అబద్ధం!
మొన్న సూర్యరాయాంధ్ర నిఘంటువును టైపు చేస్తుండగా ‘ఆబద్ధము’ శబ్దానికి అర్థాలకు ఉదాహరణగా క్రింది చాటుశ్లోకం కనిపించింది.యావజ్జీవ మహం మౌనీ, బ్రహ్మచారీ తు మే పితా |
మాతా తు మమ వంధ్యాసీ, దపుత్త్రశ్చ పితామహః ||
తాత్పర్యం ...
నేను యావజ్జీవం సన్యాసిని. నా తండి బ్రహ్మచారి. నా తల్లి గొడ్రాలు. మా తాత పుత్త్రసంతానం లేనివాడు.
దీనికి నా అనువాదం ...
ఆ. వె.
గడపినాఁడ మౌనిగా నా బ్రతుకును నా
తండ్రి బ్రహ్మచారి, తల్లి గొడ్డు
రాలుగా ప్రసిద్ధు లాలకింపుఁడు పితా
మహుఁ డపుత్త్రకుండు మా కులమున.
కవి మిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.
గొడ్డు వోలెను ' కని' తల్లి గోప్య ముగను
రిప్లయితొలగించండిపారవేయగ నొక నాడు బాట ప్రక్క
ప్రేమ మీరగ ' కని' తెచ్చి పెద్ద జేయ
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె.
శంకరార్యా " దపుత్రశ్చ " అంటే అర్థం " నపుత్రశ్చ " అనేనా ?
రిప్లయితొలగించండివసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండివంధ్యా+ఆసీత్+ అపుత్రశ్చ అని .
మందాకిని గారూ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ !బావుంది !
01)
_________________________________
అన్ని మూర్తుల నాతండు - నమ్మ జూచు
అడ్డు గోడలు లేవంచు - నాదరించు
ఆడ తనమున గాంచును - అమ్మ తనము !
ఆదరించును యందరి - నమ్మ వోలె !
గొడ్డురాలైన తల్లికిఁ - గొడుకు మ్రొక్కె !
_________________________________
మూర్తి = స్త్రీమూర్తి
రోడ్డు ప్రక్కన సొగసైన బిడ్డ దొరికె
రిప్లయితొలగించండిదైవ మిచ్చిన వరమంచు దత్తు డనుచు
ముద్దు గా పెంచి యాతని పెద్ద జేయ
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !
తల్లి మనసుండు నందురు తరుణికెపుడు
రిప్లయితొలగించండిపిల్ల వాండ్రనుఁ గనకున్న పెద్ద లోటు
కనుల కన్నట్టి పిల్లలఁ గరుణఁజూపఁ,
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె
గురువు గారికి మిత్రులకు ధన్యవాదములు. ఒక ప్రాణ స్నేహితుని కుమార్తె వివాహమునకు వెళ్ళి వస్తున్నాను. కంప్యూటరు అందుబాటులో లేదు,స్నేహితులతో హడావుడి.అయినా ఐ ఫోను ద్వారా మిత్రుల పూరణలు చదివి ఆనందిస్తూనే ఉన్నాను. శ్రీ పండిత నేమాని వారు బ్లాగులో పాల్గొనడము ముదావహము.
రిప్లయితొలగించండిశ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు ,కిశోర్ జీ, మందాకిని గారు, రాజేశ్వరి అక్కయ్య గారు చక్కని పూరణలు చేసారు.
రిప్లయితొలగించండివిద్య గఱపిన గురువిల వేల్పు గాదె
రిప్లయితొలగించండినాదృతి నన్న మొసగు నామె యమ్మ గాదె
కాన్పు నీయకె మాతృక కరుణ జూప
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె !
విద్య గఱపిన గురువిల వేల్పు గాదె
రిప్లయితొలగించండినాదృతి నన్న మొసగు నామె యమ్మ గాదె
కాన్పు నిడకనె మాతృక కరుణ జూప
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె !
ఈయు వ్యావహారికము గదా అందుకు సవరించాను.
కనుల కన్నంతఁ గొడుకుగఁ గరుణఁజూపఁ
రిప్లయితొలగించండిమూడవ పాదం ఇలా మారిస్తే అన్వయం బాగుంటుందనుకుంటున్నాను.
అందరిపూరణలూ అలరించాయి. మూర్తిగారు, ధన్యవాదాలు.
దొడ్డ మనసుతో ,దొరికిన బిడ్డ నైన
రిప్లయితొలగించండినాదరముతోడ ప్రేమతో హాయిగూర్చి
బెంచి పోషించి మమతను పంచినట్టి
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !!!
పండిత నేమాని గారి వ్యాఖ్య ...
రిప్లయితొలగించండిఅయ్యా: అబద్ధం సందర్భములో ఒక డైలాగు వినండి:
"ధర్మరాజు తమ్ముడు కుంభకర్ణుడు దమయంతిని ఎత్తుకుపోతే హనుమంతుడికి కోపము
వచ్చి పాతాళ లోకానికి ఎగిరి బ్రహ్మ ముక్కు పట్టుకొని కీ తిప్పేడుట"
(మూలము తెలియదు - చిన్నప్పుడు విన్నది).
పెంచి పెద్దజేసిన తల్లి ప్రియము - కన్న
రిప్లయితొలగించండితల్లి కన్న - లోకమునందు - తనను గనియు
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె
తనను జూడంగ రావల దనుచు జెప్పి
పండిత నేమాని గారి పూరణ ....
రిప్లయితొలగించండిపిల్లలే లేని జన్మంబు వృధ యటంచు
వగచు భక్తురాలికి భగవంతుడొక్క
స్వప్నమున బిడ్డడై యార్తి బాపి బ్రోచె
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
అడవాళ్ళను ‘అమ్మల్లాగా’ చూచిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరక్కయ్యా,
ఒప్పుగ నిర్దోషంబుగ
రప్పించితె నేదునూరి రాజేశ్వరి! యీ
గొప్పనగు పూరణంబును
తప్పొక్కటి గాననైతి ధన్యుఁడ నైతిన్.
*
మందాకిని గారూ
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
సంతోషం!
మ్రొక్కఁ దగినట్టి వారలఁ జక్కఁ జెప్పి
నను ద్వితీయపాదమునందు గణము దప్పె
‘నాదృతిని నన్న మిడు నామె యమ్మ గాదె"
యనిన నిర్దోషపూరణం బగును; గన్న
వరపు నరసింహ మూర్తి! శుభంబు నీకు!
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
రాజారావు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
పండిత నేమాని గారూ,
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
గురువు గారూ ధన్యవాదములు. ప్రయాణమపు బడలిక,నిద్రమత్తు అంతే!చంద్రభాసురము గాదు !
రిప్లయితొలగించండిపండితులు ,సరస్వతీ పుత్రులు ,శతావధానులు , మీ అందరి మధ్య " నా పేరు " ఓహో ! అదృష్టము నాది. నన్నింత గా ప్రోత్స హిస్తున్న మీ అందరికి కృతజ్ఞతాభి వందనములు [ గురువులు గా ]
రిప్లయితొలగించండిడా. మూర్తి మిత్రమా! మీరు చంద్రభాసురం లేకుండానే "గుఱ్ఱ౦" ఎక్కగల సమర్ధులని మేమెరుగుదుము, సార్ :-)
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిఘ్నపతి మ్రొక్క గిరిజకు, "వింత యిదియె
రిప్లయితొలగించండిగర్భమే రాని గౌరికి కలిగె సుతులు
గొడ్డురాలైన తల్లికిఁ గొడుకు మ్రొక్కె"
ననుచు మిగుల పరిహసించె నబ్ధి సుతుఁడు!!
అబ్ధి సుతుఁడు = చంద్రుఁడు
మిత్రులందరిపూరణలూ ముచ్చటగా నున్నవి !
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
బండ చాకిరి చేయుచు గండదివ్వె
రిప్లయితొలగించండిమాదిరి సదా తనకడుపు మంట మరచి
పట్టె డన్నము పెట్టను మట్టి మోసి
జీవితమును చాలించిన శీలవతికి
గొడ్డు, రాలైన, తల్లికిఁ గొడుకు మ్రొక్కె!