సీత కోసం రావణాసుర మందిరంలో వెదుకుచు అచ్చట వివిధ భంగిమల లో నిద్రిస్తున్న అందగత్తెలను చూసిన హనుమ, అలవాటుగా మీదకు రాబోతున్న మనసిజుని తనను రుద్రావతరంగా తెలుసుకొనమని, కామ భావన లేని వాడననీ చెప్పినట్లు నా భావం.
వివిధ భంగి మలను విశ్రాంతి గా నున్న పడతి తతిని జూచె ప్రక్క మీద దరికి జేర జూడ తానేమొ గనుమని కపి మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె.
గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో ..................................... కాల కృత్యములను గావించి, పవనుడు కూడబెట్టినట్టి కనకపు సింహాస నంబునందు గూర్చొ నుండగొచ్చిన, నేటి కపి మనోజుఁ గాంచి కుపితుఁ డయ్యె| ( పవనుడు = గాలి జనార్థనుడు, నేటి కపి రాజు= సి బి ఐ లక్ష్మీ నానారాయణ)
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, రుద్రస్వరూపుడైన ‘కపి’నే విషయంగా చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * పండిత నేమాని గారూ, సర్వోత్తమంగా, అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. ‘కడకు జేరుకొనగ’ అన్నచోట ‘కదిసి బాణమేయ’ అంటే ఎలా ఉంటుంది? * వరప్రసాద్ గారూ, ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. మంచిది! రెండవపాదంలో గణదోషం, మూడవపాదంలో ‘గూర్చొనుండగొచ్చిన’ అపశబ్దప్రయోగం సంభవించాయి. నా (బ్రాకెట్లో) నా సవరణలతో మీ పద్యం ...
కాల కృత్యములను గావించి, పవనుడు కూడబెట్టినట్టి (కుందనంపు గద్దెమీద నుండగా వచ్చెనే) నేటి కపి మనోజుఁ గాంచి కుపితుఁ డయ్యె| ( పవనుడు = గాలి జనార్దనుడు, నేటి కపి రాజు= సి బి ఐ లక్ష్మీ నానారాయణ) ?
చింతా రామకృష్ణారావు గారూ, మనోజ్ఞమైన పూరణ. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని ‘శివకపి’ ... ? * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * మందాకిని గారూ, నాకు మార్గదర్శనం చేసిన గొప్ప పూరణ మీది. క్రమాలంకరంలో మీ పూరణ అలరించింది. అభినందనలు. * రాజారావు గారూ, మీ కపి వంటి మనోజు పూరణ చాలా బాగుంది. అభినందనలు. * ఊకదంపుడు గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ, ప్రవరుణ్ణి సంబోధించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, ‘కపి’ శబ్దానికి ఉన్న నానార్థాలను చక్కగా వినియోగించుకొని మంచి పూరణ నిచ్చారు. అభినందనలు. * రాజేశ్వరక్కయ్యా, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం .. అక్కడ ‘కలకల మెగసిన’ అంటే సరి! * వసంత కిశోర్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీత కోసం రావణాసుర మందిరంలో వెదుకుచు అచ్చట వివిధ భంగిమల లో నిద్రిస్తున్న అందగత్తెలను చూసిన హనుమ, అలవాటుగా మీదకు రాబోతున్న మనసిజుని తనను రుద్రావతరంగా తెలుసుకొనమని, కామ భావన లేని వాడననీ చెప్పినట్లు నా భావం.
రిప్లయితొలగించండివివిధ భంగి మలను విశ్రాంతి గా నున్న
పడతి తతిని జూచె ప్రక్క మీద
దరికి జేర జూడ తానేమొ గనుమని
కపి మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన భావన. చక్కని పూరణ.ఆభినందనలు.
‘పడతి తతిని జూచె’ అనేది ‘పడతుల తతి జూచె’ అయితే బాగుంటుందేమో?
మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఇప్పుడే ఆంధ్రామృతం లోమీరు చేసిన పూరణ చూశాను.
చక్కని విరుపు తో మెరిపించారు.
pandita nemani గారి పూరణ ....
రిప్లయితొలగించండిశీతశైల తనయ సేవచేయుచునుండ
ధ్యానమగ్న చిత్తుడైన శివుని
కడకు జేరుకొనగ కందర్పుడట వృషా
కపి మనోజు గాంచి కుపితుడయ్యె
గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
రిప్లయితొలగించండి.....................................
కాల కృత్యములను గావించి, పవనుడు
కూడబెట్టినట్టి కనకపు సింహాస
నంబునందు గూర్చొ నుండగొచ్చిన, నేటి
కపి మనోజుఁ గాంచి కుపితుఁ డయ్యె|
( పవనుడు = గాలి జనార్థనుడు, నేటి కపి రాజు= సి బి ఐ లక్ష్మీ నానారాయణ)
అన్న పూర్ణ భర్త యా పరమేశుడే
రిప్లయితొలగించండికపి. మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె
మన్మధాగ్నిఁ గొలుప మసలుచునుండగా!
రామ భక్త హనుమ బ్రహ్మచారి.
ఎంత వార లైన కంతుని వశమౌట
రిప్లయితొలగించండివింత గొలుపు చుండు వినిన గనిన
గౌరి పైన రక్తి గలుగంగ గని "శివ
కపి"మనోజు గాంచి కుపితుడయ్యె!
సతివియోగదు:ఖమతిశయించగనాడు
రిప్లయితొలగించండిబ్రహ్మయాజ్ఞబడసి పలువిధముల
కుసుమబాణ తతులగుప్పించుతరివృషా
కపి మనోజు గాంచి కుపితుడయ్యె.
చూచిరమ్మనగను చొరబడి కాల్చిన
రిప్లయితొలగించండిరామబంటు యెవరు?రక్కసులకు
వరములిచ్చు విభుఁడుఁ బగఁబట్టు విధమెద్ది?
కపి; మనోజు గాంచి కుపితుడయ్యె.
అంతరాలు చూడ కాది భిక్షు వెదుట
రిప్లయితొలగించండికోతి బుధ్ధి జూపి కోల నేసె
'కపిమనోజు' గాంచి కుపితు డయ్యెను శివు
డగ్ని ధార గురిసె నాయు వూడె
రాజారావు గారు మనోజుని కపి చెస్తే నేను కపిని మనోజంటున్నాను.
రిప్లయితొలగించండితొర్రఁజొచ్చి దైత్యుదుంధుభినిదునిమి,
వెలికి వచ్చి చూచి కలత చెంది,
పరువిడుచును పోయి పత్నులిర్వురిమధ్య
'కపిమనోజు' గాంచి కుపితు డయ్యె.
నా పూరణ ....
రిప్లయితొలగించండి(నేనూ మందాకిని గారి బాట పట్టాను ... తప్పలేదు మరి!)
నరుని ధ్వజము మీఁద మెఱయు చిహ్నం బేది?
మురిసె నెందుకు రతి మరల మరల?
వ్రేటువడ్డ నాగవిభుఁ డెట్టి దశ నందె?
కపి; మనోజుఁ గాంచి; కుపితుఁడయ్యె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిరుద్రస్వరూపుడైన ‘కపి’నే విషయంగా చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని గారూ,
సర్వోత్తమంగా, అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘కడకు జేరుకొనగ’ అన్నచోట ‘కదిసి బాణమేయ’ అంటే ఎలా ఉంటుంది?
*
వరప్రసాద్ గారూ,
ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. మంచిది!
రెండవపాదంలో గణదోషం, మూడవపాదంలో ‘గూర్చొనుండగొచ్చిన’ అపశబ్దప్రయోగం సంభవించాయి. నా (బ్రాకెట్లో) నా సవరణలతో మీ పద్యం ...
కాల కృత్యములను గావించి, పవనుడు
కూడబెట్టినట్టి (కుందనంపు
గద్దెమీద నుండగా వచ్చెనే) నేటి
కపి మనోజుఁ గాంచి కుపితుఁ డయ్యె|
( పవనుడు = గాలి జనార్దనుడు, నేటి కపి రాజు= సి బి ఐ లక్ష్మీ నానారాయణ) ?
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని ‘శివకపి’ ... ?
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
నాకు మార్గదర్శనం చేసిన గొప్ప పూరణ మీది. క్రమాలంకరంలో మీ పూరణ అలరించింది. అభినందనలు.
*
రాజారావు గారూ,
మీ కపి వంటి మనోజు పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
ఊకదంపుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
నిగమ శాస్త్ర హితుడు నిత్యాగ్ని హోత్రుండు
రిప్లయితొలగించండిపురము విడిచి హిమపు గిరికి జనగ
రమణి నిలిచి వలపు రాగాలు గురిపింప
"కపిమనోజు"గాంచి కుపితుడయ్యె!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంధ్ర దేశ యువత హద్దుపొద్దు మరచి,
రిప్లయితొలగించండితమక మందుట గని, తనయుఁ బిలిచి,
తారతమ్య మెరిగి తారసిలు మనుచు
కపి మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె !
సూచన: కపి=విష్ణువు; మనోజుడు లక్ష్మీ పుత్రుడు గాన,విష్ణునకు తనయుడే గదా!
విపిన మందు జేరి విన్నాణి కాగోరి
రిప్లయితొలగించండితపము జేయ నెంచె దయిత మరచి
కనులు మూసినంత కలకలము రేపిన
కపి మనోజుఁ గాంచి కుపితుఁడయ్యె !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
శంభు మనసు మార్చి - శాంతిని నెలకొల్ప
సాయకములు వేసె - శంబరారి !
పంచ బాణు వలన - భంగమయిన ,వృషా
కపి, మనోజుఁ గాంచి - కుపితుఁడయ్యె !
_________________________________
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిప్రవరుణ్ణి సంబోధించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
‘కపి’ శబ్దానికి ఉన్న నానార్థాలను చక్కగా వినియోగించుకొని మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
*
రాజేశ్వరక్కయ్యా,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం .. అక్కడ ‘కలకల మెగసిన’ అంటే సరి!
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.