8, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -452 (రాముఁ డాతఁడు తమ్ముఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రాముఁ డాతఁడు తమ్ముఁడు రావణునకు.

38 కామెంట్‌లు:

  1. శివుని విల్లును విరిచిన జెట్టి యెవడు?
    తోడు వనముకు వచ్చెను వాడె వండు?
    శత్రు వెవ్వరి కాతడు సరిగా చెపుమ ?
    రాముఁ డాతఁడు - తమ్ముఁడు - రావణునకు.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ ! బావుంది !

    01)
    _________________________________

    రాణి కైకేయి కోరిన, - రమణి తోడ
    సౌఖ్యమును వీడి వనముల - సంచరించె
    రాము డాతడు ! - తమ్ముడు రావణునకు
    కుంభకర్ణుడు , రాముచే - కూలెననిని !
    _________________________________

    రిప్లయితొలగించండి
  3. మూడవపాదం లో చిన్న టైపాటు సవరణ

    శత్రు వెవ్వరి కాతడు సరిగ చెపుమ ?

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ప్రశ్నోత్తార రూపంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదాన్ని ‘తోడు వనమున కేతెంచువా డెవండు?‘ అనండి. బాగుంటుంది. ‘వనముకు’ అనరాదు, ‘వనమునకు’ అనాలి కదా!
    *
    వసంత కిశోర్ గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. విమల భక్తిని గొల్చు విభీషణుండు
    రాముఁ, డాతడు తమ్ముడు రావణునకు
    అవనిజను నొసగి దశరథాత్మజుడిని
    బ్రాపు గొనుమని నుడివెను భ్రాత కతడు .

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! ధన్యవాదములు !
    మూర్తీజీ ! భేష్ !

    02)
    _________________________________

    అరుణ తారకు తనయులు - యిరువురరుగొ !
    పెద్ద వాడేమొ క్రూరుడు - పెంకి వాడు !
    పిన్న వాడేమొ సౌమ్యుడు - పిరికి కాడు !
    పిలుచు చుందురు జనులంత - పిల్లవాండ్ర
    రాముఁ డాతఁడు తమ్ముఁడు - రావణునకు !

    _________________________________

    రిప్లయితొలగించండి
  7. కిశోర్ జీ ! ధన్యవాదములు. మంచి విరుపు తో 'విరిచేశారు'.
    మాస్టరు గారూ! శ్రేష్ఠ మైన సవరణకు ధన్యవాదములు. మీ సూచన తో ...

    శివుని విల్లును విరిచిన జెట్టి యెవడు?
    తోడు వనమున కేతెంచె, వాడెవండు?
    శత్రు వెవ్వరి కాతడు? సరిగ చెపుమ.
    రాముఁ డాతఁడు - తమ్ముఁడు - రావణునకు.

    రిప్లయితొలగించండి
  8. కిశోర్ జీ ధన్యవాదములు.మీ యిప్పటి రెండు పూరణలు శాస్త్రి గారి క్రమాలంకార పూరణ బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  9. మూర్తి గారూ! మంచి భావం తో పూరించారు.బాగుంది.
    కానీ .. క్షమించాలి ...
    రాము 'డు' విభక్తి వలన అన్వయం కొంచెం ...

    రిప్లయితొలగించండి
  10. శాస్త్రి గారూ కిట్టించి సవరించాను '

    విమల శీలత మెచ్చు విభీషణునుని
    రాముఁడాతడు ; తమ్ముడు రావణునకు
    హితము బలుకును నొప్పింప మితము లేక
    అవనిజను నొసగ దశరధాత్మజునకు




    శాస్త్రి గారూ కిట్టించి సవరించాను '

    విమల శీలత మెచ్చు విభీషణునుని
    రాముఁడాతడు ; తమ్ముడు రావణునకు
    హితము బలుకును నొప్పింప మితము లేక
    అవనిజను నొసగ దశరధాత్మజునకు

