డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘అతికమ్మన’ అని సమాసం చేయరాదు. ‘రండు+ఉవిద’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వండినారు’ను ‘ఒండినారు’ అన్నారు. నా సవరణలతో మీ పద్యం.... సెనగపిండి తోడ చేసిన గవ్వలు కరకరమని యెంతొ కమ్మనుండు తెలుగు వారి రుచుల తీరును గనగ రం డువిద లెల్ల వండి రుత్సుకతన. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘ఐక్యత’ను ‘ఐఖ్యత’ అన్నారు. ***** శైలజ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తీయని గవ్వల రుచిగని
రిప్లయితొలగించండిహాయిగ పరుగిడుచు రండి ఆహా యనుచున్
శ్రేయము వంటికి మెదడుకు
ప్రాయము నందన్ని తినుట భాగ్య మటన్నన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
సెనగపిండి తోడ చేసిన గవ్వలు
రిప్లయితొలగించండికరకరమనుచునతి కమ్మనుండు
తెలుగు వారి రుచుల తీరును గనరండు
యువిద లొండినారు యుత్సుకతన.
మంచి గోధుమ పిండికి పంచ దార
రిప్లయితొలగించండిపాకముకలిపి యింటిలో వండినట్టి
యవ్వచేసిన గవ్వల నారగించ
మనసు స్వర్గముఁజేరును తనివితోడ
గవ్వల జూడగ బటమున
రిప్లయితొలగించండిరివ్వున మఱి వా లనటకు రెప రెప లాడెన్
అవ్వా ! నామది నిజమిది
గవ్వల రుచి జెప్ప దరమె ? కన్నడి కైనన్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘అతికమ్మన’ అని సమాసం చేయరాదు. ‘రండు+ఉవిద’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వండినారు’ను ‘ఒండినారు’ అన్నారు. నా సవరణలతో మీ పద్యం....
సెనగపిండి తోడ చేసిన గవ్వలు
కరకరమని యెంతొ కమ్మనుండు
తెలుగు వారి రుచుల తీరును గనగ రం
డువిద లెల్ల వండి రుత్సుకతన.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ధన్యవాదాలండి అన్నయ్యగారు..
తొలగించండిఅవ్వ చేసి నట్టి గవ్వలు తీయన
రిప్లయితొలగించండిదవ్వు నుంచి పంపె తవ్వెడన్ని
బువ్వ తినక ముందె బుద్ధిగా నోటిలో
రువ్వుకొన్న నెంతొ రుచిగ నుండు!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అమ్మ యిదేమి వంట?మరియాదల కందని దైన-పిల్లలే
రిప్లయితొలగించండినమ్మియు యిష్ట మై దినుచు-నవ్వులుబంచగ లాభమేగదా?
అమ్మకు,అమ్మజేసినవి అమ్మెడి వాటికి సొమ్ముకంటె?ఆ
కమ్మని గవ్వలో రుచిగ కామిత సిద్ధిని గూర్చి పెట్టులే|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేలికగా జేయదగిన
రిప్లయితొలగించండిమేలొసగెడు వంటకమును మెచ్చరె జనులున్
బోలుగ నుండెడి గవ్వలు
కాలక్షేపమగు దినగ కమ్మని రుచితో!!!
గవ్వలు జూడగ జునులకు
రిప్లయితొలగించండిజివ్వున మరి మనసు లాగు సేవించంగా
జవ్వున దినగా తీయని
గవ్వల రుచి బొగడతరమె కావ్యుని కయినన్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపిల్లల నోటి నాలుకలు –ప్రీతిగ నాడెడి రీతిజేయుచున్
రిప్లయితొలగించండితల్లులయందునన్ విసుగు తగ్గెడి మార్గము బంచి పెట్టుచున్
అల్లరి కొంత చెల్లదని-ఆదరి గవ్వలు చూపుకందగా?
పిల్లల నవ్వుతో గలసి పెంచెను నైఖ్యత తీపి మార్గ మై|
2.శనగపిండి నీళ్ళు సరిపడ రీతిగా
కలుపు గోలు చేత కలసి పోయి|
నూనె యందుగాలి నోరూరు నట్లుగా
గవ్వలాయెచూడ?గువ్వలట్లు|
తీయని గవ్వలఁ బెట్టెను
రిప్లయితొలగించండిహాయిగఁ దిన నాదు సతియె యమృతంబనగన్!
సాయమ్మౌ యీ గవ్వలె!
పేయమ్మౌ సుధను గ్రోల వేల్పులకెల్లన్!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఐక్యత’ను ‘ఐఖ్యత’ అన్నారు.
*****
శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.