శ్రీ పతి శాస్త్రి గారూ! చక్కటి పద్యం తో భారతి పాద విభూషణ ధ్వని ని వినిపించారు పదపద వేడుకొందమిక పల్కుల రాణిని, వేడుకొన్నచో వదనము నందు జేరు శుభ వాక్కుల వెల్గులు, పద్యమల్లుచో వదలక వర్ణ వర్ణమున పాదము నిల్పుచు నాట్య మాడుగా పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
ముదముగ రామ నామమును పూర్వపు పుణ్య ఫలమ్ము తోడ, నా రద ముని వాక్కు తోడ, రస రమ్యముగన్ పలు మార్లు పుట్టలో వదలక పల్కినట్టి గుణవంతుడు వ్రాసిన రామ గాధలో పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్!!
అందరకీ నమస్కారములు అందరి పూరణలు మనస్సుని ఎంత గానో అలరించు చున్నవి . " ఈ పూరణల తోరణాన్ని హృదయ ద్వారానికి కట్టివేస్తే " ఓహో " మరొక ప్రపంచంతో పని ఏముంది ?
శంకరార్యా ! మమ్ములను 'ప్రౌఢనవ్య కవివర్యులు' గా మన్ననజేసి జెప్పిన పద్యము మా ఉత్సాహాన్ని ఇనుమడింప జేయు చున్నది.నిజానికి మీ బ్లాగున సరస్వతీ దేవిని మీరే ఆవాహన జేసి ప్రతిష్టించారు. ఆ మహిమవలననే బ్లాగులో అడుగిడిన ప్రతి వారికి సరస్వతీ కటాక్షం లభిస్తున్నది.
అందరి పూరణలు మనోహరంగా ఉన్నాయి. ధన్యవాదాలు. నిన్న దినమంతా తీరికలేని పనులవల్ల మీ మీ పూరణలను సమీక్షించలేక పోయాను. ఈ రోజు సాయంత్రం వరకు నా వ్యాఖ్యలను ప్రకటిస్తాను.
గురువుగారు నేడు ప్రతిఒక్కరు భారతీమాత పద మువ్వల సవ్వడిని చక్కగా విని ఆనందిచినారు. అందరికి అబినందనలు. హనుమచ్ఛాస్త్రిగారూ,మందాకినిగారు యితర మిత్రులందరికి హృదయపూర్వక అభినందనలతో చిన్న విన్నపమును తెలుపుకొంటున్నాను. ప్రతి దినమూ ఏదో ఒక సమయంలో మన 2 బ్లాగులను చూడకుండా ఉండలేనంతగా ఆకర్షింపబడ్డాను. కానీ వృత్తి ధర్మానికి న్యాయం చేకూర్చాలి కదా! అందువల్ల చాలామందికి అబినందనలు తెలపాలనుకున్నా సమయాభావంవల్ల కుదరటం లేదు. కనీ ఎవరు రాకపోయినా నాకు వెలతిగానే ఉంటుంది. మీ అందరి అభిమానములు పొందగలిగినదులకు ఆనందంగాఉన్నది. లోకాస్సమస్తాసుఖినో భవంతు. Thank you.
శ్రీపతి శాస్త్రి గారూ, అవధాన చక్రవర్తిని ప్రస్తుతించిన మీ పూరణ (గణదోషం సవరించినది) బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, పదపదమందు మాధుర్యాన్ని ఒలికించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు. * చింతా రామకృష్ణారావు గారూ, పోతన కవిత్వానికి అంతటి మాధుర్యం ఎలా వచ్చించో చక్కగా వివరించారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మధురమైన పూరణ. అభినందనలు. రెండవపాదంలో ‘పరాణ్ముఖత్వము’ ,, అది ‘పరాఙ్ముఖత్వము’నకు టైపాటు కదా! మూడవపాదంలో ‘విరించిత’ ... ? * రాజారావు గారూ, పల్లెపదాల నిసర్గసౌందర్యాన్ని హృదయోల్లాసంగా వర్ణించారు. చక్కని పూరణ. అభినందనలు. జిగురు వారిని సంబోధించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. * జిగురు సత్యనారాయణ గారూ, రామకథను గానం చేసిన వాల్మీకి కోకిలను గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, అమందానందకర సుందరమైన పూరణ మీది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, ఊహాలోకంలో విహరింప జేసిన మీ మొదటి పూరణ, కరుణరసాన్ని కురిపించిన రెండవ పూరణ రెండూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. * రాజేశ్వరక్కయ్యా, ధన్యవాదాలు. * పండిత నేమాని గారూ, సర్వశ్రేష్ఠంగా ఉంది మీ మనోహరమైన పూరణ. అభినందనలు. * మందాకిని గారూ, మధురమైన పూరణ నిచ్చారు. ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, ధన్యవాదాలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండివదనము నందు తేజములు వర్ధిలుచుండగ పృచ్ఛకోత్తముల్
ముదమున నిచ్చు ప్రశ్నలకు మోదము నందుచు పద్యపాదముల్
కుదురుగ గూర్చి జెప్పు ఘన కోవిదు నాగఫణీంద్రునిన్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండివదనము నందు తేజములు వర్ధిలుచుండగ పృచ్ఛకోత్తముల్
ముదమున నిచ్చు ప్రశ్నలకు మోదము నందుచు పద్యపాదముల్
కుదురుగ గూర్చి జెప్పు ఘన కోవిదు నాగఫణీంద్రశర్మకున్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
శ్రీ పతి శాస్త్రి గారూ! చక్కటి పద్యం తో భారతి పాద విభూషణ ధ్వని ని వినిపించారు
రిప్లయితొలగించండిపదపద వేడుకొందమిక పల్కుల రాణిని, వేడుకొన్నచో
వదనము నందు జేరు శుభ వాక్కుల వెల్గులు, పద్యమల్లుచో
వదలక వర్ణ వర్ణమున పాదము నిల్పుచు నాట్య మాడుగా
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
ముదముగ పోతనే తనదు తన ముద్దుల పట్టియ భారతాఖ్యకున్
రిప్లయితొలగించండిసదమల భావనా గరిమ చక్కని యక్షర సంవిధానమున్
మదులను ఝుమ్మనన్ జదువ, మంచిగ రూపము దిద్దె నందుచే
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
చెదరని భక్తి తత్వమును, శ్రేష్ఠకవిత్వ పదానురక్తి, యిం
రిప్లయితొలగించండిపొదవు పరాణ్ముఖత్వము,విభుండన కృష్ణుడెయంచు జెప్పునే,
మృదుమధురంబు పోతన విరించిత భాగవతంబునెల్లెడన్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
అదియును బండి తాళి దురహంకృతు లంటక , యచ్చతెన్గు క
రిప్లయితొలగించండిమ్మదనము నిండి , పల్లె పదమై జనియించి , ప్రజాగళమ్ము లో
మదికి బసందు గూర్చు మరు మల్లియ జాన పదంపు జావళీ
పద పద మందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనున్
ముదముగ రామ నామమును పూర్వపు పుణ్య ఫలమ్ము తోడ, నా
రిప్లయితొలగించండిరద ముని వాక్కు తోడ, రస రమ్యముగన్ పలు మార్లు పుట్టలో
వదలక పల్కినట్టి గుణవంతుడు వ్రాసిన రామ గాధలో
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్!!
మదికి బసందుగా , సరళ మౌ పదబంధము , భావదీప్తితో ,
రిప్లయితొలగించండి'ముదమున రామనామ'మని ముగ్ధ మనోహరమైన శైలి తో ,
సదమల రీతులన్ 'జిగురు సత్యము 'చెప్పిన పద్య మంతటన్
పదపదమందు శోభిలెను భారతి పాద విభూషణ ధ్వనుల్
రాజారావు గారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు
సదమల వేదశాస్త్రముల సారమునంతయుకొంతకొంతగా
రిప్లయితొలగించండిపదములయందు, పద్దియముపద్దియమందునపంచదారయున్
వదులుతువ్రాసె భాగవతవాణిని భక్తిగనాడు నందునన్
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!!!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________________________
అదటది లేనివారు, బలె - యాంధ్రుల పాలిటి యాత్మ బంధువుల్
సదయులు నన్నపార్యు లిల - చక్కగ జెప్పిన భారతమ్మునన్
పదపదమందు శోభిలును - భారతి పాద విభూషణ ధ్వనుల్
జదివిన మోదమంది,మది - జారును నూహల లోకమందునన్ !
