గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ మూడు పూరణలూ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘అన్యాయానికి అన్యాయం’ చేయాలన్న రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. మూడవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * మిస్సన్న గారూ, చక్కని విరుపుతో పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు. కాని ‘పర్జన్యుని చింతించి ...’ ? * మందాకిని గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ ముందే చూసి ఉంటే నా పూరణ పోస్ట్ చేసేవాణ్ణి కాను. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * ఊకదంపుడు గారూ, కొద్దిగా తికమక పెట్టింది అర్థం కావడానికి. మళ్ళీ చదివితేనే మీ పూరణలోని చమత్కారం అవగాహన అయింది. బాగుంది. అభినందనలు. * రాజారావు గారూ, మంచి భావనతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. కాని చివరి పాదంలో యతి తప్పింది. ‘లో/ న న్యాయము’ అన్నప్పుడు పాదప్రథమాక్షరం లఘువే అవుతున్నది. నా సవరణ... ‘ ...... విషయమున న య న్యాయము సేయు వార లతి పుణ్యాత్ముల్’
మందాకిని గారూ, మీ పూరణలోని సునిశిత హాస్యం (light hearted humor) బాగుంది. అవును, సన్యాసం పుచ్చుకో వద్దని, నీవే శ్రీ మహావిష్ణువని చెప్పి మరీ పిల్లనిచ్చి అన్యాయం చేయగల సత్తా ఆయనకొక్కడికే వుంది:-)
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, నేనే కాస్త నిదానంగా ఆలోచించాల్సించి. తొందరపడి వ్యాఖ్యానించాను. మన్నించండి. * మందాకిని గారూ, ‘సతము’ అంటే ఎల్లప్పుడు అనుకొని వాడాను. అది సతతము కదా. ఏమిటో .... పొరపాట్లు జరిగిపోతున్నాయి. శాశ్వతము అనే అర్థం అక్కడ అన్వయించదు. ‘విడనాడి యెపుడు’ అందాం. అయినా జి. ఎన్. రెడ్డి గారి పర్యాయపద నిఘంటువులో ఎల్లప్పుడు అనే దానికి సతము అనే పర్యాయపదాన్ని కూడా ఇచ్చారు?
పండిత నేమాని గారూ, ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. శ్రేష్ఠమైన పూరణతో నా బ్లాగుకు వన్నె తెచ్చారు. సంతోషం. మీ సూచనలు, సలహాలు మాకు మార్గదర్శనం చేస్తాయి. ధన్యవాదాలు.
గురువుగారూ ధన్యవాదాలు. హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు. గురువుగారూ మీ పూరణ చాలా బాగుంది. ' సతము ' ను, ' నిత్యమూ, ఎల్లప్పుడూ ' అనే అర్థంలో పెద్దలైన కవులు కూడా వాడటం చాలా తరచూ చూస్తూ ఉంటాము.
గురువుగారూ, అవునండీ,శాశ్వతము అనే అర్ధం లో సతము కు ప్రయోగాలు ఉన్నాయండీ., ఇప్పుడు గుర్తులేవు గానీ .. ఈ సారి చూసినప్పుడుటంకిస్తాను.
వ్రాసేటప్పుడే - అనుమానం వచ్చిందండీ - ఏకబిగిన అర్ధం కాదేమో అని - కందంలో - పదాలు ఒక పట్టాన ఇమడవు - నాకు - అందువల్ల అతుకులుపెట్టాల్సి వస్తుంది. కార్యస్థానం లోనూ, కర్మస్థానం లోనూ - తెఱపి దొరకబుచ్చుకొని - తెరచాటునవ్రాయటమ్ వల్ల - భావమో - సందర్భమో ఆ పద్యం గూర్చి వ్రాద్దామన్నా - ఎక్కడ స్థానాధిపతులకంటబడతానోనని భయమొకటి.
చంద్రశేఖర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘సత్కా ర్యవిధిన్ + అన్యాయము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సత్కార్యవిధి / న్నన్యాయము’ అని ప్రయోగించవచ్చు. * రాజేశ్వరి అక్కయ్యా, చక్కని భావంతో పూరణ చేసారు. అభినందనలు. మొదటిపాదంలో గణదోషం! ‘ఏ న్యాయ మెఱుంగని జన’ అంటే సరి! * మిస్సన్న గారూ, ధన్యవాదాలు. * ఊకదంపుడు గారూ, ధన్యవాదాలు. మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. కానీయండి ... :-) * రాజారావు గారూ, ధన్యవాదాలు. * శశిధర్ పింగళి గారూ, ధన్యవాదాలు. నన్ను మునగచెట్టు ఎక్కించకండి. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, ఏమిటి? ఈసారి మీ పద్యం చక్కని ధారతో గంగాప్రవాహంలా ముందు కురికింది. ముఖస్తుతి అనుకోకండి. ఉచితపదప్రయోగంతో ధారాశుద్ధితో సాగింది మీ పద్యం. అభినందనలు. * వసంత కిశోర్ గారూ ఆ మీ ఆరు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. రెండవ పూరణలో ‘శంకరునకునూ’ అని వ్యావహారిక పదబంధాన్ని ప్రయోగించారు. ‘శంకరునకు తా / నన్యోన్యత ...’ అందాం. * చింతా రామకృష్ణారావు గారూ, సమస్యలు పూరించి బ్లాగుకు వన్నె తేవడమే మీరు నాకు చేయగల న్యాయం. మంచి పూరణ. ధన్యవాదాలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, ధన్యవాదాలు.
ఏ న్యాయము మది నెంచక
రిప్లయితొలగించండిఅన్యాయము జేసి జనుల నందలమెక్కన్
అన్యాయమునకు చూడగ
నన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్.
సంజయుడు ధృతరాష్ట్రునితో
రిప్లయితొలగించండిసన్యాసులె పాండవులన
వన్య మృగంములను గూడి వనవాసమ్మా ?
అన్యులె ? నీసుతు డెప్పుడు
నన్యాయము సేయు! వార లతిపుణ్యాత్ముల్.
పుణ్యాత్ములె మరి సేయగ
రిప్లయితొలగించండినే న్యా యమునకు వదలక నెప్పుడు న్యాయం!
బన్యాయమునకు నెంతయు
నన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్!!
మిస్సన్న గారూ! 'అన్యాయం'పై బహు న్యాయమైన పూరణ నిచ్చారండీ !
రిప్లయితొలగించండిదైన్యస్థితినొందుదురిల
రిప్లయితొలగించండినన్యాముసేయువార, లతిపుణ్యాత్ముల్
వన్యవిహారులయిరి ప
ర్జన్యుని చింతించి మోక్ష సాధకులవగాన్.
కన్యామణినిన్ వరునకు
రిప్లయితొలగించండిధన్యత సమకూరువిధముఁ దానము నిచ్చున్
సన్యాసమును వలదనుచు
నన్యాయము సేయు వారలతిపుణ్యాత్ముల్
ఒక మామను అల్లుడు పొగడ్తలలో ముంచెత్తుట
గణ్యులవినీతి పథమున
రిప్లయితొలగించండిమాన్యములాక్రమణఁ జేసి మాన్యత విడిచెన్!
ధన్యత నొందగ వారల
కన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్!!
కన్యల నిఖ్ఖా పేరున
రిప్లయితొలగించండినన్యపు దేశముల వారలాగము చేయున్!
కన్యల నీయక వారల
కన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్!!
కన్యాదానముగొనుచేఁ
రిప్లయితొలగించండిఅన్యస్త్రీవిముఖతఁగొని అప్సరసయె తా
నన్యోన్యతగోరుటయిన
నన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్!!
ధన్యులు ప్రాణాధికముగ
రిప్లయితొలగించండినన్యుల బ్రేమించు వార లదియు నవిటి వా
రి న్యూనత విషయము లో
న న్యాయము సేయు వార లతి పుణ్యాత్ముల్
నా పూరణ ....
రిప్లయితొలగించండిమాన్యులఁ బీడించుచు సౌ
జన్యము విడనాడి సతము స్వార్థపరతతో
నన్యుల దోచెడి దుష్టుల
కన్యాయము సేయువార లతి పుణ్యాత్ముల్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలూ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘అన్యాయానికి అన్యాయం’ చేయాలన్న రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. మూడవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
చక్కని విరుపుతో పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
కాని ‘పర్జన్యుని చింతించి ...’ ?
*
మందాకిని గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ ముందే చూసి ఉంటే నా పూరణ పోస్ట్ చేసేవాణ్ణి కాను.
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
ఊకదంపుడు గారూ,
కొద్దిగా తికమక పెట్టింది అర్థం కావడానికి. మళ్ళీ చదివితేనే మీ పూరణలోని చమత్కారం అవగాహన అయింది. బాగుంది. అభినందనలు.
*
రాజారావు గారూ,
మంచి భావనతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
కాని చివరి పాదంలో యతి తప్పింది. ‘లో/ న న్యాయము’ అన్నప్పుడు పాదప్రథమాక్షరం లఘువే అవుతున్నది. నా సవరణ...
‘ ...... విషయమున న
య న్యాయము సేయు వార లతి పుణ్యాత్ముల్’
గురువు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు. పర్జన్యుని చింతించి అంటే విష్ణుమూర్తిని తలచుచూ ( విష్ణువు గురించి తపస్సు ) అనే అర్థములో వాడినాను. తప్పైతే తెలుపగలరు.
గురువుగారూ, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీకు అభినందనలు.
మీ పూరణ చాలా చక్కటి ధారతో బాగున్నది. సతము అంటే శాశ్వతమని తెలిసింది.
మందాకిని గారూ, మీ పూరణలోని సునిశిత హాస్యం (light hearted humor) బాగుంది. అవును, సన్యాసం పుచ్చుకో వద్దని, నీవే శ్రీ మహావిష్ణువని చెప్పి మరీ పిల్లనిచ్చి అన్యాయం చేయగల సత్తా ఆయనకొక్కడికే వుంది:-)
రిప్లయితొలగించండిSanyaasirao (Pandita Nemani) గారి పూరణ ...
రిప్లయితొలగించండిమాన్యులయిరి నేడు ప్రజల
కన్యాయము సేయువార, లతి పుణ్యాత్ముల్
ధన్యు లవమానమొందుచు
దైన్యముతో మ్రగ్గుచుండ ధరణీస్థలిపై
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినేనే కాస్త నిదానంగా ఆలోచించాల్సించి. తొందరపడి వ్యాఖ్యానించాను. మన్నించండి.
*
మందాకిని గారూ,
‘సతము’ అంటే ఎల్లప్పుడు అనుకొని వాడాను. అది సతతము కదా. ఏమిటో .... పొరపాట్లు జరిగిపోతున్నాయి. శాశ్వతము అనే అర్థం అక్కడ అన్వయించదు. ‘విడనాడి యెపుడు’ అందాం.
అయినా జి. ఎన్. రెడ్డి గారి పర్యాయపద నిఘంటువులో ఎల్లప్పుడు అనే దానికి సతము అనే పర్యాయపదాన్ని కూడా ఇచ్చారు?
పండిత నేమాని గారూ,
రిప్లయితొలగించండి‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
శ్రేష్ఠమైన పూరణతో నా బ్లాగుకు వన్నె తెచ్చారు. సంతోషం. మీ సూచనలు, సలహాలు మాకు మార్గదర్శనం చేస్తాయి. ధన్యవాదాలు.
చంద్రశేఖర్ గారు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువు గారు,
అలాగా?
చంద్రశేఖర్:
రిప్లయితొలగించండిఅన్యాపదేశముగ ప
ర్జన్యాదులు నల పరీక్ష సల్పి నొసంగెన్
ధన్యత, సత్కా ర్యవిధిన్
యన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్!
కర్కోటకస్య నాగస్య, దమయంత్యా నలస్య చ |
రిప్లయితొలగించండిఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలి నాశయే ||
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఏ న్యాయము తెలియని పేదల
రిప్లయితొలగించండిమాన్యములను దోచు కొనుచు మహి నేలెడి ఈ !
వన్య మృగముల నణచుట
కన్యాయము చేయు వారలతి పుణ్యాత్ముల్ !
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువు గారూ ! " సతము " అంటే " శాశ్వతము " అని ఇప్పుడే నిఘంటువులో చూసాను.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిహనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
గురువుగారూ మీ పూరణ చాలా బాగుంది.
' సతము ' ను, ' నిత్యమూ, ఎల్లప్పుడూ ' అనే అర్థంలో పెద్దలైన కవులు కూడా
వాడటం చాలా తరచూ చూస్తూ ఉంటాము.
క్షమించాలి టైప్ పొరబాటు
రిప్లయితొలగించండిఏ న్యాయము తెలియని పేదల
మాన్యములను దోచు కొనుచు మహినేలెడి ఈ !
వన్య మృగముల నణచుట
కన్యాయము సేయువారలతి పుణ్యాత్ముల్ !
శంకరయ్య గారూ
రిప్లయితొలగించండిమంచి సవరణతో పద్యానికి వన్నె హెచ్చింది . ధన్య వాదములు.
గురువుగారూ,
రిప్లయితొలగించండిఅవునండీ,శాశ్వతము అనే అర్ధం లో సతము కు ప్రయోగాలు ఉన్నాయండీ., ఇప్పుడు గుర్తులేవు గానీ .. ఈ సారి చూసినప్పుడుటంకిస్తాను.
వ్రాసేటప్పుడే - అనుమానం వచ్చిందండీ - ఏకబిగిన అర్ధం కాదేమో అని - కందంలో - పదాలు ఒక పట్టాన ఇమడవు - నాకు - అందువల్ల అతుకులుపెట్టాల్సి వస్తుంది. కార్యస్థానం లోనూ, కర్మస్థానం లోనూ - తెఱపి దొరకబుచ్చుకొని - తెరచాటునవ్రాయటమ్ వల్ల - భావమో - సందర్భమో ఆ పద్యం గూర్చి వ్రాద్దామన్నా - ఎక్కడ స్థానాధిపతులకంటబడతానోనని భయమొకటి.
భవదీయుడు
ఊకదంపుడు
నేటి సమస్యకు దీటుగ
రిప్లయితొలగించండిమేటి పరిష్కార మిడిరి మిస్సన్నయు నా
పాటిగ నేమానియు మన
సాటి హితుడు సంపతయ్య సామర్ధ్యముగా
శంకరాభరణం బ్లాగ్ భువనవిజయాన్ని తలపిస్తోంది. శ్రీ శంకరయ్య మాష్టారు కృష్ణదేరాయలై సమస్యలనిస్తుంటే మిత్రులు అష్టదిగ్గజాలై అడిగిందే తడవుగా చక్కని పూరణలు చేస్తున్నారు. అందరికి శుభాభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యో నమః
రిప్లయితొలగించండిఅందరి పూరణలు అలరారు చున్నవి.
అన్యుల తాపము మ్రగ్గెద
రన్యాయము సేయువార,లతి పుణ్యాత్ముల్
ధన్యులు పరహిత మగ్నులు
మాన్యులు సద్గుణ విరాజమానధనాఢ్యుల్ !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
పూతన ప్రాణహారి పూజనీయుడే గదా !
01)
_________________________________
స్తన్యము నిచ్చెడి మిష , ప
ర్జన్యుని నాశమును గోరు - రాక్షస వనితా
స్తన్యము గ్రోలుచు , నసువుల
కన్యాయము సేయువార - లతి పుణ్యాత్ముల్ !
_________________________________
మదనాంతకుడు గూడా పూజనీయుడే గదా !
రిప్లయితొలగించండి02)
_________________________________
కన్యామణి పార్వతికిని
సన్యాసిగ తపము జేయు - శంకరునకునూ
అన్యోన్యత,గూర్చి నతని
కన్యాయము సేయువార - లతి పుణ్యాత్ముల్ !
_________________________________
రావణాంతకుడు గూడా పూజనీయుడే గదా !
రిప్లయితొలగించండి03)
_________________________________
సన్యాసి వేష ధారణ
పుణ్యాంగన సీత జేరి - మ్రుచ్చిలు వానిన్
జన్యాంగనమున, కుటిలుని
కన్యాయము సేయువార - లతి పుణ్యాత్ముల్ !
_________________________________
జన్యాంగనము = యుద్ధభూమి
ఏకలవ్యుని వేలు హరించినా, గురుస్థానంలో నున్న ద్రోణుడూ పూజ్యుడే !
రిప్లయితొలగించండి04)
_________________________________
విన్యాసము నొలికించిన
మన్యమున వసించు వాని - మాత్సర్యముతో
మన్యువు గలుగగ ,నంగుళి
కన్యాయము సేయువార - లతి పుణ్యాత్ముల్ !
_________________________________
మన్యము = అడవులతో కొండలతో కూడుకొన్న భూభాగము
మన్యువు = శోకము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికళ్ళను శివున కర్పించిన ధన్యుడు ,తిన్నడూ పూజ్యుడే !
రిప్లయితొలగించండి05)
_________________________________
పుణ్య వశంబున ,శంభు, న
నన్యముగ గొలుచుచు, భక్తి - నయనంబులనే
ధన్యత నొసగి, తనకు తా
నన్యాయము సేయువార - లతి పుణ్యాత్ముల్ !
_________________________________
సత్యం కోసం భార్యనమ్మిన హరిశ్చంద్రుడూ పూజ్యుడే !
