30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -477 (మానినీమణి భర్తనే)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మానినీమణి భర్తనే మఱచిపోయె.
ఈ సమస్యను సూచించిన
నేదునూరి రాజేశ్వరి గారికి
ధన్యవాదాలు.

29, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -476 (రాముఁడు పగవాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

పండిత నేమాని వారి ఆశీస్సులు - 2

విద్యాశీస్సులు

దరహాసైందవ శోభితాస్యయగు విద్యాదేవి కావించుచున్
వరవీణామృదు నిక్వణ ప్రతతులన్ వాత్సల్య పూర్ణాత్మయై
పరమార్థమ్ములు కూర్చు నాశిషములన్ వర్షించుచుండెన్ సమా
దర రీతిన్ గొని తద్రసమ్ము నమితోత్సాహాన సేవింపమే!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

28, సెప్టెంబర్ 2011, బుధవారం

ఛందస్సు - 2 (సరసయతి)

.................... సరసయతి .....................
"పుడు పితృదేవతల పూజ హితము కాదు"
పై పాదంలో ఇ-హి లకు మైత్రి కూర్చడం ‘సరసయతి’.
‘సరస’ అంటే సమీపం. భిన్నవర్గాలకు చెంది, ఉచ్చారణాసామీప్యం కలిగిన వర్ణాలకు మైత్రి కూర్చడం సరసయతి.
కం.
అయహలు, చఛజఝశషసలు
నయసంయుత నణలు రేచనా సరసగుణా
ప్రియ యవి యొండొంటికి ని
శ్చయముగ వల్లయ్యె సర్వశాస్త్రవిధిజ్ఞా! (కవిజనాశ్రయము, 1-74)
ఆ.వె.
ణనలు చెల్లుఁ గమలనాభ యొండొంటికి
నయహ లమరియుండు హస్తివరద
శషస లొందునండ్రు చఛజఝంబులతోడ
సరసయతు లనంగ జలధిశయన! (అనంతుని ఛందోదర్పణము, 1-107)
కం.
పరగు న్నణ లొండొంటికి
సరవిన్ శషసలు దనర్చు చఛజఝములకున్
పరికింప నయహ లేకము
సరసవిరామంబు లవి నిశాకరమకుటా!
(కూచిమంచి తిమ్మకవి లక్షణసార సంగ్రహము)
కం.
హయ లత్వమునకు, శషసలు
నయవర్తన చఛజఝలకు, నలి మధ్యమ వ
ర్గయుతానునాసికము ని
శ్చయముగ ద్రుతమునకుఁ జెల్లు సరసవళు లన్న్. (అప్పకవీయము)
పై లక్షణాల ప్రకారం మూడువిధాల యతులు ఏర్పడుతున్నాయి.
1) అకారానికి యహలు.
2) చఛజఝలకు శషసలు
3) ద్రుతము (నకారము)నకు మధ్యమవర్గ అనునాసికాక్షరమైన ణకారము (న కు ణ)