    రిప్లయితొలగించండి
  11. మూర్తి గారూ !' కిట్టించి సవరింఛి ' న పద్యం తో రక్తి కట్టించారు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీగురుభ్యోనమ:

    "సాదు సద్గుణ సౌజన్య సహృదయుండు
    రాముడాతడు" తమ్ముడు రావణునకు
    హితము గోరుచు పల్కెను హితవు లంత
    దునిమె నావిభీషణుని తాన్ దుష్టుడగుచు

    గత 3 దినములుగా నెట్ ప్రాబ్లం వలన బ్లాగ్స్ చూడలేకపోయాను.
    గురుపొజోత్సవం సందర్భంగా గురువుగారికి వందనములను ఆలస్యముగా తెలియజేస్తున్నాను.

    గురువుగారికి,మిత్రులకు వందనములు

    రిప్లయితొలగించండి
  13. 'ధర్మ సంస్థాప నేతెంచె ధరణి హరియు
    రాముఁడాతడు ' ,తమ్ముడు రావణునకు
    దెలియ పఱచెను 'ధరణిజ చెలువ సిరియె
    గాన విడువుము భక్తితో గైలు మోడ్చి !

    రిప్లయితొలగించండి
  14. గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
    విభీషనుడు రావణునికి హితబోద జేసెను గాని వాటిని పెడచెవిని బెట్టి
    మరణించెను అది
    .................................
    అన్య కాంత జెలిమి చేటను సుగుణాల
    రాము డాతడు, తమ్ముడు రావణునకు
    బలు విధముల జెప్పెనుగాని పంతములను
    వీడక గడతేర్చెను లంక వీరులలను|

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రి చెప్పారు...
    శ్రీగురుభ్యోనమ:

    "సాధు సద్గుణ సౌజన్య సహృదయుండు
    రాముడాతడు" తమ్ముడు రావణునకు
    హితము గోరుచు పల్కెను హితవు లంత
    దునిమె నావిభీషణుని తాన్ దుష్టుడగుచు

    గత 3 దినములుగా నెట్ ప్రాబ్లం వలన బ్లాగ్స్ చూడలేకపోయాను.
    గురుపూజోత్సవం సందర్భంగా గురువుగారికి వందనములను ఆలస్యముగా తెలియజేస్తున్నాను.

    గురువుగారికి,మిత్రులకు వందనములు

    రిప్లయితొలగించండి
  16. చంద్రశేఖర్:
    కుండ చెవుల జోదుడతడు బండి చక్ర
    మంటి కన్నులున్న బల్ మచ్చరీడు
    పోరు సల్పె భయంక రాకారు డగ్గి
    రాముఁ డాతఁడు తమ్ముఁడు రావణునకు!
    ఎవరో చెప్పుకోండి చూద్దాం:-)

    రిప్లయితొలగించండి
  17. Pandita Nemani గారి పూరణ ....

    రాముని హితుండు ధర్మ విభ్రాజితుడు వి
    భీషణుం డజవంశ విభూషణుండు
    మాన్య గుణ శీలుడును సరమా మనోభి
    రాముడాతడు తమ్ముడు రావణునకు

    రిప్లయితొలగించండి
  18. రెండవ పాదంలో టైపాటు సరిదిద్ది:
    కుండ చెవుల జోదుడతడు బండి చక్ర
    మంటి కన్నులున్నట్టి బల్ మచ్చరీడు
    పోరు సల్పె భయంక రాకారు డగ్గి
    రాముఁ డాతఁడు తమ్ముఁడు రావణునకు!
    ఎవరో చెప్పుకోండి చూద్దాం:-)

    రిప్లయితొలగించండి
  19. నా పూరణ ....

    విష్ణువే రాఘవుఁ డని విభీషణుండు
    సీతఁ దెచ్చుట లంకకుఁ జేటు; రాము
    శరణు కోరుటె హితమనె సద్గుణాభి
    రాముఁ డాతఁడు తమ్ముఁడు రావణునకు.