రిప్లయితొలగించండి06)
_________________________________
అన్యాయంబ నెఱింగియు
సన్యాసికి రాజ్యమిచ్చి - సత్యము కొఱకై
హైన్యముగా ,నమ్మి , సతికి
నన్యాయము సేయువార - లతి పుణ్యాత్ముల్ !
_________________________________
పుణ్యాత్ము శంకరయ్యకు
రిప్లయితొలగించండినన్యాయము జరుగకుండప్రార్థించుటయే
సన్యాయము.సేయమి నది
అన్యాయము. సేయువార లతిపుణ్యాత్ముల్.
(నిత్యానంద స్వామి ని దృష్టిలోబెట్టుకొని)
రిప్లయితొలగించండిసన్యాసులనుచు సరసపు
విన్యాసము జేయునట్టి వెధవల నెడ కా
ఠిన్యత జేయకపోవడ
మన్యాయము! సేయువారలతిపుణ్యాత్ముల్!!!
మాస్టారూ, 'సతము' శబ్ద ప్రయోగం-అందుకోండి- శ్రీ మదాంధ్ర మహాభారతము-అరణ్య-సప్తమాశ్వాసము-సావిత్ర్యోపాఖ్యనంలో...
రిప్లయితొలగించండికలిమియు లేమియున్ సతము గావవి సెందినచోఁ చెలంగుచున్...
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
‘సత్కా ర్యవిధిన్ + అన్యాయము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సత్కార్యవిధి / న్నన్యాయము’ అని ప్రయోగించవచ్చు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని భావంతో పూరణ చేసారు. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం! ‘ఏ న్యాయ మెఱుంగని జన’ అంటే సరి!
*
మిస్సన్న గారూ,
ధన్యవాదాలు.
*
ఊకదంపుడు గారూ,
ధన్యవాదాలు.
మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. కానీయండి ... :-)
*
రాజారావు గారూ,
ధన్యవాదాలు.
*
శశిధర్ పింగళి గారూ,
ధన్యవాదాలు. నన్ను మునగచెట్టు ఎక్కించకండి.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఏమిటి? ఈసారి మీ పద్యం చక్కని ధారతో గంగాప్రవాహంలా ముందు కురికింది. ముఖస్తుతి అనుకోకండి. ఉచితపదప్రయోగంతో ధారాశుద్ధితో సాగింది మీ పద్యం. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ ఆ
మీ ఆరు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
రెండవ పూరణలో ‘శంకరునకునూ’ అని వ్యావహారిక పదబంధాన్ని ప్రయోగించారు. ‘శంకరునకు తా / నన్యోన్యత ...’ అందాం.
*
చింతా రామకృష్ణారావు గారూ,
సమస్యలు పూరించి బ్లాగుకు వన్నె తేవడమే మీరు నాకు చేయగల న్యాయం. మంచి పూరణ. ధన్యవాదాలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
ధన్యవాదాలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమాస్టారూ, ధ్యన్యవాదాలు.
రిప్లయితొలగించండిగురువు గారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమూర్తి మిత్రమా మీ పద్యం లో పద లాలిత్యం తోనికిసలాడు తోంది.
రిప్లయితొలగించండిశ్రీ చింతా వారు సమయోచితమైన పూరణ నిచ్చారు.
రాజారావు గారూ ధన్యవాదాలు.
శశిధర్ గారూ మీ మాటలు గురువుగారికి సంబంధించినంత వరకూ సత్యములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ కృతజ్ఞతలు. మా హ్యూగోలో తెలుగు కవిత్వము చెప్పగలిగే వాడిని నేనొక్కడినే !
రిప్లయితొలగించండిఅన్యోన్యము నిష్ట పడక
రిప్లయితొలగించండికన్యా కొమరితల నుండి కాశ్మీరముకున్
సన్యాసుల మను నేతల
కన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్
ప్రభాకర శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కన్యాకొమరిత' దుష్ట సమాసం.
వక్ర నీతి:
రిప్లయితొలగించండికన్యాదానము నందున
ధాన్యపు తూకమ్మునందు దారిద్ర్యమునన్
సన్యాసుల వేషములో
నన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్
రిప్లయితొలగించండినారదా :)
సన్యాసులమని చెప్పుచు
నన్యాయము సేయువార లతిపుణ్యాత్ముల్,
కన్యామణులనెడ గలరు
విన్యా సమ్ముల సలుపుచు విశ్వగురువులై !
జిలేబి