"యకార హకారములకు అఆఐఔలున్ను, యకార హకారములకు గుడియు నేత్వమైనా ఉంటే ఇఈఎఏలున్ను, కొమ్మైనా ఒత్వమైనా ఉంటే ఉఊఒఓలున్ను చెల్లును. ఇవి సరసయతులు." (‘సుకవిమనోరంజనము’ కర్త కూచిమంచి వేంకటరాయని వ్యాఖ్య)
"అయహలకు మైత్రి చెల్లు నన్నప్పుడు ‘అ’ అనునది సర్వాచ్చులకు ఉపలక్షణము"
(‘ఛందోదర్పణ’ వ్యాఖ్యాత శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు).
"అయహల మైత్రి నిట్లు విస్తరించి చెప్పవచ్చును.
1) అఆఐఔ - యయాయైయౌ - హహాహైహౌ.
2) ఇఈఋౠఎఏ - యియీయృయౄయెయే- హిహీహృహౄహెహే.
౩) ఉఉఒఓ - యుయూయొయో - హుహూహొహో
‘తెలుగులో ఛందోవిశేషములు’ - యతిభేదపరిశీలనము నుండి)
కొన్ని ఉదాహరణలు.
1) అఆఐఔ - యయాయైయౌ - హహాహైహౌ.
ఉదా||
మలినతారకాసముదయంబుల నెన్నను సర్వవేద ... (భార. ఆది. ౧-౧౯)
సూకర| మై యప్పుడ యెత్తికొని రయంబునఁ జనుచోన్. (భార. ఆది. ౧-౧౩౩)
డిచినఁ దిట్టినన్ మఱి మహాపరుషంబున పల్కి ... (భార. ఆది. ౧-౧౩౮)
కుటిలుఁ డార్యసమ్మతుఁ డహంకృతిదూరుఁడు ... (భార. విరా. ౧-౯౮)
2) ఇఈఋౠఎఏ - యియీయృయౄయెయే- హిహీహృహౄహెహే.
ఉదా||
హిమకరుఁ దొట్టి పూరుభరతే కురుప్రభు పాండుభూపతుల్ (భార. ఆది. ౧-౧౪)
వచ్చి య| య్యెర నొక డుండుభం బను నహిం గని వ్రేయఁగ ... (భార. ఆది. ౧-౧౫౨)
యాత్మలో| నిడుగడఁ జేయుచుం గడు సహింపక కద్రువ ... (భార. ఆది. ౨-౪౨)
మ| హీ నాయకు సొమ్ము పాము నెమ్ములు గాలో ... (భార. విరా. ౧-౧౩౬)
బా| హిరములైనఁ గెలని కెగ్గు లగుట (భార. విరా. ౧.౧౩౭)
హీనత నున్కి మీకు వగ పేమియుఁ జేయద యేమి ... (భార. విరా. ౨-౨౧౮)
ఇందు నొప్పారు శ్రీరామహృదయ మనెడు (పండిత నేమాని రామాయణము, పీఠిక - ౧౪)
హితబృందములతోడ నేగి తనదు (పం. నే. రామా. బాల. ౧సర్గ. ౨౦)
హితమా రీతి గురుండు తెల్ప వసుధాధీశుండు కేల్మోడ్చి... (పం. నే. రామా. బాల. ౩సర్గ. ౯)
చ్చె నానతి జనకమహీవిభుండు. (పం. నే. రామా. బాల. ౬సర్గ. ౧౪)
౩) ఉఉఒఓ - యుయూయొయో - హుహూహొహో
ఉదా||
అసురకు| నోయన చెప్పుటయు విని మహోగ్రాకృతితో (భార. ఆది. ౧-౧౩౩)
పుదుఁ దత్తద్విధప్రయోగముల మెయిన్. (భార. విరా. ౧-౭౯)
కనాడు వచ్చె నయోధ్యకు కైక ... (పం. నే. రామా. బాల. ౭సర్గ. ౩౩)
చఛజఝశషస; నణల మైత్రి గురించి మరో పాఠంలో తెలుసుకుందాం.

