23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -469 (జెల్లఁ దినిన కృష్ణుఁ డంత)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
జెల్లఁ దినిన కృష్ణుఁ డంత చిన్నగ నవ్వెన్.
ఈ సమస్యను పంపించిన శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

 1. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

  తల్లికి వెన్నుని యల్లర
  దెల్లయు గొల్లెతలుకూడి తెల్లముచేయన్
  మెల్లగ వెన్నంతయు రో
  జెల్లతినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్

  రిప్లయితొలగించండి
 2. పండిత నేమాని గారి వ్యాఖ్య ...

  ప్రాస నియమము:
  ఒకరి పూరణలో (మామిడి పండు గురించి) ప్రాసను పాటించని ఒక పద్యమును చూచేను.
  ప్రాస నియమము ప్రకారము పద్యములో ప్రతి పాదములోను 2వ అక్షరము ప్రాస
  అక్షరము. దానికి ముందున్న అక్షరము అన్ని పాదములలోను గురువు అయితే
  గురువును, లఘువు అయితే లఘువును మాత్రమే వాడాలి. ఒక పాదములో గురువు ఇంకొక
  పాదములో లఘువు ఉండరాదు. అలాగే ద్విత్వ, సంయుక్త అక్షరములు, బిందు పూర్వక
  అక్షరములు వచ్చునపుడు కూడా తప్పక నియమమును పాటించుచుంటే బాగుంటుంది.
  అందరూ గ్రహించగలరని నా భావన.

  రిప్లయితొలగించండి
 3. చక్కని పూరణ నందించిన కామేశ్వర శర్మగారి బాటలోనే ...

  మెల్లగ పాల్వెన్నలు రో
  జెల్లతినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్
  అల్లరిదేమని తల్లియె
  జెల్లను తలమీద వేసి చెవి నులమగనే !

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని గారి పూరణ ...

  చల్లని చూపుల వేలుపు
  నల్లని సొగసరి సుజన మనముల నెపుడు రా
  జిల్లుచు భక్తి ఫలపు గు
  జ్జెల్ల దినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘తల్లి మేలుకొని తనయుని జూచి
  అల్లరిదేమని అడిగినందుకే
  అలిగినవేళనె చూడాలి
  గోకుల కృష్ణుని అందాలు ...’
  గుండమ్మకథ చిత్రంలోని మంచి పాటను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. మెల్లగ మన్నునుఁ గొని రో
  జెల్ల తినిన కృష్ణుఁడంత చిన్నగ నవ్వెన్
  అల్లరి కాదది గనినను
  చల్లని వెన్నునకు వెన్న సమమే మన్నున్

  రిప్లయితొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________
  చల్లగ గొల్లలు నెల్లరు
  నల్లరి పిల్లడిని గూడి - యల్లన మెల్లన్ !
  గొల్లెత లిల్లిళ్ళం , గురు
  జెల్లఁ దినిన కృష్ణుఁ డంత - చిన్నగ నవ్వెన్ !
  _________________________________
  కురుజు = జున్ను

  రిప్లయితొలగించండి
 8. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, సెప్టెంబర్ 23, 2011 9:15:00 AM

  ఎల్ల జగంబులు జూపెన్
  తెల్లము జేసెను జగతికి దేవుండని,భీ
  తిల్లిరి యసురులు, మను రో
  జెల్లను తిని కృష్ణుడంత చిలిపిగ నవ్వెన్.

  మను = మట్టి

  రిప్లయితొలగించండి
 9. ఎల్లరిని విడి కుచేలుఁడు
  చల్లగ మరుగునకు పోయి సంబర పడుచున్
  తల్లి యొసంగిన యటుకులఁ
  జెల్లఁ దినిన, కృష్ణుఁ డంత చిన్నగ నవ్వెన్.

  రిప్లయితొలగించండి
 10. చల్ల చిలుక నిలు వెల్లను
  చిల్లు పడగ గొట్టిన తన చెవి పట్టి కసిన్
  గొల్లెత తలపై మొట్టగ
  జెల్ల దినిన కృష్ణు డంత చిన్నగ నవ్వెన్

  రిప్లయితొలగించండి
 11. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  చక్కని పూరణతో బ్లాగులోకి అడుగుపెట్టారు. సంతోషం.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  మందాకిని గారూ,
  మనోహరమైన పూరణ. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మధురంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  ‘భీతిల్లిరి యసురులు’ అన్నచోట ‘భీతిల్లిరి దనుజులు’ అంటే బాగుంటుందేమో?
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  ఓహ్! అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  రాజారావు గారూ,
  ‘జెల్ల’కాయ తినిపించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, సెప్టెంబర్ 23, 2011 8:20:00 PM

  మంచి సవరణ చేసినందులకు ధన్యవాదములు గురువు గారూ.

  రిప్లయితొలగించండి
 13. పిల్లన గ్రోవిని వూదుచు
  యుల్లములను దోచు కొనుచు యమునా తటమున్ !
  గొల్లల యింటను వెన్నను రో
  జెల్ల దినిన కృష్ణు డంత చిన్నగ నవ్వెన్ !

  రిప్లయితొలగించండి
 14. రాజేశ్వరక్కయ్యా,
  చక్కని పూరణ. అభినందనలు.
  కాకుంటే రెందవ పాదంలో యతి తప్పింది.
  ‘యుల్లములను దోచి యమున యొడ్డున జేరున్’ అంటే సరీ!

  రిప్లయితొలగించండి
 15. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ....

  శ్రీ శంకరయ్యగారూ, నమస్కారం.
  శంకరాభరణం బ్లాగుకు మీరందించిన ఆహ్వానం నాకు ముదావహం.
  నేను పంపిన సమస్యకు వచ్చిన స్పందన నాకు చాలా ఆనందం కలిగించింది. తమ తమ పూరణలు పంపిన కవి పండితులకు ధన్యవాదం.

  రిప్లయితొలగించండి
 16. చల్లగ కృష్ణుని గూడున
  మెల్లగ తన గుడ్లుబెట్టి మేతకు పోగా
  నల్లని పిల్ల యుదరపూ
  జెల్లఁ దినిన కృష్ణుఁ డంత చిన్నగ నవ్వెన్


  1. కృష్ణు డు = కాకి

  2. కృష్ణుడు = కోకిల

  ౩. ఉదర పూజ = తిండి

  రిప్లయితొలగించండి
 17. పిల్లడు చీరలు దోచగ
  కల్లోలము చెంది కొమలు కబురును చేర్చన్
  మెల్లగ యశోద చరచిన
  జెల్లఁ దినిన కృష్ణుఁ డంత చిన్నగ నవ్వెన్

  జెల్ల = మొట్టికాయ

  రిప్లయితొలగించండి