22, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -468 (మామిడి ఫలమున్ దినంగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

  1. ఏమో రసాయనమ్ముల
    మామంచిగ రంగు కొరకు మాగేయుదుర
    య్యా! మంచి నీటకడుగక
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్!

    రిప్లయితొలగించండి
  2. మామకు మధుమేహముయని
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్,
    ఆమని రాదని,జీవన
    మే మరిలేదని నుడివిరి మిడిమిడి వైద్యుల్!!!

    రిప్లయితొలగించండి
  3. ఏమని బలికితి విప్పుడు?
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్
    గోమతి కనిరావైద్యులు?
    రామా! యెక్కడిపరీక్ష రా? యిది తగునా?

    రిప్లయితొలగించండి
  4. ప్రేమతొ రసమును పీల్చుచు
    నేమది జుర్రేవు, టెంకనే మ్రింగినచో
    భామా! గొంతున నిలబడి
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్!

    రిప్లయితొలగించండి
  5. కామోద్దీపన గల్గును
    మామిడి ఫలమున్ దినంగ;; మరణము గల్గున్
    ప్రేమన్నమితముగ దినన్
    ఆమము, వాతములు చేరి యతి ఉష్ణంబై !

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    ఆమని రాకనె గోయుచు
    చీమల మందులను జల్లి చిల్లులు పడగన్
    దోమలు ముసిరిన క్రుళ్ళిన
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్!

    రిప్లయితొలగించండి
  7. నా మతి భ్రమణముఁ జెందెన
    'మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్ ?'
    వ్రాతయె దప్పున ? సరియౌ
    పాతర పెట్టించు తినెద ' పాప ఫలమ్మున్ '!

    రిప్లయితొలగించండి
  8. మామిడిఫలములు తినవదగు
    నేమాత్రము చెడకయున్న.నేచ్చోటైనన్
    బాము విషంబున క్రుళ్ళిన
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్.

    రిప్లయితొలగించండి
  9. నా పూరణ......

    ఆ మాధుర్య మమేయము
    మామిడి ఫలమున్ దినంగ; మరణము గల్గున్
    ధూమదళ నిర్మితములన్
    దామసమునఁ గొనినఁ జుట్ట నస్యము గుట్కాల్.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రసాయనాల వల్ల విషతుల్యమైన మామిడి గురించి చక్కగా పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
    టెంక గొంతుకడ్డంపడ్డ మీ రెండవ పూరణ చాలా బాగుంది.
    ‘ప్రేమతొ, జుర్రేవు’ పదాలను ‘ప్రేమను, జుర్రెదవు’ అంటే సరి!
    *
    మంద పీతాంబర్ గారూ,
    మిడిమిడి వైద్యులపైన చక్కని పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.
    ‘మధుమేహము + అని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మధుమేహమ్మని’ అంటే సరి!
    *
    మందాకిని గారూ,
    ప్రశ్నార్థకంగా మంచి పూరణ చెప్పారు. చక్కగా ఉంది. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    అవునా? నాకు తెలియదే! అయినా ఈ వయస్సులో తిన్నా ఏం లాభం? నాకు మొదటినుండీ శీతఫలాలు (అందరూ సీతాఫలాలు అంటారు కాని అది తప్పు!) చాలా ఇష్టం. ఇక వాటి ‘సీజన్’ మొదలవుతుంది.
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ' ఏమీ ! నీతరమా ? ఆ
    మామిడి ఫలమున్ దినంగ - మరణము గల్గున్
    ఆమొలక కాయు లోపుగ -
    నీ మతి మండా !ముదుసలి !నేర్పరివి గదా !'

    అని రాజు పరిహసింపగ
    విని ముదుసలి చేతులెత్తి వినయము మీరన్
    ఘనముగ ' నేనీ పని నా
    మనవలు దిను కొరకు జేతు ' మాన్యుడ ! యనియెన్

    విన్నపము

    'మనవలు' గ్రామ్యం బని యది
    'మనుమలు 'గా దిద్ద వలదు మాన్యుడ ! వృధ్ధుం
    డొనరగ గ్రామీణుడు మరి !
    తన సొగసైన పలుకుబడి తగునా దిద్దన్ ?

