26, సెప్టెంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -473 (డండం డడడం)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
డండం డడడం డడండ డండం డడడం.
ఈ సమస్యను పంపించిన
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి
ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

  1. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణలు ....
    (1)
    పండగ పదినాళ్ళుండగ
    బండెడుగా తెచ్చుకున్న బాణాసంచా
    నెండేయగ నగ్గి తగిలి
    డండం డడడం డడండ డండ డడడం
    (2)
    గండరగండడు సాంబుడు
    ఛండమ్మౌ తాండవమ్ము సలుపగ గిరిపై
    మెండుగ మ్రోగెను ఢమరము
    డండం డడడం డడండ డండ డడడం

    రిప్లయితొలగించండి
  2. మెండుగ వర్షము పడె నట
    కొండలలో కోన నడుమ, గొప్పగ పిడుగే
    'డండమ్మన' మార్మోగెను
    డండం డడడం డడండ డండం డడడం.

    రిప్లయితొలగించండి
  3. పండుగ శలవులు వచ్చెను
    దండిగ సమయమును నేను దాగుడు మూతల్,
    కొండల కోనల నాడెద
    డండం డడడం డడండ డండం డడడం.

    మూడు పూరణల్లో కవివర్యులు అలరించారు.
    ఇంక నేను ఆటల్లో పడ్డాను. శలవులిచ్చారు , ఆటలాడతాననే సంతోషంతో పాట పాడానని పూరణ చేశాను.

    రిప్లయితొలగించండి
  4. నా పూరణ .....

    నిండుగ వరదలు వచ్చెను
    గండ మెటుల గడచు ననుచుఁ గలవరపడితిన్
    గుండియ దడదడలాడెను
    డండం డడడం డడండ డండం డడడం.

    రిప్లయితొలగించండి
  5. భండన మందున భీముడు
    దుండగులను చీల్చి చెండి దుర్యోధనుడిన్
    గొండను వలె ఢీకొనగను
    డండం డడడం డడండ డండం డడడం.

    రిప్లయితొలగించండి
  6. మెండుగ బంధువు లొచ్చిరి
    దండిగ నిలునిండ జనులు దడదడ లాడన్ !
    పండుగ సంబర మనుచును
    డండం డడడం డడడం డండం డడడం

    రిప్లయితొలగించండి
  7. భండన మందున భీముడు
    దుండగులను చీల్చి చెరిచి దుర్యోధనుడిన్
    గొండను వలె ఢీకొనగను
    డండం డడడం డడండ డండం డడడం.

    రిప్లయితొలగించండి
  8. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి. గురువు గారూ మీ పూరణ అదిరింది, కాని ఓ యిద్దఱు గుండె దడ రోగుల వలన నిన్న రాత్రి సరిగ్గా నిద్ర లేదు.వారిప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత నిద్ర పట్టక ( శ్రీ వసంత కిశోర్ గారి లా మీకో పూరణ కూడా యేడు జాముల వేళలో చేసాను.). ఈ రాత్రి సుఖంగా నిద్ర పోదామనుకొంటూంటే మీరు డం డం డడండ డం డం అంటున్నారు ! ఆంజనేయ దండకం చదువుకో మంటారా ?

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారి పూరణ ....

    దందమయా రామా! కో
    దండధరా! నీ ప్రశస్తి తగ చాటింతున్
    దండిగ భేరీ మ్రోతల
    డండం డడడం డడండ డండం డడడం

    రిప్లయితొలగించండి
  10. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, సెప్టెంబర్ 26, 2011 9:08:00 AM

    అందరి పూరాణలూ అద్భుతం గా ఉన్నాయి.
    అందరికీ భేరీ మ్రోతల డండం డడడం డడండ డండం డడడం
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  11. డండం ఠాంఠాం ధాంధాం
    ఢాం డు౦ జుయ్ జుయ్ టకటక ఢాంటక్ తుస్ తుస్
    భండం బుస్ బుస్ కర్ కర్
    తండో౦ లన్నియునుశబ్ద ధ్వనులు టింకూ !

    రిప్లయితొలగించండి
  12. పూరణపాదం చూడాలనుకొంటే:
    డండం ఠాంఠాం ధాంధాం
    డండం డడడం డడండ డండం డడడం
    భండం బుస్ బుస్ కర్ కర్
    తండో౦ లన్నియునుశబ్ద ధ్వనులు టింకూ !

    రిప్లయితొలగించండి
  13. ఖాండవ వనమున నందా
    ఖండల వరసుతుఁడు వేయు కాండంబునకున్
    మండెను తరువులు ధగ ధగ
    ఢంఢం ఢఢఢం డడండ ఢఢఢం ఢంఢం !

    రిప్లయితొలగించండి
  14. ఖాండవ వనమున భళె రా
    ఖండల వరసుతుఁడు వేయు కాండంబునకున్
    మండెను తరువులు ధగ ధగ
    ఢంఢం ఢఢఢం డడండ ఢఢఢం ఢంఢం !

    రిప్లయితొలగించండి
  15. గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
    ----------------
    క: దండు కొనెలే టుజీ యం
    దుండు ధన మెండుగను చిదంబర ఎండ్ కో
    దండుడు, నేడది బయలై
    డండం డడడం డడండ డండం డడడం|

    రిప్లయితొలగించండి
  16. దండ మయా ! కామేశ్వర !
    దంఢ మయా ! శంకరయ్య ! దండము ! కవులూ !
    'గుండె దడ ' సమస్య నిడిరి !
    డండం - డడడం - డడండ - డండం - డడడం !!!

    రిప్లయితొలగించండి
  17. దిండునతలదూర్చెద;సూ
    ర్యుండేపొడసూపెనేమొ! రూఢ్యంబింతే
    దండెత్తెన్వంటింటన్-
    డండం డడడం డడండ డండం డడడం.

    [ప్రాణేశ్వరికి లేకపోతేనేం పద్యప్రీతి,ప్రాసపట్టింపు -వంటింట్లో పాత్రలకుంటే చాలదూ]

    రిప్లయితొలగించండి
  18. కొండొకతె మేడ నెక్కెను.
    భాండంబది చేయి జారి, పడి, దొర్లంగా
    నిండెన్ శబ్దం బిట్టుల
    డండం డడడం డడండ డండం డడడం.

    రిప్లయితొలగించండి
  19. దండిగ పని ఆఫీసున
    రండని పిలిచెదరు, పోవ రహదారులు బంద్
    గుండియలదురుచునుండును
    డండం డడడం డడండ డండం డడడం!!

    రిప్లయితొలగించండి
  20. సత్యనారాయణ గారూ చప్పట్లు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో చక్కని పూరణ. అందుకోండి అభినందన నీరాజనాలు.

    రిప్లయితొలగించండి
  21. జిగురు సత్యనారాయణగారూ చాలాబాగున్నది.ఉద్యోగస్తులపై గల వత్తిళ్ళను చక్కగా చెప్పారు.అభినందనలు

    రిప్లయితొలగించండి
  22. శ్రీగురుభ్యోనమ:

    దండోర డప్పు శబ్ధము
    డండం డడడం డడండ డండం డడడం
    డండం బనగన్ కొండడు
    ఎండనబడి తిరిగి చాటె నెల్లరు వినగన్

    రిప్లయితొలగించండి
  23. గండంబిక ఖలులకు తగు
    దండన మన భరత ధాత్రి తప్పదు పౌరుల్
    దండంబును చేగొనిరదె
    డండం డడడం డడండ డండం డడడం!!

    రిప్లయితొలగించండి
  24. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    బాణాసంచా, డమరుకము మ్రోగించిన మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    రెండవపూరణలో ‘ఢమరము’ అన్నారు. అటువంటి శబ్దమేదీ లేదు. ‘డమరము’ ఉంది కాని దాని అర్థం దేశోపద్రవం, శత్రువును అరుపులతో బెదరించడం, భయంతో పారిపోవడం, దుశ్శకునం మొదలైన అర్థాలున్నాయి. మీ ఉద్దేశంలో అది అది ‘డమరుకం’ కదా! దానికి డమరువు అనే రూపాంతరం ఉంది. కాబట్టి అక్కడ ‘మెండుగ మ్రోగెను డమరువు’ అంటే సరి!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పిడుగుపాటును బోలిన మీ పూరణ దడదడలాడించింది. బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ ‘దాగుడుమూతా దండాకోర్ ... ’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    భీమదుర్యోధను లనెడి రెండు కొండలు ఢీకొన్న మొదటి పూరణ, ఖాండవదహనాన్ని ప్రస్తావించిన రెండవ పూరణ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘దుర్యోధనునే’ అనీ, రెండవ పూరణలో ‘ధగధగ’కు బదులు ‘భగభగ’ అని ఉంటే బాగుంటుందని నా సలహా.
    అన్నట్టు ... ఈ సమస్య అంతగా భయపెట్టిందా? ద్వంద్వయుద్ధంతో, దావానలంతో మీరే మమ్మల్ని భయపెట్టారు.
    *
    రాజేశ్వరక్కయ్యా,
    పండుగ సంబరమంతా మీ పూరణలో ధగధగలాడింది. మంచి పూరణ. అభినందనలు.
    కానీ ... బంధువులు ‘ఒచ్చారా? వచ్చారా?’. అక్కడ ‘దండిగ చుట్టాల్ వచ్చిరి’ అంటే సరి!
    *
    పండిత నేమాని గారూ,
    కోదండ ధరునిపై మీ పూరణ బ్రహ్మాండంగా ఉంది. ధన్యవాదాలు.

    దండమయా నేమాని! య
    ఖండ మధుర కావ్యకరణ ఘనచాతుర్యా!
    మెండైన సంతసమ్మున
    దండిగ నభినందనములఁ దడయకఁ గొనుమా!

    రిప్లయితొలగించండి
  26. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    ధన్యవాదాలు.
    *
    ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    డీ డూడడ డడడ్డాడండా డుండి. డడిడండడడు! :-)
    (మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు!)
    అన్నట్టు ఆ శబ్దాలన్నీ మతాబులవేనా? మన బ్లాగులోకి ‘దీపావళి’ని అప్పుడే తెచ్చారే!
    *
    వరప్రసాద్ గారూ,
    టూజీ స్కాం నిందితుల పేర్లు దండోరా వేయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని రెండవ పాదంలో యతి తప్పింది. సవరించే ప్రయత్నం చేసాను కాని నావల్ల కాలేదు.
    *
    రాజారావు గారూ,
    వైవిధ్యమైన పూరణ. సెహబాస్! అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. చింతా రామకృష్ణారావు గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    శంకర్ గారు చెప్పినట్లు చప్పట్లు కొట్టదగిన పూరణ మీది. సందర్భోచితంగా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    శంకర్, యస్. గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ దండోరా పూరణ దండిగా బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. గురువుగారూ ధన్యవాదములు. మీ సలహా చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  29. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కాయకష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్యను
    తన సంపాదనంతా తాగేసి యింకా తాగడానికి డబ్బులిమ్మంటే
    లేవన్న భార్యను రోజూ :

    01)
    _________________________________

    మెండుగ త్రాగుట కొఱకే
    బండెడు చాకిరి , బ్రదికెడు - భార్య ననుదినమ్
    దండించగ ధన మిమ్మని
    డండం డడడం డడండ - డండం డడడం !
    _________________________________

    రిప్లయితొలగించండి
  30. రోజూ వ్యాయామం (దండీలు బస్కీలు మొ||వి) చేసి బలాఢ్యుడైన
    వాడి మీద కోపగించిన ఒక అర్భకుడు కాలరు పట్టి (గుండీలు తెగేలాగ) లాగితే , వీడు చండీశ్వరుడైతే - వాడి పని :

