5, సెప్టెంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -449 (కుజనుల సంగతి హితమని)

కవి మిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కుజనుల సంగతి హితమని గురువు వచించెన్.

34 కామెంట్‌లు:

  1. ప్రజ జీవనాడి కవులకు.
    ప్రజలను విడనాడు కవులు ప్రబలనసాధ్యం
    బు.జన హితులయిన సుకవుల
    కు జనుల సంగతి హితమని గురువు వచించెన్.

    రిప్లయితొలగించండి
  2. గురువు గారికి వందనములు.
    వందనమందవేడుదును.పద్యము కూర్చుట నేర్పగాను మా
    కందిన శంకరుండయితి, కమ్మటి దౌమన భాషయందునన్
    పొందిక శబ్దముల్ పొదిగి పూరణఁ జేయుటఁ దెల్పి ,మమ్ములన్
    సుందర కావ్యముల్ చదువ సొంపుగ నిచ్ఛనుఁ బెంచినాడవే!

    గురుతుల్యులైన మిత్రులందరికి వందనములు.

    మిత్రులందరు నెంతయొ మేలుఁ గూర్ప
    నేఁటి పొద్దుకు వ్రాయుట నేర్చినాను
    వందనములను మీకును పంపుచుంటి
    తమరు గురుతుల్యులనియును దలతు నెపుడు.

    సుజనుల సంగతమేమరి
    విజయముఁ గూర్చునని, వారి వెంటనుఁ జనుచో
    కుజనుల వీడుదుమని, మా
    కు,జనుల సంగతి హితమని గురువు వచించెన్.
    గురువుగారు,

    నిన్నటి నా పూరణ వ్యాఖ్యానించగలరని విన్నపం.

    రిప్లయితొలగించండి
  3. చింతా రామకృష్ణారావు గారి ‘ఆంధ్రామృతం’ బ్లాగులో నా పద్యం ... (స్వల్పమైన మార్పుతో)

    నిరతము విద్యాబోధన,
    పరహితవర్తనము, శిష్యవాత్సల్యంబున్,
    వరశాస్త్రజ్ఞానమ్మును,
    గురుతరబాధ్యతలు గల్గు గురునకు జేజే!

    రిప్లయితొలగించండి
  4. భజనలు జేసెడి వారిని
    నిజముగ నీ హితులె యనగ నేరము రాజా !
    ప్రజ హితము కొరకు నిన్ చెన
    కు, జనుల సంగతి హితమని గురువు వచించెన్!!

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారూ,
    నిన్నటి మీ పూరణను చదివాను, నిన్ననే వ్యాఖ్యానించాను కూడా. మీ పేరును టైప్ చేయడం మరిచాను. వ్యాఖ్యలలో ‘జిగురు’ వారిపై వ్యాఖ్య తరువాత చూడండి.

    రిప్లయితొలగించండి
  6. గురువర్యులకు నమస్కారములు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
    గురువుల గురుతరబాధ్యతలు గురుతుగ జెప్పిన మీకు జేజే!
    సుకవులకు జనుల సంగతి హితమని చెప్పిన చింతా వారికి నమస్కారములు.
    కుజనుల వీడుదుమని, మాకు,జనుల సంగతి హితమని చెప్పిన మందాకిని గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ, తొందరపాటుకు మన్నించండి.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  8. గురువుల ప్రవర్తనానియమావళి చక్కగా చెప్పారండి. అభినందనలు.
    హనుమచ్ఛాస్త్రిగారు,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. జ్ఞానము రూపు దాల్చి యనుమాన నివృత్తి విధాన శిష్యులన్
    జ్ఞాన వికాస భాస వదనాబ్జ మనోజ్ఞుల జేసి విశ్వవి
    జ్ఞానమహోపకారులగు నా గురువర్యుల దల్చి - నేడు నా
    మానసమందు శంకరుని మాన్యుడుగా నుతి జేతు నెంతయున్

    రిప్లయితొలగించండి
  10. మాస్టారూ, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు మరీ, మరీ. నా మనసులో మాట: చాలా కాలం నేను సాహితీ సదస్సులలో పాల్గొని, యెందరో సుకవుల, ఘనకవుల పరిచయం పొందాను. వారిలో చాలా మటుకు తెలుగు, సంస్కృతం టీచర్లు, లెక్చరర్లే. అయితే వారిలో చాలా మంది వారికి వచ్చినంతలో పేరు సంపాదించు కొన్నవాళ్లో, వారి తెలివి తేటలు ప్రదర్శించేవారో, ఇంకేదయినా వ్యాపకం పెట్టుకొన్న వాళ్ళే తప్ప, ఓపికగా విద్యార్థికి పాఠం చెప్పటమో, ఉత్తేజపరిచి వాడిలోని తెలివిని వెలికి తీయటమో చేసిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు బహు కొద్దిమంది. నేడు ఉపాధ్యాయుడు అన్ని ఉద్యోగుల్లాగే, ఒక ఉద్యోగిగా మిగిలిపోయాడు. చాలా కాలానికి మీలో మళ్ళా మా చిన్నప్పటి గౌరీనాథశాస్త్రి తెలుగు మాష్టారిని చూడగలిగాను. అలాగే శేషగిరి రావు గారని మా హైస్కూల్ సైన్సు మాష్టారు. నన్ను చిన్న వయసులో సైన్సు వైపు మళ్లించిన మహామనీషి. మీరందరూ నిజమైన ఉపాధ్యాయులు. మీకు శతకోటి వందనాలు.

    రిప్లయితొలగించండి
  11. చంద్రశేఖర్ గారు చెప్పినట్లు విద్యార్ధి జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే మాస్టర్లు చాలా తక్కువ.(పూర్వ కాలంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. లేకపోతే మేమీ దశకి వచ్చే వాళ్ళం కాదు.) స్వలాభాపేక్ష లేకుండా చేసేవాళ్ళు ఇంకా తక్కువ. మీరు ఆ వర్గంలో ఉన్నారు.

    "మాస్టారూ, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారూ,
    ఒక్కొక్క రోజు ౫౦ పూరణలదాకా వస్తున్నపుడు , వాటినన్నిటినీ పరిశీలించి తగు సవరణలు చేయుటకు సమయం వెచ్చించి, శ్రమ పడుతున్న మీకు నా జోహార్లు.
    పైన నా పూరణ చూళ్ళేదా గురువుగారూ అంటూ నా వంటి వాళ్ళు....

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యులకు వందనములు !

    వందనము కంది శంకర !
    సుందరమౌ నీదు సూక్తి - సొంపులు గనినన్
    విందగు మా డెందములకు !
    అందించుము మాకు నీదు - ఆదర మెపుడున్ !

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యులకు వందనములు !

    వందనము కంది శంకర !
    మందమతుల కరుణ మమ్ము - మార్చితి వెంతో
    చందన మలదిన రీతిని
    కుందగనీ కెవరి మదిని - కూర్మిని బెంచన్ !

    రిప్లయితొలగించండి
  15. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, సెప్టెంబర్ 05, 2011 12:27:00 PM

    ప్రజనిర్దేశ్యమె కార్యము,
    త్యజియించుము దేహసౌఖ్య దారాసుతులన్,
    అజరామర శుభకీర్తుల
    కు, జనుల సంగతి హితమని గురువు వచించెన్.

    కార్యము = చేయదగిన పని ( ప్రజలు కోరుకొన్నదే చేయవలెను )

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యులకు వందనములు !

    వందనము కంది శంకర !
    అందముగా నిడి సమస్య - లాదర మొదవన్
    అందరమూ పూరణ , నా
    నందము బొందగ , పదముల - నాణ్యత బెరుగన్ !

    రిప్లయితొలగించండి
  17. నిజమీ బ్లాగున మిత్రులు
    సుజనులు , కవి పండితులు , విశుధ్ధ చరితు - ల
    క్కజ , మపు రూపముగా దొర
    కు జనుల సంగతి హితమని గురువు వచించెన్

    రిప్లయితొలగించండి
  18. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, సెప్టెంబర్ 05, 2011 1:09:00 PM

    గురువుగారూ,

    మీకు నా హృదయపూర్వక ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు. సాటి కవిమిత్రులు చెప్పినట్లు, మీరు నిజమైన ఉపాధ్యాయులు. ఇంత వయసులో కూడ ఓపికగా అందరిపూరణలు చూస్తూ, వివరణలు ఇస్తూ మమ్ములను తెలుగు భాషకు మరింతగా దగ్గరకు చేస్తున్న మీకు నా మన: పూర్వక శిరసాభివందనములు.

    గురువు గారూ, మీతో పరిచయభాగ్యం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. శిరసాభివందనములు.

    రిప్లయితొలగించండి
  19. శ్రీమాన్ కంది శంకరయ్య గారికి,జ్ఞాన వృద్ధులు, వయో వృద్ధులు, పెద్దలు అయిన వారికి, ఉపాధ్యాయులకూ, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా కైమోడ్పులు.సాహితీ మిత్రులకూ, కవి పండితాళికీ,గురు భక్తులకూ నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గురుర్ర్బహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః
    గురుతుల్యులైనట్టి కవులందరికి,ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
    ప్రజలు సుఖశాంతులతోనున్నప్పుడే, వారు కవులను ఆదరింతురు
    యువకులకు గురువుగారు ఈ విధముగా జెప్పుచుండిరి , రాజు గారిని పొగడుట కాదు . .


    క: భజనలు జేయుట మెచ్చరు
    ప్రజ, తమ కష్టములతోడ పాలకులాడన్,
    నిజముగ నేటి యువ కవుల
    కు, జనుల సంగతి హితమని గురువు వచించెన్|

    రిప్లయితొలగించండి
  21. నా పూరణ ....

    "నిజ మిదియె చెప్పుచుంటిని
    సుజనావళితోడి చెలిమి శుభము లొసఁగు; క
    ష్టజ మనుచుఁ దెలిసి విడుచుట
    కుజనుల సంగతి హిత" మని గురువు వచించెన్.

    రిప్లయితొలగించండి
  22. గురువు గారూ వందనములు !మమ్ములను తెలుగు భాషకు మరింతగా దగ్గరకు చేస్తున్న మీకు నా హృదయపూర్వక ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు.కవిమిత్రులకు,కవిగురువులకు నా హృదయపూర్వక వందనములు

    సుజల స్రవంతులు గురువులు,
    విజయ సుసారధులు వారు విజ్ఞాన గిరుల్,
    నిజమైన శక్తి శిష్యుల
    కు,జనుల సంగతి హితమని గురువు వచించెన్ !!!

    రిప్లయితొలగించండి
  23. శ్రీ కంది శంకరార్యులకు శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి వందనములు. ఉపాధ్యాయ దినొత్సవ సందర్భమున యీ బ్లాగును సందర్శించే ఉపాధ్యాయుల కందఱికీ నా నమస్సులు,శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  24. పండితులు , పూజ్యులు ఐన గురువులకు వందనం . [ మీ రంతా నా కంటే చిన్న వారే అయినా , మీలోని పాండిత్యానికి ,సరస్వతీ , దేవికీ ,] శిరసు వంచి పాదాభి వందనం , పద్యాలు వ్రాయాలన్న నా చిర కాల వంచ్చను తమ్ముళ్ళు ముఖ్యంగా గురువులు శంకరయ్య గారు ఎంతో ఓర్పుగా , నేర్పుగా సవరణ చేసి విసుగన్నది లేకుండా నన్ను ప్రోత్స హించి నేర్పు తున్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పు కోవాలో తెలియటల్లేదు. [ నేను మూడు రోజులుగా బోస్టన్ వెళ్ళి నందున ఇప్పుడే నెట్ ముందుకు వచ్చాను. ]
    ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గానే కాదు ఎప్పుడూ " గురువు గురువే " పూజ నీయులే " సదా నా హృదయ పూర్వక వందనములు + కృతజ్ఞతలు + ధన్య వాదములు. సెలవు

