మిస్సన్న గారూ, మీ ‘ప్రమథగణనాయకసుతుని’ స్తుతి బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ ‘భూతగణనాయకసుతుని’ స్తుతి చక్కగా ఉంది. అభినందనలు. * చింతా రామకృష్ణారావు గారూ, ఉత్తమమైన పూరణ. అభినందనలు. * మందాకిని గారూ, పద్యం బాగుంది. అభినందనలు. కాని ‘గణనాయకసుత’ కు పూరణలో అన్వయం లేదు. * వసంత కిశోర్ గారూ, ధన్యవాదాలు. ప్రమథగణనాయక సుతుని మీ పూరణ బాగుంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ ‘సద్గుణగణ’ పూరితమై చక్కగా ఉంది. అభినందనలు. * ‘శిరాకదంబం’ రావు గారూ, ధన్యవాదాలు. * ‘కమనీయం’ గారూ, ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు. ‘అనిమిషగణనాయకసుతుని’ స్తుతితో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, ‘సురగణనాయకసుత’ స్తుతితో మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘నర + అసుర’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. ‘నరదనుజ’ అంటే బాగుంటుందేమో?
చంద్రశేఖర్: భారతదేశంలో మీరు పెట్టిన ప్రసాదంతిని ఇక్కడకి వచ్చాక, మా వినాయకుడికి అడిగి మరీతినిపించవలసివస్తోంది. అయినా నా మాట వింటాడు మన గణి.. గుణకీర్తన జేసెద నో సృణిధారీ! మోదకములఁ సేవింపుమయా! ఋణమోచకా! చరాచర గణనాయకసుత! వినాయకా! వందనముల్
గణము అంటే సమూహము అనే కాక ప్రమథ గణములని కూడా అని భావించాను. గణపతి అంటేనే అదే ప్రమథ గణాల పతి అనే కాదా? కొడుకులకు ఇవ్వకముందు ఈశ్వరునిదే గణాధిపత్యం కదా! అందుకని గణనాయకసుత అని మీరిచ్చారని అనుకున్నాను. తప్పైతే మన్నించండి.
రాజేశ్వరక్కయ్యా, ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. బాగుంది. అభినందనలు. అయితే మొదటి పాదంలో గణదోషం. రెండవ పాదంలో ‘ప్రణుతి, వందిత’ శబ్దాలవల్ల అర్థపునరుక్తి వస్తున్నది. సమ్యస్య పాదానికి అన్వయం లేదు. మీ పద్యానికి నా సవరణ ... గణ నాదుడవని (నమ్మితి) ప్రణ(తుల నిడి కొలువఁగలుఁగు భాగ్యము నాదే!) గణు తింపకు దోషము; (సుర) గణ నాయకసుత ! వినాయకా ! వందనముల్ ! పండుగ వెళ్ళిపోయింది కదా అని ‘దోషముల గణుతించాను’ :-) * చంద్రశేఖర్ గారూ, అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * మందాకిని గారూ, మీ లేటెస్ట్ పూరణ బెస్ట్ గా ఉంది. పూరణలో వైవిధ్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు. * రాజారావు గారూ, ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గణపతి నవరాత్రములన-
రిప్లయితొలగించండిగణితంబగు భక్తి గొల్తు గజముఖ! మాధా-
రుణి విడనాడకుము ప్రమధ-
గణనాయకసుత! వినాయకా! వందనముల్
శంకరార్యులకు,కవి మిత్రులకు,బ్లాగు వీక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగణుతింప సకల దేవత
గణముల కే స్వామివీవు గజముఖ!వరదా !
ప్రణవము నీవే! భూతపు
గణనాయకసుత! వినాయకా! వందనముల్.
నా బ్లాగునందు 21 పత్రి పేర్లు గల పద్యమును ఉంచినాను. ఒకపరి దర్శించ గోరు చున్నాను.
