30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -477 (మానినీమణి భర్తనే)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మానినీమణి భర్తనే మఱచిపోయె.
ఈ సమస్యను సూచించిన
నేదునూరి రాజేశ్వరి గారికి
ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

 1. శ్రీగురుభ్యోనమ:

  వారిజాక్షులు పయనించు వాహనంబు
  అదుపు తప్పగ నందరు యదిరి పడగ
  తల్లడిల్లెను గాయము తలకు తగుల
  మానినీమణి భర్తనే మఱచిపోయె.

  రిప్లయితొలగించండి
 2. గురువుగారూ శ్రీ రాజరాజేశ్వరీమాత నన్ను మన్నించుగాక. పైపూరణ నాకు నచ్చలేదు. కానీ అంతకు మించి తోచలేదు.

  రిప్లయితొలగించండి
 3. లక్కాకుల వెంకట రాజారావు గారి పూరణ ....

  కొత్త కాపురమందున్న కూర్మి కతన
  వేడ్క' దాంపత్య సుఖ మగ్న' విడువ దాయె
  మానినీ మణి భర్తనే - మఱచి పోయె
  దాను బుట్టింటి వారి దాత్కాలికముగ

  రిప్లయితొలగించండి
 4. శ్రీపతి శాస్త్రి గారూ,
  మన్నించవలసిన తప్పేమీ మీరు చేయలేదే. అందులో అపార్థం కాని, అశ్లీలం కాని లేవు కదా! చక్కని పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. రాజారావు గారూ,
  మంచి విరుపుతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. పిల్లలనుజేర్చె లలితాంగి పెద్ద బడిన
  వత్సరాంతమ్మువరకును వారురారు,
  జేరి,మహిళలసంఘాన సేవజేయ
  మానినీమణి భర్తనే మఱచి పోయె!!!

  రిప్లయితొలగించండి
 7. మా పూరణ:
  తరలము:
  తరుణికిన్ పతియే సమస్తము, దైవమున్ గురుడాతడే,
  ధరణి నాతని సేవజేయుట ధర్మ మంచు దలంచుచున్
  బరమ భక్తి చెలంగ గొల్చుచు మానినీమణి భర్తనే,
  మరచిపోయెను వాకిటన్ గల మానిసిన్ బతి సేవలో

  రిప్లయితొలగించండి
 8. మా పూరణ:
  తరలము:
  తరుణికిన్ పతియే సమస్తము, దైవమున్ గురుడాతడే,
  ధరణి నాతని సేవజేయుట ధర్మ మంచు దలంచుచున్
  బరమ భక్తి చెలంగ గొల్చుచు మానినీమణి భర్తనే,
  మరచిపోయెను వాకిటన్ గల మానిసిన్ బతి సేవలో
  Nemani

  రిప్లయితొలగించండి
 9. నాటి సాధ్వి సదా పతి ననుసరించె
  గొడవలంబడుచు వెడల గొట్టె నేటి
  మానినీమణి భర్తనే;; మఱచిపోయె
  భారతీయత, పాశ్చ్యాత్య బాణిఁ బడిన
  నొంటి చక్రపు బ్రతుకులు కుంటువారు !

  రిప్లయితొలగించండి
 10. గురువుగారూ పద్యం బాగాలేదని కాదు, పండుగ దినములలో ప్రమాదాన్ని ఉటంకించుట నచ్చలేదని నాభిప్రాయము. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 11. చక్కని పూరణలు చేసిన కవి మిత్రులకు అభినందనలు.

  తిరుమలేశుని జూడగ వరుసలోన
  మోకరిల్లుచు దూసుకు ముందు కేగె
  తన్మయంబున; చూడక తనదు వెనుక
  మానినీమణి భర్తనే మఱచిపోయె.

  రిప్లయితొలగించండి
 12. హనుమచ్ఛాస్త్రిగారూ అద్భుతంగా పూరించినారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, సెప్టెంబర్ 30, 2011 9:14:00 PM

  భక్తతుకారాం చలనచిత్రము లోని అంశము......

  అటు తుకారాముడత్యంత పటుతరమున
  పాండురంగని సేవించె భక్తితోడ,
  రాజులొసగిన నగలపై మోజు పెరగ
  మానినీ మణి భర్తనే మరచిపోయె.

  రిప్లయితొలగించండి
 14. అజ్ఞాతగారూ భారతంలోని కథను,సమస్యను మార్చకుండా,చందస్సును మార్చి చాలా చక్కగా మనోహరంగా పూరించినారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. గురువులకు పాదాభివందనం

  ఈ పోష్టుకు సంబంధం లేనిదే అయినా, అడుగ సాహసిస్తున్నాను. తమ పూరణతో చిన్న చిక్కుముడి విడదీయటానికి సహాయము చేయవలసినదిగా ప్రార్థన. ఖాండవ వనము, ముక్కంటి ఆగ్రహజ్వాల, పవనసుతుని లంకా దహనముతో పూరణ చేయ సాహసించాను కానీ, చివరి పాదం ఎంత ప్రయత్నించినా ఎలా పూరించాలో తెలియక గురువుల వద్దకు చేర్చిన ఏకలవ్య శిష్యుడిని పూరణతో అనుగ్రహించండి.

  "మహా దరిద్రము గాల్చువాడొకడు పుట్టకపోయె! నక్కటా!"

  ఏకలవ్య

  రిప్లయితొలగించండి
 16. "కలసి యుండెద నీతోడ కడ వరకని"
  బాసఁ జేసె భార్యామణి భర్త తోడ
  కాలుని పిలుపు రాగ తా రాలి పోయె
  మానినీమణి భర్తనేమఱచి పోయె!!

  భర్తను + ఏమఱచి = భర్తనేమఱచి (భర్తను మోసగించి)
  మరో అర్థం > భర్తనే మఱచి (భర్త అనేవాడు ఒకడున్నాడు అని గుర్తు లేకుండా......)

  రిప్లయితొలగించండి
 17. అగ్నిప్రవేశం ముందు సీతమ్మవారు:

  రావణాసురాంతకుడను,ప్రాణ సముని,
  ధర్మమూర్తిని,దశరధతనయుని, గని
  మానినీమణి భర్తనే,మఱచి పోయె
  పడిన కష్టములను రెప్పపాటు పాటు.

  రిప్లయితొలగించండి
 18. జిగురు సత్యనారాయణ గారూ,
  ఉదాత్తమైన పూరణ.

  రిప్లయితొలగించండి
 19. అమృతాభిషేకమ్ము నంతఃపురమ్మును
  ...... చిన్న కోడలు మావి చిగురు మొదలు
  చిట్టెమ్మ నపరంజి సింధూరములు రక్త
  ...... సంబంధ దేవత చంద్ర ముఖిని
  కల్యాణ తిలకము కలవారి కోడళు
  ...... పుత్తడి బొమ్మను మొగిలి రేకు
  భార్యా మణిని క్రొత్త బంగారముల తోడ
  ......పసుపు కుంకుమలను విసుగు లేక

  తనివి తీరగఁ జూచెడి తరుణి కాగ
  ఉల్లమందున నిలవగ బుల్లి తెరయె
  అర్థ గంటకు నొక సీరియల్లు రాగ
  మానినీమణి భర్తనే మఱచి పోయె!!

  రిప్లయితొలగించండి
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  శకుంతల :

  01)
  _________________________________

  చింతతో వీడి చెలులను, - చేర వచ్చె
  మదుర మధురమౌ నూహలు - మదిని నిండ
  మానినీ మణి భర్తనే ! - మరచి పోయె
  మౌని దుర్వాసు శాపాన - మగడు , మగువ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 21. అయ్యా! ఏకలవ్య గారూ! శుభాశీస్సులు. మీరు పద్యము ఎలాగ మొదలు పెట్టారు. మీరు వ్రాసిన పాదములను తెలియజేస్తే (అది ఏ పద్యమో)మిగిలిన భాగమును ఎలా నింపాలో మా వంతు ప్రయత్నము మేము చేయగలము.
  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 22. జీ యస్ యన్ గారూ ! బుల్లి తెర సీరియళ్ళను సీస(ము) లో బలే ఇమిడ్చారండీ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

  కానుకలనిత్తు రమ్ము సంక్రాంతి కనుచు
  తండ్రి పిలువంగ పతితోడ తరలి వెడలి
  కన్నవారింట తనవారి కాంచినంత
  మానినీమణి భర్తనే మఱచిపోయె!

  రిప్లయితొలగించండి
 24. పండిత నేమాని గారి పూరణ ....

  తరలము:
  తరుణికిన్ పతియే సమస్తము, దైవమున్ గురుడాతడే,
  ధరణి నాతని సేవజేయుట ధర్మ మంచు దలంచుచున్
  బరమ భక్తి చెలంగ గొల్చుచు మానినీమణి భర్తనే,
  మరచిపోయెను వాకిటన్ గల మానిసిన్ బతి సేవలో

  రిప్లయితొలగించండి
 25. కవిమిత్రులకు,
  నమస్కారం!
  మా ఆక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. స్నానాది కార్యక్రమాలు ముగించుకొని కొద్దిసేపటి తర్వాత మీపూరణపై వ్యాఖ్యానిస్తాను.

  రిప్లయితొలగించండి
 26. నేదునూరి రాజేశ్వరి గారి పూరణ ...

  పుట్టి నింటికి వెడలెను బెట్టు కట్టి
  తల్లి యొడిలోన శయనించ తనివి దీర
  సేద దీర్చెను యా తల్లి మోద మలర
  మానినీ మణి భర్తనే మఱచి పోయె !

  శ్రీ కంది శంకరయ్య గారికి సోదర , సోదరీమణి మందాకిని గారికి అందరికి విజయ దశమి శుభ కాంక్షలు

  రిప్లయితొలగించండి
 27. **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారూ,
  కౌశికుణ్ణి ధర్మవ్యాధుని వద్దకు పంపిన పతివ్రత కథను మనోహరంగా పూరణలో ప్రస్తావించారు. ముఖ్యంగా తేటగీతి పాదాన్ని తరలవృత్తంలో ఇమిడ్చిన మీ నైపుణ్యం అబ్బురపరచించి. అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.
  **********************************************************************
  (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  హనుమచ్ఛాస్త్రిగారూ,
  శ్రీపతి శాస్త్రి గారి మాటే నా మాట ..." అద్భుతంగా పూరించినారు. అభినందనలు. "
  **********************************************************************
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
  **********************************************************************
  ఏకలవ్య గారూ,
  పండిత నేమాని వారి వ్యాఖ్యను చూసారు కదా!
  "మహా దరిద్రము గాల్చువాడొకడు పుట్టకపోయె! నక్కటా!" ఇది స్వయంగా మీరు సృష్టించుకున్న సమస్యా? ఎవరైనా ఇచ్చారా? ఇది ఏ ఛందస్సులోను ఇమడడం లేదు. మీరు కొంత ప్రయత్నం చేసానన్నారు కదా!
  మీరు ఏం వ్రాసారో తెలియజేస్తే సవరణలు కాని సలహాలు కాని ఇవ్వగలను. మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాను.
  **********************************************************************
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ మొదటి పూరణ బాగుంది.
  ఇక మీ రెండవపూరణ అత్యద్భుతంగా ఉంది. అభినందనలు.
  (మా ఆవిడ పుణ్యాన మీరు పేర్కొన్న సీరియళ్ళలో కొన్ని పేర్లు తెలుసు)
  **********************************************************************
  ఊకదంపుడు గారూ,
  మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  ‘రావణాసురాంతకుడను’ అన్నచోట ‘రావణాసురాంతకుడగు’ అని ఉండాలనుకుంటా!
  **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
  **********************************************************************
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  చక్కని పూరణ. బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  రాజేశ్వరక్కయ్యా,
  సంతోషం. ధన్యవాదాలు. మంచి పూరణ. అభినందనలు.
  ఏదో ఒక సవరణ సూచించాలి కదా! ‘సేదదీర్చెను + ఆతల్లి’ అన్నప్పుడు యడాగమం రాదు కదా! ‘సేదదీర్చంగ నాతల్లి’ అందాం ... :-)
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 28. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ....

  అజ్ఞాత గారి భావమునకు యీ సమస్య యెలా వుంటుందో !
  "దారిద్ర్యమ్మును రూపు మాపు ఘనుడే ధాత్రి న్నయో గల్గడే !!"

  రిప్లయితొలగించండి
 29. సరదాగ:

  బాతురూముకు డోరులు పడని హైమ
  పసుపుతో జేసి బొమ్మకు ప్రాణ మొసగి
  "అమ్మ తోడు!"గ మగవారినడ్డు మనిన
  మానినీమణి భర్తనే మఱచిపోయె!

  రిప్లయితొలగించండి