30, జూన్ 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1717 (సంతతము దుఃఖమే కులసతుల వలన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సంతతము దుఃఖమే కులసతుల వలన.

34 కామెంట్‌లు:

 1. సంతసమ్ముగ సేవలు సలుప సతులు
  సంతతము, దుఃఖమేకులసతుల వలన
  కలుగు? గయ్యాళి తనమున్న కాంతలైన
  సంతతము దుఃఖమే కులసతుల వలన

  రిప్లయితొలగించండి
 2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  నా మనసులోని మాటగా చక్కని పూరణతో బోణీ చేశారు. చాలా సంతోషం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. వినయమే లేని సతితోన వేగ లేక
  సంతతము దు:ఖమే , కులసతుల వలన
  గలుగు నిరతము గృహమందు గౌర వమ్ము
  లక్ష్మి నెలకొని శోభిల్లు లక్షణ ముగ

  రిప్లయితొలగించండి
 4. మిత్రులందఱకు నమస్సులతో...

  సూటి పోటి మాటలతోడ సూదులవలె
  గ్రుచ్చుచుండంగ గేస్తుండు కూర్మి నెట్లు
  పంచఁగలఁడయ్య? కినియుచు వగపు నిడఁగ
  సంతతము దుఃఖమే కులసతుల వలన!!

  రిప్లయితొలగించండి
 5. రామ! నను రావణుడు దెచ్చి లంక నుంచె
  నెట్లు కనుగొందు వోస్వామి? యేమ నెదను?
  బాధలే నీకు నావల్ల , పతులకెన్న
  సంతతము దుఃఖమే కులసతుల వలన.

  రిప్లయితొలగించండి
 6. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. రమణి వింతను గోరంగ రాఘవుండు
  పగల బడినవ్వ బాంచాలి పాండు సుతులు
  ఇడుములన్బొందిరి జూడ నేరి వలన
  సంతతము దుఃఖమే కుల సతుల వలన

  రిప్లయితొలగించండి
 8. మాయ లేడిని తాగోరి మగువ సీత
  పతికి కష్టాలు గొనిదెచ్చె వనము నందు
  తండ్రి మీదనలిగి తాను దహన మగుచు
  భవుని బాధకు గురిజేసె బాలచంద్ర
  యిద్ద రతివల మధ్యన యిమడలేక
  శేషశయనుడు మారెను శిలగ తాను
  వింత గాదిది లోకాన ప్రియులకెపుడు
  సంతతము దుఃఖమే కుల సతుల వలన!!!


  రిప్లయితొలగించండి
 9. పసిడి లేడిని యొక భామ భర్త నడుగ
  అడుగు తడబడ గని యొక్క యతివ నవ్వ
  పతులు బడినారు పడరాని పాట్లు నాడు
  సంతతము దుఃఖమే కులసతుల వలన.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
  గురువుగారు మీ కష్టములను దీర్చమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ
  ---------------------
  పద్యమున్నజాలు పసిడి యేల ననుచు
  బ్లాగు మిత్ర తతికి బంధు వైన
  కందివంశ తిలక కష్టములను జూచి
  నిద్ర యేల నయ్య భద్ర శైల !

  రిప్లయితొలగించండి
 11. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  పార్వతికి ‘బాలచంద్ర’ అన్న పర్యాయపదం ఉన్నట్టు మీ పద్యం వలన తెలిసింది. పర్యాయపద నిఘంటువులో ఉంది కాని వ్యుత్పత్తి ఏమిటో?
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  కందుల వరప్రసాద్ గారూ,
  ధన్యవాదాలు...
  ప్రస్తుతం నేను వృద్ధాశ్రమంలో ప్రశాంతంగా ‘టెన్షన్ ఫ్రీ’ జీవితాన్ని గడుపుతున్నాను. ఆర్థికపరమైన కష్టాలంటారా... అవి ఎప్పుడూ ఉండేవే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువు గారూ
   బహుశా ఫాల చంద్ర నా
   ఫాలము అర్ధ చంద్ర ఆకారంలో ఉంటుంది.
   ఒక వేళ బాల చంద్ర నే అయితే నా అజ్ఞతను మన్నించండి

   తొలగించండి
 12. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  పరుగులిడు విద్య నేర్పగ వాణి భువికి
  స్థిరముగా నింటనుండక సిరి తిరుగును
  భగ్నమై గూర్చె పాట్లు కపర్దికి సతి
  సంతతము దుఃఖమే కులసతుల వలన.

  ధర్మజుని నంటి పడెపాట్లు ద్రౌపది కద!
  ధర హరిశ్చంద్రు నర్ధాంగి దాసి కాగ
  పతిని వెంటంటి వైదేహి పాట్లు పడగ
  సంతతము దుఃఖ మేకులసతుల వలన?.

  రిప్లయితొలగించండి
 13. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. భార్య గయ్యాళి దియగుచో భర్త కుమఱి
  సంతతము దుఃఖ మే కుల సతుల వలన
  నెడ్డె మనినచో ననునామె తెడ్డె మనియు
  సర్వ నాశన మగునార్య ! సదరు గృహము

  రిప్లయితొలగించండి
 15. సంతతము దుఃఖమే [ము+ఏ]కులసతులవలన
  కలుగునో కారణమ్మును తెలియ వలయు
  వారి వ్యథలను పోగొట్టి ప్రశ్రయమున
  చేరవలయు సతి హృదయ సీమనిండ
  2.మూతి విరుపులో కులసతి ముద్దుమురిపె
  ములను వంపులు సొంపులు తెలియలేరు
  పడుపుకత్తెల గాంక్షించు పతులకెల్ల
  సంతతము దుఃఖ మేకులసతుల వలన
  3.సంఘమొకటి యనాదిగా చక్కబడెను
  భార్య బాధిత తాడిత పతులకొరకు
  మూలమంత్రమ్ము యాసంఘ మునకు నిదియ
  "సంతతము దుఃఖ మేకులసతుల వలన"  రిప్లయితొలగించండి
 16. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సదరు’ అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మూడు వైవిధ్యమైన పూరణలను చెప్పి అలరింపజేశారు. అభినందనలు.
  మూడవపూరణలో ‘మంత్రమ్ము+ఔ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మూలమంత్రమౌ నా సంఘమునకు...’అనండి.

  రిప్లయితొలగించండి
 17. భర్త కష్ట సుఖములను పంచు కొనక
  సూటి పోటి మాటలతోడ స్రుక్కజేయ
  సంతతము దుఃఖమే కులసతుల వలన
  నట్టిసాహచర్యము కంటె నడవిమేలు

  రిప్లయితొలగించండి
 18. మొండిఘటము, పెంకి,చండశాసనురాలు
  నిత్యశంకితమతి,నీచబుద్ధి
  దారయైన "సంతతము దుఃఖమే కుల
  సతుల వలన "కలుగు శాంతి సుఖము.

  రిప్లయితొలగించండి
 19. చింతించు మగనితో చిత్రంబుగా జేరి
  -----కోర్కెల జాబితా గోర పడతి
  పంతాన పతిజేరి పరిహాస మందున
  ------అన్యోన్నమేలేని నతివతోడ
  చీరనగలు లేవు సిగ్గందు ముగ్గినా
  ------కనుపించదాయను కాంతతోడ
  అమ్మ నాన్న లటన్న నలుసుగా జూచుచు
  ------చాడీలు జెప్పెడి సాధ్వి తోడ
  సంతసంబును సాకని సవతివోలె
  నిత్య కృత్యము నిందలబత్యమైన?
  కంతు లందున కలతల చింత జేర్చ?
  సంతతము దుఃఖమే కులసతుల వలన

  రిప్లయితొలగించండి
 20. కట్నమిచ్చియు కొన్నట్టి కాంతలంత
  పట్టుదలలకు వెళ్ళగ?పంతమందు
  సుఖము గూర్చని సుదతుల సూక్ష్మబుద్ది
  సంతతము దుఃఖమే కులసతుల వలన

  రిప్లయితొలగించండి
 21. .తే.గీ: మూర్ఖ వాదనచేతను మొండి దగుచు
  పట్టుదల తోడ భర్తను భాధ పెట్టి
  సామరస్యము కోల్పోయి శాంతి లేక
  సంతతము దుఃఖమే కులసతుల వలన.

  రిప్లయితొలగించండి
 22. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  దువ్వూరి రామమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణలు (ముఖ్యంగా వివరంగా చెప్పిన సీసపద్యం) బాగున్నవి. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. నక్కా శివకుమార్ గారూ,
  సినిమాలకు, సినిమాలకు ప్రాధాన్యత నిచ్చే బ్లాగులు ఎన్నో ఉన్నాయి. మీ సమాచారాన్ని ఆ బ్లాగులతో పంచుకోండి. ఈ బ్లాగు కెవలం సంప్రదాయ సాహిత్యానికి అంకితమైనది. అందువల్ల మీ ‘మహేశ్ బాబు సినిమా పాటలను డౌన్‍లోడ్ చేసుకోండి’ అనే వ్యాఖ్యను ఆ లింకును తొలగిస్తున్నాను. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు పెట్టవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 24. అలవి గానట్టి కోర్కుల ననవరతము
  కోరుచును తీర్చకున్నచో క్రోధమునను
  వరుని సాధించు గయ్యాళి వనితలున్న
  సంతతము దుఃఖమే కులసతుల వలన.

  రిప్లయితొలగించండి
 25. గురువర్యులసూచన మెరకు సవరించినపద్యము
  3.సంఘమొకటి యనాదిగా చక్కబడెను
  భార్య బాధిత తాడిత పతులకొరకు
  మూలమంత్రమౌ నాసంఘ మునకు నిదియ
  "సంతతము దుఃఖ మేకులసతుల వలన"

  రిప్లయితొలగించండి
 26. పాండు పుత్రులఁ బెంచిన బడతి కుంతి
  ధర్మవర్తన నేర్పగ ధరణి మెచ్చె!
  'శివ' కుమారుని దీర్చిన జిజియ బాయి
  యందె జేజేలు పౌరుల వందనాలు!
  పూజ్య బాపును గన్నట్టి పుతలిబాయి
  జన్మ ధన్యమాయె స్వతంత్ర సాధనమున!
  సతులు నేర్పగ నేర్చిరి సంతులిచట!
  సంతతము దుఃఖ మే కులసతుల వలన?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ
   మీ పద్యము చూడక ముందు నా పద్యం వ్రాశాను
   మీరు కూడా సతుల పక్షంగానే వ్రాశారు.
   మీ పద్యం యథా విధి గా చాలా బాగుంది

   తొలగించండి
 27. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. ఇచ్ఛ వచ్చినటుల నుండ నిష్ట పడరు
  కొంప లోన పేకలనాడ కోప బడుదు
  రంద రమరచి దనవారె యధికు లనరు
  సంతతము దుఃఖమే కుల సతుల వలన

  అందరూ సతులనే తప్పు పడుతుంటే నేనొక్కణ్ణే
  వారి వైపు మట్లాడానని నన్ను నేనే మెచ్చు కుంటున్నా

  రిప్లయితొలగించండి
 29. అత్తమామల కొరకునై క్రొత్తలోన
  బిడ్డపాపల సేమంబు పేర పిదప
  కులము యశముకు పూజల కొంతవరకు
  సంతతము దు:ఖమే కులసతుల వలన

  ఆర్జనంబది సరిగాను నందవనుచు
  తోటివారల పోల్చుక దు:ఖపెట్టు
  సతియె,బాధ్యత పేరిట సణుగుచుండు
  సంతతము దు:ఖమే కులసతుల వలన

  వంశగౌరవమంచును భార్యయెపుడు
  మంచిగానుండ భర్తను మలచుచుండి,
  సుఖము వెతుకుచు దు:ఖాన,సుమతి యుండ
  సంతతము దు:ఖమే కులసతులవలన

  ఆటవెలదులసౌఖ్యంబునందియిచ్చి
  చేయిదాటియు పోకను చెలగుచుంద్రు
  భర్త సేమంబె కోరును పత్ని యెపుడు
  సంతతము దు:ఖమే కులసతులవలన

  రిప్లయితొలగించండి
 30. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మెల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 31. గురుదేవులకు మరియు శ్రీ అశ్వర్థనారాయణమూర్తి గారికి ధన్యవాదములు. ప్రపంచ మనుగడ కులసతులు తీర్చిదిద్దే నవతరం వల్లే సాధ్యం! కాదంటారా? మూర్తి గారూ!

  రిప్లయితొలగించండి
 32. వారి గాథలఁ జదువుచు దారి తెలిసి
  కొనుచు నడువుదమనియెడు కోర్కె గలిగి
  చదువ మొదలిడ, నక్కట! చదువు కొలది
  సంతతము దుఃఖమే కులసతుల వలన.

  రిప్లయితొలగించండి