    రిప్లయితొలగించండి
  25. వినుతింపన్ దన పద్య పూరణలతో విజ్ఞాన సందీప్తులన్
    మన కందించెడు సాహితీ హితు డసామాన్యుండు మాన్యుండు శ్రీ
    ఘన చింతాన్వయ రామకృష్ణ కవి విఖ్యాతుండు నాచార్యుడై
    మన మధ్యన్ గురు పూజ లందుకొన సమ్మానింతు పద్యమ్మునన్

    రిప్లయితొలగించండి
  26. కుజుడనశుభములఁగూర్చగఁ
    కుజపతివలెధర్మమునెలకొల్పగనెంచన్
    కుజపతివలెఁగావ నృపుకుఁ
    కుజనుల సంగతి హితమని గురువు వచించెన్

    [శుభములు గూర్చిన కుజుడు ( మంగళుడు) అనవలెనన్నా -
    రాముడి వలే ధరము నెలకొల్ప దలచుకున్నా -
    శివుని వలె - కావగ నెంచినా - ఆ రాజుకు - (కుజనుల = భూజనుల = తనప్రజల) సంగతి హితమని గురువు దెల్పెను.

    కు=భూమి
    కుజ=సీత,పార్వతి]

    రిప్లయితొలగించండి
  27. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    స్వజనుల మేలును దలపక
    ప్రజలను పాలించు వాడె - ప్రభువన ధరణిన్ !
    నిజమును గన గలుగు నృపుల
    కు , జనుల సంగతి హితమని - గురువు వచించెన్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  28. ' వినుతింపన్ దన ' -యని పొరపాటున టైపు చేయబడింది . దానిని 'వినుతింపందగు ' -యని చదువ గలరు

    రిప్లయితొలగించండి
  29. ప్రజలాశించిన రఘువం
    శజ రత్నమునకు, వశిష్ట శైక్షోత్తముకున్
    సుజనాభి బాల రామున
    కు జనుల సంగతి హితమని గురువు వచించెన్

    రిప్లయితొలగించండి
  30. ప్రజలను గాచెడి భగవతి
    సుజనుల దీవించి యెపుడు శుభము లొసంగున్ !
    నిజమగు మంచిని పెంచుట
    కు , జనుల సంగతి హితమని గురువు వచించెన్ !

    రిప్లయితొలగించండి
  31. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న మా బావగారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ వచ్చిన సందర్భంగా వారి సన్మానసభకు వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరాను. అందువల్ల నిన్నటి మీ పూరణలను పరిశీలించడం, వ్యాఖ్యానించడం వీలు కాలేదు.
    నాకు శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    ఈ సాయంత్రంలోగా మీమీ పూరణలపై, వ్యాఖ్యలపై స్పందిస్తాను.

    రిప్లయితొలగించండి
  32. సమస్యను సమర్థవంతంగా పూరించిన
    చింతా రామకృష్ణారావు, మందాకిని, గోలి హనుమచ్ఛాస్త్రి, సంపత్ కుమార్ శాస్త్రి, రాజారావు, వరప్రసాద్, మంద పీతాంబర్, ఊకదంపుడు, వసంత కిశోర్, (మనతెలుగు) చంద్రశేఖర్, నేదునూరి రాజేశ్వరి గారలకు అభినందనలు.
    *
    గురుపూజా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, నన్ను సంబోధిస్తూ పద్యాలు వ్రాసిన మిత్రులు మందాకిని, గోలి హనుమచ్ఛాస్త్రి, రాజారావు, చంద్రశేఖర్, లక్కరాజు శివరామకృష్ణారావు, వసంత కిశోర్, సంపత్ కుమార్ శాస్త్రి, చింతా రామకృష్ణారావు, వరప్రసాద్, మంద పీతాంబర్, గన్నవరపు నరసింహ మూర్తి, నేదునూరి రాజేశ్వరి గారలకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  33. "సుజనా! ఎన్నిక లందున
    విజయము కావలెన నీకు బీహరు లోనన్?"
    భుజముల తుపాకి దాల్చెడు
    కుజనుల సంగతి హితమని గురువు వచించెన్

    రిప్లయితొలగించండి