27, సెప్టెంబర్ 2011, మంగళవారం

పండిత నేమాని వారి శుభాశీస్సులు!

‘శంకరాభరణం’
సభ్యులగు కవి మిత్రులందరికి
శుభాశీస్సులు.

మీ సౌహార్దమయాభినందనలకున్ మీ సద్గుణ శ్రేణికిన్
మీ సాహిత్య విహార తత్పరతకున్ మీ భావ వైచిత్రికిన్
నే సంతోషమునొంది కూర్తు నివియే స్నిగ్ధ ప్రశంసల్ వచ
శ్శ్రీసంపన్నులరైన మీకు బహుధా శ్రేయమ్ములన్ గోరుచున్

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

4 కామెంట్‌లు:

 1. మేలగు ! 'శంకరాభరణ 'మిత్రులు ,ప్రేక్షకు ,లెల్లవారికిన్
  శ్రీలలితా పరాత్పర విశేష శరన్నవ రాత్రి వేడుకన్
  దేలి , త్రిమూర్తి మాతృ పద దీప్తుల దీవెన లంది , మీరు - మీ
  పాలి కుటుంబ సభ్యలును, బంధు జనమ్ము శుభమ్ము బొందెడిన్!

  రిప్లయితొలగించండి
 2. వినుతింతున్ సుకవిత్వలేఖనకళావిఖ్యాతు, శ్రీపార్వతీ
  శ నిజాంఘ్రిద్వయలగ్నచిత్తుని, సమస్యాపూరణస్థావధా
  న నటజ్జిహ్వుని, రామకావ్యకరణానందున్, సుహృన్మోదవా
  క్కును, నేమాని కులాబ్ధిచంద్రుని, సదాకోదండరామాశ్రితున్.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ నేమాని సుధాబ్ధి చంద్రునకు , రాశీ భూత సాహిత్య వి
  ద్యా నానా ద్భుత రామ కావ్య ఘటనా ధన్యాత్ముకున్ , సంతత
  జ్ఞానాదిత్యునకున్ , నిగర్వికి ప్రణామంబుల్ సమర్పింతు - మే
  మానందించితి మయ్య ! మీరు దయతో నాశీస్సు లంధించగన్

  రిప్లయితొలగించండి
 4. అందరకు ! నవరాత్రి శుభా కాంక్షలు.
  ‘శంకరాభరణం’ సభ్యులగు కవి మిత్రులందరికి
  శుభాశీస్సులు అంద జేసిన శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి