14, సెప్టెంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం -459 (మణిముట్టగఁ జేయి గాలె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మణిముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.
ఈ సమస్యను పంపిన కోడీహళ్ళి మురళీమోహన్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

 1. బెణికిన కాలును, మెడపై
  వ్రణమును జూపుచు జననికి, జ్వరమని చలితో
  వణుకుచు వచ్చిన బాలా
  మణి, ముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.

  రిప్లయితొలగించండి
 2. ఫణి యగు నక్రమ మైనను
  పణమది, ముట్టంగఁ దగదు పామరు కైనన్
  కణిమొళి గనరే! స్పెక్ట్రం
  మణిముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  కాళీయుని భార్య :

  01)
  _________________________________

  ఝణఝణ కింకిణి రవముల
  ఫణి తలపై నాట్య మాడె - పరమాత్ముండే !
  రణమున డస్సిన ,యా ,ఫణి
  మణి ,ముట్టగఁ జేయి గాలె - మహిళామణికిన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 4. గొణుగుచు పొయి వెలిగించెర
  మణి,ముట్టగ చేయికాలె మహిళామణికిన్
  కణకణ మండే నిప్పుల
  కణికల ముంజేతి తోడ కదలింపంగన్.

  రిప్లయితొలగించండి
 5. శ్రీగురుభ్యోనమ:

  కణకణ మండెడు నిప్పున
  మణిహారము జారిపడగ మగువే వగచెన్
  గుణహీనురాలు యగుచున్
  మణిముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.

  రిప్లయితొలగించండి
 6. ప్రణయోష్ణ పీడనముచే
  జెనకగ మల్లియలు కాల్చె.చిత్రముగా నా
  ఘనముగ వెలిగెడి జ్యోతి
  ర్మణి ముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.

  రిప్లయితొలగించండి
 7. జన మధ్య మందొక గ్రా
  మణి ముట్టగ జేయి - గాలె మహిళా మణికిన్
  దన చెప్పు తీసి మాడున
  దిని పించెను బుధ్ధి వచ్చు తీరున భళిరా !

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని గారి పూరణ ....

  ఖణఖణమను నిప్పులపై
  మణి నిండుగ పాలు పోసి మరగుచునుండన్
  ఝణఝణమని విసురుగ జని
  నణి ముట్టగ జేయి కాలె మహిళా మణికిన్
  (మణి = చెంబు)

  రిప్లయితొలగించండి
 9. ఫణమున ఏమమ్మా యది?
  వ్రణమేమది, నిప్పుతోడ భద్రము సుమ్మీ!
  "మణి" పిలుపుల నేరికి సరి?
  మణి; ముట్టగ చేయి కాలె; మహిళామణికిన్.

  రిప్లయితొలగించండి
 10. చని మారుతి ఫలమని దిన
  మణి ముట్టగ జేయి గాలె - మహిళా మణికిన్
  మనమున బాధ గలిగి , యం
  జని వేడె దన సుతు గావ చయ్యన సూర్యున్

  రిప్లయితొలగించండి
 11. ఈ సమస్యను నేను సారస్వతసర్వస్వము అనే పాత పత్రికలో చూశాను. అందులో ఈ సమస్యకు ఈ క్రింది పూరణలు వచ్చాయి.

  పుణుకులు వండెడుతఱిఁ గం
  కణమూడెను గ్రాఁగు చిందఁగాఁదైలంపుం
  గణములు నివుమధ్య నభో
  మణిముట్టఁగఁ జేయిగాలె మహిళామణికిన్‌

  ప్రణయకలహాంతమున పతి
  సణగుజు పైకేఁగ, మారు జ్వరతీక్ష్ణముచే ్
  నణఁగి శ్రమనొందు కాంతా
  మణి ముట్టఁగఁ జేయిగాలె మహిళామణికిన్‌

  రిప్లయితొలగించండి
 12. చిన్న సవరణ తో ...

  బెణికిన కాలును, మెడపై
  వ్రణమును గనుమా, జ్వరమ్ము వచ్చిన దనుచున్
  వణుకుచు వచ్చిన బాలా
  మణి, ముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్.

  రిప్లయితొలగించండి
 13. నా పూరణ ....

  గణుతించి చంద్రచూడా
  మణిఁ దలఁచుచునుండి నివురు మాటునఁ గల యా
  కణకణలాడెడి హననీ
  మణి ముట్టఁగఁ జేయి గాలె మహిళామణికిన్.
  (హననీమణి = అగ్ని)

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులకు వందనాలు.
  చక్కని పూరణలు పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి, మిస్సన్న, వసంత కిశోర్, మందాకిని, శ్రీపతి శాస్త్రి, చింతా రామకృష్ణారావు, రాజారావు, పండిత నేమాని గారలకు పూర్వకవుల పూరణలను తెలిపిన కోడీహళ్ళి మురళీమోహన్ గారికి అభినందనలు, ధన్యవాదాలు.
  వ్యక్తిగత కారణాల వల్ల మనస్సు వికలమై అందరి పూరణలను విడివిడిగా వ్యాఖ్యానించలేకపోతున్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 15. గురువుగారూ పరమాత్ముడు మీ మనస్సుకు ఊరట కలిగించాలని వాంచిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 16. ప్రణయము నలిగిన పతిగని
  ప్రణుతిం పగదరి కిజేర ప్రణయిని వెడలెన్ !
  దణి కోపమిను మడింపగ ర
  మణి ముట్టగ జేయి గాలె మహిళా మనికిన్ !

  ప్రణయము + అలిగిన = ప్రణయము నలిగిన

  రిప్లయితొలగించండి
 17. తమ్ముడూ ! భగవంతుడు మనస్సాంతిని కలిగించాలని దీవిస్తున్నాను

  రిప్లయితొలగించండి
 18. శంకరయ్య గారూ!
  మీరు వచ్చిన వ్యాఖ్యలపై అనివార్యమైన సలహాలనిస్తే చాలు.
  వికలమై ఉన్నప్పుడు మీరు స్పందించ లేకపోతున్నందుకు విచారించకండి.మీకు ఆపరమాత్మ బాధలు మానసిక వేదనలు తప్పక తీరుస్తాడు.

  రిప్లయితొలగించండి
 19. చంద్రశేఖర్:
  మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో :| మీకు తెలియంది కాదు మాస్టారూ. సదాశివ స్మరణ మీకు తప్పక మనశ్శాంతిని కలుగజేస్తుంది. ఈ శంకరాభరణం స్కూలు పిల్లలకి రెండు రోజులు శెలవు ఇవ్వండి సార్. అన్నీ సర్దుకొంటాయి.
  నాపూరణ (ఇంకా చింతామణి వదలలేదు. క్లైమాక్స్ ఘట్టం ఆధారంగా):
  వణఁకు బిల్వమూర్తిఁ చింతా
  మణిముట్టగఁ జేయి గాలె;; మహిళామణికిన్
  గణికకు కనువిప్పై త
  క్షణమే సకలము త్యజించి సాధుమణి యయ్యెన్ !

  రిప్లయితొలగించండి
 20. శంకరార్యా !ప్రపంచంలో యెక్కడైనా వారానికి
  5 లేక 6 పని రోజులు ఉంటాయి !
  ఖచ్చితంగా ఒకరోజైనా శలవు ఉంటుంది !

  కాని -----------------------------------------
  వారానికి 8 రోజులు( వా.స.పూ-కలిపితే)
  పనిజేసే సంస్థ ఏదైనా ఉందీ ------------అంటే
  అది " శంకరాభరణము " మాత్రమే !
  పోనీ ఒక వారం రోజులు శలవు ప్రకటించెయ్యండి !
  విశ్రాంతి కలుగుతుందేమో !