    రిప్లయితొలగించండి
  20. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి విరుపుతో మొదటి పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘విభీషణునుని’ అన్నచోట ‘ను, ని’ అని రెండు ప్రత్యయాలు వస్తున్నాయి. అక్కడ ‘విభీషణాఖ్యు’ అందాం.
    రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది.
    కాని ‘'ధర్మ సంస్థాప నేతెంచె ధరణి హరియు’ కొంత గజిబిజిగా ఉంది. ‘'ధర్మ సంస్థాపనకు వచ్చె ధరణి హరియు’ అందామా?
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండవ పూరణలోని అరుణతార పిల్లల భావన ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    సంతోషం!
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    కాని రావణుడు విభీషణుని ‘తునిమె’ అనే అర్థం వస్తుంది ...?
    ‘........... హితవు లంత
    ద్రోసె నావిభీషణుని .... ’ అందాం.

    రిప్లయితొలగించండి
  21. వరప్రసాద్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది. ‘అన్య కాంతల చెలిమి చేటనెడి సుగుణ’ అంటే సరి!
    *
    చంద్రశేఖర్ గారూ,
    కుంభకర్ణుణ్ణి అగ్గిరాముడిగా చేసిన మీ నైపుణ్యం కొనియాడదగింది. చక్కని పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని గారూ.
    మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. జ్ఞాన పూర్ణ విభీషణుఁ ఘనత వేరు.
    మాన మర్యాద లెఱిగిన మహితుఁడతఁడు.
    సౌమ్య సద్భావ సంపూర్ణ సద్గుణాభి
    రాముఁ డాతఁడు తమ్ముఁడు రావణునకు.

    రిప్లయితొలగించండి
  23. మొదటి పాదంలో అరసున్నా పొరపాటున పడిన టైపాటు. మన్ననీయము.

    రిప్లయితొలగించండి
  24. రామలీల మైదానము రక్తిగట్ట
    విజయదశమిన వెలిసెనువిగ్రహాలు
    రాముడాతడు, తమ్ముడు,రావణునికి
    చెంతనే కుంభ కర్ణుండు వింతగొలిపె!!!

    రిప్లయితొలగించండి
  25. పెద్దల, మిత్రుల పూరణలన్నీ మనోహరంగా అలరిస్తున్నాయి.

    రాక్షసుండయ్యు గ్రహియించె రామ తత్త్వ-
    మతడు, భంగమ్ము నొందెను హితవు పల్కి,
    శరణ మిచ్చెను వానికి ధరణిజ పతి
    రాముఁ, డాతఁడు తమ్ముఁడు రావణునకు.

    రిప్లయితొలగించండి
  26. రామ చంద్రుని శరణు గోరంగ వెడలె
    నా విభీషణుడరయ ధర్మాను సారి
    రాక్షస మ్మెరుగని భాసుర సుగుణాభి
    రాము డాతడు తమ్ముడు రావణునకు

    రిప్లయితొలగించండి
  27. "శరణు కోరిన వారికి సదయుడతడు,
    రాముడాతడు" తమ్ముడు రావణునకు
    పలువిధమ్ముల హితవులఁ బలుకుచుండె
    చెవిని శంఖపు నాదము చెవిటి వినునె?

    రిప్లయితొలగించండి
  28. అందమైన అందరి పూరణల మధ్య ఎలాగైనా " కిట్టిద్దామంటే " ప్చ్ ! అబ్బే ! లాభం లేదు. అందుకే తమ్ముడికి రెస్టు

    రిప్లయితొలగించండి
  29. గురువుగారూ ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  30. పదము లంటిన చాలును పరమ పధము
    వరము లీయగ నతనికి పరమ హితము
    భక్తు లందరి పాలిట రక్తి మీర
    రాముఁడాతఁడు తమ్ముఁడు రావణునకు !