    02)
    _________________________________

    దండీలనుతీయు నొకని
    గుండీలనుపట్టిలాగ - కోపము తోడన్
    చండీశ్వరుడై వానిని
    డండం డడడం డడండ - డండం డడడం !
    _________________________________

    రిప్లయితొలగించండి
  31. రోజూ రాత్రి బాట పక్కనున్న బండి కింద పడుకొనే అభాగ్యుడు
    తెల్లవార్లూ చలికి తెల్లరిపోతే చూసే వాళ్ళ కళ్ళళ్ళో కన్నీళ్ళు :

    03)
    _________________________________

    గుండెలు వణికే చలికే
    బండీ క్రిందే యసువుల - బాసిన జూడన్
    గుండెలు కరుగగ , కనులను
    డండం డడడం డడండ - డండం డడడం !
    _________________________________

    రిప్లయితొలగించండి
  32. ఇంట్లో పనికిరాని చెత్తా చెదారం తగలేసి
    శీతాకాలానికి వెచ్చని వీడ్కోలు పలికే భోగిరోజున :

    04)
    _________________________________

    ఎండిన ,విరిగిన ,తునిగిన
    బండీ, కుర్చీ తదితర - వస్తు చయమునే
    మండించిన భోగి దినము
    డండం డడడం డడండ - డండం డడడం !
    _________________________________

    రిప్లయితొలగించండి
  33. ఝండాలు దించేసారు ! శలవు ప్రకటించారు !
    బడిలో గంట మ్రోగింది !
    పండిన ముఖాలతో పిల్లలింటికి పరువెత్తారు !
    శలవిచ్చారని సంతోషం మరి !

    05)
    _________________________________

    ఝండా వతనం బాయెను
    డండం డడడం డడండ - డండం డడడం !
    దండుగ వెడలిన పిల్లలు
    పండిన సంతోషమునను - పరువెత్తి రటన్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  34. ఈ "బెండాసురుడు" అనేది చాలా చిన్నది !
    వాడు చేసే శబ్దాలకు యింకా పెద్ద పేరు పెట్టాలి !
    కాని, మరి నాకు తట్టట్లేదు ! మీకేమైనా తడితే చెప్పండి !

    06)
    _________________________________

    బెండగు చువ్వల నన్నియు
    బెండును దీయంగ సుత్తి - బెండాసురుడే
    బండగ బాదిన శబ్దము
    డండం డడడం డడండ - డండం డడడం !
    _________________________________
    బెండాసురుడు = రాడ్‌బెండరు

    రిప్లయితొలగించండి
  35. ఆశీర్వాదములు సిరులు
    రాశీభూతములయిన వరమ్ములు కవితా
    ప్రాశస్త్యముల నొసంగుదు
    నో శంకర కవివరా! మహోదయ! నీకున్

    రిప్లయితొలగించండి
  36. వసంత కిశోర్ జీ చక్కని పూరణలు ! కాని,

    మెండుగ కాసెడి యెండల
    దండిగ తిండియును లేక తనువున డస్సిన్
    గండల గాసిపడు జనుల
    బండాసురు లనుట తగున పండితవర్యా ?

    రిప్లయితొలగించండి
  37. ఓ ! సరే ! బెండాసరులా !

    బెండాసరులనుట తగునె ప్రియమిత్రుండా !

    రిప్లయితొలగించండి
  38. పండితవర్యులు తమతమ
    పాండిత్యమునొలకబోసి పండుగ చేయన్
    మెండుగ మ్రోగెడకారము
    డండం డడడం డడండ డండం డడడం

