మిస్సన్న గారూ ధన్యవాదములు. చూసారా శాస్త్రి గారి మాట ! మా డొక్కు కారుకి గురువు గారు యెన్ని పంక్చరులు పెడతారో చూద్దాము. నేను నిజంగానే కారు స్టీరింగ్ చక్రము అరిగి ఊడిపోయే వరకు కారుని వాడుతా.
మిస్సన్న గారూ ! మీ 'కుర్ర కారు' (మా కుర్ర కారా? అనకండి ) బాగా దూసుకు పోయిందండీ ... మూర్తి గారు అందరికంటే ముందుగా కారు తెచ్చారు. బాగుందని ఎక్కి కూర్చున్నా..ఇంకేవీ పట్టించు కోలేదండీ ...
శాస్త్రి గారూ ఈ సారి కారు మంచిదే కాని గ్యాసు ( పెట్రోలు ) ఖరీదు కదా అందువలన కంపరము !అందులోకి నలుగురు కలసి కొన్న కారు. కారు వాడుకొనే వారే గాని గ్యాసు పోయించరు.
వీరు,వారి పేరు వీరిది యుమ్మడి కారు ,వాడు వారె ,గ్యాసు కొనరె కారుచౌక గాని గ్యాసుని కొనలేక కారు కంటఁబడినఁ గంప మెత్తె !
కిశోర్జీ ! ధన్యవాదములు. ఊకదంపుడు గారు, మంద పీతాంబర్ గారి షావు కార్లు,చింత వారి కుర్ర కారు, వుర్రూత లూగిస్తున్నారు.రాజారావు గారి పుకారు చక్కగా షికారు చేస్తున్నది. జిగురు వారి కారు బాగా కూత పెట్టినది.మిస్సన్నగారి కారు విద్యార్థి చేతిలో రెండుగా(కా, రు) అందముగా విడి పోయినది. అందరకు అభినందనలు.
కారు నందు మిగుల - పూరణము గురియ కర్షకులకు విందు - కలుగ జేయు ! కప్పు నందు చిన్న - కన్నంబు పడుటచే కారు కంట బడిన - గంపమెత్తె ! వేరు దారి లేక - చేరువలో గల పూరి యింటి లోకి - మారి పోతి ! _________________________________ కారు = వానాకాలము పూరణము = వాన
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, దారి తప్పిస్తూ పడిన తిప్పలకు, గ్యాసు కొనలేక పడిన ఇబ్బందులకు జాలి కలిగింది. మనోహరమైన పూరణలు. అభినందనలు. శాస్త్రి గారి సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు. * * * * * * * * * మిస్సన్న గారూ, మీ ‘కుర్రకారు’, ‘పట్టుకారు’ ‘అక్కసు వెళ్ళగక్కిన’ పూరణలు మూటికి మూడూ అద్భుతంగా ఉన్నాయి. ఇక నాల్గవదైన మీ ‘రు’కార పూరణ సర్వోత్తమం. అభినందనలు. * * * * * * * * * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఎలిజబెత్ రాణిని ఎక్కించిన మీ డొక్కుకారు పూరణ బాగుంది. ‘మర్యాద కలవారు కారు’ అన్న మీ పూరణలోని విరుపు ఉత్తమంగా ఉంది. ‘ఉద్యమకారు’ని మీది మీ పూరణ బాగుంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ, ఇంకా మిమ్మల్ని ‘చింతామణి’ వదలిపెట్టలేదు. మీ సుబ్బిశెట్టి గారి పూరణ చాలా బాగుంది. అభినందనలు. * * * * * * * వసంత కిశోర్ గారూ, మీ ‘కన్నీరు కారు’ పాప పూరణ ప్రశస్తం. రెండవ పూరణలో ‘కన్నీరు ధారగా కారు’ హనుమను వర్ణించిన విధానం బాగుంది. మూడవ పూరణలో కప్పుకు కన్నం పెట్టి వాననీరు కారుటను వర్ణించారు. బాగుంది. కాని ‘కన్నంబు పడుటచే / కారు కంట బడిన’ అన్నచోట ‘కన్నంబు పడి నీరు / కారు; కంట బడిన’ అంటే ఎలా ఉంటుంది? * * * * * * * జిగురు సత్యనారాయణ గారూ, ‘మొగులు కారు’ నంటున్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * ‘అర్హులు కారు’ అంటున్న మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
వానా కాలం కర్షకులకు పండుగయితే మా యింటి కప్పుకు కన్నం ఉండడం వల్ల కారు (వానాకాలం సూచించే కారుమబ్బు) కంటబడగానే నాకు కంపం మొదలు ! వర్షం కురిసి నీరు కారే దాకా ఎక్కడ వున్నాను ! కారక ముందే కారు(మబ్బు)ను చూసి మా పశువుల పాకలోకి మారిపోయాను !
ఆర్యా ! గంపమెత్తుట అనగా నేమియో తెలుపగలరు.
రిప్లయితొలగించండిడొక్కు కారు నొకటి ప్రక్కింట గొని వారు
రిప్లయితొలగించండినడువ ద్రోయు మనుచు నన్ను గోర
తప్పకుండె ! దారి తప్పించి తిరుగాడ
కారు కంటఁ బడినఁ గంప మెత్తె ! !
శాస్త్రి గారూ
రిప్లయితొలగించండికంపము + ఎత్తె = వణకు పుట్టింది అని భావిస్తున్నా
మూర్తి గారూ ! అర్థము సుబోధకము చేసినందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ 'డొక్కు కారు' పూరణ చాలా బాగుంది.
శాస్త్రి గారూ ఆ డొక్కు కారు పాపం మూర్తి గారిది కాదు.
రిప్లయితొలగించండివారి ప్రక్కింటి వారిది. :-))
వెకిలి చేష్టలున్ను వెఱ్ఱి వేషా లున్ను
రిప్లయితొలగించండికుక్క నక్క పిల్లి కూత లున్ను
ఆడ పిల్ల గన్న నా రీతి నౌ కుర్ర-
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
మిస్సన్న గారూ ధన్యవాదములు. చూసారా శాస్త్రి గారి మాట !
రిప్లయితొలగించండిమా డొక్కు కారుకి గురువు గారు యెన్ని పంక్చరులు పెడతారో చూద్దాము.
నేను నిజంగానే కారు స్టీరింగ్ చక్రము అరిగి ఊడిపోయే వరకు కారుని వాడుతా.
మూర్తి గారూ ! నేనూ మీ' డొక్కు కారు ' నెక్కుతున్నానండీ ...
రిప్లయితొలగించండికారు డొక్కు జూడ కారు నలుపెపుడు
కారు నడుపు వారు కారు వారు
ఎలిజ బెత్తు రాణి ఎక్కినదని చెప్ప
కారు కంటఁ బడినఁ గంప మెత్తె
మిస్సన్న గారూ
రిప్లయితొలగించండి"వెకిలి చేష్టలున్ను వెఱ్ఱి వేషా లున్ను
కుక్క నక్క పిల్లి కూత లున్ను" పద్య పూరణ బాగుంది.
మిస్సన్న గారూ ! మీ 'కుర్ర కారు' (మా కుర్ర కారా? అనకండి )
రిప్లయితొలగించండిబాగా దూసుకు పోయిందండీ ...
మూర్తి గారు అందరికంటే ముందుగా కారు తెచ్చారు. బాగుందని ఎక్కి కూర్చున్నా..ఇంకేవీ పట్టించు కోలేదండీ ...
ధన్యవాదాలు లక్కరాజు వారూ!
రిప్లయితొలగించండిపొయ్యి రాజ జేసి పులుసు గిన్నెను పెట్టి
యుడికినంత పులుసు, పడుచు పిల్ల
దించ బోవ గిన్నె దిబ్బున పడె పట్టు-
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
శాస్త్రి గారూ డొక్కు కారైనా పర్వా లేదు హాయిగా షికారు కెళ్ళి రండి.
రిప్లయితొలగించండిమా కుర్రకారు కంట మాత్రం పడకండి. డొక్కు కారు చూసి మళ్ళా కూతలు కూస్తారు.
మూర్తి మిత్రమా పాపం గురువుగార్కి ఏ కారూ ఉన్నట్లు లేదు.
రిప్లయితొలగించండిడొక్కుదైనా పరవా లేదు. మీ మీద అభిమానంతో ఏమీ చెయ్యరు లెండి.
వారు కలిమి యున్న వారె, యైనను గాని
రిప్లయితొలగించండిఏరికైన నింత నిడగ బోరు !
మంచి వారు కారు,మర్యాద కలవారు
కారు; కంటఁ బడినఁ గంప మెత్తె !!
మిస్సన్న గారూ ! మీకుర్ర కారు తో జాగ్రత్తగా వుంటాను లెండి....
రిప్లయితొలగించండిమీరేమిటండీ.. కుర్ర కారును మామీదకు వదలి 'పడుచు పిల్లను' పట్టు కున్నారు ...
ఇంతకీ పూరణ 'కంప మెత్తు' (వణకు ) మీద చేయాలా ? కంపర మెత్తు అర్థం తీసుకోవచ్చునా ?
శాస్త్రి గారూ ఈ సారి కారు మంచిదే కాని గ్యాసు ( పెట్రోలు ) ఖరీదు కదా అందువలన కంపరము !అందులోకి నలుగురు కలసి కొన్న కారు. కారు వాడుకొనే వారే గాని గ్యాసు పోయించరు.
రిప్లయితొలగించండివీరు,వారి పేరు వీరిది యుమ్మడి
కారు ,వాడు వారె ,గ్యాసు కొనరె
కారుచౌక గాని గ్యాసుని కొనలేక
కారు కంటఁబడినఁ గంప మెత్తె !
శాస్త్రీజీ ఏం పట్టుకుంటే ఏం లాభం? జార విడిచేసాక!
రిప్లయితొలగించండిమీ రెండవ కారు విరుపు చాలా బాగుంది.
మిస్సన్న గారూ మీ పడుచు పిల్ల పూరణ బాగుంది. స్వయం పాకపు రోజుల్లో పట్టుకారుతో దిబ్బున అన్నం గిన్నె పడేసిన అనుభవాల్ని గుర్తు చేసి కంపర మెత్తించారు.
రిప్లయితొలగించండిసందు గొందు లందు, సన్నని బాటల,
రిప్లయితొలగించండిబడుల గుడుల ముందు నడుగడుగున
నడువ వీలు కాక నడి మధ్య నిలిపెడు
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
' మీకు కారు లేదనా అంత అక్కసు? ' అంటోందండీ నా భార్య!
మూర్తి మిత్రమా మీ ఉమ్మడి కారు ప్రహసనం చాలా బాగుంది.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ! ధన్యవాదములు.(పడుచు పిల్లను జార విడిచి నందులకు కాదు.) నా కారు ' విరుపు ' నచ్చినండులకు.
రిప్లయితొలగించండిమూర్తి గారూ ! ధన్యవాదములు.(డొక్కు కారైనా, ఉమ్మడి దయినా ..ఓపికగా వాడుతున్నందులకు.
ఒంటి వెడలు చుంటి నొక్క కాన నడుమ,
రిప్లయితొలగించండిమృగము లేవి నాదు మీద కొచ్చు
ననుచు బెదరు చుండ, నక్సలై టుద్యమ
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
దేహ ఛాయ నలుపు, దాహమేమోజాస్తి
రిప్లయితొలగించండిబావురుమనుగొంతు బానపొట్ట
వడ్డియనుచు వెంటబడెడు షావు
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
[మొదటి రెండు పాదాలూ కారుకి కూడా అన్వయం]
మూర్తిగారి డొక్కుకారూ
రిప్లయితొలగించండిశాస్త్రిగారి ఉద్యమకారు
మిస్సన్న మహాశయులు పట్టుకున్న పడుచు వదిలిన పట్టుకారూ
చాలా చక్కగా ఉన్నాయ్ !
షావుకారు బావుంది కాని
రిప్లయితొలగించండిఊదంగారూ - మూడో పాదం ?
దీర వృత్తి లేని, దివ్య భావన లేని,
రిప్లయితొలగించండిచోర జార వృత్త నేరవృత్త
దురితు లెక్కువైరి ధరణిపైనను కుర్ర
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
అప్పు జేసె నతడు యవసరమ్ముకొఱకు
రిప్లయితొలగించండివడ్డి కట్టి కట్టి నడ్డి విరిగె
అసలు దీర్చుమనుచు యప్పునిడిన షావు
కారు కంటఁ బడినఁ గంపమెత్తె
వసంత కిషోర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములండీ..
ఇప్పుడు సరి దిద్దుతున్నాను.
దేహ ఛాయ నలుపు, దాహమేమోజాస్తి
బావురుమనుగొంతు బానపొట్ట
అసలుఁమించి మిగుల కొసరుగుంజెడిషావు
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
ఇన్ని నాళ్ళ బోధ యే గంగ కలసెను
రిప్లయితొలగించండిఋ,రు ల కింత భేద మెఱుగ లేవె?
రుషి? రుణమ్ము? కట ! గురువనగ విద్యార్థి
కా ' రు ' కంటఁ బడినఁ గంపమెత్తె.
బసుల ,రైళ్ళ ,బడుల ,బాజార్ల ,మార్కెట్ల ,
రిప్లయితొలగించండిపార్కుల ,జనముండు పట్టు లందు
నదిగొ ! బాంబు పెట్టి రని మీడియాలొ పు
కారు కంట బడిన గంప మెత్తె
అదిరి చెమట పుట్టె నర చేతికి, మరియు
రిప్లయితొలగించండిసైకిలేమొ బెదిరి సైడుగుండె
కారు కూత తోడ కలహము మొదలని
కారు కంటఁ బడినఁ గంపమెత్తె
కిశోర్జీ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఊకదంపుడు గారు, మంద పీతాంబర్ గారి షావు కార్లు,చింత వారి కుర్ర కారు,
వుర్రూత లూగిస్తున్నారు.రాజారావు గారి పుకారు చక్కగా షికారు చేస్తున్నది.
జిగురు వారి కారు బాగా కూత పెట్టినది.మిస్సన్నగారి కారు విద్యార్థి చేతిలో రెండుగా(కా, రు) అందముగా విడి పోయినది. అందరకు అభినందనలు.
వెతల బడిరి ప్రజలు గతమందు మన తెలం
రిప్లయితొలగించండిగాణమందు రజ్వి క్రౌర్యమునకు
కండకావరమ్ము దండిగా గల "రజా
కారు" కంట బడిన గంప మెత్తె!!!
చంద్రశేఖర్:
రిప్లయితొలగించండిచింతామణి నాటక పఠనానుభవంతో:
సుబ్బిశెట్టి 'గారు' సొమ్ములి చ్చిననాడు
చిల్లి గవ్వ లేని శెట్టి నేడు,
అట్లు పెసర పుణుగు లమ్మెడి యా షావు
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
కడుపు కాల , పాప - కంటిలో కన్నీరు
కారు ! కంట బడిన - గంప మెత్తె
కన్న తల్లి ! మదిని - కరుణ యుప్పొంగగా
కడుపు నింపి పాప - కలత మాన్పె !
_________________________________
ఏరు వాక సాగి యెంత కష్ట పడిన
రిప్లయితొలగించండిపంట కోత వేళ వాన రాగ
నీటి పాలగునని నీరసించి, "మొగులు
కారు" కంటఁ బడినఁ గంపమెత్తె!!
02)
రిప్లయితొలగించండి_________________________________
కారు కూత కూయ - కైకసి పుత్రుండు
కలత జెందె మిగుల - కంబు కంఠి !
కనలి హనుమ కనుల - కన్నీరు ధారగా
కారు ! కంట బడిన - గంపమెత్తె
కారు రూపు వాడు - కరుణతో బెంచిన
వనము నందు చిచ్చు - హనుమ బెట్టె !
_____
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి03)
రిప్లయితొలగించండి_________________________________
కారు నందు మిగుల - పూరణము గురియ
కర్షకులకు విందు - కలుగ జేయు !
కప్పు నందు చిన్న - కన్నంబు పడుటచే
కారు కంట బడిన - గంపమెత్తె !
వేరు దారి లేక - చేరువలో గల
పూరి యింటి లోకి - మారి పోతి !
_________________________________
కారు = వానాకాలము
పూరణము = వాన
స్వార్థ పరులు మోక్ష సాధనకర్హులు
రిప్లయితొలగించండిగారు, కంటఁ బడినఁ గంపమెత్తె
ననిన - దైవమగునె? నడిసంద్రమందున్నఁ
వేడినంత వచ్చు విభుడు గాదె!
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిదారి తప్పిస్తూ పడిన తిప్పలకు, గ్యాసు కొనలేక పడిన ఇబ్బందులకు జాలి కలిగింది. మనోహరమైన పూరణలు. అభినందనలు.
శాస్త్రి గారి సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.
* * * * * * * * *
మిస్సన్న గారూ,
మీ ‘కుర్రకారు’, ‘పట్టుకారు’ ‘అక్కసు వెళ్ళగక్కిన’ పూరణలు మూటికి మూడూ అద్భుతంగా ఉన్నాయి.
ఇక నాల్గవదైన మీ ‘రు’కార పూరణ సర్వోత్తమం. అభినందనలు.
* * * * * * * * *
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఎలిజబెత్ రాణిని ఎక్కించిన మీ డొక్కుకారు పూరణ బాగుంది.
‘మర్యాద కలవారు కారు’ అన్న మీ పూరణలోని విరుపు ఉత్తమంగా ఉంది.
‘ఉద్యమకారు’ని మీది మీ పూరణ బాగుంది. అభినందనలు.
లక్కరాజు వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
* * * * * * * *
ఊకదంపుడు గారూ,
మీ ‘షావుకారు’ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
* * * * * * * *
చింతా రామకృష్ణారావు గారూ,
వయస్సుకు తగ్గ భావంతో కుర్రకారు మీద చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
* * * * * * * *
మంద పీతాంబర్ గారూ,
మీ ‘షావుకారు’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘నతడు యవసరమ్ము’ అన్నది ‘నాత డవసరమ్ము’ అనీ, ‘దీర్చుమనుచు యప్పు’ అన్నది ‘దీర్చుమనుచు నప్పు’ అంటే బాగుంటుంది.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమిత్రులందరికీ అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిఇంకా మిమ్మల్ని ‘చింతామణి’ వదలిపెట్టలేదు. మీ సుబ్బిశెట్టి గారి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
* * * * * * *
వసంత కిశోర్ గారూ,
మీ ‘కన్నీరు కారు’ పాప పూరణ ప్రశస్తం.
రెండవ పూరణలో ‘కన్నీరు ధారగా కారు’ హనుమను వర్ణించిన విధానం బాగుంది.
మూడవ పూరణలో కప్పుకు కన్నం పెట్టి వాననీరు కారుటను వర్ణించారు. బాగుంది. కాని ‘కన్నంబు పడుటచే / కారు కంట బడిన’ అన్నచోట ‘కన్నంబు పడి నీరు / కారు; కంట బడిన’ అంటే ఎలా ఉంటుంది?
* * * * * * *
జిగురు సత్యనారాయణ గారూ,
‘మొగులు కారు’ నంటున్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
‘అర్హులు కారు’ అంటున్న మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
మిత్రులందరి పూరణలూ ముచ్చట గొలుపు చున్నవి !
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
వానా కాలం కర్షకులకు పండుగయితే
మా యింటి కప్పుకు కన్నం ఉండడం వల్ల
కారు (వానాకాలం సూచించే కారుమబ్బు) కంటబడగానే నాకు కంపం మొదలు !
వర్షం కురిసి నీరు కారే దాకా ఎక్కడ వున్నాను !
కారక ముందే కారు(మబ్బు)ను చూసి మా పశువుల పాకలోకి మారిపోయాను !
నా పూరణలు ....
రిప్లయితొలగించండి(1)
తరుగనట్టి యాస్తి తండ్రి యిచ్చె నటంచు
చేరి రేవగలును బారులందు
బీరు త్రాగి క్రొత్తకారులోఁ జేయు శి
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
(2)
రాజకీయమందు రాణించు నేతలు
నీతిదూరు లనుచు నెనరులేక
ప్రచురితమ్ము సేయు పత్రికలందు పు
కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
(3)
పెరుగుచున్న ధరలు, పెట్రేగు నవినీతి,
యక్రమార్జనమ్ము లదుపుచేయ
లేక చేతకాని లేకివారున్న స
ర్కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
(4)
దేశమందు నీతిఁ దెప్పింప నన్నా హ
జారె సేయునట్టి సమరముఁ గని
కిట్టక యతని కపకీర్తి తేఁగోరు స
ర్కారు కంటఁ బడినఁ గంపమెత్తె.
శంకరార్యా ! మీ షికారు ,పుకారు , సర్కార్లు అద్భుతంగా యున్నవి !
రిప్లయితొలగించండిఅభినందనలు !
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ నాలుగు పద్యాలు మేమందరం తయారు చేసిన కారు కు మీరు 'ఫినిషింగ్ టచ్' గా అవసరమైన నాలుగు చక్రాలు ఇచ్చినట్లు గా వున్నది.
పద్య ఖడ్గ ధార భయదమై యవినీతి
రిప్లయితొలగించండియుధ్ధమున ప్రతాప మురక లెత్తె
ఘనులు శంకరయ్య ! కవులు తమకు సాటి
కారు - కంట బడిన గంప మెత్తె
గురువు గారూ మీ నాలుగు పూరణలు చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిగురువు గారు అభిమానముతో మా కారుకి పంక్చరు పెట్టక పోయినా బాటపై మేకులుంటాయి కదండీ !
పవనహీనమయ్యె వాహన చక్రమ్ము
సీల డిగ్గు పడగ నేల కంటె
చలన రహిత మైన శకటమ్ము వికటించ
కారు కంటఁ బడగఁ గంప మెత్తె !
రాజారావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు ....
కవి ‘యాచార్య ఫణీంద్రులు’,
కవి ‘చింతా రామకృష్ణ ఘనులు’ తలంపన్,
కవి‘విష్ణునందనులు’ మఱి
కవి యని న న్ననిన నీటికాకిని గాదే!
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిటైరు పంక్చరైన మీ కారు పూరణ బాగుంది. అభినందనలు.
గురువుగారూ నాలుగు కార్లూ నాలుగు దిగ్గజాల్లా ఉన్నాయి.
రిప్లయితొలగించండిఎంతైనా గురువులు గురువులే. అభినందనలండీ.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణను చదివాను, నిన్ననే వ్యాఖ్యానించాను కూడా. మీ పేరును టైప్ చేయడం మరిచాను. పై వ్యాఖ్యలలో ‘జిగురు’ వారిపై వ్యాఖ్య తరువాత చూడండి.
గురువుగారూ, తొందరపాటుకు మన్నించండి.
రిప్లయితొలగించండిధన్యవాదములు.