కలిగించిన
లోకమ్మున దాయ,సుతుల,లోలత్వముతో
వాకొను చుండును మనుజుడు
కీకీ,హిహిహీ,బెకబెక,కిచకిచ,భౌభౌ.
3. కాకాపట్టును బ్రతుకగ
మోకాలిని వంగి ద౦డములు పెట్టునిక
న్నీకున్ నీవే సరియను
కీకీ,హిహిహీ,బెకబెక,కిచకిచ,భౌభౌ.
కీకారణ్యమునందున
రిప్లయితొలగించండినాకుల మాటున కువకువలాడుచు జీవుల్
వేకువఁయరచుచు నుండెన్
కీకీ హిహిహీ బెకబెక కిచకిచ భౌభౌ.
నేకంటి నొక్క యూర - పు
రిప్లయితొలగించండిరాకృత పాపంపు వికృత రత మతిహీనుం
డాకొన్న సన్నలెన్నగ
కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘అందున ధ్వని’ అన్నప్పుడు ‘న’ గురువుకాదు. ఆ పాదాన్ని ‘ఈకందమునందునను ధ్వని యనుకరముల్’ అనండి. ‘అనుకరణముల్+ఏకరువు’ అన్నప్పుడు యడాగమం రాదు. సవరించండి. సవరణ సూచించడానికి విఫలప్రయత్నం చేశాను. ‘అనుకరణముల్| సాకల్యముగా జెప్పిన...’ అంటే ఎలా ఉంటుంది?
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వేకువ’ తరువాత అర్ధానుస్వారం ఎందుకు? ‘వేకువ నరచుచు...’ అనండి.
*****
‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కాచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘దొరఁ గాచెడి యా| పోకిరి...’ అందామా?
శ్రీ భాగవతుల కృష్ణరావు గారి పూరణ
రిప్లయితొలగించండిమా కవితలు వినుడనుచునె
కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
కేకలను విడిచి మద్యము
మాకోద్దను మాట చాటి మసలగ మేలౌ
రూకల కోరి ప్రభుత్వమె
వాకొని "మద్యమ్ము త్రాగ మానుడటంచు"
న్నే కోనల నమ్మగ, నిక!
"కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!"
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీకారణ్యము నందున
రిప్లయితొలగించండివే కవ్వడి,కవలును,తను భీముని తోడన్
తా కనె సవ్వడులరయగ
కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!
వేకువ వర్షపు వేళల
నా కీటకములును,కప్ప,లరచెడి పక్షుల్
వే కుక్కలరుపు గనమే
కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!
తా కొండొక మాంత్రికుడటు
వే కీడును కలుగజేయ,భీకర శభ్దాల్
తాకింపజేసె చెవులను
కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!
నే కంటిని మానసికపు
భీకర రోగిని నతడును పెద్దగనరచెన్
తా,కట్టబడియు,నిటులన్
కీకీ!హిహిహీ!బెకబెక!కిచకిచ!భౌభౌ!
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
'తాన్+కట్టబడియు - తాఁ గట్టబడియు' అవుతుంది కదా!
గురుదేవులకు ప్రణామములు.
రిప్లయితొలగించండినిన్నటి దత్తపది :
క్షీరరాశి వధువుఁ జేకూర్చి పెట్టగ
నహరహముల సృష్టి కన్నమిడుచు
భవహర! శుభకర! శ్రీశ! పంకజనాభ! యీ
ధరణి జనులు గనరు ద్రప్సమైన!
నేటి సమస్యాపూరణం :
కేకలఁ బెట్టక పిలువగఁ
జేకూర్చగ 'పిలుచు గంట' చిత్రపు రీతిన్
తాకగ మీటన్నిటులనె
"కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!"
(Calling bell=పిలుచు గంట)
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండి(ఒక వైద్యశాలలో నొక రోగికి మందిడగా నతఁడు చేయు వింత చేష్టలను గని పరిచారిక భిషక్కుతోఁ బలికిన సందర్భము)
"చేకొని మందిడ నీతఁడు
కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
కేకల నిడసాఁగె! వితథ
మో, కాక నిజమొ? కనుఁగొను మో దోషజ్ఞా!"
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండి‘ఏకరువు+ఎట్టి’... ఇందులో ‘ఎట్టి’ అనేది ‘పెట్టి’ అనే అర్థంలో వాడారా? అలా అయితే దోషమే. లేక ‘ఎట్టి = ఎటువంట్’ అనుకుంటే అన్వయం కుదరడం లేదు. వివరించండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణలు (నిన్నటి దత్తపది, ఈనాటి సమస్య) రెండూ బాగున్నవి. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వితథము అర్థంకోసం ఆంధ్రభారతిలో వెదకవలసి వచ్చింది!
ధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండిముందుగ "ననృతమో" యనుకొంటిని. మనస్సు మార్చుకొని, "వితథమో" యని వ్రాసితిని! ఏమయిన నేమి? మీకొక యర్థముపై నవగాహన కలిగినది! సంతోషము!
వ్యాకరణం బునకనువుగ
రిప్లయితొలగించండినేకరువున్ బెట్టుచునుధ్వనియనుకరణముల్
సౌకర్యంబుగ నిట్లగు
కీకీ హిహిహి బెకబెక కిచకిచ భౌభౌ
గురువుగారు ఇలా సవరించాను
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడు మీ పద్యం అన్నివిధాల బాగున్నది. సంతోషం!
గురువుగారు
తొలగించండికృతజ్ఞతలు, చివరికి కంపార్టుమెంటల్ పద్ధతిలో
పాసయ్యాను
లోకుల పోకడవలెనే
రిప్లయితొలగించండిదూకుచుకోతులు,పురుగులు,దొరగాచెడియా
పోకిరి కుక్కలయరుపులు
కీకీ,హిహిహీ, బెకబెక కిచకిచ బౌబౌ
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
కేకలఁబెట్టుచు సభలన్
రిప్లయితొలగించండికీకీ హిహిహి బెకబెక కిచకిచ బౌబౌ
యీకాలపునేత లకట!
చీకాకులఁబెట్టుచుంద్రు చీడ పురుగులై
మాస్టరు గారూ ! ధన్యవాదములు.. మీ సూచనతో......
రిప్లయితొలగించండిచేకొని జంతుల బొమ్మలు
రాకేశివియేమి ? చెప్ప రారా ! యనగా
ఓకె ! యని జెప్పె బాలుడు
కీకీ! హిహిహీ! బెకబెక! కిచకిచ! భౌభౌ!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.