20, జూన్ 2015, శనివారం

పద్య రచన - 937

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. రంగు రంగుల విరులల్లె రమణు లంత
  మధుర భావాలు విరజిమ్ము మనసు నిండ
  వాలు జడలందు విరిసిన పూల తావి
  సొగసు లీనుచు మురిపించు సోయ గమ్ము

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఆడువారికి వాలుజడ - మగవారికి గుండె దడ :

  01)
  _______________________________

  జడ యనిన, తిరి యన్నను, - జట యనినను,
  వేణి, వేణిక, మరియును - వేనలి యను
  వెండ్రుకల చుట్టలను పిల్చు - వివిధ పేర్ల
  నల్లుకొన్నట్టి యతివలు - యందగించి
  కుళ్ళగింతురు, మగ గుండె - ఝల్లుమనగ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  కర్తృపదం ‘రమణులు’ బహువచనం. క్రియాపదం ‘అల్లె’ ఏకవచనం. ‘రంగుల విరుల నల్లిరి రమణులంత’ అనండి.
  *****
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ఎదపై విడివిడి గానే
  పదపడి వేయంగ రాక ఫలితము, తామే
  మదనుని వీడుచు శరములు
  మదవతులను జేరి జడను మసలుచునుండెన్

  రిప్లయితొలగించండి
 5. పూలను బోలెడి తరుణుల
  మూలల తా గొలువుదీరి పూమాలికలే
  లీలగ వాల్జడ లమెరిసి
  గోలల కందమ్ము నొసగు కువలయ మందున్!!!

  మూల = కొప్పు

  రిప్లయితొలగించండి
 6. విరుల దండలు జూడుము వివిధ ములగు
  రంగు లకలయి కలుగల్గి రమ్య ముగను
  వాలు జడల రూప మ్మున భామినులను
  ముగ్ధు లనుజేయు చుండెను మూర్తి ! కాదె ?

  రిప్లయితొలగించండి
 7. పూలజడలతోడ పులకలు రేపుచు
  చేడె లొప్పు చుండ చెన్నుగాను
  చూపుఁ ద్రిప్పలేక సుందరాంగులనుండి
  చిక్కు చుండ్రి జనులు చేపలట్లు

  రిప్లయితొలగించండి
 8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. నడవగ తరుణుల జడలే
  తడబడకను తాళమేయు తత్వము నందే
  కడు రమణీయము జూడగ
  నడకకు నందంబు జేర్చునాట్యములందున్
  2.అందపు సుంద రాంగుల సహాయము జేయునటన్నతీర్పుకే
  కొందరు మొగ్గుజూపుదురు?కోవిదు లెంతురు.జూడగా జడల్
  పొందిక పోరు సల్పుటకు పూర్తి గహాస్యము జేయు భర్తకున్
  నిందలచేత ఈజడలు నేటికిదగ్గెను పట్టాణాలలో|

  రిప్లయితొలగించండి
 10. కురుల సామ్రాట్టుల గూర్చిన యందమా
  -----పరుల ఈర్ష్యలకది పట్టుగొమ్మ|
  విరిసిన మల్లెలువిరివిగబూసినా?
  -----తరుణుల అందమే తరుగబోదు|
  మరులను గొల్పెడిమల్లెలుతెలుపని
  -----నల్లని కురులన్ని నక్కియుండు|
  వీపునకందమై వెన్నెల కాంతిలా
  -----సొగసును గురిపించు సోయగంబు
  ఊగు యూహలన్ని ఉయ్యాల లూపగ?
  జడలునిలువరించు నడక బెంచ|
  అతివ లంద మంత ఆజడలుంచగా?
  మతులు గతులుదప్పు మగువకైన|

  రిప్లయితొలగించండి
 11. ఏమి వయ్యార మయ్యారె! ఇంద్ర హీర
  మగుచు బడుచు గుండెల గొండ లదర గొట్టె
  విరులు బొదిగిన జడలకు వివర మరయ
  ఆంధ్ర నైషధ కర్తయె నర్హు డగును

  రిప్లయితొలగించండి
 12. ఆ.వె:రంగు రంగు విరుల రమణీయముగ కూర్చి
  పెళ్ళి కూతురికిడ పెళ్ళికొడుకు
  మురిసి పోయి జూడ ముచ్చటదియెగాదె
  కనగ రండు మీరు కాంతలార.

  రిప్లయితొలగించండి
 13. కె. ఈశ్వరప్ప గారూ,
  మనోహరమైన పద్యాలను అందించారు. అభినందనలు.
  మీ పద్యాలలో మధ్యలో అచ్చులు రాకుండా అవసరమైన యడాగమ, నుగాగమ సంధులను ప్రయోగించండి.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. పూలు రకమ్మునకొకటిన్
  మాలికలయ్యె జడలోన మలచగ, వరుడౌ
  పాలకడలిఁ దేలు హరికి
  శ్రీలక్ష్మిని వధువుఁ జేసి సింగారింపన్!

  రిప్లయితొలగించండి

 15. పద్యరచన విరిజడలు
  నలుగురు వధువుల విరిజడ
  లలంకరింపగ జేసిరి ఐదువరాండ్రున్
  కలలో తారూహించిన
  వలపులు ఫలియించ వరుని ప్రణయమునందున్

  రిప్లయితొలగించండి
 16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి