వసంత మహోదయా! మీరు చక్రి గారి ఫార్వర్డ్ జర్నీ గురించి మాట్లాడుతున్నారు. మిస్సన్న గారు రిటర్న్ జర్నీ లో చక్రి గారు పొగడ్తలందుకొని, గరుడిని ఎక్కారని చెబుతున్నారు పద్యంలో. మరి రౌండు ట్రిప్ గదా.
మాస్టారూ, ధన్యవాదాలు. ఇక్కడకూడా పోస్టు చేస్తున్నాను, ఇప్పుడే డా. మూర్తి గారి తో మాట్లాడాను. ఫ్లోరిడా అని వేరే రాష్ట్రంలో పెళ్ళికి వెళ్లి ఇప్పుడే వచ్చారుట. లాప్ టాప్ లేక పోస్టింగ్స్ చూడలేదుట. రేపటినుంచి కవితా వ్యవసాయం చేయమని మనవి చేశాను. ప్రొద్దున కొంచెం హడావిడిగా వుంటుంది, నిదానంగా సాయకాలం నుంచి వస్తారు. నాకు ఫ్లోరిడా విషయం చెప్పారు. మిత్రుల ఆత్మీయతకి నా తరఫునించి కూడా ధన్యవాదాలు.
వసంత మహోదయా ! అలాగే పోతన గారి బ్రహ్మాండమైన పద్యాన్ని మీరూ నాచేత రెండు సార్లు చదివించారు, మీ పోస్టింగు ద్వారా . గజేంద్ర మోక్షణ కథ అంటే నాకు ప్రాణం. ప్రపంచ సాహిత్యంలోనే అంత సహజమైన చిన్న కథ ఆధారంగా వేదాంత సారాన్ని పిండీభూతం చేసి పెట్టిన ఉదంతం ఇంకెక్కడా లేదేమో!
ఏదొ సరదాగ వ్రాసిన నేమి? మంచి పద్యమే యిది. చిన్న లోపంబు గలదు. తప్పెను యతి తృతీయపాదమున, దాని నిట్లు సవరించినాఁడను హితము గాను "మరల మరల పోవుదమ యెటకైన " నేదునూరి రాజేశ్వరి సాదు! సాదు!
మాస్టారూ, మీ సవరణలు పద్య రూపంలో ప్రకటించడం ముదావహం. మా అసలు సిసలైన శంకరయ్య మాష్టారు బయటికొచ్చారు ఇన్నాళ్ళకి. భాద్రపద పౌర్ణమి నిజమైన నిండు పున్నమి మనందరకూ. ఇలానే రోజూ పున్నమి గానే వుండాలని ఆశిస్తూ...
ధన్యోస్మి. మీ వంటి వారల ఆశీస్సులే మా కవిత్వాభివృద్ధికారకాలు.
ధన్యుండైతిని మీదు పద్య రచనా ధాటీ ప్రశంసన్ భళీ, మాన్యుల్ మీరు సరస్వతీ కరుణ సంప్రాప్తుల్, వివేకాధికుల్, అన్యోన్యంబగు భాషణంబు, రసద్వవ్యావృత్త సాలంకృతా విన్యాసంబులు సుప్రసిద్ధ కవితా విద్వత్తు మీ కల్పనల్.
రాజారావు గారూ, హనుమచ్ఛాస్త్రి గారిపై నా పద్యంలో గణదోషాన్ని గుర్తించి, సవరణ సూచించినందుకు ధన్యవాదాలు. * గోలి హనుమచ్చాస్త్రి గారూ, ‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట!’ అందరి తప్పులు వెదకే నేను మిమ్మల్ని సంబోధించిన పద్యంలో గణదోషం చేసాను. మన్నించాలి! రాజారావు గారి సవరణ చూడండి. అది నచ్చకపోతే (హనుమశాస్త్రి) క్రింది సవరణ చూడండి. "గోలి కుల హనుమచ్ఛాస్త్రి మేలు! మేలు!" లేదా "భళిర! భళి! హనుమచ్ఛాస్త్రి! బాగు! బాగు!"
కవి మిత్రులకు మనవి. మిమ్మల్ని సంబోధిస్తూ వ్రాసిన పద్యాల్లో మర్యాదాసూచకమైన ‘మీరు’ అనకుండా ఏకవచన ప్రయోగం చేసాను. తప్పుగా భావించకండి. పూర్తి పద్యం గుర్తుకు రావడంలేదు కాని ‘చిన్నప్పుడు రతికేళిక / నున్నప్పుడు కవితలోన ... రాకొట్టుట మోజు సుమీ ...’ అన్నారు కదా!
వేల వేలుగ వివిధ మౌ విగ్రహములు
రిప్లయితొలగించండివేయ హుస్సేను సాగరు, వెలుగులందు
విఘ్న నాధు నిమజ్జన వేడ్క జూడ
నగరికేగిరి, సతి తోడ నంది నెక్కి
గరళకంఠుండు పయనించె, గరుడు నెక్కి
హరియె పయనించె సిరి తోడ, హంస నెక్కి
వాణి తోడను పయనించె బ్రహ్మ కూడ
భాగ్య నగరపు భాగ్యము బాగు బాగు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఆ త్రిమూర్తులు మురిసి భార్యలను గూడి
తమతమ నిజవాహనములఁ దడయ కెక్కి
వచ్చి రను పూరణము నిదె మెచ్చినాఁడ;
భళిర! గోలి హనుమచ్ఛాస్త్రి! బాగు బాగు!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! బాగు ! బాగు !
01)
_________________________________
అరయ "మాయా బజారు" ను - గిరిజ కోర !
పరువు పోవును యెద్దుపై - తరల భువిని !
పరుగు తీయును వేగము - గరుడు డైన !
హరిని కోరెను యెరువుగ - దరికి జేరి !
గరళకంఠుండు పయనించె - గరుడు నెక్కి !
మరల మరల గని మురియ - గిరిజ తోడ !
_________________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిగిరిజా మనోరథము స
త్వరమునఁ దీర్చంగ శివుఁడు వర ఖగపతినే
యరదముగఁ జేసినాఁడా?
సరి! చక్కని పూరణము; వసంత కిశోరా!
మత్త వేదండమును గాచె మకరి జంపి
రిప్లయితొలగించండిచక్రి దీనావ నుండని సంత సింప
సురలు, మునులును, దిక్పతుల్, సుతుడు, సతియు,
గరళకంఠుండు; పయనించె గరుడు నెక్కి.
ఒకరిని మించిన పూరణలు మరోకరివి. ఎంత బాగున్నాయో .అందరికి అభినందనలు . ఇప్పుడే , న్యూయార్ నుంచి మనవల దగ్గరకి వెళ్ళి వచ్చాను. పూరణలు చూడగానే ఓహో అద్భుతం .
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండికిశోర్జీ ధన్యవాదములు. ఇంతకీ 'మాయాబజార్' సినిమా 'సతీ' సమేతంగా
పశుపతి "గరుడ " (ఖగపతి) పై వచ్చి చూసి వెళ్ళాడంటారు. బాగుంది.
శాస్త్రీజీ ! ఒక్కసారి చూస్తే తనివి తీరేనా ?
రిప్లయితొలగించండిఅందుకే మరల మరల గని మురిసేడు గిరిజతో సహా !
మిస్సన్న గారూ! 'గరళకంఠుండు' గరుడు నెక్కి పయనించ కుండా చక్కగా ఆపేశారు. అభినందనలు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి గారూ ధన్యవాదములు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండినక్రమునుఁ జంపె ఘనుఁడని
చక్రినిఁ గొనియాడుచుండ శర్వాదులు ని
ర్వక్రమగతి హరి యెక్కెనె?
సక్రమ పూరణము; గొను ధిషణ! మిస్సన్నా!
మిస్సన్న మహాశయా ! నేనొప్పుకోను !
రిప్లయితొలగించండిపోతనగారు చెప్పినదాన్ని పూర్వపక్షం చేసేస్తున్నారు మీరు !
మరేమో
"సిరికింజెప్పడు శంఖ చక్రయుగమున్ - చేదోయి సంధింపడే
పరివారంబును జీర డబ్రగపతిన్ - బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివా - ద ప్రోత్థిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజ - ప్రాణావ నోత్సాహియై ! "
అని ఆయనంటుంటే -----------మీరేమిటి?
గరుడ వేగము తెలిసిన గిరిజ మురిసి
రిప్లయితొలగించండితిరిగి నీయగ వలదంచు గరుడె మనకు
మరల మరల పోవుద మెచటి కైన
గరళ కంఠుడు పయనించె గరుడు నెక్కి
మంచి గా రాస్తేనే బోలెడు తప్పులు .ఇది సరదాగా వ్రాసానంతే [ మన బడి కదా ]
వృషభరాజమ్ము నెక్కుచు పేర్మితోడ
రిప్లయితొలగించండిగరళకంఠుండు పయనించె; గరుడు నెక్కి
బయలు దేరెను విష్ణుండు; బ్రహ్మ కదలి
వచ్చె హంసపై ; కన్నుల పండువాయె.
నా కలలో............
పండిత నేమాని గారి పూరణ ....
రిప్లయితొలగించండిఔర! భస్మాసురుని గూల్చి శౌరి శివుని
ఆపదను బాపి పిదప తోడగుచు శీత
గిరికి గొనిపోయె నటుల నాతరుణమందు
గరళకంఠుండు పయనించె గరుడునెక్కి
వసంత మహోదయా! మీరు చక్రి గారి ఫార్వర్డ్ జర్నీ గురించి మాట్లాడుతున్నారు. మిస్సన్న గారు రిటర్న్ జర్నీ లో చక్రి గారు పొగడ్తలందుకొని, గరుడిని ఎక్కారని చెబుతున్నారు పద్యంలో. మరి రౌండు ట్రిప్ గదా.
రిప్లయితొలగించండిమాస్టారూ, ధన్యవాదాలు. ఇక్కడకూడా పోస్టు చేస్తున్నాను,
రిప్లయితొలగించండిఇప్పుడే డా. మూర్తి గారి తో మాట్లాడాను. ఫ్లోరిడా అని వేరే రాష్ట్రంలో పెళ్ళికి వెళ్లి ఇప్పుడే వచ్చారుట. లాప్ టాప్ లేక పోస్టింగ్స్ చూడలేదుట. రేపటినుంచి కవితా వ్యవసాయం చేయమని మనవి చేశాను. ప్రొద్దున కొంచెం హడావిడిగా వుంటుంది, నిదానంగా సాయకాలం నుంచి వస్తారు. నాకు ఫ్లోరిడా విషయం చెప్పారు. మిత్రుల ఆత్మీయతకి నా తరఫునించి కూడా ధన్యవాదాలు.
వసంత మహోదయా ధన్యవాదాలు. మీ ప్రశ్నకు చంద్రశేఖరులు జవాబు చెప్పారు. చక్రి వెనుక పరివారమంతా అక్కడికి వచారు. రిటర్న్ జర్నీలో గ్రద్ద నేక్కాడాయన.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారి కల్పన అద్భుతం, సహజ సుందర భరితము..
రిప్లయితొలగించండిచంద్ర శేఖరా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయా !
మీ కారణంగా పోతన గారిని తలచుకొనే భాగ్యం కలిగింది !
ధన్యవాదములు !
వసంత మహోదయా ! అలాగే పోతన గారి బ్రహ్మాండమైన పద్యాన్ని మీరూ నాచేత రెండు సార్లు చదివించారు, మీ పోస్టింగు ద్వారా . గజేంద్ర మోక్షణ కథ అంటే నాకు ప్రాణం. ప్రపంచ సాహిత్యంలోనే అంత సహజమైన చిన్న కథ ఆధారంగా వేదాంత సారాన్ని పిండీభూతం చేసి పెట్టిన ఉదంతం ఇంకెక్కడా లేదేమో!
రిప్లయితొలగించండిపండిత నేమాని వారి భావన బావుంది !
రిప్లయితొలగించండిపండిత నేమాని వారి స్ఫూర్తితో :
02)
_________________________________
అరయ నానాడు శ్రీహరి - యసురు జంపి
తిరిగి మరలెడు సమయాన - హరుని గూడ
గరుడు మూపున నెక్కించ - గిరిని విడువ !
గరళకంఠుండు పయనించె - గరుడు నెక్కి
గిరిజ జేరెను వేగమె - బెరుకు మరచి !
________________________________
అసురుడు = భస్మాసురుడు
గిరి = కైలాస గిరి
చంద్రశేఖరా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఏనుగూ మొసలీ కథగానే తెలుసు !
వేదాంతసారమా ???
కొంచెం వివరించి తరింపజెయ్యండి మిత్రులందరినీ !
గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
రిప్లయితొలగించండిపుత్రులు పుడమినందు జిక్కి కాపాడమన శివుడు..
...................................
పంపె భూలోక యాత్రకు పుత్రులిద్ద
రిని జనిల కష్టముల దీర్చి రమ్ము, పురుగు
మందులకు జిక్కి గాపాడమనగ, వేగ
గరళ కంఠుండు పయనించె గరుడు నెక్కి|
కంది శంకరు జూడగ కదలి వచ్చె
రిప్లయితొలగించండిగరళకంఠుండు. పయనించె గరుడు నెక్కి
విష్ణు మూర్తియు భువి జేర. వినుతి గన్న
శంకరాభరణము గొల్పు సౌమ్యుఁడంచు.
భళిర ! గోలి హనుమ శాస్త్రి ! బాగు బాగు !
రిప్లయితొలగించండిశాస్త్రి గారి స్ఫూర్తితొ
రిప్లయితొలగించండిప్రమద గణముల తోడను పారు తోడ
గరళకంఠుండు,పయనించె గరుడు నెక్కి
హరియు సిరితోడ గాంచిరి హస్త ముఖుని
వివిధ రూపాల శోభను విస్మయముగ !!!
రాజేశ్వరక్కయ్యా,
రిప్లయితొలగించండిఏదొ సరదాగ వ్రాసిన నేమి? మంచి
పద్యమే యిది. చిన్న లోపంబు గలదు.
తప్పెను యతి తృతీయపాదమున, దాని
నిట్లు సవరించినాఁడను హితము గాను
"మరల మరల పోవుదమ యెటకైన "
నేదునూరి రాజేశ్వరి సాదు! సాదు!
మిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండిఔను ,నిజమే !
"తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరో - ధ వ్రాతమున్ దాని వె
న్కను బక్షీంద్రుడు, వానిపొంతను ధనుః - కౌమోదకీ ,శంఖ ,చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీ - కాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వా - రాబాల గోపాలమున్ ! "
అనికూడా శలవిచ్చారు పోతన గారు !
నేనే మరిచాను ! మరోసారి ధన్యవాదములు !
మందాకిని గారూ,
రిప్లయితొలగించండి‘కనులకు పండుగ’ యని చ
క్కని పూరణ నొసఁగి హితుల కత్యానందం
బును గల్గఁ జేయు మందా
కిని! కాంక్షించెద నఖండ కీర్తి గలుఁగఁగాన్.
పండిత నేమాని గారూ,
రిప్లయితొలగించండిపూర్వకృతపుణ్య మేదొ నా ముందు నిలిచె
నదియె ‘పండిత నేమాని’ యనెడి మూర్తి;
నా నమస్కృతిఁ గొనుము ‘నేమాని రామ
జోగి సన్యాసి రావు’! యశోధనాఢ్య!
నందివాహనుడై నేడు నగజతోడ
రిప్లయితొలగించండిగరళకంఠుడు పయనించె, గరుడునెక్కి
భూపతియు నేడు లక్ష్మితో భువికి జేరె
సకల గణనాయకునినిమర్జనము చూడ.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమిగుల నుత్సహించి తగ సమస్యాపూర
ణం బొనర్చి పంపినాఁడ;విందు
చూపుచుంటి చిన్న లోపాలు సవరింతు
వ్రాయు మిట్టులే, వరప్రసాద!