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని గారి పూరణ .....

    ఈ మభ్యపెట్టు మాటలు
    మామిడి ఫలమున్ దినంగ మరణము కల్గున్
    మా ముందు చెల్లవయ్యా
    ఈ మధుర ఫలమ్ము చూడు మిపుడే తినెదన్

    రిప్లయితొలగించండి
  13. ఇటీవలి కాలంవరకు అమెరికా కు మామిడిపళ్ళు ఎగుమతి చేయటానికి భారతదేశానికి అనుమతి లేదు. నాకు గుర్తున్నంతవరకూ ఒబామా అధ్యక్షుడైన తరువాతే .. అనుమతి లభించిందనుకుంటా.


    నేమోసుకుబోయె అటకు
    భామా!తినుమనుచునొసగ పశ్చిమ సఖికిన్-
    నామనసువిరుగననె: "మీ
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్!"

    రిప్లయితొలగించండి
  14. గురువు గారి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
    శ్రీకృష్ణదేవరాయుల కుమారుడు తన మేనమామ ఇచ్చిన ఫలముతిని చనిపోయెను.
    ------------------
    క: మామంచి మామ యిచ్చిన
    జామను దినిమళ్ళి గోర, జామల తోడన్
    బామువిషపు ఫలమిచ్చెన్,
    మమిడి ఫలమున్ దినంగ మరణము గల్గెన్|

    రిప్లయితొలగించండి
  15. తింటే ఆయాసం,తినక పోతే నీరసం. భోజనము తర్వాత చంద్రభాసురము లేకుండానే నాకు మత్తు కలుగుతొంది. అందులో మామిడి పళ్ళు తలచు కొంటే ! నా పద్యములో ప్రాస తప్పింది.( శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు ) మరో ప్రయత్నము.

    నా మతి భ్రమణముఁ జెందెన !
    ' మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్ '?
    రామ స్మరణమె నమ్మెద
    సాముద్రిక మేల నిడుమ చక్కని ఫలముల్ !

    రిప్లయితొలగించండి
  16. రాజారావు గారూ,
    నిస్సందేహంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    మూడవపద్యంలో ముందే హెచ్చరించారు. బాగుంది.
    *
    పండిత నేమాని గారూ,
    చాలా బాగుందండీ మీ పూరణ. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    ఉండి ఉండి ఊడిపడతారు చక్కని పూరణతో. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘నే మోసుకుబోతి నటకు’ అంటే బాగుంటుందేమో?
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని జామపళ్ల సీజన్లో మామిడిపళ్లు రావనుకుంటాను ... :-)
    *
    గన్నవరపు వారూ,
    నేనూ గమనించలేదు సుమా! సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ఏమది తినుటకు నోచని
    మామిడి రసమని తెలియక మంత్రించి నటుల్ !
    ప్రేమగ తినియుం డినచో
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్ !

    [ " ఫలమున్ " ]

    రిప్లయితొలగించండి
  18. మన తెలుగు - చంద్రశేఖర్గురువారం, సెప్టెంబర్ 22, 2011 9:59:00 PM

    ఊదం గారూ, అమెరికాకి ఇండియా మామిడిపళ్ళ export ప్రస్తావన బాగుంది. చిన్న సవరణ: దాదాపు 18 ఏళ్ళ తరువాత ఏప్రిల్ 2007 లో (అంటే ఇంకా బుష్ రాష్ట్రపతిగిరీ నడుస్తోంది, ఒబామా ఇంకా రాలేదు) మళ్ళా ఇండియా అల్ఫాంసో, రత్నగిరి మామిడిపళ్ళు అమెరికాకి చేరాయి. ఒబామా ప్రెసిడెంట్ గిరీ వచ్చాక పాకిస్తాను నుంచి కూడా దిగుమతి చేసుకొనేందుకు పర్మిషన్ ఇచ్చారు. అదీ కథ.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ,
    ధన్యవాదాలు. రాసేటప్పుడు మోసుకువెళ్లి అని గానీ , మోసుకుబోతినటకు - అని గానీ అందామనుకున్నానండీ.. కాని ఆ ప్రయాస( మరియు వెర్రితనం) వ్యక్తమవ్వదేమోనని సందేహం వచ్చిందండీ.

    చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదములు. మీరు చెబితే లీలగా ఓ ఫోటో గుర్తొస్తోంది, బుట్టని( Box) Ms.Rice భారత అధికారులనుంచి అందుకోవడమ్.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    కమలజుడు నిర్ణయించిన
    సమయమునకు సమయ వలయు - జగమున ప్రాణుల్ !
    ప్రమయం బాసన్న మయిన
    మామిడి ఫలమున్ దినంగ - మరణము గల్గున్ !
    _________________________________
    ప్రమయము = మరణము

    రిప్లయితొలగించండి
  21. డా.మూర్తి మిత్రమా! అదృష్టవంతులు, automatic గా నిద్ర ఎందరికి పడుతుంది!:
    చంద్రభాసురము వలదు ఇంద్ర పదవి
    వలదు, వుండనొక గుడిసె వలచిన సతి
    తోడు నీడగ నుండను తూఁగు కనులు
    నెమ్మదిగ సడి సేయక నిదుర పోవు!
    ఈ మాజిక్ కి ఇంకో మెడికల్ టెర్మినాలజీ ఏమయినా వుందేమో!

    రిప్లయితొలగించండి
  22. 01అ)
    _________________________________

    ఆ మర్కుడు తల వ్రాసిన
    నేమమునకు సమయ వలయు - జగమున ప్రాణుల్ !
    ప్రామీత్సము దరి జేరిన
    మామిడి ఫలమున్ దినంగ - మరణము గల్గున్ !
    _________________________________
    మర్కుడు = బ్రహ్మ
    నేమము = సమయము
    ప్రామీత్సము = మృత్యువు

    రిప్లయితొలగించండి
  23. రాజేశ్వరక్కయ్యా,
    పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
    సవరించే అవకాశం ఇవ్వనందుకు కొద్దిగా ‘డిజప్పాయింట్’ అయ్యాను. :-)
    *
    చంద్రశేఖర్ గారూ,
    చక్కని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
    కాని ‘వుండ’ ? ‘యకారమును వువూవొవోలును ణళలు తెనుఁగుపదముల మొదట నుండరాదు’ కదా!
    *
    వసంత కిశోర్ గారూ,
    ప్రాస సవరించిన మీ పూరణ బాగుంది. ‘కాలం మూడినప్పుడు త్రాడే పామై కాటేస్తుందన్న లోకోక్తి’కి అద్దం పడుతున్నది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. మాస్టారూ, అదివరలో మీరు వ కారం తో మొదలయ్యే పదాలు వుండవని చెప్పిన పాఠం సమయానికి గుర్తుకు రాలేదు. మరొక్కసారి ధన్యవాదాలు. పండిత శ్రీ నేమాని వారికి కృతజ్ఞతలతో:
    చంద్ర భాసురమ్మును వలదింద్ర పదవి
    వలదు, వసతిగ నొక గూడు, వలచిన సతి
    తోడు నీడగ నుండను తూఁగు కనులు
    నెమ్మదిగ సడి సేయక నిదుర పోవు!

    రిప్లయితొలగించండి
  25. రాజారావు గారి స్ఫూర్తితో :
    ఇది తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక అత్యధ్బుత సన్నివేశం
    "చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా" అంటూ గాన గంధర్వుని పాటకు
    నాగేశ్వర్రావు అభినయం ,
    ఆ వృద్ధ పాత్రకు ఆనాడు చేసిన మేకప్ అజరామరం !

    మామిడి తోటను నొకపరి
    బాముల పడుచూ ముదుకడు - పత్రుల పాతన్
    మామిడి మొక్కల పాతెడు
    నా ముదుసలి జూచి రాజు - నగుచూ ననియెన్ !

