20, సెప్టెంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -466 (కాలు నమ్మి కొలిచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

 1. భక్తుడనగ నతడె బాల మార్కండేయు
  డనెడు వాడు, నమ్మె ఢక్క నొకటి
  చేత బూనువాని, చిత్తశుద్ధి గలిగి
  కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.

  రిప్లయితొలగించండి
 2. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, సెప్టెంబర్ 20, 2011 8:23:00 AM

  మార్కండేయమహర్షి గురించి......

  విమల భక్తి, మదిని విష్పష్టతాభిలా
  షను గలింగి తీవ్ర జపము సలిపె
  దేవదేవు మెచ్చి దీర్గాయువునుజేసె
  కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.

  కాలు = ఈశ్వరుడు, యముడు.,

  రిప్లయితొలగించండి
 3. సత్యవంతు దోడ సావిత్రి చని గనె
  ప్రాణ నాథు మెడను పాశ మిడుగ
  భక్తి భావ మొప్ప వైవస్వతుడు మెచ్చ
  కాలు నమ్మి కొలచి కాలు గెలచె !

  రిప్లయితొలగించండి
 4. మగని ప్రాణ మొకటి మగువ సావిత్రియె
  యముని వెంట పడుచు నడిగె వరము
  ఆత్మ స్థైర్య మంది అలుపునే పొందక
  కాలునమ్మి కొలిచి కాలు గెలిచె.

  (కాలుని+అమ్మి)
  కాలుని = యముని
  అమ్మి = సావిత్రి

  రిప్లయితొలగించండి
 5. శ్రీగురుభ్యోనమ:

  హోమ జపతపములు హోరగతిని మార్చు
  ననుచు సన్నిహితుడు నమ్మకముగ
  చొరవ గలిగి నుడివె జ్యోతిషమును, జాత
  కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.

  రిప్లయితొలగించండి
 6. సతిగ సహనవతిగ సావిత్రి యానాడు
  వాదు లాడి, వేడి వరము బొందె
  మారెజీవితమ్ము,మరలె జీవనగమ
  కాలు! నమ్మి కొలిచి కాలు గెలిచె!!!

  రిప్లయితొలగించండి
 7. శ్రీగురుభ్యోనమ:

  నన్ను నెవరి కనుచు నచికేతుడడుగగా
  యముని కనుచు తండ్రి యాజ్ఞ నిడగ
  శాస్త్ర ధర్మములను చక్కంగ నేర్చగా
  కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె

  రిప్లయితొలగించండి
 8. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, సెప్టెంబర్ 20, 2011 12:42:00 PM

  రావణుండు భక్తి రంజిల్లగాగొల్చె, (కాలుని )
  సంతసమ్మునొందె కుంతి కృష్ణు, ( నమ్మి కొలిచి )
  మర్త్యుడైన పతిని బ్రతికించి సావిత్రి ( కాలు గెలిచె )
  కాలు,నమ్మి కొలిచి,కాలు గెలిచె.

  రిప్లయితొలగించండి
 9. మగువ ' దివ్వె ' యగును - మగవాడు నుడు విచ్చ
  కాలు నమ్మి, కొలిచి , కాలు - గెలిచె
  నా పురుషుడు ? వంచనలు గెలువవు - ప్రేమ
  యొకటె గెలుపు నూనె - యువిద గెలువ

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని గారి పూరణ .....

  ఆదరమ్ము మెరయ నా మృకండు సుతుండు
  జ్ఞానధనుడు దీక్ష బూని తపము
  నాచరించి యభవు నంబికాధవు కాల
  కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె

  రిప్లయితొలగించండి
 11. నేనూ మార్కండేయుణ్ణే ఆశ్రయించాను.

  అంతకునకు బెదర కల్పాయు వని కల
  గుండు వడక నా మృకండుసూనుఁ
  డధికభక్తితోడ నంబికాపతిఁ గాల
  కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.

  రిప్లయితొలగించండి
 12. వరప్రసాద్ గారి పూరణ .....

  బోదకాలువాని బోధనలకు జాత
  కాలు నమ్మి, కొలిచి, కాలు గెలిచె
  నాతఁ డెన్నికలల నందలమెక్కఁ దా
  మరచె ముందువెనుక మొరకు గనుక.

  రిప్లయితొలగించండి
 13. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నవగ్రహ పూజామహిమ సినిమాలో కాంతారావు (సత్యసేనుడనుకుంటా)
  నవగ్రహాల్ని దూషించి రాజ్యాన్ని ,భార్యా బిడ్డలనూ, చివరికి
  కాళ్ళూ చేతులూ కూడా నరకబడి చావుకు అతి దగ్గరై,
  ఒక గృహిణిచే ఆదరించబడి యామె బిడ్డ చావుకు కూడా కారకుడై,
  అప్పటికి ఙ్ఞానోదయమై ,నవగ్రహ స్తోత్రం చేసి అన్ని బాధల నుండీ
  విముక్తుడౌతాడు ! అదీ కథ !

  01)
  _________________________________

  కాల కర్మ వశము - కష్టాల పాలయి
  కాలు సేతులు తెగ - కలత నొంది
  కలుగ ఙ్ఞాన , మన్య - గ్రహముల తోడను
  కాలు నమ్మి కొలిచి - కాలు గెలిచె !
  _________________________________
  కాలుడు = శని , యముడు

  రిప్లయితొలగించండి
 14. మందాకిని గారూ,
  ఈ రోజు ఎక్కువకవులు మార్కండేయుణ్ణే ఆశ్రయించారు. అందుకు మీరు అంకురార్పణ చేసారు. సంతోషం. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  మీ రెండవ పూరణ క్రమాలంకార శోభితమై అలరిస్తున్నది. సంతోషం.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీరు మార్కండేయుణ్ణి కాకుండా సావిత్రిని ఆశ్రయించారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
  రెండవ పాదం చివర ‘పాశ మిడుగ’? అది పాశమిడగ అనే దానికి టైపాటా? ‘పాశము పడ’ అంటే ఎలా ఉంటుంది?
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘ఆత్మస్థైర్య’ మన్నప్పుడు ‘త్మ’ గురువై గణదోషం వస్తుంది కదా! స్థైర్యానికి సంథ అనే పర్యాయపదం ఉంది. ‘ఆత్మసంథ’ అందాం.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

  *
  మంద పీతాంబర్ గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  రాజారావు గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  *
  పండిత నేమాని గారూ,
  అద్భుతమైన పూరణ. అభినందనలు. ధన్యవాదాలు.
  మీ పూరణ ముందే చూసి ఉంటే నా పూరణను పోస్ట్ చేసేవాణ్ణి కాదు.
  *
  వరప్రసాద్ గారూ,
  నా సెల్లుకు మెసేజ్ రూపంలో పంపిన మీ పూరణ బాగుంది. పూరణలను ఇలా కూడా పంపవచ్చని క్రొత్త దారి చూపించారు. సంతోషం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోర్ గారూ,
  మంచి సినిమాను గుర్తు చేసారు.ధన్యవాదాలు. ఆ చిత్రం సి.డి. నావద్ద ఉంది.
  కాలుడు శబ్దాన్ని శనైశ్చరునికి అన్వయించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి