11, సెప్టెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -455 (గణమే త్రుంచెను శంభుచాపమును)

వారాంతపు సమస్యా పూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ....
"గణమే త్రుంచెను శంభుచాపమును శ్రీ
రాముండు చేఁబూనఁగా"
(గమనిక - యతిలో కూడ సమస్య ఉన్నది. పాదాద్యక్షరం సంయుక్తాక్షరమైతేనే యతిమైత్రి చెల్లుతుంది)
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, సెప్టెంబర్ 11, 2011 10:28:00 AM

    గురువు గారూ,

    సాహసం చేస్తున్నాను. తప్పైతే క్షమించి సూచించగలరు.

    గణనీయంబగు యాగరక్షణమహాకార్యంబుకున్ రామల
    క్ష్మణ వీరుల్ చన, తాటకీ శిరమునున్ మాన్యంబు శ్రీరామ మా
    గ్రణమే త్రుంచెను, శంభుచాపమును శ్రీరాముండు చేబూనగా
    హ్రణియాలంకృతసీత రాముని గనెన్ హర్షాతిరేకంబునన్.

    మాగ్రణము = బాణము
    హ్రణియాలంకృత = సిగ్గుతోనలంకరించబడిన

    రిప్లయితొలగించండి
  2. సంపత్ కుమార్ శాస్త్రి గారూ అద్భుతమైన పూరణ నిచ్చారు. అందుకోండి అభినందనలు.

    గణముల్ పూర్తిగ నేర్వ నైతి నకటా కష్టమ్ముగా నుండుటన్,
    వణకౌ ప్ర్రాసను గూర్చి లక్షణముగా పద్యమ్ము వ్రాయంగ, నో
    రణమే నాకగు నెన్నగా వళుల నౌరా! యెట్లు పూరించుట-
    "ల్గణమే త్రుంచెను శంభుచాపమును శ్రీరాముండు చేఁబూనఁగా"

    రిప్లయితొలగించండి
  3. జనకుండానతి సేయ రాఘవుడు విశ్వామిత్ర యజ్ఞోప ర
    క్షణ కున్ బూనుట తోడనే బరచె బ్రాకారమ్ములన్ రామ మా
    ర్గణమే - త్రుంచెను శంభు చాపమును శ్రీరాముండు - చేబూనగా
    గొని వేసెన్ వరమాల సీత తన సిగ్గుల్ మొగ్గలై పూయగా

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని గారి పూరణ ....

    క్షణమాత్రంబును జాగుసేయకయె పుష్పాస్త్రుండు ఫాలానలే
    క్షణుపై కక్షను దీర్పగా దలచి ఉత్సాహంబుతో వేయ మా
    ర్గణమున్ మంగళ సూచకమ్మగుచు నా కందర్ప కంజాత మా
    ర్గణమే త్రుంచెను శంభుచాపమును శ్రీరాముండు చేబూనుడున్

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా !
    నే నాకళింపు జేసుకో లేకున్నాను గాన
    వివరణతో పండిత నేమాని గారి పూరణను దయతో కొంచెం విశదీకరిస్తారా !

    రిప్లయితొలగించండి
  6. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
    టైపాటు వల్ల ‘మార్గణమే’ అనేది ‘మాగ్రణమే’ అయినట్టుంది.
    *
    మిస్సన్న గారూ,
    భలేగా తప్పించుకున్నారే! బాగుంది మీ పూరణ. అభినందనలు.
    పూరణ అసాధ్య మనుకున్నప్పుడు ఇదే గత్యంతరం లేని పద్ధతి. బాగుంది. మిత్రులకో క్రొత్త దారి చూపించారు.
    *
    రాజారావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని గారూ,
    వసంత కిశోర్ గారి సందేహం గమనించారా?
    మీరు ‘మార్గణము’ శబ్దాన్ని పూరణలో రెండుసార్లు ప్రయోగించారు. మార్గణము శబ్దానికి ‘యాచించుట, వెదకుట, బాణము, ఐదు అనే సంఖ్యకు సంకేతం, ఒక విధమైన ధనుస్సు’ అనే అర్థాలున్నాయి. మీరు ప్రయోగించిన మొదటి మార్గణ పదానికి మన్మథుని పంచబాణాలు అనీ, రెండవ దానికి పంచబాణాలలో ఒకటైన ‘అరవింద పుష్పబాణం’ అనీ అర్థం చెప్పుకున్నా భావం ఇబ్బంది పెడుతున్నది. దయచేసి ‘వివరణ’ ఇస్తే నాకూ, కవిమిత్రులకు మీ పూరణలోని కవితామాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశం దొరుకుతుంది. అన్యధా భావించకండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    పండిత నేమాని వారు విద్వన్మూర్తులు. వారి పూరణ విశేషార్థపూరితమే కాని దానిని అవగాహన చేసికొనే స్థాయి నాకు లేదు. వారి వివరణకోసం ఎదురు చూద్దాం.

    రిప్లయితొలగించండి
  7. ఫణినాథుండగు శంకరున్ మనమునన్ భావించి సేవించి, మా
    ర్గణమై నాయెడ రాముడాక్షణము వీరావేశముల్ చూపె, మా
    ర్గణమే త్రుంచెను శంభుచాపమును; శ్రీరాముండు చేఁబూనఁగా
    రణధీరుండగు వానికింపొసగ నా రాపుత్రి యుం నిల్చెనే.

    రిప్లయితొలగించండి
  8. గురువుగారూ ధన్యవాదాలు. ఏం చేయను పూరణ నాకు జటిలమనిపించింది.
    కానీ పండిత నేమాని వారు దీనికి సమ్మతించరని నేనను కొంటు న్నాను.
    అంటే అలా తప్పించుకోవడం పధ్ధతి కాదు అంటారని.

    రిప్లయితొలగించండి
  9. ఘన నీలాంబర దేహుడే నిలచియా గాధేయుకున్ మ్రొక్కియున్
    విని దిగ్దంతులు సవ్వడిన్ వణుకగా భీతిల్ల గా దిక్పతి
    ర్గణమే, త్రుంచెను శంభుచాపమును శ్రీరాముండు; చేఁబూనఁగా
    వనజాక్షిన్ చెయి పట్టి చేరు కొనగా వైభోగ ముప్పొంగెగా !

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారి వ్యాఖ్య ....

    మత్తకోకిల.
    భారతీ వరివస్య జేయుచు వాగ్విభూషణ మూర్తివై
    చేరదీయుచు సాహితీప్రియ చిత్తులన్ రసవత్తమో
    దార ప్రక్రియలన్ బొనర్చుచు తన్మయత్వమునొందునో
    సార"ధీ" నిను ప్రస్తుతించెద శంకరయ్య మహాశయా!

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని ‘దిక్పతిర్గణము ..’ ?

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

    అయ్యా! ఈ పూరణలో నా భావమును వినండి.
    మదనారి(శివుడు) పై శంబరారికి (మన్మధుడు) కక్ష గలదని ఊహించేను. ఆ కక్ష తీర్చుకొనుటకు అవకాశముగా శివుని ధనుస్సునైనా భగ్నము చేద్దామనుకున్నాడు. రాముని చేతిలో శివుని ధనుస్సును చూచి అదే అవకాశముగా భావించి దానిపై బాణము వేసేడు. ఆ విధముగనే నా పూరణ ఉన్నదని నా భావము. దానిని సవరించవలసి వస్తే మీరు ఏ సలహా ఇచ్చినా తప్పక పాటిస్తాను

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గారూ,
    ధన్యవాదాలు. ఇప్పుడు సందేహనివృత్తి జరిగింది.

    రిప్లయితొలగించండి
  14. శివుని మీది కక్ష సింగాణిపై తీర్చుకున్నాడన్నమాట !
    పండిత నేమానిగారూ ! ధన్యవాదములు మరియూ అభినందనలు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారి పూరణ .....

    అనలంబా యను రీతి వెల్గు, సుమనో - కారున్‌ , మహావీరునిన్
    ముని కూడా నరుదెంచు నా సుగుణ , రా - మున్‌ గాంచి , ప్రేమంబు, ధా
    రుణిజౌ సీతయె ,గన్నులన్విడుచు , నా - లోకంబులే వాడి మా
    ర్గణమై(మే) త్రుంచెను శంభు చాపమును శ్రీ- రాముండు చేబూనగా !

    రిప్లయితొలగించండి
  16. మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘రాపుత్రి’.. ‘రాపట్టి’ అయితే?
    *
    వసంత కిశోర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘మునికూడా’ అనే వ్యావహారిక రూపం స్థానంలో ‘ముని తోడై’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  17. వసంత కిశోర్ గారూ,
    ‘మునితోడై’ అంటే తరువాతి ‘నరుదెంచు’ను ‘యరుదెంచు’ అని సవరించాలి.

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ, ధన్యవాదములు.
    గుర్తు చేయటానికి మొహమాట పడి ఊరుకున్నాను.
    అయినా గమనించి వ్యాఖ్యానించినందుకు సంతోషం కలిగింది. రాపట్టి బాగుంది. రా కు పట్టికి పొంతన చక్కగా కుదురుతుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. మందాకిని గారూ,
    మొహమాటం వద్దండీ. ఇంతకు ముందే చెప్పాను. బ్లాగు నిర్వహణను ఉద్యోగనిర్వఃహణగా భావిస్తున్నాను. విధినిర్వహణలో లోటు, అలసత ఉంటే మీరు ‘దబాయించి’ అడగవచ్చు.

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా ! ధన్యవాదములు ! ఇప్పుడు చూడండి !

    1అ)
    _______________________________________________

    అనలంబా యను రీతి వెల్గు, సుమనో - కారున్‌ , మహావీరునిన్
    ముని వెంటన్నరుదెంచు నా సుగుణ రా - మున్‌ గాంచి ప్రేమంబు,ధా
    రుణిజౌ సీతయె ,గన్నులన్విడుచు , నా - లోకంబులే వాడి మా
    ర్గణమై(మే) త్రుంచెను శంభు చాపమును శ్రీ - రాముండు చేబూనగా !
    _______________________________________________

    రిప్లయితొలగించండి
  21. ప్రణతుల్ నిచ్చుచు నాంధ్రభారతిని నే ప్రార్ధించి శోధింపగా
    సణుగుల్ తోడను గోపనంపు యతులన్ సంధించి బంధించుటన్
    గణనీయమ్మగు రామభద్రు భుజమున్ గారాబుగా జూచు మా
    ర్గణమే త్రుంచెను శంభుచాపమును శ్రీ
    రాముండు చేఁబూనఁగా

    మార్గణము = బాణము

    రిప్లయితొలగించండి