శంకరార్యా ! ధన్యవాదములు. మిరుమిట్లు గొలిపే వెలుగునకు కళ్ళు చీకట్లు క్రమ్మినట్లవుతాయి. మీ పూరణ ఎంతో సహజ సుందరముగా నున్నది. వివిధ రకముల దీపాలు వెలిగించిన కవి మిత్రులకు అభినందనలు.
రాజారావు గారూ, వలపు దీపాన్ని వెలిగించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. ద్వంద్వసమాస పూర్వపదంగా పార్వతి శబ్దం దీర్ఘాంతమౌతుంది. ‘శ్రీ పార్వతీ మహేశ్వరులు ..’ అందాం. * రాజేశ్వరక్కయ్యా, బాగుంది మీ పూరణ. అభినందనలు. ఏదో ఒక ‘తప్పు’ పట్టాలి కదా :-) అది ‘సాదీయనుడు’ కాదు ... ‘సాధీయసుడు". * శ్రీపతి శాస్త్రి గారూ, మీ విశ్వరూప దీపపు పూరణ బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, అద్భుతమైన ఊహ. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. స్విచ్ అని అన్యదేశ్యాన్ని వాడారు కనుక ‘వేస్తిని’ అనే గ్రామ్యప్రయోగం ఓ.కే. * వసంత కిశోర్ గారూ, మీ మూడు పూరణలూ దేని కదే అద్భుతం. చాలా మంచి పూరణలు. అభినందనలు.
రూపము తెలియును గదరా
రిప్లయితొలగించుదీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మెన్,
పాపిని నేనని నీవిటు
తాపము పొందదగదోయి! తమ్ముడ! వినరా!
సంధ్యా సమయయము మించి పోతుంటే ఒక అత్తగారు తన కోడలితో ....
రిప్లయితొలగించుఆ పరమేశ్వరు మ్రొక్కుము
దీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మెన్
పాపకు పాలను పట్టుము
పాపడి కన్నంబు పెట్టి బజ్జో మనుమా !
ఓ పరమేశ్వర! మ్రొక్కెద
రిప్లయితొలగించుదీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మెన్
ఏ పథ మెటకో తెలిపెడు
దీపము వెలిగించి జ్ఞాన తేజము నిమ్మా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుచంద్రశేఖర్:
రిప్లయితొలగించుతాపము తీరు న్న౦త
ర్దీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మెన్
పాపపు తూపులు పొడవఁగ
సైపగలేను పరమేశ! జ్ఞానమొసఁగరా !
గురువు గారికి ధన్యవాదములు, నమస్కారములతో
రిప్లయితొలగించుఅప్పు జేసి నడిరోడ్డున నిలిచెను యందురు అది ఈ విధమున
-----------------
పాపపు లోకము, యప్పుల
దీపము వెలిగించినంత, తిమిరముగ్రమ్మెన్
మాపును దన మర్యాధలు
శాపమునిచ్చి, రహదారి సధనము జేయున్|
లోపలి తిమిరముతొలగెను
రిప్లయితొలగించుదీపము వెలిగించినంత. తిమిరము గ్రమ్మెన్
దీప మది యారిపోవగ.
దీపము సుజ్ఞాన చిహ్నతేజము కనినన్.
రూపైన మగువ - చూపుల
రిప్లయితొలగించుదీపము వెలిగించినంత తిమిరము గ్ర(మ్మున్)మ్మెన్
పాపము !మగవారి మదికి
శాపమొ మరియేమొ చెపుమ శంకర వర్యా !
దీపించి తరణి - తూరుపు
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్
పాపము ! పశ్చిమ ధరణికి
వాపోవగ నేల ? మరల వచ్చును వెలుగుల్
పాపమదియేమి శాపమొ ?
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్
దీపపు సెమ్మెకు - వెలుగులు
దీపించెను దాని చుట్టు దేదీప్యముగా
తాపము తొలుగును జ్ఞానపు
రిప్లయితొలగించుదీపము వెలిగించినంత; తిమిరము గ్రమ్మెన్
కోపము హెచ్చిన ,తమకే
లోపము లేదని దలచిన లోకుల కెల్లన్!!!
కోపమ్మట రాహువుకును
రిప్లయితొలగించుతాపమ్మున రవిని మ్రింగు తరుణమ్మిదియే
దీపము వెలిగించుమనగ
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్!!
నా పూరణ ....
రిప్లయితొలగించుదీపితమగు శక్తి గలుగు
(హైపవరు వోల్టులు గలుగు)
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్
రూపింపఁ గనుల ముందఱ
వ్యాపించె నవె మిఱుమిట్టు లత్యధికముగన్.
శ్రీ పార్వతి పరమేశ్వరు
రిప్లయితొలగించులా పగిదిని బెండ్లి యాడి యమర సుఖాలన్
దీపింప వలపునూనెల
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్
మందాకిని గారూ,
రిప్లయితొలగించు‘పాపపు తిమిరము’ గ్రమ్మిందన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
అప్పుల దీపం వెలిగిస్తే తిప్పల తిమిరమే కదా మిగిలేది. మంచి భావన. అభినందనలు.
‘లోకము + అప్పుల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పాపపు జగమున నప్పుల’ అందాం. ‘రహదారి సధనము జేయున్’ ... ? ‘రహదారి సంకట మయమౌ’ అందామా?
*
చింతా రామకృష్ణారావు గారూ,
అద్భుతమైన పూరణ. అభినందనలు.
*
రాజారావు గారూ,
మీ మూడు పూరణలూ దేనికదే వైవిధ్యంగా మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
సూర్యదీపం వెలుగగానే రాహుతిమిరం క్రమ్మిందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించుమిరుమిట్లు గొలిపే వెలుగునకు కళ్ళు చీకట్లు క్రమ్మినట్లవుతాయి. మీ పూరణ ఎంతో సహజ సుందరముగా నున్నది.
వివిధ రకముల దీపాలు వెలిగించిన కవి మిత్రులకు అభినందనలు.
దీపము వెలిగించుము చెలి
రిప్లయితొలగించుశాపము నీయకు వలపుల సాదీయనుడన్ !
తాపము పెరిగిన తదుపరి
దీపము వెలిగించి నంత తిమిరము గ్రమ్మెన్ !
సాదీయనుడు = మిక్కిలి మంచివాడు
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించుపాపాత్ములు కౌరవులా
గోపాలుని గట్టనెంచ గోపముతోడన్
ఆపుణ్యాత్ముడు తేజో
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్
{కౌరవులకు మాత్రము]
మాపున వేస్తిని విద్యు-
రిప్లయితొలగించుద్దీపపు స్విచ్ మందిరాన, దిగ్గున పేలెన్
ఠాపని బల్బయ్యయ్యో!
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించుఅందరి పూరణలూ అలరించు చున్నవి !
సీతనే దీపం వెలిగించగానే లంకలో చీకటి ప్రారంభం :
01)
_________________________________
పాపంబని మది నెంచక
పాపాత్ముడు రావణుండు - పరువడి దెచ్చెన్ !
పావనియౌ సీత యనెడి
దీపము వెలిగించినంత - తిమిరము గ్రమ్మెన్ !
_________________________________
పరువడి = తొందరపాటు (తొందరపడి)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుపాపం పాపారావు కళ్ళు :
రిప్లయితొలగించు02)
_________________________________
దీపారాధన జేసిన
దీపము దరి చిచ్చుబుడ్డి - దిగ్గున పేలెన్
దీపావళి ! పాపారావ్
దీపము వెలిగించినంత - తిమిరము గ్రమ్మెన్ !
_________________________________
కౌరవుల చీకట్లకు (వినాశనానికి) కారణ దీపం - వస్త్రాపహరణమే గదా :
రిప్లయితొలగించు03)
_________________________________
ద్వాపరమున రారాజే
దాపరముగ గెల్చి తాను - ధర్మము విడువన్
ద్రౌపది వస్త్రాపహరణ
దీపము వెలిగించినంత - తిమిరము గ్రమ్మెన్ !
_________________________________
దాపరము = మాయ = మోసము
కోపం కూడా దీపమే :
రిప్లయితొలగించుభార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోతే భర్తకు మిగిలేది సంసారంలో చీకట్లే గదా :
04)
_________________________________
చూపుల నిప్పులు గ్రక్కుచు
తా పాదము తన్నె సతిని - ధర్మారావే !
స్త్రీ పోవగ పుట్టింటికి
దీపము వెలిగించినంత - తిమిరము గ్రమ్మెన్ !
_________________________________
స్త్రీ = భార్య
రాజారావు గారూ,
రిప్లయితొలగించువలపు దీపాన్ని వెలిగించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
ద్వంద్వసమాస పూర్వపదంగా పార్వతి శబ్దం దీర్ఘాంతమౌతుంది. ‘శ్రీ పార్వతీ మహేశ్వరులు ..’ అందాం.
*
రాజేశ్వరక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఏదో ఒక ‘తప్పు’ పట్టాలి కదా :-)
అది ‘సాదీయనుడు’ కాదు ... ‘సాధీయసుడు".
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ విశ్వరూప దీపపు పూరణ బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
అద్భుతమైన ఊహ. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
స్విచ్ అని అన్యదేశ్యాన్ని వాడారు కనుక ‘వేస్తిని’ అనే గ్రామ్యప్రయోగం ఓ.కే.
*
వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ దేని కదే అద్భుతం. చాలా మంచి పూరణలు. అభినందనలు.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించుమీ కోపపు దీపం పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించుగురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించుస్విచ్, బల్బు పదాలకు తెలుగు మాటలు తోచలేదు.
వేస్తిని అనే గ్రామ్య పద ప్రయోగాన్ని కూడా గమనించలేదు.
వేయగ అనవచ్చును. ధన్యవాదాలు.
స్విచ్ = మీట
రిప్లయితొలగించుబల్బ్ = దీపం
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఅజ్ఞాత గార్కి ధన్యవాదాలతో
రిప్లయితొలగించుసవరించిన నా పూరణ:
మాపున వేయగ విద్యు-
ద్దీపపు మీటంత లోనె , దిగ్గున పేలెన్
ఠాపని దీపపు కుప్పెయు
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్
దీపము పై"డోముం"డగ
రిప్లయితొలగించుదీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్
దాపున "సీలింగం" తను
పాపము బల్లుల పురుగులు పరుగిడి పోయెన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోపముతో పవరాఫున
రిప్లయితొలగించుపాపాయికి పాలు కలుప వరగలి నందున్;
దాపున నడుగున; హరికెన్
దీపము వెలిగించినంత తిమిరము గ్రమ్మెన్