27, సెప్టెంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -474 (ఇపుడు పితృదేవతల)

కవి మిత్రులారా,
మహాలయ అమావాస్య పర్వదిన శుభాకాంక్షలు!
ఈరోజు పితృఅమావాస్య.
నేటినుండి తెలంగాణాలో బతుకమ్మల సందడి!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఇపుడు పితృదేవతల పూజ హితము గాదు.

23 కామెంట్‌లు:

  1. పర్వ దినమిది పూజింప భాగ్య మబ్బు
    నిపుడు పితృదేవతల పూజ హితము; గాదు
    వారు దేవతల్ పూజించు వారు పిచ్చి
    వారు యని చెప్పు వారలే భ్రష్టు లౌను.

    రిప్లయితొలగించండి
  2. జననీ జనకులకు నమస్కృతులు !

    తల్లి దండ్రులు పూజ్యులు ధరణి యందు
    భువిని వీడిన జే వలె భూరి భక్తి
    నిపుడు పితృదేవతల పూజ; హితము గాదు
    విస్మరించుట వారిని విదురులకును !

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని గారూ,
    ధన్యవాదాలు.
    మీ పద్యాశీస్సులను ఇక్కడినుండి తొలగించి ప్రత్యేకంగా ప్రకటించాను. గమనించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  4. ఇపుడు పితృ దేవతల పూజ - 'హితము గాదు
    రాస్త-రైలు రోకోలు ,పోరాట బాట,
    రాజకీయ దుర్నీతి ,నిరసన ,బందు '
    ప్రజల నిక్కట్ల పాల్జేయ పాడి గాదు

    రిప్లయితొలగించండి
  5. Best wishes to all well wishers. Dasara Greetings.
    You can glace at all my works at the following web site:
    http.//panditha-nemani.info. Sreemadhyaatma Raamayanam can also be seen.
    itlu = Nemani

    రిప్లయితొలగించండి
  6. బ్రతికి నంత సేపు మిగుల వెతలు జూపి
    చచ్చినంత శ్రార్థముఁ జేయు చవటలార!
    ఆవ గింజంత ప్రేమ లేనట్టి మీకు
    నిపుడు పితృదేవతల పూజ హితము గాదు!!

    రిప్లయితొలగించండి
  7. భాద్రపదమున రెండవ పక్షమందు
    పెద్ద వారు హితైషుల పేరు తలతు
    రిపుడు. పితృదేవతల పూజ హితము. గాదు,
    నేను చేయననెదవేల? నీతి యౌన?

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాతవాసం లో ఉన్నపుడు సహదేవుడు అన్నలతో:

    అనువుగానిచోటునమనమపరిచితుల
    వలెను బతుకుచుంటిమిగాద బలముచెడియె
    తొల్లి కాదు,రాదరిదృష్టి దోప, కూడె,
    యిపుడు పితృదేవతల పూజ హితము గాదు.

    {అనువుగానిచోటున అపరిచితుల వలెను బతుకుచుంటిమి గాద బలముచెడియె
    తొల్లి కాదు, మనము అరిదృష్టి దోపరాదు, (ఐదుగురం) కలసి-యిపుడు పితృదేవతల పూజ హితము గాదు.}

    [ఎదో ఉపాయం తట్టి పూజ చేసేఉంటారనుకోండీ , ఒక వేళ వీళ్లకి తట్టకపోయినా కృష్ణుడు ఉండనే ఉన్నాడు!.
    ఔచిత్యం కాదు కాబట్టి సహదేవుడికి అంటాకట్టాను, తరువాత అన్నలు మంచిచెడ్డలు ఏర్పడ చెప్పి ఉంటారు అని సూచించటానికి.]

    [బ్రతుకు బదులు బతుకు అని కావాలనే అన్నానండీ -
    1)రాదు+అరిదృష్టి 2) "కూడె, యిపుడు" సబబో కాదో తెలియదు.]

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమ:

    జన్మనిచ్చెను సుతునకు తన్మయమున
    యింటి కోడలు,వారసునిచ్చె మాకు
    పురుడు కలిగిన పదినాళ్ళు నరయ జూడ
    ఇపుడు పితృదేవతల పూజ హితము కాదు.

    పురుడు తీరిన వెనువెంట జరుపవలయు
    మాత పితరుల మరువక మానసమున
    శ్రాద్ధ కర్మలు విడువక శ్రద్ధ కలిగి
    ప్రేమ పంచెడి వారలే పితరులనగ

    రిప్లయితొలగించండి
  10. గురువుగారు మీ అనుమతితో చిన్న సవరణ

    మాత పితరుల మరువక మానసమున
    శ్రాద్ధ కర్మలు విడువక శ్రద్ధ కలిగి
    పురుడు తీరిన వెనువెంట జరుపవలయు
    ప్రేమ పంచెడి వారలే పితరులనగ

    రిప్లయితొలగించండి
  11. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ....