శంకరాభరణ పాఠకులకు, ఆంధ్త్రామృత పాఠకులకు, భగవద్భక్తులందరికీ వినాయక చతుర్థి సందర్భముగా శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగణనాయక! భువి విలసద్
గుణ పోషక! దుర్విఘాతకుఁడ! విఘ్నేశా!
ప్రణవాశ్రితుఁడా!భూత సు
గణనాయక సుత! వినాయకా! వందనముల్.
గణపతి దేవా! కావుమ!
రిప్లయితొలగించండిప్రణతులు గొనుమయ్య! పాహి! పాహి! గజముఖా!
గుణములు మంచివి నిమ్మా!
గణనాయక సుత! వినాయకా! వందనముల్!
శంకరార్యులకూ ,కవిమిత్రులకూ,
రిప్లయితొలగించండిఅందరికీ వినాయక చవితి శుభాభినందనలు !
__________________________________
పార్వతి సుతు పర్వమున ,ని
గర్వముగా ప్రణతు లిడిన - గణనాథు డిలన్
సర్వులు పరవశ మొందగ
సర్వ శుభము లొసగి బ్రోచు - సంసేవించన్ !
__________________________________
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
గణనీయముగా మమ్ముల
గణగణముగ నగణితముగ - గాచుము కరుణన్
గుణ గణముల నొసగి ! ప్రమథ
గణనాయక సుత! వినాయ - కా! వందనముల్
_________________________________
గురువుగారికి ,కవిమిత్రులకు వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిజనగణముల ఘనమనమున
గణనాథా గురియజేయు కరుణామృతమున్
అణుమాత్రమైన, సద్గుణ
గణనాయకసుత! వినాయకా! వందనముల్!
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిశిరాకదంబం వెబ్ పత్రిక
గుణగణముల వినుతి బడసి
రిప్లయితొలగించండిప్రణవస్వరముల మునిజన వందిత చరణా
ప్రణతుల గొనుమీ ,అనిమిష
గణనాయకసుత వినాయకా వందనముల్.
---------
గణ నాధ ! సుర ,నర ,యసుర ,
రిప్లయితొలగించండిముని , పశు ,పక్ష్వాది గణ సమూహము లెల్లన్
ఘనముగ నిను గొల్తురు సుర
గణ నాయక సుత ! వినాయకా ! వందనముల్
పై పూరణ కర్త రాజారావు
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ ‘ప్రమథగణనాయకసుతుని’ స్తుతి బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ‘భూతగణనాయకసుతుని’ స్తుతి చక్కగా ఉంది. అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.
*
మందాకిని గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.
కాని ‘గణనాయకసుత’ కు పూరణలో అన్వయం లేదు.
*
వసంత కిశోర్ గారూ,
ధన్యవాదాలు.
ప్రమథగణనాయక సుతుని మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ ‘సద్గుణగణ’ పూరితమై చక్కగా ఉంది. అభినందనలు.
*
‘శిరాకదంబం’ రావు గారూ,
ధన్యవాదాలు.
*
‘కమనీయం’ గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.
‘అనిమిషగణనాయకసుతుని’ స్తుతితో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
‘సురగణనాయకసుత’ స్తుతితో మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘నర + అసుర’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. ‘నరదనుజ’ అంటే బాగుంటుందేమో?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువులు , పండితులు , [ సోదరులు , సోదరి మందాకిని ] అందరికీ వినాయక చవితి శుభా కాంక్షలు.
రిప్లయితొలగించండిగణ నాదుడవని నిను
ప్రణ తిగనే కొలువ గలిగి వందితు డౌదున్ !
గణు తింపకు దోషములను
గణ నాయకసుత ! వినాయకా ! వందనముల్ !
రాజేశ్వరక్కయ్యా,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
పండుగపూట‘గణుతింపకు దోషములను’ అన్నారు. సంతోషం!
చంద్రశేఖర్:
రిప్లయితొలగించండిభారతదేశంలో మీరు పెట్టిన ప్రసాదంతిని ఇక్కడకి వచ్చాక, మా వినాయకుడికి అడిగి మరీతినిపించవలసివస్తోంది. అయినా నా మాట వింటాడు మన గణి..
గుణకీర్తన జేసెద నో
సృణిధారీ! మోదకములఁ సేవింపుమయా!
ఋణమోచకా! చరాచర
గణనాయకసుత! వినాయకా! వందనముల్
గణము అంటే సమూహము అనే కాక ప్రమథ గణములని కూడా అని భావించాను.
రిప్లయితొలగించండిగణపతి అంటేనే అదే ప్రమథ గణాల పతి అనే కాదా? కొడుకులకు ఇవ్వకముందు ఈశ్వరునిదే గణాధిపత్యం కదా!
అందుకని గణనాయకసుత అని మీరిచ్చారని అనుకున్నాను. తప్పైతే మన్నించండి.
అగణిత గుణనిధి! పుత్రుడ!
గణ నాయక! సుత వినాయకా! వందనముల్,
గుణవంతులు నీకొసగిరి
ప్రణతుల్ గొనివారినింక పరిణతి నిమ్మా!
పార్వతి తనయునితో అంటున్నట్టుగా వ్రాశాను. చూడగలరు.
వారికింక అని వ్రాయబోయి, వారినింక అని వ్రాశాను.
రిప్లయితొలగించండిపరిణతి ని వివేకాన్ని ఇవ్వమని భావన.
గణనాధ ! నర సురాసుర
రిప్లయితొలగించండిముని పశు పక్ష్వాది గణ సమూహము లెల్లన్
ఘనముగ నిను గొల్తురు - సుర
గణనాయకసుత ! వినాయకా ! వందనముల్
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యం---
రిప్లయితొలగించండిగుణనిధి! ముద్దుల తనయా!
గణ నాయక! సుత వినాయకా! వందనముల్,
గుణవంతులు నీకొసగిరి
ప్రణతుల్ గొనివారికింక పరిణతి నిమ్మా!
రాజేశ్వరక్కయ్యా,
రిప్లయితొలగించండిప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. బాగుంది. అభినందనలు.
అయితే మొదటి పాదంలో గణదోషం. రెండవ పాదంలో ‘ప్రణుతి, వందిత’ శబ్దాలవల్ల అర్థపునరుక్తి వస్తున్నది. సమ్యస్య పాదానికి అన్వయం లేదు. మీ పద్యానికి నా సవరణ ...
గణ నాదుడవని (నమ్మితి)
ప్రణ(తుల నిడి కొలువఁగలుఁగు భాగ్యము నాదే!)
గణు తింపకు దోషము; (సుర)
గణ నాయకసుత ! వినాయకా ! వందనముల్ !
పండుగ వెళ్ళిపోయింది కదా అని ‘దోషముల గణుతించాను’ :-)
*
చంద్రశేఖర్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
మందాకిని గారూ,
మీ లేటెస్ట్ పూరణ బెస్ట్ గా ఉంది. పూరణలో వైవిధ్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
రాజారావు గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
నా పూరణ ...
రిప్లయితొలగించండిప్రణవస్వరూప! సురముని
గణ సేవిత పాదపద్మ! కరుణామృత వీ
క్షణ! కరివదనా! ప్రేతిక
గణనాయక సుత! వినాయకా! వందనముల్.
మాస్టారూ, ధన్యవాదాలు. మీ పూరణ చక్కని ధ్యాన శ్లోకంలా వుంది.
రిప్లయితొలగించండిప్రణమిల్లుచు కోరెదనిను
రిప్లయితొలగించండిగణములు ప్రాసలు యతులను ఘనముగ నిడుమా!
సణుగుడు గురువుల బాపుము
గణనాయకసుత! వినాయకా! వందనముల్