కవిమిత్రులారా, నే ననుకున్నట్టే అందరూ ‘గురజాడ జాడనే’ పట్టారు. సంతోషం! * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘దేశప్రేమ’ అన్నప్పుడు ‘శ’ గురువై గణదోషం వస్తుంది. అక్కడ ‘దేశభక్తి’ అంటే సరి! * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, నేను రెండు జాడలిస్తే బదులుగా నాకు (5+2) ఏడు జాడలిచ్చారు. సంతోషం. మంచి పూరణ. అభినందనలు. * రాజారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * పండిత నేమాని గారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * చింతా రామకృష్ణారావు గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
శ్రీపతి శాస్త్రి గారు పూర్ణమను గుర్తు చేసినాక నేనూ తలచుకోకుండా ఉండలేక పోయాను. "నలుగురు కూర్చుని నవ్వేవేళల నా పేరొకతరి తలవండి" అని చెప్పిన చిట్టితల్లిని మరువగలమా!
వసంత కిశోర్ గారూ, సీత జాడ చూపిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. * మందాకిని గారూ, సవరించకున్నా బాగుంది. సవరించింది ఇంకా బాగుంది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * రాజేశ్వరక్కయ్యా, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. కాకుంటే ... మొదటి పూరణలో ‘ముత్యాలసరము గుర’ అన్నప్పుడు, రెండవపూరణలో ‘వెన్నెల్లోన’ అన్నప్పుడు గణదోషం. వీలైతే సాయంత్రం వరకు సవరిస్తాను. కాస్త ‘అర్జంటు’ పని మీద వెళ్తున్నా.
దేశ ప్రేమ గలిగి , దేశ మన్నను మట్టి
రిప్లయితొలగించండికాదు మనుషు లనుచు, కండ గలిగి
మంచి నెపుడు పెంచు మన్నట్టి మన గుర
జాడ చూపినట్టి జాడఁ గనుఁడు.
నలుగు రాడు తెనుఁగు నలువ రాణియు మెచ్చు
రిప్లయితొలగించండినవ్య రీతు లందు భవ్య మగును
వ్యావహారికాంధ్రభాష గురుఁడు గుర
జాడ చూపి నట్టి జాఁడ గనుఁడు
నలుగు రాడు తెనుఁగు నలువ రాణియు మెచ్చు
రిప్లయితొలగించండినవ్య రీతు లందు భవ్య మగును
వ్యావహారికాంధ్రభాష గురుఁడు గుర
జాడ చూపి నట్టి జాఁడఁ గనుఁడు
మట్టి జాడ జూపె మనిషిజాడను జూపె
రిప్లయితొలగించండిదేశ భక్తి జాడ , దేహ శక్తి
జాడ, మంచిచెడుల జాడజూపెను,గుర
జాడ చూపి నట్టి జాఁడఁ గనుఁడు !!!
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిపలు రకముల " జాడ" లతో శోబిల్లుతున్నదండీ మీపద్యం.
ధన్యవాదములు.
పదుగు రాడు ' మాట ' ' పాటి ' యై ధర జెల్లు
రిప్లయితొలగించండినేర ! పండితుండ ! మార వేమి ?
మార్పు సహజ మనుచు మహనీయు డా ' గుర
జాడ ' జూపి నట్టి జాడ( గనవ ?)గనుడు !
పండిత నేమాని గారి పూరణ ....
రిప్లయితొలగించండిసత్పురుషుల యడుగు జాడల నేగుట
సర్వ సౌఖ్యదమును సత్ఫలదము
వరగుణుండు దేశ భక్తుడునగు గుర
జాడ జూపినట్టి జాడ గనుడు
పాడ తగిన కవిత పద్యమట్టుల వ్రాసి,
రిప్లయితొలగించండిప్రజల కవిత యనుచు ప్రబల చేయ
రాయవరము సుకవి ప్రకటించె నా గుర
జాడ చూపినట్టి జాడఁ గనుఁడు.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినే ననుకున్నట్టే అందరూ ‘గురజాడ జాడనే’ పట్టారు. సంతోషం!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘దేశప్రేమ’ అన్నప్పుడు ‘శ’ గురువై గణదోషం వస్తుంది. అక్కడ ‘దేశభక్తి’ అంటే సరి!
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
నేను రెండు జాడలిస్తే బదులుగా నాకు (5+2) ఏడు జాడలిచ్చారు. సంతోషం. మంచి పూరణ. అభినందనలు.
*
రాజారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
నా పూరణలు ....
రిప్లయితొలగించండి(1)
చేరి సరసి చెంత నీరమందు ప్రతిబిం
బించు రూపుఁ గాంచి ప్రియుఁడు నవ్వి
యతివ వదనబింబ మనఁగ నీటను నెలరా
జాడ చూపినట్టి జాడఁ గనుఁడు.
(2)
జనుల భాషలోన సాగు కన్యాశుల్క
నాటకంబు వ్రాసి నాటి దుష్ట
సంప్రదాయములను చండించె నా గుర
జాడ చూపినట్టి జాడఁ గనుఁడు.
గురువు గారికి ధన్య వాదాలు .
రిప్లయితొలగించండిసంపత్ కుమార శాస్త్రి గారూ,ధన్య వాదాలు.
నాట్యమాడ నేర్చి నానంచుఁ బలుకుచు
రిప్లయితొలగించండివందనంబొనర్చి వారిజాక్షి
మాంసచక్షువులకు మహియందున నటరా
జాడఁ జూపినట్టి జాడఁ గనుఁడు
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిఆహా! నటరాజును ఆడించిన మీ పూరణ వైవిధ్యంతో అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
గురువు గారూ, ధన్య వాదాలు .
రిప్లయితొలగించండిమీపూరణనే అనుసరించాను.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
నూఱు యోజనముల - నొకపరి లంఘించె
అబ్ధి దాట నెంచి - హనుమ యపుడు
విందు యంధ మనక - విశ్రాంతి నెరుగక
లంక జేరె నంత - రాము కొఱకు !
పట్టు బట్టె నేని - పట్టి విడువ రాదు
పవన సుతుడు నేర్పు - పాఠ మదియె
శోక తప్త యయి , య - శోకవనము , సీత
జాడ జూపినట్టి - జాడ గనుడు !
_________________________________
జాడ = ఆచూకీ , విధము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాట్యగతుల నెన్నొనర్తించి చూపుచు
రిప్లయితొలగించండితాండవమ్ముఁ జేయు తరుణమందు
అచ్చెరువునఁ బలికి రచటివారు." నటరా
జాడఁ జూపినట్టి జాడఁగనుడు"
గురువు గారు,
రాశాక అనిపించిందేమంటే తాండవం అబ్బాయిలు చాలా బాగా చేయటం నేను చూశాను. ఇక్కడ వారిజాక్షి కన్నా అబ్బాయి గురించే చెపుదామనిపించింది.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅత్తవారి యింట పుత్తడి పూర్ణమ్మ
కథను జెప్ప నీరు కంట రాలు
దుష్ట సంస్కృతులను దునుమాడ మన గుర
జాడ జూపినట్టి జాడ గనుడు
నేటి చదువు లనగ మేటియై సరగున
రిప్లయితొలగించండిపూర్వ కవుల పలుకు నేర్వ లేరు
ముత్య మంటి పలుకు ముత్యాల సరముగుర
జాడ జూపి నట్టి జాడ గనుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమసక వెన్నె ల్లోన మామ చెంతను జేరి
రిప్లయితొలగించండిచంద మామ జూడ యంద ముగను
కలువ భామ గాంచి కులుకుతు రేరాజు
జాడ జూపి నట్టి జాడ గనుడు !
పూర్ణ యనెడి పేరు, పుత్తడి బొమ్మకు
రిప్లయితొలగించండిముద్దు గొలుపు చిన్ని ముద్దరాలు
కరుణ రసము నొలుక కథలనిచ్చినగుర
జాడ జూపినట్టి జాడఁ గనుడు.
శ్రీపతి శాస్త్రి గారు పూర్ణమను గుర్తు చేసినాక నేనూ తలచుకోకుండా ఉండలేక పోయాను.
"నలుగురు కూర్చుని నవ్వేవేళల నా పేరొకతరి తలవండి" అని చెప్పిన చిట్టితల్లిని మరువగలమా!
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిసీత జాడ చూపిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
సవరించకున్నా బాగుంది. సవరించింది ఇంకా బాగుంది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరక్కయ్యా,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
కాకుంటే ... మొదటి పూరణలో ‘ముత్యాలసరము గుర’ అన్నప్పుడు, రెండవపూరణలో ‘వెన్నెల్లోన’ అన్నప్పుడు గణదోషం. వీలైతే సాయంత్రం వరకు సవరిస్తాను. కాస్త ‘అర్జంటు’ పని మీద వెళ్తున్నా.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిపూర్ణమ్మ ప్రస్తావనతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
శ్రీ చింతా రామకృష్ణారావు గారు కూడా గురజాడ వారి సరస్వతీ రాయవరమునకు చెందిన వారే ! మరో మహా కవికి పుట్టినిల్లు రాయవరము !
రిప్లయితొలగించండిమొదటి పాదంలో " ముత్తెపు దండ " అని
రిప్లయితొలగించండిరెండవ పదంలో " మసక వెన్నె లందు " అని వ్రాస్తే సరి పోతుందేమో కదా !
ముందు అలాగే రాసి చేరిపాను తమ్ముడూ !