సమస్యా పూరణం -475 (నిగమము పఠియించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్.
ఈ సమస్యను సూచించిన
నేదునూరి రాజేశ్వరి గారికి
ధన్యవాదాలు.

శుభాకాంక్షలు!

రాజారావు చెప్పిన
శరన్నవరాత్రి శుభాకాంక్షలు!
మేలగు ‘శంకరాభరణ’ మిత్రులు, ప్రేక్షకు, లెల్లవారికిన్
శ్రీలలితా పరాత్పర విశేష శరన్నవరాత్రి వేడుకన్
దేలి, త్రిమూర్తిమాతృ పదదీప్తుల దీవెన లంది మీరు, మీ
పాలి కుటుంబసభ్యలును, బంధుజనమ్ము శుభమ్ము బొందెడిన్!


లక్కాకుల వెంకట రాజారావు

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

పండిత నేమాని వారి శుభాశీస్సులు!

‘శంకరాభరణం’
సభ్యులగు కవి మిత్రులందరికి
శుభాశీస్సులు.

మీ సౌహార్దమయాభినందనలకున్ మీ సద్గుణ శ్రేణికిన్
మీ సాహిత్య విహార తత్పరతకున్ మీ భావ వైచిత్రికిన్
నే సంతోషమునొంది కూర్తు నివియే స్నిగ్ధ ప్రశంసల్ వచ
శ్శ్రీసంపన్నులరైన మీకు బహుధా శ్రేయమ్ములన్ గోరుచున్

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యా పూరణం -474 (ఇపుడు పితృదేవతల)

కవి మిత్రులారా,
మహాలయ అమావాస్య పర్వదిన శుభాకాంక్షలు!
ఈరోజు పితృఅమావాస్య.
నేటినుండి తెలంగాణాలో బతుకమ్మల సందడి!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఇపుడు పితృదేవతల పూజ హితము గాదు.

26, సెప్టెంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -473 (డండం డడడం)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
డండం డడడం డడండ డండం డడడం.
ఈ సమస్యను పంపించిన
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి
ధన్యవాదాలు.

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -472 (ఖలునకు సత్కారము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఖలునకు సత్కారములవి ఘనముగ జరిగెన్
ఈ సమస్యను పంపించిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

సమస్యా పూరణం -471 (మనమొక రాజహంస)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
(నిజానికి ఇందులో ‘సమస్య’ లేదు. పాదపూరణమే! మీ మీ కవితామాధుర్యాన్ని చవిచూపడమే!)
మనమొక రాజహంసయయి
మంచిని పెంచి సుఖించు టొప్పగున్.
ఈ పద్యపాదాన్ని పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

24, సెప్టెంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం -470 (ప్రామాణిక పుస్తకమును)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్.
ఈ సమస్యను పంపించిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -469 (జెల్లఁ దినిన కృష్ణుఁ డంత)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
జెల్లఁ దినిన కృష్ణుఁ డంత చిన్నగ నవ్వెన్.
ఈ సమస్యను పంపించిన శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి ధన్యవాదాలు.

22, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -468 (మామిడి ఫలమున్ దినంగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

21, సెప్టెంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం -467 (జాడ చూపినట్టి జాడ)

కవి మిత్రులారా,
ఈ రోజు మహాకవి గురజాడ వెంకట అప్పారావు 150వ జయంతి!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
జాడ చూపినట్టి జాడఁ గనుఁడు.

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -466 (కాలు నమ్మి కొలిచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

19, సెప్టెంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -465 (పదుగురు గనంగ వనిత)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -464 (పదపదమందు శోభిలును)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
(నిజానికి ఇందులో ‘సమస్య’ లేదు. పాదపూరణమే! మీ మీ కవితామాధుర్యాన్ని చవిచూపడమే!)
పదపదమందు శోభిలును
భారతి పాద విభూషణ ధ్వనుల్.
ఈ పద్యపాదాన్ని పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం -463 (పట్టుబడెను చేఁప)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పట్టుబడెను చేఁప తుట్టతుదకు!
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

17, సెప్టెంబర్ 2011, శనివారం

ఆహ్వానం!

‘పొద్దు’ అంతర్జాల కవిసమ్మేళనానికి ఆహ్వానం!
శంకరాభరణ బ్లాగులో సమధికోత్సాహంతో పాల్గొంటూ
పాఠకులనూ, అన్య ఔత్సాహికులను ఎప్పటికప్పుడు రంజింపజేస్తున్న
సుకవివరులకు ప్రణామాలు.
పెద్దల ఆశీర్వాదాలతో, కవివరుల అశేషప్రతిభతో
పొద్దులో ఏటా అంతర్జాలకవిసమ్మేళనం జరుపుకోవడం
ఆనవాయితీగా వస్తున్నది.
ఇందులో భాగంగా
ఈ విజయదశమికి కూడా
అంతర్జాలకవిసమ్మేళనం
జరుగుతుంది.
పాల్గొనదలచిన వారు వివరాలకోసం ఈ క్రింది లంకెలో చూడవచ్చు.

http://poddu.net/?q=node/851

ఇట్లు,
పొద్దు.

సమస్యా పూరణం -462 (యమునకు పద్యానురక్తి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -461 (దోఁచుకొన్నవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దోఁచుకొన్నవాఁడె తోడునీడ.

15, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -460 (భీమసేనుఁడు గాంధారి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
భీమసేనుఁడు గాంధారి పెద్దకొడుకు.
జాలపత్రిక ‘ఈమాట’ వారికి ధన్యవాదాలతో...

14, సెప్టెంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం -459 (మణిముట్టగఁ జేయి గాలె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మణిముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.
ఈ సమస్యను పంపిన కోడీహళ్ళి మురళీమోహన్ గారికి ధన్యవాదాలు.

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -458 (రణము హర్షంబు గూర్చు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ.
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

12, సెప్టెంబర్ 2011, సోమవారం

చమత్కార (చాటు) పద్యాలు - 126

అబద్ధం!
మొన్న సూర్యరాయాంధ్ర నిఘంటువును టైపు చేస్తుండగా ‘ఆబద్ధము’ శబ్దానికి అర్థాలకు ఉదాహరణగా క్రింది చాటుశ్లోకం కనిపించింది.
యావజ్జీవ మహం మౌనీ, బ్రహ్మచారీ తు మే పితా |
మాతా తు మమ వంధ్యాసీ, దపుత్త్రశ్చ పితామహః ||

తాత్పర్యం ...
నేను యావజ్జీవం సన్యాసిని. నా తండి బ్రహ్మచారి. నా తల్లి గొడ్రాలు. మా తాత పుత్త్రసంతానం లేనివాడు.

దీనికి నా అనువాదం ...
ఆ. వె.
గడపినాఁడ మౌనిగా నా బ్రతుకును నా
తండ్రి బ్రహ్మచారి, తల్లి గొడ్డు
రాలుగా ప్రసిద్ధు లాలకింపుఁడు పితా
మహుఁ డపుత్త్రకుండు మా కులమున.
కవి మిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.

సమస్యా పూరణం -457 (గరళకంఠుండు పయనించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి.

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -456 (వనమును ధ్వంసంబు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.
ఈ సమస్యను సూచించిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

సమస్యా పూరణం -455 (గణమే త్రుంచెను శంభుచాపమును)

వారాంతపు సమస్యా పూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ....
"గణమే త్రుంచెను శంభుచాపమును శ్రీ
రాముండు చేఁబూనఁగా"
(గమనిక - యతిలో కూడ సమస్య ఉన్నది. పాదాద్యక్షరం సంయుక్తాక్షరమైతేనే యతిమైత్రి చెల్లుతుంది)
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

10, సెప్టెంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం -454 (పండితుని జూచి నవ్వెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పండితుని జూచి నవ్వెను పామరుండు.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -453 (కపి మనోజుఁ గాంచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కపి మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

8, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -452 (రాముఁ డాతఁడు తమ్ముఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రాముఁ డాతఁడు తమ్ముఁడు రావణునకు.

7, సెప్టెంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం -451 (అన్యాయము సేయువార)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
అన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -450 (గాలికబురు లిపుడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
గాలికబురు లిపుడు గణన కెక్కె.

5, సెప్టెంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -449 (కుజనుల సంగతి హితమని)

కవి మిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కుజనుల సంగతి హితమని గురువు వచించెన్.

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -449 (మోదక మన్న సుంతయును)

వారాంతపు సమస్యా పూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ....
మోదక మన్న సుంతయును
మోదము లేదు గణాధినాధుకున్.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

సమస్యా పూరణం -448 (కారు కంటఁ బడిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.

3, సెప్టెంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం -447 (ఓడ నేల పయిన్)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఓడ నేల పయిన్ నడయాడఁ దొడఁగె.
ఈ సమస్యను సూచించిన
కోడీహళ్ళి మురళీమోహన్ గారికి
ధన్యవాదాలు.

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -446 (దీపము వెలిగించినంత)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్.
ఈ సమస్యను సూచించిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

1, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -445 (గణనాయకసుత!)

కవి మిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు!
భాద్ర పద శుధ్ధ చవితికి
చిద్రూప గణేశుఁ గొల్చి శ్రీలు, సకల సం
పద్రూప శుభముఁ బడయుఁడు
భద్రమ్మగు మిత్రు లార ! భవదీయులకున్.

(లక్కాకుల వెంకట రాజారావు గారు)
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
గణనాయకసుత! వినాయకా! వందనముల్.