_____________________________________________
అదటు = గర్వము
నా పద్యం ....
రిప్లయితొలగించండిపదపడి ప్రౌఢనవ్య కవివర్యులు నే డిదె నా సమస్యలన్
ముదమున పూరణంబులను పూర్తియొనర్తురు చిత్రరీతులన్
హృదయము రంజిలన్ మనల కెంతయొ తృప్తి గలుంగ బ్లాగులో
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!
02)
రిప్లయితొలగించండి_____________________________________________
మృదువగు పూలపై కరుణ - మేలిమి బంగరు భూషణంబనన్
పొదిగెను యక్షరంబులను - "పుష్పవిలాపము " కావ్యమందునన్
పదముల పేర్చి గూర్చె మన - భాగ్యవశంబున పాపయార్యుడే !
పద పద మందు శోభిలును - భారతి పాద విభూషణ ధ్వనుల్
జదివిన ఖేదమంది,మది - జాలిగ జూచును పూలబాలలన్!
_____________________________________________
అందరకీ నమస్కారములు
రిప్లయితొలగించండిఅందరి పూరణలు మనస్సుని ఎంత గానో అలరించు చున్నవి . " ఈ పూరణల తోరణాన్ని హృదయ ద్వారానికి కట్టివేస్తే " ఓహో " మరొక ప్రపంచంతో పని ఏముంది ?
పండిత నేమాని గారి పూరణ .....
రిప్లయితొలగించండిహృదయములోన ధాతృహృదయేశిని ధ్యానమొనర్చు వేళలో
నొదవు పవిత్ర భావములు, నొప్పుగ పద్యము లల్లబూనుచో
కుదురు సువర్ణ భూషలయి కూరిమి వాణికి, నట్టి కూర్పులన్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్
శంకరార్యా ! మమ్ములను 'ప్రౌఢనవ్య కవివర్యులు' గా మన్ననజేసి జెప్పిన పద్యము మా ఉత్సాహాన్ని ఇనుమడింప జేయు చున్నది.నిజానికి మీ బ్లాగున సరస్వతీ దేవిని మీరే ఆవాహన జేసి ప్రతిష్టించారు. ఆ మహిమవలననే బ్లాగులో అడుగిడిన ప్రతి వారికి సరస్వతీ కటాక్షం లభిస్తున్నది.
రిప్లయితొలగించండిచదువుల తల్లి శారదకు చక్కని రీతుల పిల్లలందరున్
రిప్లయితొలగించండికుదురుగ చేసిరర్పణలు గొప్పగ పద్యపుపద్మమాలికల్,
మదిని ముదమ్మునిండగను మాయమ రాదొకొ తాను ముగ్ధయై!
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
అందరి పూరణలు మనోహరంగా ఉన్నాయి. ధన్యవాదాలు. నిన్న దినమంతా తీరికలేని పనులవల్ల మీ మీ పూరణలను సమీక్షించలేక పోయాను. ఈ రోజు సాయంత్రం వరకు నా వ్యాఖ్యలను ప్రకటిస్తాను.
రిప్లయితొలగించండిగురువుగారు నేడు ప్రతిఒక్కరు భారతీమాత పద మువ్వల సవ్వడిని చక్కగా విని ఆనందిచినారు. అందరికి అబినందనలు. హనుమచ్ఛాస్త్రిగారూ,మందాకినిగారు యితర మిత్రులందరికి హృదయపూర్వక అభినందనలతో చిన్న విన్నపమును తెలుపుకొంటున్నాను. ప్రతి దినమూ ఏదో ఒక సమయంలో మన 2 బ్లాగులను చూడకుండా ఉండలేనంతగా ఆకర్షింపబడ్డాను. కానీ వృత్తి ధర్మానికి న్యాయం చేకూర్చాలి కదా! అందువల్ల చాలామందికి అబినందనలు తెలపాలనుకున్నా సమయాభావంవల్ల కుదరటం లేదు. కనీ ఎవరు రాకపోయినా నాకు వెలతిగానే ఉంటుంది.
రిప్లయితొలగించండిమీ అందరి అభిమానములు పొందగలిగినదులకు ఆనందంగాఉన్నది.
లోకాస్సమస్తాసుఖినో భవంతు.
Thank you.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅవధాన చక్రవర్తిని ప్రస్తుతించిన మీ పూరణ (గణదోషం సవరించినది) బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పదపదమందు మాధుర్యాన్ని ఒలికించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
పోతన కవిత్వానికి అంతటి మాధుర్యం ఎలా వచ్చించో చక్కగా వివరించారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మధురమైన పూరణ. అభినందనలు.
రెండవపాదంలో ‘పరాణ్ముఖత్వము’ ,, అది ‘పరాఙ్ముఖత్వము’నకు టైపాటు కదా! మూడవపాదంలో ‘విరించిత’ ... ?
*
రాజారావు గారూ,
పల్లెపదాల నిసర్గసౌందర్యాన్ని హృదయోల్లాసంగా వర్ణించారు. చక్కని పూరణ. అభినందనలు.
జిగురు వారిని సంబోధించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
రామకథను గానం చేసిన వాల్మీకి కోకిలను గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
అమందానందకర సుందరమైన పూరణ మీది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
ఊహాలోకంలో విహరింప జేసిన మీ మొదటి పూరణ, కరుణరసాన్ని కురిపించిన రెండవ పూరణ రెండూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
*
రాజేశ్వరక్కయ్యా,
ధన్యవాదాలు.
*
పండిత నేమాని గారూ,
సర్వశ్రేష్ఠంగా ఉంది మీ మనోహరమైన పూరణ. అభినందనలు.
*
మందాకిని గారూ,
మధురమైన పూరణ నిచ్చారు. ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమదిని దోచే పూరణల నెందరో సత్కవులు, వందనీయులు, గురువులు సమర్పించి భారతికి పద్యార్చన చేశారు. అందరికీ నమస్సులు.
రిప్లయితొలగించండిఎదయెద మీటుచున్ జగము నేలు పరాత్పరు జాడ చాటుచున్
పదపద శీఘ్రమే పరమ భాగవతోత్తమ బంధుకోటుల-
న్నెదయెద పల్కరింతమని యెల్లర భాగవతమ్ము పిల్చెడిన్
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
ఎదయెద దేవుని జూచుచు
రిప్లయితొలగించండిపదపద శీఘ్రం బటంచు బంధులతోడ
న్నెదయెదను బల్కరించిన
పదపదమున కవిత తెల్పబడె మిస్సన్నా!
కమనీయం గారి పూరణ ....
రిప్లయితొలగించండిముదమున నందబాలకుని ముగ్ధమనోహర బాల్యలీలలన్
మృదుల మనోజ్ఞ భావముల మించెడు పద్యవిశిష్ట శైలిసం
పదల రచించె పోతన యపారపవిత్రగుణాత్మకమ్ముగా
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
(మంద పీతాంబర్ గారి ‘సరాదాకి చిరుకవిత’ బ్లాగునుండి)
గురువుగారూ ధన్యుడను.
రిప్లయితొలగించండిముదిరిన ప్రాయమందునను ముచ్చట మీరగ శంకరార్యులన్
రిప్లయితొలగించండికుదురుగ కూర్చొనీయకిట కొండొక రీతిని బోరుకొట్టుచున్
చెదరక నేర్చి ఛందమును చేయగ పూరణ లెన్నొ నావియౌ
పదపదమందు శోభిలును
భారతి పాద విభూషణ ధ్వనుల్ 😊