వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
(నిజానికి ఇందులో ‘సమస్య’ లేదు. పాదపూరణమే! మీ మీ కవితామాధుర్యాన్ని చవిచూపడమే!)
మనమొక రాజహంసయయి
మంచిని పెంచి సుఖించు టొప్పగున్.
ఈ పద్యపాదాన్ని పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.
అనయము క్షీరనీర ముల నారసి పేరును గొన్నతీరుగన్
రిప్లయితొలగించండిమనమొక రాజహంసయయి మంచిని పెంచి సుఖించు టొప్పగున్.
వినయము తోడ వేడుకొన వీణనుఁ బూనిన శారదాంబ వా
హనమున కున్న మంచిగుణమబ్బును. నమ్ముము మానసంబునన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
___________________________________________
మనిషను,బుద్ధి గల్గి,యభి - మానము జూపుచు జీవు లన్నిటన్
మనదగు బంధు, మిత్రులకు - మాన్యత బెంచుచు , ప్రేమ బంచుచూ
మనమున తల్లి,దండ్రి,గురు - మన్నన జేయుచు మంచి వర్తనన్
మనమొక రాజహంస యయి - మంచిని పెంచి సుఖించు టొప్పగున్ !
___________________________________________
పండిత నేమాని గారి పూరణ ....
రిప్లయితొలగించండిధన జన యౌవనాదులు సదా పెనుపొందగ జేయు గర్వమున్
వినయము విద్యయున్ దగు వివేకముతో వసుధైక గేహ భా
వనమున నెల్ల లోకులకు భద్రము గోరుచు తోడు నీడయై
మనమొక రాజహంసయయి మంచిని పెంచి సుఖించుటొప్పగున్
మునివర ముఖ్యులున్ భరతభూమి వసించిరె దివ్య మార్గమున్
రిప్లయితొలగించండిఘనతర వేదశాస్త్రములు కర్మవరిష్ఠతఁ గల్గె నీ ధరన్
దనరగ ధర్మ వర్తనులు దాతలు నేతలు పుణ్యశీలురున్
మనమొక రాజహంస యయి మంచిని పెంచి సుఖించు టొప్పగున్
ధనమున కొంత పేదలకు దానము సేయుచు , పాండితీ ప్రభల్
రిప్లయితొలగించండిఘనముగ మంది కోస , మధికారము లోకము కోస మెంచుచున్ ,
మన దిన చర్య రోజుకొక మంచిపనిన్ మొదలై చరించుచున్ ,
మనమొక రాజ హంస యయి మంచిని పెంచి సుఖించుటొప్పగున్
నా పద్యమునకు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి సవరణ. నాకు వ్యక్తిగతముగా పంపినా మిత్రులు గురువుగారు ఆనందిస్తారని యిక్కడ మీతో పంచుకొంటున్నాను.
రిప్లయితొలగించండిఆర్యా ! ఒక వరసలో అన్నయ్య, మరో వరసలో బావగారు ( శ్రీ పండిత నేమాని వారి భార్య గన్నవరపు వారి ఆడుబిడ్డ ) అవుతారు. కడు దూరములో ఉన్నా ప్రతిదినము మీకు వంగి వంగి నమస్కారములు పెడుతున్నాను. మీ కవనపు రీతి మాకబ్బునె ? మీ విద్వత్తుకు జోహారులు !
మునివర ముఖ్యులీ భరత భూమి విశిష్ఠత వృద్ధిసేయగా
ఘనతర వేద శాస్త్ర తతి జ్ఞాన పథమ్మున తోడు లయ్యెడున్
దనరగ నాయకాగ్రణులు ధర్మ పథమ్మున, సజ్జనాళికిన్
మనమొక రాజహంసయయి మంచిని బెంచి సుఖించు టొప్పగున్
నేను వారాంతపు సమస్య ఇచ్చాననీ, దానికి వచ్చిన పూరణలను సమీక్షించాలనీ మరిచేపోయాను. ఇంతకు ముందే మందాకిని గారు గుర్తు చేసారు. మరో రెండు మూడు నిమిషాల్లో ‘కరెంట్’ పోతుంది. కనుక ఈ సాయంత్రం వరకు వాటి విషయం చూస్తాను. ఆలస్యానికి మన్నించండి.
రిప్లయితొలగించండిమనిషని యన్న వాని ప్రతి మానస మందున మంచి చెడ్డలున్
రిప్లయితొలగించండిగొనకొని చేరి యుండు మరి గొప్పగ పాలును నీర మట్టులే
ఘనతర శక్తి బొందనగు జ్ఞానము పెంపుగ జేసి, భూమి పై
మనమొక రాజహంసయయి మంచిని బెంచి సుఖించు టొప్పగున్.
**********************************************************************
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
మనోహరమైన పదబంధాలతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
**********************************************************************
వసంత కిశోర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘మనిషి’ అనే పదం లేదు, అది ‘మనుష్యుడు’. ‘మనిసి’ ఉంది. ‘మనిషి + అను’ అన్నప్పుడు సంధి లేదు. ‘మనిసి + అను’ ఆన్నా అదే సమస్య. అక్కడ ‘మనుజుడు’ అంటే సరిపోతుంది. ‘చేయుచూ’ అనేది ‘చేయుచున్’ అని ఉండాలి.
**********************************************************************
పండిత నేమాని గారూ,
నీతిప్రబోధకమై అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
**********************************************************************
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
మూడవ పాదం చివర ‘పుణ్యశీలురున్’ స్థానంలో ‘మెచ్చునట్లుగన్’ అని ఉంటే పూరణకు ఒక సంపూర్ణత సిద్ధిస్తుం దనుకుంటాను.
నేమాని వారు సవరించిన పద్యం చూసాను. అద్భుతంగా ఉంది. అంతటి కవివరేణ్యులు మీ బంధువులని తెలిసి మీ అదృష్టాన్ని అభినందిస్తున్నాను.
**********************************************************************
రాజారావు గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
**********************************************************************
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
‘మనిషని యన్నవాని’ అన్నచోట ‘మనుజు డటన్నవాని’ అందాం. ఎందుకో వసంత కిశోర్ గారి పూరణకు నా వ్యాఖ్య చూడండి.
**********************************************************************
గురువుగారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండినేను కూడా ఈ వారాంతపు పూరణం చేయటం మరచి పోయాను.
ఉదయం మందాకినిగారి వ్యాఖ్య చూసి గుర్తుకు వచ్చి వెంటనే పూరించాను.
మందాకిని గారూ! ధన్యవాదములు.
ధనమును ఖర్చు చేయకను దండిగ వచ్చెడి పెన్షనందునన్
రిప్లయితొలగించండితినుచును నాల్గు పూటలను తీరిక వేళల వ్రాసి పద్యముల్
ఘనముగ రాజకీయముల గండర గండుల చీల్చిచెండుచున్
మనమొక రాజహంసయయి
మంచిని పెంచి సుఖించు టొప్పగున్