గురువు గారు, ధన్యురాలను. హనుమచ్ఛాస్త్రి గారు, రచించలేక "చించాన"న్నమాట.ధన్యవాదములు. వంటల పుస్తకంతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా చెప్పారు. అందరి పూరణలూ అలరిస్తున్నాయి.అభినందనలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ నిజానికి బాగుంది. ప్రశంసార్హమే. కాని పరనింద, పరహింస హిందూ సంస్కృతి కాదు కదా! విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన సంస్కృతికి వారసులం మనం! మన బ్లాగును తరచుగా చూచే ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పేదాకా నాకీ విషయం తెలియదు. వెంటనే బ్లాగు తెరచి మీ పూరణను తొలగించాను. మీకు బాధ కల్గిస్తే మన్నించండి. సాధ్యమైనంత వరకు బ్లాగును వివాదాలకు దూరంగా ఉంచాలని నా కోరిక.
విమతగ్రంథమ్ముల నిటు క్షమ విడి సంపత్కుమార శాస్త్రీ! నిందిం చ మనకు హితమా? మన్నిం చుము తొలగించితిని; కాదు చొక్క మటంచున్.
మన్నించాలి. తప్పును చూపినందులకు, ఆదిలోనే నన్ను హెచ్చరించినందులకు మీకు, మీ మిత్రుడికి నా హృదయపూర్వకాభివందనములు. ఇక మీదట ఇటువంటి తప్పులు రాకుండా జాగ్రత్త పడుతానని విన్నవించుకొంటున్నాను. నాపూరణ తీసివేసినందులకు నాకు బాధగా లేదుకానీ పరనిందా పూరితమైన పద్యం వ్రాసినందుకు బాధగా వుంది. రెండు రోజులపాటు బ్లాగుకు దూరంగా వుండి నన్ను నేను శిక్షించుకోదలిచినాను.
మన దేవుళ్ళను, పవిత్రగ్రంథాలను, ఆచారాలను కించపఱచే విధంగా ఎవరెలా వ్రాసినా తరతరాలుగా సహిస్తూ వస్తున్నాము. క్షమిస్తూ వస్తున్నాము. కాని అదే ఇతర మతాలను ఏమాత్రం విమర్శించినా గొడవలూ, కేసులూ, ఫత్వాలూ! మనం చూస్తున్నదేగా. మీ పూరణను తొలగించినందుకు మీకు బాధ కలిగితే మన్నించాలి.
సంపత్ కుమార్ శాస్త్రిగారు, మీరు అంతగా బాధపడవలసిన పనిలేదని నా అభిప్రాయం. అవతలి వాళ్ళు , మనవాళ్ళు కూడా మన పవిత్రగ్రంథాల , ఆరాధ్యదైవాల గురించి యథేచ్ఛగా వ్రాస్తుంటారు. ఈ ప్రక్రియను విమర్శించే వాళ్ళే ఉండరు. ఇది మన దురదృష్టం.
సోదరి నేదునూరి రాజేశ్వరి గారికి నా పై సంపూర్ణమైన గౌరవమే ఉన్నది. పద్యరూపములో సమముగా వివరింప లేక పోయినది. మార్చిలో ఆమెతో అమెరికాలో నేను ముఖస్తముగా మాటాడుట కూడా జరిగినది.
ఆమె హృదయమ్ము భక్తి భావావృతమ్ము ఆమె భావమ్ము నవకవిత్వాశ్రయమ్ము ఆమె వాక్యమ్ము మధురరసాన్వితమ్ము ఆమె నాశీర్వదింతు సమాదరమున
అవధాన సరస్వతి , పాండితీ స్రష్ట , ఐన పండిత నేమాని వారి ఆదరాభి మానములకు కృతజ్ఞు రాలను నా జన్మ ధన్య మైనది . ఎంతో వ్రాయాలన్న ఆసక్తితో అసక్తు రాల నయ్యాను నా పొరబాటును మన్నించి ఆశీర్వ దించిన వారి ఔన్నత్యం శ్లాఘనీయము .
ఏమా ధూర్తత వానికి?
రిప్లయితొలగించండిరామాయణమును గురించి రమ్యము గా, నే
నీ మాయలుఁ దొలుగఁ జదువు
ప్రామాణిక పుస్తకమును, పాపిర! చించెన్!
ఏమా రచనావేగం
రిప్లయితొలగించండిబేమా పూరణపు నేరు పేమా భాషా
సామర్థ్యము? సెహబాసని
యో మందాకిని! పొగడెద నోహో యనుచున్.
పండిత నేమాని గారి పూరణ ....
రిప్లయితొలగించండిఈ మా పావన పిచ్చయ
నేమందుము "పాపి" యనుచు నితడొక కవి, శ్రీ
రాముననుగ్రహమున నీ
ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్
రామాయణ కరణత్వం
రిప్లయితొలగించండిబామంత్రించితివి పాపి కద్భుతరీతిన్
ధీమంతుఁడ వని పండిత
నేమాని కవీశ్వరా! గణించెద నిన్నున్.
పండిత నేమాని గారూ,
రిప్లయితొలగించండిపద్యంలో ఏకవచన ప్రయోగానికి మన్నించండి.
‘చిన్నప్పుడు రతికేళిక
నున్నప్పుడు కవితలోన ...’ అన్నారు కదా!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
"సామీ "యన ముని జెప్పిన
"రామా" యను మంత్ర మహిమ - రమ్య మొదవగా
"రామాయణ"మను పుణ్యపు
ప్రామాణిక పుస్తకమును - పాపి రచించెన్ !
_________________________________
మందాకిని గారూ ! చించేశారండీ !
రిప్లయితొలగించండిమాస్టారు గారి తో అందమైన కందాన్ని చెప్పించారు.
పావన పిచ్చయ (పాపి) తో చేసిన నేమని గారి పూరణ బాగుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికిశోర్జీ ! మీరూ (ర)చించేశారు.ఇక మాకు చించ టానికి ఏముందా అని ఆలో చించు చున్నాను..
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిచంద్రశేఖరులు కూడా బాగా చించారు చూడండి !
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిధీమంతుడనని వ్రాసెను
ప్రామాణిక వ్యక్తులనిన పాపులు యనుచున్
క్షామము లెందులకన న {ఏమని చెప్పుదమిక న}
ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"కామసూత్రాలు" రచించిన "వాత్సాయనుల" వారికి క్షమాపణలతో :
రిప్లయితొలగించండి02)
_________________________________
ఏ మాత్రము బిడియ పడక
భామా మణులను గలసెడి - పలు భంగిమలన్
కామమునకు సూత్రములను
ప్రామాణిక పుస్తకమును - పాపి రచించెన్ !
_________________________________
నేమానియె వ్రాసి తనరె
రిప్లయితొలగించండిప్రామాణిక పుస్తకమును, పాపి రచించెన్
సీమలఁ గూల్చెడి తత్వము
రామాయణ గాధ మేలు వ్రాయగఁ జదువన్ !
సీమల గూల్చేడి తత్వము = అతివాదము
శ్రీ పండిత నేమాని వారు శ్రీ మదధ్యాత్మ రామాయణ గ్రంధమును విరచించారు
శ్రీపతి గారు, గన్నవరపు వారు కూడా బాగానే (ర) చించేశారు.
రిప్లయితొలగించండిచీమలు, పురుగుల తోడను
నేమాత్రము పాప మనక నెవ్విధి వంటల్
భామలు చేయగ వచ్చునొ
ప్రామాణిక పుస్తకమును 'పాపి' రచించెన్ !
( పాపి చైనా వాడు లెండి. మనవాడు కాదు.)
నందవంశాన్ని నిర్మూలించిన (పాపి )చాణక్యుడే అర్థశాస్త్ర గ్రంధకర్త :
రిప్లయితొలగించండి03)
_________________________________
ఈ మూర్ఖుల దొలగించగ
నే మాత్రము తాళని కని - నిర్మూలించెన్ !
ఆమూలాగ్రము "నర్థము"
ప్రామాణిక పుస్తకమును - పాపి రచించెన్ !
_________________________________
యుద్ధంలో అనేక మందిని వధించిన(పాపి) శ్రీకృష్ణ దేవరాయలు
రిప్లయితొలగించండిఆముక్తమాల్యద రచయిత :
04)
_________________________________
సామాన్యుల, సైనికులను
సామూహముగా వధించె - సమరము నందున్ !
"ఆముక్త మాల్యద" నియెడి
ప్రామాణిక పుస్తకమును - పాపి రచించెన్ !
_________________________________
(స్వగతం : ఏవిటో ! ఈ పూరణ కోసం అందర్నీ పాపులు గా చిత్రించి
నేను మహాపాపి నౌతున్నట్టున్నాను !పాపం శమించు గాక !)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారు,
రిప్లయితొలగించండిధన్యురాలను.
హనుమచ్ఛాస్త్రి గారు,
రచించలేక "చించాన"న్నమాట.ధన్యవాదములు.
వంటల పుస్తకంతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా చెప్పారు.
అందరి పూరణలూ అలరిస్తున్నాయి.అభినందనలు.
5)
రిప్లయితొలగించండి_________________________________
భామా లోలుడు, మరి , యభి
రాముని వంచించె నాడు - లాభా పేక్షన్
వేమన,విరాగి ! సూక్తుల
ప్రామాణిక పుస్తకమును - పాపి రచించెన్ !
_________________________________
(స్వగతం : ఏవిటో ! ఈ పూరణ కోసం అందర్నీ పాపులు గా చిత్రించి
నేను మహాపాపి నౌతున్నట్టున్నాను !పాపం శమించు గాక !)
ఈ పాపానికిక స్వస్తి !
రిప్లయితొలగించండి"రామాయణ విష వృక్షము"
రిప్లయితొలగించండిప్రామాణిక పుస్తకమును పాపి రచించె
న్నామెయు నధోగతిన బడి
లేమిన ముప్పావు చావు లెక్కన చచ్చెన్!
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఐదు చక్కని పూరణలు చేసారు. అన్ని పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
కాని నా దృష్టిలో మీరు చెప్పిన ఐదుగురిలో ఎవ్వరూ ‘పాపులు’ కాదు!
ఏమందును? వాల్మీకుఁడు,
వేమన చాణక్య భువనవిజయోల్లాసున్
శ్రీమద్వాత్సాయన కవి
సామజములఁ బట్టితివి వసంత కిశోరా!
నా పూరణ ....
రిప్లయితొలగించండిసామాన్యుఁడె? ద్యూతక్రీ
డామంత్రాంగప్రవీణుఁడై జూదరు లెం
తో మెచ్చ ‘ద్యూతకళ’లో
ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు.
‘ప్రామాణికవ్యక్తులు’ అన్నప్పుడు ‘క’ గురువై గణదోషం ఏర్పడుతున్నది. అలాగే ‘పాపులు + అనుచున్’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘పాపులె యనుచున్’ లేదా ‘పాపులటంచున్’ అంటే సరి!
శ్రీపతి శాస్త్రీ! వ్రాసిన
నీ పూరణమందున గమనించితె దోషా
లీ పట్టున సరిదిద్దుము
చూపిన నా దారిఁ బట్టి శోభ చెలంగన్.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిఅవహేళనఁ జేసితె గ
న్నవరపు నరసింహ మూర్తి! నాస్తికవాదా
త్త విషయ పాపాత్ముల;
స్తవనీయము పూరణము గదా యని మెత్తున్.
గోలి హనమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండికసుమాలపు తిండిని రా
క్షసప్రవృత్తి గలవాని చైనావ్యక్తిన్
వెసఁ బాపిగఁ జూపు ప్రతిభ
యసమానము గాదె! గోలి హనుమచ్ఛాస్త్రీ!
(కసుమాలము = రోత కలిగించేది)
గురువుగారు ధన్యవాదములు. మీ సూచనలు నాకు సర్వదా శిరోధార్యములు. సవరించిన పద్యం
రిప్లయితొలగించండిధీమంతుడనని వ్రాసెను
ప్రామాణిక కావ్యములకు వ్యంగ్యపు వ్యాఖ్యల్
క్షామము లెందులకన న
ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్.
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండివంచనతో రామాయణ
మెంచియు నీచముగ వ్రాసె హేళన నామెన్
కించపఱచు పూరణము ర
చించిన ‘మనతెలుగు’ చంద్రశేఖర! సెహబాస్!
అందరి పూరణను వ్యాఖ్యానించానా? ఎవరిదైనా తప్పిపోయిందా?
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపద్యంబునేమీ యలయక
పద్యముతో, మెచ్చుకొనెడు పదముల తోడన్
హృద్యముగా చెప్పి న ఘన
విద్యా వేత్తైన మీకు వేవేల నుతుల్!
మాస్టారూ, ధన్యవాదాలు. నా పూరణ పద్యం కన్నా మీ మెచ్చుకోలుపద్యం బహు బాగు. సరళ భావంతో చక్కని నడకతో మీరు వ్రాసే సవరణ పద్యాలు మాకు చెప్పక చెప్పిన పాఠాలు.
రిప్లయితొలగించండిశ్రీమధు సూదను తెలిపెడి
రిప్లయితొలగించండిప్రామణిక పుస్తకమును భక్తుఁడు వ్రాయన్
భూమిని దొంగల కొఱకని
ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రిగారూ మీరు యితరుల పవిత్ర గ్రంథాన్ని అలా హాస్యం చేయుట తప్పేమో నని నాకనిపిస్తుంది.
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ నిజానికి బాగుంది. ప్రశంసార్హమే. కాని పరనింద, పరహింస హిందూ సంస్కృతి కాదు కదా! విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన సంస్కృతికి వారసులం మనం!
మన బ్లాగును తరచుగా చూచే ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పేదాకా నాకీ విషయం తెలియదు. వెంటనే బ్లాగు తెరచి మీ పూరణను తొలగించాను. మీకు బాధ కల్గిస్తే మన్నించండి. సాధ్యమైనంత వరకు బ్లాగును వివాదాలకు దూరంగా ఉంచాలని నా కోరిక.
విమతగ్రంథమ్ముల నిటు
క్షమ విడి సంపత్కుమార శాస్త్రీ! నిందిం
చ మనకు హితమా? మన్నిం
చుము తొలగించితిని; కాదు చొక్క మటంచున్.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమధుసూదనుపై గ్రంథము
మధురం బని పూరణంపు మణి నొసఁగిన నీ
వధికుఁడ వని కవితా వా
రిధి వని నుతియింతు రామకృష్ణారావూ!
రాజేశ్వరక్కయ్యా,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. కాని భావంలో విరోధాభాస గోచరిస్తోంది!
నేమాని వారు వ్రాసిన
రాముని కథ నేదునూరి రాజేశ్వరి! యౌ
నౌ మేలను పూరణమున
నేమందుఁ గల దపశ్రుతి యెఱుఁగుము తల్లీ!
అయ్యో ! క్షమించాలి ." నేమాని వారి గ్రంధము హృదయ రంజకముగా ఉంది .అలా అనుసరించి మరొకరు వ్రాసింది సరిగా లేదు అని నా ఉద్దేశ్యము .ఐతే చెరిపి వేయాలి తమ్ముడూ !
రిప్లయితొలగించండిగురువు గారూ,
రిప్లయితొలగించండిమన్నించాలి. తప్పును చూపినందులకు, ఆదిలోనే నన్ను హెచ్చరించినందులకు మీకు, మీ మిత్రుడికి నా హృదయపూర్వకాభివందనములు. ఇక మీదట ఇటువంటి తప్పులు రాకుండా జాగ్రత్త పడుతానని విన్నవించుకొంటున్నాను. నాపూరణ తీసివేసినందులకు నాకు బాధగా లేదుకానీ పరనిందా పూరితమైన పద్యం వ్రాసినందుకు బాధగా వుంది. రెండు రోజులపాటు బ్లాగుకు దూరంగా వుండి నన్ను నేను శిక్షించుకోదలిచినాను.
మన్నించాలి.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమన దేవుళ్ళను, పవిత్రగ్రంథాలను, ఆచారాలను కించపఱచే విధంగా ఎవరెలా వ్రాసినా తరతరాలుగా సహిస్తూ వస్తున్నాము. క్షమిస్తూ వస్తున్నాము. కాని అదే ఇతర మతాలను ఏమాత్రం విమర్శించినా గొడవలూ, కేసులూ, ఫత్వాలూ! మనం చూస్తున్నదేగా. మీ పూరణను తొలగించినందుకు మీకు బాధ కలిగితే మన్నించాలి.
తప్పును సరిదిద్దుకొనుటె
గొప్పగదా! రెండహములు కుములుచు బ్లాగున్
దప్పుకొనెడి నీ నిర్ణయ
మిప్పట్టున మాకె శిక్ష! యిది తగదయ్యా!
పండిత నేమాని గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండికవివర్యుండును సాహితీ ప్రముఖ లోక స్తుత్య శీలుండు గౌ
రవమేపారగ శంకరాభరణమన్ బ్లాగున్ మహోదాత్త రీ
తివికాసమ్మును గూర్చుచున్ నిలిపె తద్విజ్ఞాన తేజోధనుం
డవు కంద్యన్వయ శంకరయ్యకు సువర్ణాశీస్సులన్ గూర్చెదన్ (అవు = అగు)
శ్రీరస్తు సకల సౌభా
గ్యారోగ్యాన్విత చిరాయురస్తు హితైషీ
శ్రీరమణీయంబై యొ
ప్పారుత మీ సాహితీ సమారాధనముల్
సంపత్ కుమార్ శాస్త్రిగారు,
రిప్లయితొలగించండిమీరు అంతగా బాధపడవలసిన పనిలేదని నా అభిప్రాయం. అవతలి వాళ్ళు , మనవాళ్ళు కూడా మన పవిత్రగ్రంథాల , ఆరాధ్యదైవాల గురించి యథేచ్ఛగా వ్రాస్తుంటారు. ఈ ప్రక్రియను విమర్శించే వాళ్ళే ఉండరు. ఇది మన దురదృష్టం.
పందితశ్రీనేమాని వారి ఆశీ:పూర్వక పద్యాలు అమోఘం. వారు మన బ్లాగుకు రావటం మన అదృష్టం.
