17, సెప్టెంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం -462 (యమునకు పద్యానురక్తి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

45 కామెంట్‌లు:

  1. స్వయముగ పద్యము జెప్పును
    రయముగ తానాశువుగను రమ్యము గానే!
    ప్రియమైన చిట్టి చెల్లెలు
    యమునకు, పద్యానురక్తి హాయింగూర్చున్!!

    రిప్లయితొలగించండి
  2. శాస్త్రి గారు,
    భలే గా యమున ను చేశారే, బాగుంది. నేనింకా యముడినేం చెయ్యాలా అని ఆలోచించాను.
    మీరేమీ అనుకోకపోతే ఒక మాట.చెల్లెలి మీద ప్రియం ఎక్కువై ప్రాస మరిచినట్టున్నారు

    రిప్లయితొలగించండి
  3. అమరెను వేదిక యిచ్చట
    కమనీయమ్మగు తెనుగున ఘనముగ పద్యా
    లమరును రసికుల సముదా
    యమునకు, పద్యానురక్తి హాయింగూర్చున్.

    రిప్లయితొలగించండి
  4. సుమనసరాడిభ కవికుల
    సుమనోహర కృష్ణభూప శోభిత సభలో
    కమనీయపు కైతల క
    య్యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్

    రిప్లయితొలగించండి
  5. సుమధుర సుందర కవితలు
    ప్రముదంబును గూర్చు.తెలుగు పద్య ప్రియులకున్,
    సుమ పేశలమగు కవి హృద
    యమునకు, పద్యానురక్తి హాయింగూర్చున్.

    రిప్లయితొలగించండి
  6. మందాకిని గారూ! 'యమున' గురించి ఆలోచిస్తూ తొందరలో చేసిన పొరపాటు.సున్నితమైన హెచ్చరిక తో సవరణకు అవకాసము కల్పించిన మీకు ధన్యవాదములు.
    అద్భుతమైన పురాణ జేశారు.నేనూ మీ 'సముదాయము' లో చేరు చున్నాను.
    'అష్టావధాని' శర్మ గారూ ! 'కయ్యమైనా' పూరణ తియ్యగా వుందండీ !

    యమునకు స్తోత్రము మరి క
    య్యమునకు సరిజోడు, జూడ నభిమానులె నె
    య్యమునకు,కవికుల సముదా
    యమునకు, పద్యానురక్తి హాయింగూర్చున్!!

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగుందండి . నలుగురు యమునలతో పూరణ. వరుసగా ఎవరికి ఏది నచ్చుతుందో అందంగా చెప్పారు.
    పండితుల వారి రెండు పూరణలూ అందంగా అమరినాయి.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
    ప్రముద , జమున అక్కచెల్లెళ్ళ కోసము దిరిగెడి యమునకు వారుజిక్కక
    పద్యములు పాడుచునుండును అది
    .................................
    క: ప్రముదకు సుమనిష్టము, మరి
    జమునకు సుమనోహరుడగు జగనిష్టము, ని
    త్యము భూప్రదక్షిణలు జే
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్|

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, సెప్టెంబర్ 17, 2011 10:56:00 AM

    సుమధురకవితాప్రౌఢిన్,
    విమలపదంబున్, వివేకవిద్యలయందున్,
    సములై, సల్పినతమవి
    య్యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్.

    కయ్యానికైన, వియ్యానికైన సమ ఉజ్జీలుండాలంటారు కదా.

    రిప్లయితొలగించండి
  10. రమణీయము హరి రూపము
    కమనీయమ్మతనిలీల,కమలాపతి నా
    మముపై పండిత సముదా
    యమునకు,పద్యానురక్తి హాయింగూర్చున్!!

    రిప్లయితొలగించండి
  11. కమనీయంబౌ కవితలు
    రమణీయంబుగ పఠింప రసముప్పొంగన్
    విమల మతులకు, భువన విజ
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్!!

    రిప్లయితొలగించండి
  12. మిత్రుల పూరణలు అలరిస్తున్నాయి ,

    సుమధురతరాంధ్ర సరసిన
    నమరిన నంబుజము లనగ నా సుమ మధువుల్
    తమకమున గ్రోలు భృంగ చ
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్ !

    రిప్లయితొలగించండి
  13. సుమతిన్ బూనిన యెడ దుః
    ఖమును శ్రమను బాపి మది వికాసము నింపున్
    సముచిత గతి సుజన నికా
    యమునకు పద్యానురక్తి హాయిన్ గూర్చున్

    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  14. మిత్రుల పూరణలు అలరిస్తున్నాయి ,

    సుమధురతరాంధ్ర సరసిన
    యమరిన యంబుజము లనగ నా సుమ మధువుల్
    తమకమున గ్రోలు భృంగ చ
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్ !