మీ పద్యంలో రెండవపాదం (బ్రాకెట్ లో) నా సవరణలు ...
(ఱను) జ(ను)ల కష్టముల దీర్చి (రాఁగ), పురుగు
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పేరు ‘అనుష్టుప్’లో తప్ప ఏ ఛందస్సులోను ఇమడలేదు. ప్రాసమైత్రి పాటించాను.
చెంతన్ మేటి పాండిత్యం
బెంతో కల కవీశ్వరా!
చింతా రామకృష్ణారావు!
గొనుమా వందనమ్ములన్.
(ఏదో ... క్రొత్తప్రయోగం చేద్దామని!)
ధన్యురాలను గురువుగారూ!
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిశాస్త్రి గారి స్ఫూర్తితో అన్నారు. మనకు ముగ్గురు శాస్త్రులున్నారు. ఏ శాస్త్రి?
మంద పీతాంబరా! కడు సుందరమ్ము
నీదు పూరణ; హరిహరు లాదరమున
తమ వహనములపై నెక్కి తరలినార?
కాని పార్వతిన్ బిల్వగా నౌనె ‘పారు’?
గరళ కంఠుండు పయనించె - గరుడు నెక్కి
రిప్లయితొలగించండిచక్రి , హంస నెక్కి యజుడు జయము బలికి
తోడురా - సురాసుర యక్ష బాడబ నర
కిన్నరాది పేరోలగ మున్న దిశకు
ధన్యోzస్మి శంకరార్యా!
రిప్లయితొలగించండిధన్యత్వము పొందె కవిత. దైవాంశజ! స
ద్విన్యాసములను కవిత న
నన్యాద్భుతరీతి వ్రాయ నర్హులు మీరల్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిప్రీతి హరిహరుల్ భార్యాసమేతు లగుచు
గరుడ నందుల నెక్కి యుత్కంఠతోడ
గణపతి నిమజ్జనోత్సవ గరిమఁ గన్ను
లారఁ గాంచిరె! సంపత్ కుమార శాస్త్రి!
రాజారావు గారూ,
రిప్లయితొలగించండిజలజాక్ష జలరుహోద్భవు
లెలమిని శివు తోడు దెచ్చు హితమతి లక్కా
కుల వెంకట రాజారా
వలఘువు నీ పద్యరచన; యభినందనముల్.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిశతసహస్ర వందనాలు, ధన్యవాదాలు.
ప్రాసమైత్రి పాటిస్తున్నా నన్నానా? చివరి పాదంలో ప్రాస తప్పింది. మన్నించాలి. ఇదుగో సవరణ ...
చెంతన్ మేటి పాండిత్యం
బెంతో కల కవీశ్వరా!
చింతా రామకృష్ణారావు!
వింతల్ గొల్పు నీ పద్యముల్.
సమస్యకు తొలి పూరణ జేసిన శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారే స్పూర్తి
రిప్లయితొలగించండి"పారు తోడ" ను "పత్ని తోడ" గా మార్చితే సరి పోతుంది .
ఈరోజు కవి మిత్రులందరినీ పద్య బంధాలతో బంధిస్తూ ఉత్సాహ ప్రోత్సాహింపుతో పరవశుల్ని జేస్తున్నారు .ధన్యవాదాలు .
రామ రావణ యుధ్ధమ్ము రాచుకొనగ
రిప్లయితొలగించండివీక్షణమునకు మేలంచు వినయ సుతుని
బనిచి పార్వతి తోడ నా యనికి జేర
గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి
ధన్యవాదములు శంకరయ్య గారూ !
రిప్లయితొలగించండిశ్రీ శంకరునికి ప్రణతులు
భాసిత విజ్ఞాన ఖనికి బ్రతిభా మతికిన్
రాశీ భూత విరాజిత
ధీశాలికి బండిత కవి దిగ్గజ మునకున్
శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణము బ్లాగు పెళ్ళి సందడిని మించి పోతున్నది !
రిప్లయితొలగించండిపద్యముల విందు కేతెంచ పరమ శివుడు
రంకె వేసెడి వృషభమ్ము రక్తి నిడునె
గరుడుడే తగు విన్యాస గరిమ గాంచ
గరళ కంఠుండు పయనించె గరుడు నెక్కి !
కనగ,శ్రీకాంతుఁపయనించెగరుడునెక్కి
రిప్లయితొలగించండిననెడు వార్త శ్రీకంఠుపయనముగాను
పొక్కి,వార్తాస్రవంతుల పుణ్యమునయె:
"గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి".
సర్వ మంగళ నమ్మిక సాక్షి గాను
రిప్లయితొలగించండిభూత హితమై విషముమ్రింగి యాత డాయె
గరళకంఠుండు;; పయనించె గరుడు నెక్కి
హరియునిక మోహినిగ నాట నంతు బట్ట!
పండిత నేమాని గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిఅనుష్టుప్పులలో నా ప్రయత్నమును తిలకించండి:
చింతాన్వయాబ్ధి శీతాంశ
కాంతిమయ మహోదయ
శాంతగుణ రామకృష్ణా
కాంతున్ నీలోన భారతిన్
కందికుల శంకరయ్యా
మందస్మిత ముఖాంబుజ
విందౌను నీదు సౌజన్యం
సందేహం నాస్తి సోదర
మాస్టారూ, మీ సవరణలు పద్య రూపంలో ప్రకటించడం ముదావహం. మా అసలు సిసలైన శంకరయ్య మాష్టారు బయటికొచ్చారు ఇన్నాళ్ళకి. భాద్రపద పౌర్ణమి నిజమైన నిండు పున్నమి మనందరకూ. ఇలానే రోజూ పున్నమి గానే వుండాలని ఆశిస్తూ...
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిశివపార్వతు లా రాముని
బవరము వీక్షింప గరుడుపై వచ్చిన య
ట్లు వచించిరి ఘనముగ గ
న్నవరపు నరసింహ మూర్తి! నచ్చెను మిగులన్.
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండివినుఁడు, వార్తాప్రసార సాధనము లందు
కొసరి గోరంతలను పెంచి కొండలంత
ఊఁకదంపుడు వార్తల నొల్ల ననెడి
ధీమహితుఁడ వనుచు నెంతు రామకృష్ణ!
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని ‘శ్రీకాంతుఁ పయనించె’ అన్నదానిని ‘శ్రీకాంతుఁ డేగెను / శ్రీపతి పయనించె’ అంటే సరి!
(మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిముదమున శ్రీగౌరీశులు
పదపడి తమ వాహనములపై వచ్చి రటం
చిదె చెప్పితె? యభినందిం
చెద నిక ‘మనతెలుగు’ చంద్రశేఖర నిన్నున్!
పండిత నేమాని గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
నా పూరణ ...
రిప్లయితొలగించండి(క్రొత్తదనం ఏమీ లేదు. అందరూ చెప్పినట్లే ...)
దుష్ట భస్మాసురుని పీడ తొలఁగిన దర
హాసుఁ డెద్దుపైఁ జనెను కైలాసమునకు
గరళకంఠుండు; పయనించె గరుడు నెక్కి
గుడుసు కైదువు జోదు వైకుంఠమునకు.
గురువు గారూ,
రిప్లయితొలగించండిధన్యోస్మి. మీ వంటి వారల ఆశీస్సులే మా కవిత్వాభివృద్ధికారకాలు.
ధన్యుండైతిని మీదు పద్య రచనా ధాటీ ప్రశంసన్ భళీ,
మాన్యుల్ మీరు సరస్వతీ కరుణ సంప్రాప్తుల్, వివేకాధికుల్,
అన్యోన్యంబగు భాషణంబు, రసద్వవ్యావృత్త సాలంకృతా
విన్యాసంబులు సుప్రసిద్ధ కవితా విద్వత్తు మీ కల్పనల్.
గురువు గారూ,
రిప్లయితొలగించండిరసవద్వ్యావృత్త అని చదువగలరని ప్రార్థన.