  రిప్లయితొలగించండి
 21. అందరి పూరణలూ వైవిధ్యంగా అలరించాయి. అభినందనలు
  నా మనోధైర్యాన్ని ఇనుమడింపజేసే సాంత్వనవాక్యాలు పలికిన మిత్రులకు ధన్యవాదాలు. నా సమస్యలు ఆర్థికపరమైనవి కావు. కుటుంబపరమైనవి. కాపురానికి రాని కోడలి విషయంలో తీసికొన వలసిన నిర్ణయం విషయంలో ఇంట్లో అభిప్రాయభేదాలు, గొడవలు. అంతే!
  నాకు మనశ్శాంతినీ, ఒక విధమైన తృప్తినీ కలిగించేది ‘శంకరాభరణం’ ఒక్కటే! ఏరోజైనా క్రొత్త సమస్యను ఇవ్వకున్నా, పూరణలు చదివి వ్యాఖ్యానించకున్నా ఏదో వెలితి, అపరాధభావం!
  ‘గళ్ళనుడికట్టు’ను కొనసాగించలేక పోవడం, వాగ్దానం చేసినట్లుగా ‘ఛందోపాఠాలు, పద్యరచన’ శీర్షికలను ప్రారంభించక పోవడం ఏదో వెలితిగానే బాధిస్తున్నాయి.
  ‘శంకరాభరణాన్ని’ నేను ఒక హాబీగా కాకుండా ఒక ఉద్యోగనిర్వహణగా భావిస్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా (అనారోగ్యం, మనోవైకల్యం, గ్రామాంతరం తదితరకారణా లేమైనా) బ్లాగును నిర్వహిస్తూనే ఉంటాను. మీ అందరి ప్రోత్సాహం, సహకారాలే నాకు వేతనం, బలం!

  రిప్లయితొలగించండి
 22. శ్రీపతి శాస్త్రి గారి పూరణలో ‘గుణహీనురాలు + అగుచున్’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘గుణహీనురాలు గావున’ అంటే సరి!
  *
  రాజారావు గారి పూరణలో ‘ఒక గ్రామణి’ అన్నప్పుడు ‘క’ లఘువుగానే ఉండి గణదోషం వస్తుంది. అక్కడ ‘జన మందరు గనుగొన గ్రా/ మణి’ అంటే ఎలా ఉంటుంది?
  *
  రాజేశ్వరక్కయ్యా,
  ‘ప్రణయమున నలిగి’ లేదా ‘ప్రణయమున గనలి’ అందాం. మూడవపాదంలో ‘దణి" ?

  రిప్లయితొలగించండి
 23. ఫణిభూషణుసుతుగన జని
  మణికుండలభూషితయగు మానిని మృదుభా
  షిణిదీపముపైబడ చెవి
  మణి ముట్టఁగఁ జేయి గాలెమహిళామణికిన్.

  రిప్లయితొలగించండి
 24. మంద పీతాంబర్ గారూ,
  మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. మాస్టారూ,
  మీనుంచి ఈ సమాధానం వస్తుందని నేను ఊహించాను. "శంకరాభరణం" మీరు ఒక విధినిర్వహణ గా భావిస్తున్నారని చెప్పకనే తెలుస్తోంది. స్వగతంనుంచి - మా గౌరీనాథ శాస్త్రి మాష్టారు చాలా దూరంనుంచి వచ్చేవారు. ఎప్పుడయినా మేము "సెలవు తీసుకోక పోయారా, మాస్టారూ" అంటే, "ఏమిటోరా పాఠం చెప్పకపోతే ఏదో వెలితిగా వుంటుందిరా, నిద్ర పట్టదు" అనేవారు. మీరు ఆ తరం వారు సార్. ఇకపోతే, గళ్ళనుడి కట్టువగైరా నిదానంగా మొదలపెట్టవచ్చునండీ. మేమందరం కలసి షుమారు 20-30 పద్యాలు రోజుకి మీ దిద్దుబాటుకి సమర్పిస్తున్నాము. అవే యెక్కువ. ఆ తరువాత జనవాక్యం శిరోధార్యం.

  రిప్లయితొలగించండి
 26. శంకరార్యా !
  శలవు ప్రకటించమని అన్నాను గాని
  శంకరాభరణం జీవితంలో భాగంగా మారిపోయింది !
  ముఖ్యంగా నాలాటి పనీపాటూ లేనివాళ్ళకు !
  పొద్దున్నే సమస్య తెలుసుకొని , పూరణ పంపి , దానిపై మీ వ్యాఖ్య
  చదివితే గాని రోజు పూర్తయిన భావన రాదు !

  రిప్లయితొలగించండి
 27. చంద్రశేఖర్ గారూ,
  వసంత కిశోర్ గారూ,
  ........... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 28. పుణుకులు వండగ తైలము
  ఘనముగ చిందగను బొబ్బ గాభర నిడగా
  వణకుచు వెళ్ళగ పెరటి ద్యు
  మణిముట్టగఁ జేయి గాలె మహిళామణికిన్

  రిప్లయితొలగించండి