19, సెప్టెంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -465 (పదుగురు గనంగ వనిత)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. వాంపు పాత్రలు పోషించు వారిజాక్షి
    వంపు సొంపులు జూపించి పాడి యాడి
    చిత్రమందున స్నానాల సీను లోన
    పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:

    గర్భవతులకు ధైర్యము కలుగజేసి
    పొరుగు వారికి తోడుగా పురుడు బోసె
    పదుగురు గనంగ వనిత, వివస్త్ర యయ్యె
    స్నాన మాడంగ నెంచుచు నాతి తాను

    రిప్లయితొలగించండి
  3. ఆడ పిల్లల హాస్టలు నందు జేర
    క్రొత్త పిల్లని ర్యాగింగు కోరి జేసె
    దారి లేకను వారలు కోరి నట్లు
    పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.

    రిప్లయితొలగించండి
  4. 'పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె '
    నను జుగుప్సా కరమ్మైన , వినుటకైన
    నిష్ట మవని సమస్యల నిడుట - బ్లాగు
    గొప్పదనమును తగ్గించు కొనుటె యగును

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో

    పరువు ముఖ్యమనుచు నటి, పవిట తోడ
    పాత్రయందు జీవింపగ పరమ జెత్త
    యనుచు ప్రక్కన బెట్టగ, నాశ వీడి
    పదుగురు గనంగ వనిత వివస్త్రయయ్యె |

    రిప్లయితొలగించండి
  6. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, సెప్టెంబర్ 19, 2011 11:30:00 AM

    నిరుడు అనసూయ పతిభక్తి నిర్ణయింప,
    విష్ణు, పరమేశు బ్రహ్మలు భిక్ష కోర,
    చిన్ని పాపలుగా మార్చి యన్నమిడెను
    పదుగురు గనంగ వనిత వివస్త్రయయ్యె.

    గురువు గారూ,
    పదుగు అంటే ఇద్దరికన్న ఎక్కువ అనే జాతీయ అర్థము తీసికొన్నాను.

    రిప్లయితొలగించండి
  7. రాజారావు గారూ,

    గత శతాష్టావధాన సంగతులు గనిన
    నింతకంటె నశ్లీలార్థ మెంతయో జు
    గుప్స గల్గు సమస్యలన్ గొప్పవారె
    యిచ్చియున్నార లౌచిత్య మెఱిఁగి పూర
    ణమున సంస్కారమును జూప నయ మగుఁ గద!

    రిప్లయితొలగించండి
  8. పట్టణంబున పరుగెత్తె,పగటిపూట
    పసిడి గొలుసులు మెడనుండి పట్టి లాగి
    పదుగురుగనంగ వనితవి!! వస్త్రయయ్యె
    కలికి కన్నీటిపొరలతో,కలతజెంది !

    రిప్లయితొలగించండి
  9. వంటఁ జేయు సమయమున మంట యెగసి
    చీర కొంగు నంటుకొనంగ సిగ్గు విడిచి
    పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె
    జీవితము మిన్న జనులకు సిగ్గు కన్న!!

    రిప్లయితొలగించండి
  10. పెద్ద పెద్దల కిష్టమై ప్రియము గూర్చు
    బ్లాగు గావున జెప్పంగ వలసె గాని
    తమరి కెట్ల ట్లు గానిండు తాప మేల ?
    మిన్న కుండుట యే నాకు మేలు మేలు !!

    రిప్లయితొలగించండి
  11. పాఠశాలకు వేళాయె పదపదమని
    పౌడరద్దగ నొకనాడు పాప నొడల
    పదుగురు గనంగ వనిత; వివస్త్ర యయ్యె
    పాపయంత అమ్మనుగని పైడితల్లి!

    రిప్లయితొలగించండి
  12. విభుని రాక గూర్చి వేగుదెల్ప,కనుల
    విందుగూర్పరూపమందగించి-
    చేరెస్నానశాల,చెలులుకావలినిల్చి
    పదుగురు గనంగ; వనిత వివస్త్ర యయ్యె
    (విభుడు ; రాజు, వనిత = రాణి , కన్నది:కావలి )

    రిప్లయితొలగించండి
  13. మరో ప్రయత్నం -

    విభుడె రానుంటినేనని వేగుఁబంప
    స్నాన మాడతలచిసౌరు తనర
    కాంతునినిలుప సఖురాండ్రు కావలుండి
    పదుగురు గనంగ; వనిత వివస్త్ర యయ్యె

    రిప్లయితొలగించండి
  14. గోడ పై నొక చిత్రము గంటి నేను
    జలక మాడగ జలజాక్షి కొలను లోన
    వలువ లోలిచిన రీతిగ కలిగె భ్రాంతి
    పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె !

    రిప్లయితొలగించండి
  15. నా పూరణ ....

    ద్రోవదిని సభ కెట్లీడ్చె దుస్ససేనుఁ?
    డమృతమును పంచ విష్ణువే మయ్యె నాఁడు?
    స్నానమును జేయఁగా నేమి సతి యొనర్చె?
    పదుగురు గనంగ; వనిత; వివస్త్ర యయ్యె.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారూ,
    మన్నించాలి. వైవిధ్యంగా ఉండాలని మీకు ఇష్టం లేకున్నా ‘క్రమాలంకారాన్ని’ ఆశ్రయించాను.

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవపాదంలో ‘జూపించె’ అంటే అన్వయం కుదురుతుందని నా సలహా.
    ఆడపిల్లల ర్యాగింగ్ పూరణ అద్భుతంగా ఉంది.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    పురుడు పోసి వచ్చి స్నానం చేసిన పొరుగింటి వనిత గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో ‘పమిట’ను పైట (లేదా పయట, పయిట) చేయండి.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మంచి అంశాన్ని ఎన్నుకొని చక్కని పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.
    కాని పదుగురు శబ్దానికి పెక్కురు అనే అర్థం ఉన్నట్టు లేదు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    నగలు పోయి కట్టుబట్టలతో మిగిలిందంటారు. మంచి విరుపు. బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    ‘మానంకంటే ప్రాణం ఎక్కువ’ అంటున్నది మీ రెంచుకున్న వనిత. బాగుంది. అభినందనలు.
    *
    రాజారావు గారూ,

    అట్లుపేక్షించవలదండి! యవసరమగు
    సూచనలు వెంటవెంటనే శోభ నిడును.
    ‘శంకరాభరణము’ సర్వజనుల బ్లాగు;
    అందఱకు మోదముం గూర్చునట్టి దారి
    చూపి కవిమిత్ర హితుల సంస్తుతులు గొనుఁడు.
    *
    రవి గారూ,
    పాప స్కూల్ యూనీఫాం వేసుకొనడానికి వివస్త్ర అయింది. బాగుంది. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    మొదటి పూరణను ‘ఆటవెలది’ని చేసారు. తరువాత ‘తేటగీతి’గా సవరించారు. మీ రెవరో సవ్యసాచులే!
    బాగుంది పూరణ. అభినందనలు.
    రెండవపద్యం రెండవపాదం ఆటవెలది గానే మిగిలింది. ‘స్నాన మాడంగ తలచియు సౌరు తనర’ అంటే సరి!
    *
    రాజేశ్వరకయ్యా,
    నిజమే! గోడమీది పోస్టర్లు అశ్లీలంగానే ఉంటూ సభ్యతా సంస్కారం ఉన్నవాళ్లను తలవంచుకొనేలా చేస్తున్నాయి. మంచి విషయంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది. ‘గోడ పై నొక చిత్రము జూడగాను’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  19. మంద పీతాంబర్ గారి పూరణ అత్యుత్తమంగానున్నది. అబినందనలు

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    పదుగురు గనంగ వనిత,వి - వస్త్ర యయ్యె !
    పసుపు నొళ్ళంత పట్టించె - పడతి కపుడు
    పెళ్ళి కూతురు జేయగా - పెద్ద ముదిత !
    భద్ర మజ్జన మొనరించ్రి - ప్రమద లంత !
    _________________________________


    చిన్న సవరణతో :

    02)
    _________________________________

    పదుగురు గనంగ వనిత,వి - వస్త్ర జేయ
    పరమ పాతకుడా నాడు - పయిట లాగె !
    పతిత పావనుడా కృష్ణు - పరమ గరుణ
    పడతి పాంచాలి ప్రాణమూ - పరువు నిలిచె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  21. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి