29, సెప్టెంబర్ 2011, గురువారం

పండిత నేమాని వారి ఆశీస్సులు - 2

విద్యాశీస్సులు

దరహాసైందవ శోభితాస్యయగు విద్యాదేవి కావించుచున్
వరవీణామృదు నిక్వణ ప్రతతులన్ వాత్సల్య పూర్ణాత్మయై
పరమార్థమ్ములు కూర్చు నాశిషములన్ వర్షించుచుండెన్ సమా
దర రీతిన్ గొని తద్రసమ్ము నమితోత్సాహాన సేవింపమే!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

4 కామెంట్‌లు:

  1. లక్కాకుల వెంకట రాజారావు గారి వ్యాఖ్య ....

    పరమానందము గూర్చె మాకు గడు మీ పద్యామృతాశీస్సులన్
    వర వీణాధరి దృష్ఠి మాపయి బడన్ వాంఛంచు మీ మానసాం
    బురుహంబెంత మనోజ్ఞమో గద ! తవ స్ఫూర్తిన్ శుభాశీస్సు లం
    దరకున్ దెల్పుదు ' శంకరాభరణ ' మం దార్యుల్ వినోదింపగా

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

    శ్రీ రాజారావు గారి అభినందన పద్యము 3వ పాదములో "తవ స్ఫూర్తిన్" అని వాడేరు. నాకు సరిగా చెప్పడము రాదు గాని "తవ" అనే సంస్కృత పదమును విడిగా వాడుట నేను చూడలేదు. "తావక స్ఫూర్తి" అంటే ప్రయోగము సాధువు అనుకుంటాను. ఇక్కడ పద్యములో గణాలు సరిపోవుటకు గాను "భవత్ స్ఫూర్తి" అన వచ్చును.

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

    అందరకూ కొన్నిసూచనలు:
    అయ్యా! శుభాశీస్సులు.
    తవ, మమ, మొదలగు సంస్కృత పదములను తెలుగులో యథా తథముగా వాడరాదు అని నాకు జ్ఞాపకము. తావక (త్వత్, త్వదీయ, భవత్, భవదీయ), మామక(మత్, మదీయ) అని వాడవచ్చును. తవ అని ఒకరు వాడుట చూచేను. అందుకే ఈ విధముగా వ్రాస్తున్నాను. సెలవు.

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    రాజారావు గారు ఆ పద్యాన్ని నాకు మెయిల్ చేసారు. దానిని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసాను. నిజానికి వారు అక్కడ వ్రాసింది ‘తమ స్ఫూర్తిన్’. కాపీ పేస్ట్ లో ఏదో పొరపాటు జరిగి అది ‘తవ’ అని మారింది. అక్కడ ‘తమ’ అన్నా దోషమే అనుకోండి. మీ రన్నట్లు ‘భవత్ స్ఫూర్తి’ ఉత్తమమైన సవరణ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి