ఆస్తి తీసుకొని ఇల్లువదలి వెళ్ళి వ్యసన పరుడై అంతా పోగొట్టుకొని యిల్లు చేరిన కొడుకును ఆదరించి ఊరందరినీ పిలిచి విందుచేస్తాడు తండ్రి ! దీనికి గొఱ్ఱెల కాపరి యైన పెద్దకొడుకు ఆగ్రహిస్తాడు !
"నాయనా ! తప్పి పోయిన గొఱ్ఱె కోసమే గదా నువ్వు వెతుక్కుంటావు ! మందలో నున్న గొఱ్ఱె కోసం వెతకవు గదా ! నీ తమ్ముడు కూడా తప్పిపోయిన గొఱ్ఱె లాంటివాడే !" అని నచ్చజెబుతాడు తండ్రి !
01) _________________________________
ఇలువెడలి ధూర్త వర్తన పలు ఇడుములు పడిన కొడుకు - పదముల వ్రాలన్ అలుగక తండ్రే జరుపగ ఖలునకు సత్కారములవి - ఘనముగ జరిగెన్ ! _________________________________
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారూ, నిజమే! ఎన్నికల పేరిట మనం ‘ఖలులనే’ గద్దె నెక్కిస్తున్నాము. వారికే సత్కారాలు. అద్భుతమైన పూరణ. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. ఇంతకీ రెండవ పూరణలో ‘ఖలుడు’ ఎవరు? * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. మొదటి పాదాన్ని ‘ ఖలులే గల రన్ని యెడల"’ అంటే ఎలా ఉంటుంది? * శ్రీపతి శాస్త్రి గారూ, శ్రేష్ఠమైన పూరణ మీది. అభినందనలు. * మందాకిని గారూ, నేమాని వారు పేర్కొన్నట్లు మీ ‘మణిమేఖల’ ప్రయోగం అనన్యం, అద్భుతం. అభినందనలు. * మిస్సన్న గారూ, నిజమే! ఖైదీలలోనూ V.I.P. లుంటారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
పండిత నేమాని గారి పూరణ ...
రిప్లయితొలగించండిబలమత్తుడు, గుణహీనుడు,
జులుమును ప్రకటించునొకడు సుకరమ్ముగనే
గెలిచెనని యెన్నికల నా
ఖలునకు సత్కారములవి ఘనముగ జరిగెన్
పండిత నేమాని గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిఅయ్యా! మందాకిని గారి పూరణలో; కదనొక అనే పదాలలో నుగామము రాదు. కద యొక
అంటే బాగుండేది ఏమో!
పండితుల వారికి నమస్కారములు.
రిప్లయితొలగించండితప్పు గ్రహించాను. ధన్యవాదములు. జరుగును కూడ రెండు సార్లు ఉపయోగించాను. వేరే ఒక పూరణ చేయటానికి ప్రయత్నిస్తాను.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
చిన్నప్పు డెప్పుడో చదువుకున్న కథ :
ఆస్తి తీసుకొని ఇల్లువదలి వెళ్ళి వ్యసన పరుడై
అంతా పోగొట్టుకొని యిల్లు చేరిన కొడుకును
ఆదరించి ఊరందరినీ పిలిచి విందుచేస్తాడు తండ్రి !
దీనికి గొఱ్ఱెల కాపరి యైన పెద్దకొడుకు ఆగ్రహిస్తాడు !
"నాయనా ! తప్పి పోయిన గొఱ్ఱె కోసమే గదా నువ్వు వెతుక్కుంటావు !
మందలో నున్న గొఱ్ఱె కోసం వెతకవు గదా !
నీ తమ్ముడు కూడా తప్పిపోయిన గొఱ్ఱె లాంటివాడే !"
అని నచ్చజెబుతాడు తండ్రి !
01)
_________________________________
ఇలువెడలి ధూర్త వర్తన
పలు ఇడుములు పడిన కొడుకు - పదముల వ్రాలన్
అలుగక తండ్రే జరుపగ
ఖలునకు సత్కారములవి - ఘనముగ జరిగెన్ !
_________________________________
తులువలు శ్రీలను తొల్పగ
రిప్లయితొలగించండిభలెభలె జనులెల్లరు గని భరతము బట్టన్
చెలికాండ్రు చెఱను జిక్కిరె
ఖలులకు సత్కారము లిట ఘనముగ జరుగున్ !
(వారికి వారు చెలికాండ్రు, మనకు గాదు)
ఖలులే యున్నది యచ్చట
రిప్లయితొలగించండివిలువలు గలవారి కచట విలువే లేదే!
'విలువకు' ఛీత్కారమ్ములు
'ఖలులకు' సత్కారములిట ఘనముగ జరుగున్!!
02)
రిప్లయితొలగించండి_________________________________
పలుమార్లు నలకు వెట్టిన
తులువల నిల దొలగ జేసె - తుదకు వలలుడే
విలపించగ కౌరవ పతి !
ఖలునకు సత్కారములవి - ఘనముగ జరిగెన్ !
_________________________________
నలకువ = బాధ
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండివిలువలు గలిగిన గ్రంథము
పలువురు మెచ్చంగ వ్రాయు పండితునకు, నా
విలువలు తెలియగ మారిన
ఖలునకు, సత్కారములవి ఘనముగ జరిగెన్
సులభుడు భక్తుల పాలిట,
రిప్లయితొలగించండిచెలువపు సొబగులను వెల్గు శ్రీమంతునికిన్
శిలరూపమునన్మణిమే
ఖలునకు, సత్కారములవి ఘనముగ జరిగెన్
కలియుగ కనకాక్షుండన
రిప్లయితొలగించండినిల నిధులను త్రవ్వి దోచె నీ 'గాలి' ! భళీ !
ఫలితము చెఱసాలను మన
ఖలునకు, సత్కారములవి ఘనముగ జరిగెన్
ముంబై దాడుల నిందింతుడు కసబుకు జైల్లో సర్వసౌకర్యాలు కలిగిస్తున్నారట!
రిప్లయితొలగించండిచెలఁగుచు ముంబైవాసులు
కలవరపడ బాంబులేయు ‘కసబు’ను పోలీ
సులు చెరలో సుఖపెట్టిరి
ఖలునకు సత్కారములు ఘనముగ జరిగెన్.
(మిస్సన్న గారి పూరణను ముందే చూసిఉంటే నా పూరణ మరోవిధంగా ఉండేది)
పండిత నేమాని గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిమందాకిని గారి "మణిమేఖల" ప్రశంసార్హము.
అభినందనలు.
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారూ,
రిప్లయితొలగించండినిజమే! ఎన్నికల పేరిట మనం ‘ఖలులనే’ గద్దె నెక్కిస్తున్నాము. వారికే సత్కారాలు. అద్భుతమైన పూరణ. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
ఇంతకీ రెండవ పూరణలో ‘ఖలుడు’ ఎవరు?
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
మొదటి పాదాన్ని ‘ ఖలులే గల రన్ని యెడల"’ అంటే ఎలా ఉంటుంది?
*
శ్రీపతి శాస్త్రి గారూ,
శ్రేష్ఠమైన పూరణ మీది. అభినందనలు.
*
మందాకిని గారూ,
నేమాని వారు పేర్కొన్నట్లు మీ ‘మణిమేఖల’ ప్రయోగం అనన్యం, అద్భుతం. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
నిజమే! ఖైదీలలోనూ V.I.P. లుంటారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
ఇరువురు గురువర్యుల ఆశీర్వాదములు శిరసా గ్రహించి ధన్యురాలనైనాను.
రిప్లయితొలగించండిశంకరార్యా ! సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ కస(బు)వు, మిస్సన్న గారి 'గాలి' మందాకిని గారి 'మణి మేఖల' పూరణ ములు ఉత్తమమై వున్నవి. అందరకు అభినందనలు.
గురువుగారూ, హనుమచ్చాస్త్రి గారూ, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపండిత శ్రీ నేమాని వారన్నట్లు మందాకినీ గారి మనిమేఖల నేటి మణిపూస.
హనుమచ్ఛాస్త్రి గారు, మిస్సన్నగారు,
రిప్లయితొలగించండిమరీ మరీ ధన్యవాదాలు.
చెలగి యహింసాయుధ యుత
రిప్లయితొలగించండిబల రణమున గెల్చె గాంధి - భరత ధరిత్రీ
తల జననీ విఘటిత శృం
ఖలునకు సత్కారములవి ఘనముగ జరిగెన్
1)వివేకానందుడు::
రిప్లయితొలగించండిఇలనలుచెరగులదిరిగీ
లలితముగ సనాతనావలంబముఁదెలుపన్
భళిరా!బద్ధసుగుణశృం
ఖలునకు సత్కారములు ఘనముగ జరిగెన్.
మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రెండవ పూరణలో ఖలుడు దుర్యోధనాదులైన కౌరవులు !
వాళ్ళకు తగిన శాస్తి జేసింది భీముడే గదా !
ఘన సత్కారము = తగిన శాస్తి (వ్యంగ్యార్థం లో )
రాజారావు గారూ,
రిప్లయితొలగించండి‘శృంఖల’తో వైవిధ్యమైన పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.
*
ఊకదంపుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
ధన్యవాదాలు.
మందాకినిగారూ దినదిన ప్రవర్ధమానమౌతున్న మీ పద్యరచనలు, నేటి పూరణ అద్భుతముగా ఉన్నాయి. మీప్రజ్ఞకు నమస్సులు.
రిప్లయితొలగించండిశ్రీపతిశాస్త్రి గారు,
రిప్లయితొలగించండిధన్యురాలను. ఇందరి ఆదరాభిమానములు ఆశీస్సులుగా మారి నామీద వర్షించటం దేవీ కృప.
మిలియను లప్పులు జేయుచు
రిప్లయితొలగించండిసులువుగ బాంకులను దోచి సుఖపడి, కోర్టుల్
పిలువగ లండను పారెడి
ఖలునకు సత్కారములవి ఘనముగ జరిగెన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తలుపుల చాటున చర్యలు
రిప్లయితొలగించండిపలువురు కనుగొనగ చేరి భాజప నందున్
బలుపగు యోగిగ మారిన
ఖలునకు సత్కారములవి ఘనముగ జరిగెన్