రిప్లయితొలగించండిపై పోస్టింగులో "పండితశ్రీ" అని చదువమని మనవి. టైపాటు క్షమించగలరు.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిఅయ్యా! క్రిందటి ఆశీస్సుల పద్యములో "సువర్ణ" అని వాడేను. ఆ పదమునకు నాకు
తెలిసిన కొన్ని అర్థములు:
(1) మంచి అక్షరములు కల
(2) మంచి జాతికి చెందిన
(3) మంచి వన్నె (శోభ) కల
(4) బంగారముతో చేయబడిన
(5) మేలైన
ఇంక కొన్ని అర్థములు కలవేమో.
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి పాదాభివందనాలు. మీ పద్యాశీస్సుల వలన నేను ధన్యతను పొందాను. కృతజ్ఞుడను.
రిప్లయితొలగించండిగురువు గారూ ధన్యవాదములు. మీరు చక్కని పద్యాలతో అందఱి పద్యాలను విశ్లేషించారు. శ్రీ పండిత నేమాని వారి శుభాశీస్సులు శోభాకరముగా ఉన్నాయి.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండినేమాని పండితాఖ్యుల
రిప్లయితొలగించండిప్రేమాస్పద దీవెనలవి శ్రీమంతంబుల్!
నీమంబున శంకరవర!
సేమంబున్ జేయు బ్లాగుఁ చిరకాలంబున్.
చంద్రశేఖర్ గారూ, నరసింహ మూర్తి గారూ, మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
పండిత నేమాని గారి వ్యాఖ్య ....
రిప్లయితొలగించండిసోదరి నేదునూరి రాజేశ్వరి గారికి నా పై సంపూర్ణమైన గౌరవమే ఉన్నది.
పద్యరూపములో సమముగా వివరింప లేక పోయినది. మార్చిలో ఆమెతో అమెరికాలో నేను ముఖస్తముగా మాటాడుట కూడా జరిగినది.
ఆమె హృదయమ్ము భక్తి భావావృతమ్ము
ఆమె భావమ్ము నవకవిత్వాశ్రయమ్ము
ఆమె వాక్యమ్ము మధురరసాన్వితమ్ము
ఆమె నాశీర్వదింతు సమాదరమున
శంకరార్యా!ధన్యోస్మి. ధన్యవాదములి.
రిప్లయితొలగించండిఅవధాన సరస్వతి , పాండితీ స్రష్ట , ఐన పండిత నేమాని వారి ఆదరాభి మానములకు కృతజ్ఞు రాలను నా జన్మ ధన్య మైనది . ఎంతో వ్రాయాలన్న ఆసక్తితో అసక్తు రాల నయ్యాను నా పొరబాటును మన్నించి ఆశీర్వ దించిన వారి ఔన్నత్యం శ్లాఘనీయము .
రిప్లయితొలగించండి" మరొక సారి శిరసు వంచి పాదాభి వందనములు." సెలవు .
అక్కయ్యా,
రిప్లయితొలగించండి‘సెలవు’ అన్నది ఈ ఒక్క పోస్టుకే కదా! మొత్తం బ్లాగుకు కాదు కదా! అంతపని చేయకండి. ఈ తమ్ముడికి అన్యాయం చేయకండి.
ధన్య వాదములు తమ్ముడు ! మీ ఆదరాభి మానాలకి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అమ్మో ! ఈ బ్లాగు నుంచి దూరంగా వెళ్ళ గలనా ? వెళ్ళి బ్రతక గలనా ? అదే ఒకేసారి.
రిప్లయితొలగించండి"కీమాయణ" పుస్తకమును
రిప్లయితొలగించండి"రామస్వామి" యె రచించి రాముని
తెగడెన్;
మామూలు పాపి కాదొకొ!
"ప్రామాణిక" పుస్తకమును "పాపి" రచించెన్
...పెరియరు రామసామి కొందరికి పూజ్యుడు...ద్రవిడ వాది... కొందరికి పాపి...రాముడిని త్రాగుబోతుగ, సీతను వ్యభిచారిణిగ చిత్రించిరి...
కంబ రామాయణమును ఆంగ్లములో నవలగ రచించిన ఆర్ . కే. నారాయణ్ గారి దృష్టిలో రామాయణమొక మధుర శృంగార గాధ (romantic story)...
ప్రభాకర శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోమటి ఛార్టరకౌంటెటు
రిప్లయితొలగించండినీమమ్ముల తాడు తెంచి నెగ్గుట యెటులో
గోముగ తెలుపగ కోరుచు
ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్