    రిప్లయితొలగించండి
  39. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణలను ఉదయమే చూసాను. క్రొత్త సమస్యను పోస్ట్ చేసినతర్వాత మీ పూరణలపై వ్యాఖ్యానించాలనుకొని మరిచి పోయాను. ఈ రోజంతా కరెంటు గంటలకొద్ది పోతూ ఇబ్బంది పెట్టింది. అందువల్ల ఆలస్యం అయింది. మన్నించండి.
    మీ ఆరు పూరణలు వైవిధ్యంగా బాగున్నాయి. అభినందనలు.
    కాకుంటే అక్కడక్కడ వ్యావహారిక పదాలు పడ్డాయి. అంతే!
    *
    పండిత నేమాని గారూ,
    మీ ఆశీస్సులు మాకు శ్రీరామరక్ష! ధన్యవాదాలు.
    *
    నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    ధన్యవాదాలు. ప్రశంసా రూపమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  40. మూర్తీజీ ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    ఫోను , కరెంట్ , నెట్- ఒకటుంటే ఒకటుండదు !
    మిత్రులను కలవడానికి చాలా ఇబ్బందిగా నున్నది !

    రిప్లయితొలగించండి
  41. వసంత్ కిశోర్ గారూ,
    అంతేకదా! హమ్మయ్య! మీ పూరణలపై ఆలస్యంగా స్పందించినందుకు నామీద మీకు కోపం వచ్చిందనుకున్నా. సంతోషం.

    రిప్లయితొలగించండి
  42. శంకరార్యా ! ఎంతమాట ! మీ మీద కోపమా ! ఎన్నటికీ రాదు !
    ఏదో పొరపాటున మీరు వ్యాఖ్యానించడం మరిస్తే గుర్తు చేస్తా మంతే !
    మీ వ్యాఖ్య చూడక పోతే ఏదోలా ఉంటుంది !

    ఎవరెంత మెచ్చుకున్నా, లేకపోయినా మీ వ్యాఖ్య కోసం
    ఎదురు చూస్తూనే ఉంటాము !

    మీరు వ్యాఖ్యానించకపోతే ఏదో తెలీని వెలితి !
    మీ వ్యాఖ్య చూడగానే నెత్తిమీద వజ్రాల కిరీటం పెట్టిన అనుభూతి !

    అందులో మీరు తప్పులు చూపెడితే -
    ఓహ్ - ఈ తప్పు మళ్ళీ చెయ్యకూడదన్న తపన !
    తాపత్రయమూ !
    పొరపాటున మళ్ళీ అదే తప్పు చేస్తే - ఈ సారైనా జాగ్రత్తగా వ్రాయాలనే పట్టుదల !
    మీరు ఒక రెండు మెచ్చు కోలు మాటలు వ్రాస్తే - ఏనుగెక్కినంత ఆనందం !
    ఎంతమంది హృదయాల్ని ఎంతగా రంజింపజేస్తున్నారో -బహుశా మీకు తెలియక పోవచ్చు !
    అనుభవిస్తున్న మాకు తెలుసు !

    ఒక్క మాటలో చెప్పాలంటే మేం మీకు దాసులమైపోయాం !
    అందుచేత మీమీద కోపగించుకునే శక్తి మాకు లేదు !
    ఆ కోపమేదో వస్తే గిస్తే మీకు రావాలి కాని !
    ఎందుకంటే మీ సహనానికీ ఓపికకూ ఎన్నెన్ని పరీక్షలు పెడుతున్నాం - మేం !
    ఐదో తరగతి పిల్లల dictation దిద్దినట్టు దిద్దుతారు మా తప్పులన్నీ !
    ప్రతీ అక్షరం పట్టి పట్టి పరిశీలించి !
    నిజంగా పిల్లల పరీక్ష పేపర్లు కూడా ఏ ఉపాధ్యాయుడూ ఇంత శ్రద్ధగా దిద్దడం
    ఈ రోజుల్లో చాలా అరుదు !
    మీ కేమిచ్చి మేం ఋణం తీర్చుకోగలం !

    పాదాభివందనం చెయ్యడం తప్ప !

    రిప్లయితొలగించండి
  43. రేపటి వార్తలు నేడు:

    ఛండాలపు కౌంటింగున
    ముండా కొడుకులకునోడ ముద్దుల మమతల్
    గుండెలు కొట్టిన విట్టుల:
    డండం డడడం డడండ డండం డడడం

    రిప్లయితొలగించండి