    ఇంటి యిల్లాల! వింటి నేనిప్పుడేను
    కోడలుకు నేడు పండంటి కొడుకుపుట్టె
    ఆబ్దికము బెట్టు యత్నమ్ము లాపవలయు
    ఇపుడు పితృదేవతల పూజ హితముగాదు

    రిప్లయితొలగించండి
  12. తిలలు దర్భలు సమిధలు తెమ్ము వేగ
    తిథి మహాలయమావాస్య తెలియ దేమి?
    వలదు నీరుల్లి, వెల్లుల్లి, వలదు నీకు
    నిపుడు, పితృదేవతల పూజ, హితముగాదు.

    రిప్లయితొలగించండి
  13. నా పూరణ ...
    ఇపుడు పితృదేవతల పూజ హితము కాద
    టంచు తిథివారనక్షత్ర మరసి చెప్ప
    వలదు; జన్మకారకులయి వంశవృద్ధి
    కరులఁ బూజింపవచ్చు నేకాలమైన.

    రిప్లయితొలగించండి
  14. భాద్ర పదమాసమున నమా వాశ్య నేడు.
    దివిని గల యట్టి బంధులు తేరి చూచు
    నిపుడు పితృదేవతల పూజ హితము. గాదు
    కాదు కాదను వారలు కలుగ రిలను.

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    హేతువాదుల భ్రష్టత్వాన్ని చక్కగా వివరిస్తున్నది మీ పూరణ. అభినందనలు.
    చివరి పాదంలో ‘వారు + అని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వారలే భ్రష్టు లౌను’ కూడా తప్పు అనిపిస్తున్నది. ‘వార లని చెప్పువారలే భ్రష్టులు గద/ భ్రష్టు లందు’ అంటే సరి!
    ------------------------------------------------
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ------------------------------------------------
    రాజారావు గారూ,
    సందర్బోచితమైన ఉత్తమ పూరణ. బాగుంది. అభినందనలు.
    ------------------------------------------------
    జిగురు సత్యనారాయణ గారూ,
    సర్వశ్రేష్టమైన పూరణ మీది. అభినందనలు.
    అలాంటి ‘చవట’లు కళ్లముందు ఎందరో ...
    ------------------------------------------------
    మందాకిని గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ------------------------------------------------
    ఊకదంపుడు గారూ,
    పూరణ చక్కగా ఉంది. అంత వివరణ అవసరం లేదేమో! బాగుంది. అభినందనలు.
    ‘కూడె’కు బదులు ‘కూడి’ అంటే దోషమా?
    ------------------------------------------------
    శ్రీపతి శాస్త్రి గారూ,
    సహేతుకంగానే సమస్యను సమర్థించారు. బాగుంది పూరణ. అభినందనలు.
    ------------------------------------------------
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ. ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ------------------------------------------------
    మిస్సన్న గారూ,
    పితృదేవతల పూజకు ఏం కావాలో ఏవి వద్దో చక్కగా వివరించారు మీ పూరణలో. బాగుంది. అభినందనలు.
    ------------------------------------------------
    చింతా రామకృష్ణారావు గారూ,
    మేలైన పూరణ మీది. అభినందనలు.
    ‘తేరి చూచు | నిపుడు’ అనేది ‘తేరి చూతు | రిపుడు’ అంటే?

    రిప్లయితొలగించండి
  16. గురువు గారు,
    ధన్యవాదాలు.
    ప్రతీ ఒక్కరూ కన్నవాళ్ళను, వంశంలోని పెద్దవారి విషయంలో శ్రద్ధ పరిపూర్ణంగా ఉండాలో గురువు స్థానంలో ఉండి చక్కటి విషయం చెప్పారు.ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. రాజారావు చెప్పారు...
    మేలగు ! 'శంకరాభరణ 'మిత్రులు ,ప్రేక్షకు ,లెల్లవారికిన్
    శ్రీలలితా పరాత్పర విశేష శరన్నవ రాత్రి వేడుకన్
    దేలి , త్రిమూర్తి మాతృ పద దీప్తుల దీవెన లంది , మీరు - మీ
    పాలి కుటుంబ సభ్యలును, బంధు జనమ్ము శుభమ్ము బొందెడిన్!

    రిప్లయితొలగించండి
  18. పితృఅమావాస్య నేడిక పిలచి చేయు
    మిపుడు పితృదేవతల పూజ; హితము గాదు
    తల్లితండ్రుల మరచిన తరచిచూడు
    నీకొనర్తురే సత్కర్మ నీదు సంతు?

    రిప్లయితొలగించండి
  19. రాజారావు గారూ,
    ధన్యవాదాలు. మీ శుభాకాంక్షల పద్యాన్ని ఈరోజు ప్రత్యేక పోస్టుగా ప్రకటిస్తున్నాను.
    --------------------------------------
    (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ మీ పూరణ కడు మేలైనదిగా భాసిస్తోంది.

    రిప్లయితొలగించండి
  21. మహాలయ అమావాస్య నాడు:

    భర్త నాస్తికుండనియెను భార్య తోడ:
    "ఇపుడు పితృదేవతల పూజ హితము గాదు"
    భార్య దెప్పెను వలచిన భర్తనపుడు:
    "ఇపుడు త్రాగుట పీల్చుట హితమ దౌనె?"

    రిప్లయితొలగించండి