    02)
    _________________________________

    ఏమా కోరిక నీకది
    మామిడి ఫలమున్ దినంగ !- మరణము గల్గున్
    మామిడి పూయక మునుపే !
    ఏమీ నీ వెఱ్ఱి పనుల - నేమన వలెనో ?
    _________________________________

    దానికి ముదుసలి సమాధానం :

    మామిడి టెంకల పాతెడు
    నాముఖమున ఫలము కొఱకు - నాత్ర మదేలా !
    మీమా పెద్దలు నాటిన
    మామిడి మొక్కల ఫలములె - మనకు లభించున్ !

    మామిడి నాటుట మనమే
    గోముగ తినవలె ననినెడు - కోరిక తోనా ?
    మామిడి మనమే నాటిన
    మామిడి ఫలములు లభించు - మన మనుమలకే !

    రిప్లయితొలగించండి
  26. చంద్రశేఖర్ గారూ,
    మళ్ళీ పొరబడ్డారు. నేను ‘వ’కారంతో అనలేదు. అవి ‘వువూవొవో’లు మాత్రమే. వకారంతో తెలుగుపదాలు వలసినన్ని ఉన్నాయి.
    *
    వసంత కిశోర్ గారూ,
    నీతికథకు ‘ఖండకావ్య’ రూపాన్ని ఇచ్చారు. సమస్యాపూరణలో కథలే చెప్తున్నారు రాజారావు గారూ, మీరూ. సంతోషం! అభినందనలు.
    ‘పడుచూ, నగుచూ ననియెన్’ అన్నచోట ‘పడుచును, నగి యిట్లనియెన్’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  27. అవును మాస్టారూ, నేనే తప్పుగా సంక్షిప్తం చేశాను నా పోస్టింగులో. వనిత, వాణి, వేశ్య (మా చింతామణి మరి:-) ), విల్లు, విటుడు, విందు, వింత, వీలు వగైరా వగైరా పదాలు ఎలా మరచిపోగలం.

    రిప్లయితొలగించండి
  28. చంద్రశేఖర్ గారూ,
    మళ్ళీ పొరబడ్డారు.
    వనిత, వాణి, వేశ్య, విటుడు సంస్కృతపదాలు. సంస్కృతంలో వు (వువూర్షువు), వూ (వూర్ణము), వో (వోఢ)లతో మొదలయ్యే పదాలున్నాయి.
    విల్లు, విందు, వింత, వీలు తెలుగుపదాలు.

    రిప్లయితొలగించండి
  29. మాస్టారూ, మంచి తెలుగు పాఠం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. పొరపాట్లు చేయటం వల్ల ఎంతో నేర్చుకొనే అవకాశం దక్కింది. చూశారా, వేశ్యలు సంస్కృతం లోనే వున్నారు, తెలుగులో లేరు మరి (హాస్యంగా).

    రిప్లయితొలగించండి
  30. ధన్య వాదములు తమ్ముడూ !
    సవరించే అవకాసమా ? అయ్యో ! అదెంత సేపు ? డోంట్ వ....ఱ్ఱీ

    రిప్లయితొలగించండి
  31. గోముగ లభించు చవకని
    కామముతో జీడి పప్పు కాయల తోడన్
    చామల రుచిగలుగు "దురద
    మామిడి" ఫలమున్ దినంగ మరణము గల్గున్

    దురద మామిడి = ముంత మాముడి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దురద మామిడి' అనే రకం ఉన్నదా?

      తొలగించండి
    2. ముంత మామిడి పండ్లు దురదగా ఉంటాయి సార్. కొంత మందికి అవి allergy. వాటి దురద పోగొట్టుటకు దండిగా బెల్లం వేసి పులుసు చేసెదరు విశాఖపట్న వాసులు. అచ్చట అవి బుట్టలు బుట్టలు ఫ్రీ గా దొరికేవి ఒక సీసనులో...

      తొలగించండి
  32. రాముడు పందెము గెల్వగ
    భీముని పట్టణము నందు బింకము మీరన్
    గోముగ ముట్టెను తోడుత
    మామిడి ఫలమున్ దినంగ మరణము గల్గున్

    రిప్లయితొలగించండి