    రిప్లయితొలగించండి
  15. నుగామము యడాగమములలో యెప్పుడు సందేహమే ! నా రెండు పద్యాలలో యేది సరి యైనదో దయచేసి వివరించ గలరా !ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:

    క్రమమున్ దప్పక చదివెద
    ప్రముఖుల విరచితములైన పద్యములెన్నో
    సుమధుర సూర్యోదయ సమ
    యమునకు, పద్యానురక్తి హాయింగూర్చున్

    రిప్లయితొలగించండి
  17. యమునా తటమున జని
    కుముదములను గాంచి నంత కులుకచు ఖుషియై !
    తమికొని హృదయము రంజిల
    యమునకు పద్యాను రక్తి హాయిం గుర్చున్ !

    రిప్లయితొలగించండి
  18. క్రమరీతిఁ సర్వజన స
    భ్యముగ ప్రదర్శించెడి మన పౌరాణిక వే
    షములం దాంగీ కాభిన
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్

    రిప్లయితొలగించండి
  19. హనుమచ్చాస్త్రిగారూ, మంచి పద్యం చక్కని సమన్వయము. పోలిక పాటించటానికి, ఇలా వుంటే?
    యమునకు స్తోత్రము మరి క
    య్యమునకు సరిజోడు, జూడ "నభిమానమె" నె
    య్యమునకు, కవికుల సముదా
    యమునకు, పద్యానురక్తి హాయింగూర్చున్!!

    రిప్లయితొలగించండి
  20. సముచిత నుడికారపు ప-
    ద్యములకు శ్రీభాగవతము దధియై తనరున్,
    సుమన స్సువర్ణ సుజ్ఞే-
    యమునకు పద్యానురక్తి హాయిన్ గూర్చున్.

    రిప్లయితొలగించండి
  21. సమ 'యమునకు ' తగు పూరణలు చేసి తమ పద్యానురక్తిని చాటిన కవిమిత్రు లందరకు అభినందనలు.

    క్రమముగ మాధవ పెద్దియు
    కమనీయుడు ఘంటసాల గాయక పద్యం
    బమరము, వినగా మనః హృద
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్ !

    రిప్లయితొలగించండి
  22. గోలి హనుమచ్ఛాస్త్రి గారు,
    "మనః హృదయము" లో విసర్గము ఎక్కువైనదా?
    "వినగా" లో గకారము దీర్గమయిందా?

    రిప్లయితొలగించండి
  23. సత్యనారాయణ గారూ! అది 'మన హృదయమే ' టైపాటు ను చూసుకోలేదు.
    గుర్తించి తెలిపినందులకు ధన్యవాదములు.

    సవరణతో ...

    క్రమముగ మాధవ పెద్దియు
    కమనీయుడు ఘంటసాల గాయక పద్యం
    బమరము, వినగా మన హృద
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్ !

    రిప్లయితొలగించండి
  24. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మొదటి పూరణ ‘చెల్లెలు యమున’ను వదిలేశారే! నా సవరణ ...

    అమరగ పద్యమ్ముల స
    క్రమముగ నాశువుగఁ జెప్పు రమ్యముగానే
    ప్రమదమున చిట్టి చెల్లెలు
    యమునకు, పద్యానురక్తి హాయిం గూర్చున్,

    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. మూర్తి మిత్రమా ' సరసున నమరిన ' సరియైనది.

    రిప్లయితొలగించండి
  26. మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘ఇచ్చట అమరిన వేదిక’ శంకరాభరణమేనా?
    *
    ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మీ కైతల కయ్యపు పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    సుమధుర పూరణతో ప్రముదాన్ని గూర్చారు. అభినందనలు.
    ‘పద్యప్రియులకున్’ అన్నప్పుడు ‘ద్య’గురువై గణదోషం ..?
    *
    వరప్రసాద్ గారూ,
    వైవిధ్యంగా ఆలోచించారు. బాగుంది. అభినందనలు.
    కాని ‘భూప్రదక్షిణలు జేయమునకు’ ... ?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    వియ్యము కుదిర్చిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా ! నా మొదటి పూరణమును హృదయమునకు హాయింగూర్చునట్లుగా మలచిన మీకు కృతజ్ఞతలు.
    నా పూరణమున 'అభిమానము ' తో చక్కగా సమన్వయము చేసి చూపిన
    "మనతెలుగు" వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  28. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ ‘భువనవిజయపు’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘భృంగచయము’పై మీ పూరణ అదిరింది. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘సరసిన నమరిన’, రెండవపద్యంలో ‘అమరిన యంబుజములు’ సరైనవి.
    *
    పండిత నేమాని గారూ,
    ‘సుజననికాయము’ మెచ్చెడి ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    పద్యం పఠనంతో మీకు తెల్లవారుతున్నదన్న మాట. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. రాజేశ్వరక్కయ్యా,
    చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    ‘ఖుషియై’ అన్యదేశ్యపదం ... ?
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
    పద్యనాటకాల ప్రసక్తితో ఉత్తమమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
    అది ‘ఆంగికాభినయం’! ‘ఆంగీకాభినయం’ కాదు. ఆ పాదాన్ని ‘షములందు నాంగి కాభిన’ అంటే సరి!
    హనుమచ్ఛాస్త్రి గారి పూరణకు మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు.
    *
    సుజ్ఞేయ కవితా మాధుర్యం గల మీ ఫూరణ మధురంగా ఉంది. అభినందనలు.
    ‘భాగవతము దధియై’, ‘భాగవత ముదధియై’ శ్లేష అదిరిందండోయ్!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మూడవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. రాజేశ్వరి గారు,
    మొదటి పాదము చివరలో 2 లఘువులు గాని లేదా ఒక గురువు కాని తగ్గినది.
    "యమునా తటమున జని_ _"

    రిప్లయితొలగించండి
  31. జిగురు వారూ,
    ఆ గణదోషాన్ని గమనించాను. సరిదిద్దాలనుకున్నాను. మా అక్కయ్య తమ్ముడికి పని కల్పించకుండా ఉండదు కదా! అయితే వ్యాఖ్యను టైప్ చేసే సమయంలో మరిచిపోయాను.
    ‘యమునా తటమునకును జని’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  32. రాజేశ్వరక్కయ్యా,
    మీరు ‘సమస్యాపూరణం - 7’ను బుక్ మార్క్ చేసినట్టున్నారు. ఈసారి బ్లాగు తెరిచినప్పుడు పైన ఉన్న‘హోమ్’ను క్లిక్ చేసి బుక్ మార్క్ చేయండి. ఇకనుండి ఫ్రెష్ పేజీని నేరుగా చూడవచ్చు.

    రిప్లయితొలగించండి
  33. ." ఖుషి " ఆన్న పదానికి తెలుగు నిఘంటువులో " సంతోషము " అని ఉంది. అందుకని సరి పొతుం దనుకున్నాను గురువు గారూ !
    నేను అదే అనుకున్నాను " ఇంత కరెట్టుగా ఎలా రాసానా అని ? సరి జేసిన ఇద్దరికీ ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  34. మిస్సన్న గారూ, గురువు గారూ కృతజ్ఞతలు.
    శ్రీ పండిత నేమాని వారు,అవధాని శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ గారు శ్రీ చింతా రామకృష్ణా రావు గారు చక్కని పూరణలు చేస్తూ బ్లాగు శోభనినుమడింప చేస్తున్నారు. వారలకు మరో సారి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  35. గురువుగారూ ధన్యవాదములు.
    ముందు ఉదధి అనే వ్రాసాను.
    టైపు చేసేటప్పుడు పొరపాటు వల్ల దధి వేరు పడింది.
    మీరన్నట్లుగా అనుకొని అలానే ఉంచేశాను.

    రిప్లయితొలగించండి
  36. కుమతికిమద్యము, ఫలసా
    యమునకు సేద్యము, సుమతుల కనవరతము వి
    ద్య మరియును సుకవిసముదా
    యమునకు పద్యానురక్తి, హాయిం గూర్చున్!!!

    రిప్లయితొలగించండి
  37. మంద పీతాంబర్ గారూ,
    అత్యుత్తమమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పద్య సేవనం మధ్యలో అల్పాహారం ! ఆ అనుభూతే అత్యంత మధురం !

    01)
    _____________________________________

    నమలిన నోటికి రుచిగా
    నమరిన జంతికల తోడ - నన్నియు సరిగా
    సమకొన , సుమనస్సముదా
    యమునకు పద్యానురక్తి - హాయిం గూర్చున్!!!
    _____________________________________
    సుమనస్సు = విద్వాంసుఁడు

    రిప్లయితొలగించండి
  39. ‘పద్యప్రియులకున్’ అన్నప్పుడు ‘ద్య’గురువై గణదోషం రాదండి. లఘువై సుగణ యుక్తమై ఒప్పుతుందని నా అభిప్రాయం. అప్పకవి ఎప్పిన ప్రమాణాలున్నాయండి.
    మీ సునిశిత పరిశీలనా పటిమకు నాకు అాలా ఆశ్చరుఅం వేస్తోందండి. ఎంత ఓపిక మీకు?
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  40. కమలాక్షుల నిరసనతో
    సుమనోహర యౌవనమున సుకుమారున దా
    కమలిన హృదయమ్మున గా
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్

    రిప్లయితొలగించండి
  41. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  42. తమతమ గొప్పలు తెలుపుచు
    క్షమ గోరుచు జంట కవులు కందలు పాడన్
    కమనీయపు కంఠమ్మున
    యమునకు పద్యానురక్తి హాయింగూర్చున్

    రిప్లయితొలగించండి