మిత్రులందరిపూరణలూ ముచ్చటగా నున్నవి !
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రాజారావు గారూ,
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రి గారిపై నా పద్యంలో గణదోషాన్ని గుర్తించి, సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్చాస్త్రి గారూ,
‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట!’ అందరి తప్పులు వెదకే నేను మిమ్మల్ని సంబోధించిన పద్యంలో గణదోషం చేసాను. మన్నించాలి! రాజారావు గారి సవరణ చూడండి. అది నచ్చకపోతే (హనుమశాస్త్రి) క్రింది సవరణ చూడండి.
"గోలి కుల హనుమచ్ఛాస్త్రి మేలు! మేలు!" లేదా
"భళిర! భళి! హనుమచ్ఛాస్త్రి! బాగు! బాగు!"
కవి మిత్రులకు మనవి.
రిప్లయితొలగించండిమిమ్మల్ని సంబోధిస్తూ వ్రాసిన పద్యాల్లో మర్యాదాసూచకమైన ‘మీరు’ అనకుండా ఏకవచన ప్రయోగం చేసాను. తప్పుగా భావించకండి.
పూర్తి పద్యం గుర్తుకు రావడంలేదు కాని ‘చిన్నప్పుడు రతికేళిక / నున్నప్పుడు కవితలోన ... రాకొట్టుట మోజు సుమీ ...’ అన్నారు కదా!
గురువుగారూ పూరణల విశ్లేషణల్లో మీ విశ్వరూపం చూపించారు.
రిప్లయితొలగించండిశత సహస్ర ధన్యవాదాలు.
పండిత నేమాని గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిఅయ్యా ! మూర్తి గారూ!
గరళ కంఠుండు.... అనే సమస్యకి మీ పూరణాఇన..
పద్యముల విందుకేతెంచ పరమ శివుడు ...
నంది విద్వత్తు మీరెరుగ రనుకుంటున్నాను. Nandi మహా కవి పండితుడును.
ఆయన పద్యముల విందుని బాగుగ రక్తి కట్టిoచగల సమర్థుడు. మీ పూరణను
సరిచేసుకోవాలి.
పండిత నేమాని గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిడా. నరసింహమూర్తి గారూ! శుభాశీస్సులు.
కనుగొనుచుంటి మీ ప్రతిభ, కావ్య రసజ్ఞులు మీర లచ్చమౌ
మనమున పెక్కు భావములు మాటికి మాటికి తట్టుచుండగా
నొనరుచునుండి పద్యచయ మొప్పుగ బ్లాగున పేర్చుచుండిరో
యనఘ! నృసింహమూర్తి గొనుమా అభినందన చందనమ్మిదే
పండిత నేమాని గారూ,
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారిపై మీ పద్యం సుందరం, అక్షరసత్యం.
ధన్యవాదాలు.
అయ్యా ! మూర్తి గారూ!
రిప్లయితొలగించండిగరళ కంఠుండు.... అనే సమస్యకి మీ పూరణ.
పద్యముల విందుకేతెంచ పరమ శివుడు ...
నంది విద్వత్తు మీరెరుగ రనుకుంటున్నాను. నంది మహా కవి పండితుడును.
ఆయన పద్యముల విందుని బాగుగ రక్తి కట్టించ గల సమర్థుడు. మీ పూరణను
సరిచేసుకోవాలి.
పండిత నేమాని
నంది మహాపురుషుడు కాకపోతే పరమ శివుని వాహన యోగ్యత యెలా లభిస్తుంది ? శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములతో, నా సవరణ ;
నంది యేతెంచె ముందుగా విందు గుడువ
పద్య సరసత నెఱిగింప ప్రమథ గణము
విగత వాహన స్థితి దెల్పి విహగ పతికి
గరళ కంఠుండు పయనించె గరుడు నెక్కి !
శ్రీ పండిత నేమాని వారికి, గురువర్యులు శ్రీ కంది శంకారార్యుల వారికి పాదాభివందనములు !
రిప్లయితొలగించండి