    " excuse me tammudu "

    రిప్లయితొలగించండి
  31. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    03)
    _________________________________

    వీరు వంశజు డాతడు - వీర వరుడు !
    వింతగా జూడ మిథిలను - విబుధ వరులు
    విల్లు విరిచెను హరునిది - విక్రమమున !
    విమలయౌ సీత చేపట్టె - వేడుకలర !

    వీర దశరథు నానతి - వీడి పురిని
    విభుడు విజయము చేసెను - విపినములకు
    విజయుడై కూల్చెను కబంధు- వికృత రూపు
    విశ్వ శాంతిని నెలకొల్ప - వినయ శీలి !

    విజయ ధ్వానాలు జేయగ - విబుధులంత
    వింత ఖరదూషణాదుల - వేటు వేసె !
    విహరణము జేయ దొడగెను - విపినమందు
    వీతరాగుల ,పుణ్యుల - వీక్షణమున !

    రాముడట లేని సమయాన - రావణుండు
    రాక్షసంబుగ మ్రుచ్చిలె - రమణి సీత !
    రామకార్యము నెఱవేర్చ - లంక జేరె
    రామ భక్తుడు హనుమయె - రాజసముగ !

    రామ భక్తుడు జెప్పెను - రావణునకు
    రాము గెలువగ నేరవు - రణమునందు !
    రమణి సీతను గొనిపోయి - రాము కిమ్ము
    రణము మరణము దప్పును - రాక్షసులకు !

    రాయబారి మాటలు విని - రావణుండు
    రచ్చజేసిన హనుమాను - హెచ్చరించి
    రామ సేవకు తోకను - రగుల జేసి
    రామ బంటును హింసించె - రాక్షసముగ !

    "రాము డిల నడయాడు, నా - రాయణుండు
    రక్ష గోరిన రక్షించు - రమ్య గుణుడు
    రాముడాతడు" , తమ్ముడు - రావణునకు
    రామ మహిమను దెల్పెను - రాగమొదవ !

    రయము పొమ్మని పోద్రోసె - రక్కసీడు
    రాక్షసముగ విభీషణు - రాము కడకు !
    రాము డేతెంచె లంకకు - రాజసముగ
    రావణాసురు వధియించి - రమణి బ్రోచె !

    రజత హృదయు విభీషణు - రాజు జేసి
    రమణి ,రాణువ సహితము - రాజధాని
    రాము డంతట జేరి , భ - రతుని గాచి
    రాజ్య పాలన గావించె - రమ్య ముగను !

    _________________________________

    రిప్లయితొలగించండి
  32. కిశోర్ జీ!' వీ' ర ' ప్రయోగం చేశారండీ ! ( మీ పద్య పాదాదులందు మొదటి అక్షరం'వీ - ర ' మాత్రమె వున్నాయి ) సగం రామాయణాన్ని తేటగీతి లో తేటతెల్లం చేశారు. ఉషోదయానికి ముందు రామ కథా రచన చేసిన అదృష్ట వంతులు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. చింతా రామకృష్ణారావు గారూ,
    ఎప్పటిలాగే అద్భుతమైన పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    వైవిధ్యమైన పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజారావు గారూ,
    మనోజ్ఞమైన పూరణ మీది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    శ్రేష్ఠమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరక్కయ్యా,
    కిట్టించే ప్రయత్నం చేసారు. బాగుంది.
    కాని సమస్యపాదానికి అన్వయం ...?
    *
    వసంత కిశోరా,
    ఉదయాన్నే రామకథాపఠన పుణ్యఫలం దక్కింపజేసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. అద్భుతం కిశోర్ జీ రామ కధా గానము అత్యద్భుతము.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  35. రామకథాగానము
    అమృతపానము
    అభినందనలు వసంతకిశోర్ గారూ!
    మిత్రులందరి పూరణలూ అలరించాయి. అందరికీ నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !
    మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !
    మూర్తీజీ ! ధన్యవాదములు !
    మందాకినిగారూ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి