29, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -476 (రాముఁడు పగవాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. కామాదుల వీడకఁ దాఁ
    నే మోక్షమునిచ్చువిద్య నేర్వక యున్నన్
    తామసముఁ ద్రుంచె శరముల
    రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారూ! చక్కని పూరణ చేశారు.

    ఆ మహనీయుల శాపము
    క్షేమముగా తొలగ జేయ చెప్పిన యటులే
    భూమికి దిగె నా హరియే
    రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    సౌమేధికు గాలి బడిన
    యా మౌలుని రక్ష సేయ - యతులిత గరుణన్
    కామాంధుని వధియించెను
    రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!
    _________________________________

    రిప్లయితొలగించండి
  4. మన ముగ్గురిదీ ఒకే బాట !
    మందాకినిగారూ !శాస్త్రీజీ !బావుంది !

    రిప్లయితొలగించండి
  5. రాముఁడు రావణునకు సత్
    ప్రేమను సన్ముక్తిఁ గొల్పె.శ్రేయస్కరుఁడై
    ప్రేమామృత మొలికించిన
    రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!

    రిప్లయితొలగించండి
  6. కామాది అరిషడ్వర్గములను వీడలేక మాయలోనే ఉండిపోయి ఏ ముక్తి మార్గముకై ప్రయత్నించక తామస బుద్ధితో ఉన్నప్పటికీ అంత ఘోరమైన దైవాపచారం చేసినప్పటికీ , ఒక్క రామబాణం తో పాపరాశినంతటినీ భస్మంచేసి తనలో ఐక్యం చేసుకున్న రామచంద్రుని కరుణను గూర్చి నేను చెప్పాను.
    శాస్త్రిగారు, వసంతకిశోర్ గారు, రామకృష్ణారావు గారు మరింత చక్కని పూరణలు చేశారు. మిత్రులకు అభినందనలు . ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. చంద్రశేఖర్:
    రావణాసురుడు మారీచునితో అంటున్న మాటలు:
    ఓ! మారీచా! వినుమా
    రాముఁడు పగవాఁడు;; కాఁడు రావణు హితుఁడే
    సామమునైన న్నాతని
    నీ మాయలచే చెణకుము నే మెచ్చంగన్!

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ .....

    రాముడు, సంరక్షిత సు
    త్రాముడు, జయ విజయ భవ విరాముడును, పరం
    ధాముడు, శ్యాముడు, తారక
    రాముడు పగవాడు కాడు, రావణు హితుడే

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, సెప్టెంబర్ 29, 2011 12:19:00 PM

    క్షేమంకరుడా రాముడు,
    భూమిజనపహరణమనెడి మూలముతో సం
    గ్రామంబున శివమొసగిన
    రాముఁడు పగవాఁడు కాఁడు రావణ హితుఁడే.

    శివము = మోక్షము
    మూలము = కారణము, నెపము,

    రిప్లయితొలగించండి
  10. లక్కాకుల వెంకట రాజారావు గారి పూరణ ....

    విభీషణుని హితోక్తులు ...
    ఆ ముమ్మూర్తులలో ‘హరి’
    రాముఁడు; పగవాఁడు కాఁడు; రావణ! హితుఁడే,
    ప్రేమాస్పదుఁడే శివునకు;
    భామను దగ నిచ్చి శత్రుభావన విడుమా!

    రిప్లయితొలగించండి
  11. నా పూరణ .....

    (రావణునితో నారదుడు)

    తామసుఁడ వైన నిను రణ
    భీముండై యణఁచు కార్తవీర్యార్జునుఁ దా
    నే మడియించె నఁట పరశు
    రాముఁడు పగవాఁడు కాఁడు; రావణ! హితుఁడే!

    రిప్లయితొలగించండి
  12. శ్రీగురుభ్యోనమ:

    "క్షేమము గూర్చెడి వాడే
    రాముడు, పగవాడు కాడు",రావణు హితుడే
    ఆమారీచుడు రాముని
    నామామృతమహిమ నుడివె నసురుని తోడన్

    రిప్లయితొలగించండి
  13. ***********************************************************************
    మందాకిని గారూ,
    మీ పూరణ అర్థవంతంగా ఉండి అలరించింది. అభినందనలు.
    ***********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    జయవిజయుల శాపవృత్తాంతంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ***********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    పద్యం సలక్షణంగా ఉంది. అయితే మీ పూరణకు లఘువివరణ అవసరమేమో అనిపిస్తున్నది.
    ***********************************************************************
    చింతా రామకృష్ణారావు గారూ,
    ప్రశస్తమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
    ***********************************************************************
    (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
    ***********************************************************************
    పండిత నేమాని గారూ,
    ‘జయవిజయ భవ విరాముడు’ కనుకనే ‘రావణ హితు’డయ్యాడున్న మీ పూరణ ఉత్తమంగా చక్కని ధారతో అద్భుతంగా ఉంది. అభినందనలు.
    ***********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.
    ***********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    విభీషణుని మాటలుగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ***********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ***********************************************************************
    సంతోషకరమైన విషయం ....!
    ఈరో జెవ్వరూ ‘సవరణ’కు అవకాశం ఇవ్వలేదు. మహదానందంగా ఉంది.
    ***********************************************************************

    రిప్లయితొలగించండి
  14. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! ధన్యవాదములు !
    _________________________________

    సౌమేధికు గాలి బడిన
    యా మౌలుని రక్ష సేయ - యతులిత గరుణన్
    కామాంధుని వధియించెను
    రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!
    _________________________________
    సౌమేధికుడు = ముని ( సనక సనందనాదులు )
    గాలి = శాపము
    మౌలుడు = సేవకుడు ( జయ విజయులు )

    "మునుల శాపానికి గురైన తన సేవకుణ్ణి , కామాంధుడైన రావణుణ్ణి,
    వధించి రక్షించిన రాముడు , రావణునకు హితుడు " అని నా భావము !

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారి వ్యాఖ్య ...

    నిన్నటి సమస్యలో "రావణు హితుడే" అని ఉంటే "రావణ! హితుడే" అని కొందరు
    పూరించారు కదా. ఆ పూరణలు సక్రమమేనా? నాది సందేహము మాత్రమే.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారూ,
    నిజమే. పొరపాటే! ఆ పొరపాటు నా వల్ల కూడా జరిగింది. పూరణ చేసే సమయంలో నా మనస్సులో ‘రావణ హితుడే’ అనే ఉన్నది. పొరపాటును నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీమంతుడు రావణునిన్
    రాముండే చంపకున్న, రావణ బ్రహ్మన్
    నీమముగ నెవడు తలచును?
    రాముఁడు పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!

    రిప్లయితొలగించండి
  18. భూకైలాస్:

    ఏమని చెప్పుదు శంకర!
    గోముగ చూచితిని నేను గొప్పగు సినిమాన్
    సోముని భక్తుడు "ఎన్టీ
    రాముఁడు" పగవాఁడు కాఁడు రావణు హితుఁడే!

    రిప్లయితొలగించండి