16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -461 (దోఁచుకొన్నవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దోఁచుకొన్నవాఁడె తోడునీడ.

35 కామెంట్‌లు:

 1. పాలు వెన్నలన్ని పరులనింటనుఁజేరి
  దోఁచుకొన్నవాఁడె, తోడునీడ
  గా నిలిచెను నాడు గాలివానఁ గురియఁ
  చిన్నిఁదండ్రిఁ దీర్చె చిక్కులన్ని.

  రిప్లయితొలగించండి
 2. మందాకిని గారూ,
  వేగంగా స్పందించి మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
  ‘పరుల యిండ్లను జేరి’ అనండి. అర్ధానుస్వారాల ప్రయోగంలో కాస్త శ్రద్ధ చూపండి. అవి తప్పుగా ప్రయోగించడం కంటే అసలే ప్రయోగించక పోవడం ఉత్తమం.

  రిప్లయితొలగించండి
 3. గురువుగారు,
  అర్ధానుస్వారం ప్రయోగం ఈ మధ్యే అలవాటు చేసుకుంటున్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 4. మావ కొడుకు వాడు, మనువాడ లేనిచో
  బ్రతుక లేను, నాదు బ్రతుకు వాడు
  మనసు నిచ్చి దొంగ ! మనసునే దొరలాగ
  దోఁచుకొన్నవాఁడె, తోడునీడ.

  రిప్లయితొలగించండి
 5. గోకులంబునందు గ్రోలి పాల్వెన్నల,
  పొన్న చెట్టునెక్కి పొంచి, గోపి
  కాళి మానధనము కాళిందితటమున
  దోఁచుకొన్నవాఁడె, తోడునీడ!!!

  రిప్లయితొలగించండి
 6. హృదయ మందు మెలగి హృదయమ్ము వెలిగించి
  కరుణ తోడఁ గాచు పురుషు డతఁడు
  ఇచ్చు వాఁడె మరల హృదయమ్ము మెచ్చెనా
  దోఁచుకొన్న వాఁడె తోడు నీడ !

  రిప్లయితొలగించండి
 7. మంచి మంచి చీర లెంచి తెచ్చెను నాకు
  నగలు నీకె యనెన డుగక మున్నె
  ప్రేమ నింపిడంగ పెన్నిధి యై మది
  దోఁచు; కొన్నవాఁడె తోడునీడ.

  రిప్లయితొలగించండి
 8. కష్టములు క్రమ్మి వేచిన కలత పడక
  దైవమును నమ్మి ప్రార్థించ దయను కనును.
  బ్రోచు పరమాత్మ హృదయమ్ము దోఁచుకొన్న,
  వాఁడె తోడునీడగ నుండి వరలఁ జేయు.

  రిప్లయితొలగించండి
 9. గురువు గారికి నమస్కారములతో
  -------------------
  దోచుకొన్న వాడె తోడు నీడగనుందు
  నన్న గొఱ్ఱె వలెను కన్న వార్ని
  వీడి ఖలుని జెంత కొచ్చి జేరెడి వారు
  నేడు సకల జనుల నాయకులగు|

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని గారి పూరణ ...

  దోచుకొనును శ్రితుల దుఃఖముల్ దురితముల్
  దోచుకొనును హృదయ తోయజములు
  దోచుకొనును రిపుల దురభిమానమ్మిట్లు
  దోచుకున్నవాడె తోడు నీడ

  రిప్లయితొలగించండి
 11. నా పూరణ ...

  నన్ను విడిచిపోయె నా సొమ్ములన్నియు
  దోఁచుకొన్నవాఁడు; తోడునీడ
  గా మెలంగు ననుచుఁ గన్నవారికి వీడి
  లేచివచ్చి పాటులే పడితిని.

  రిప్లయితొలగించండి
 12. అయ్యో, వరప్రసాద్ గారి పూరణ ముందే చూసి ఉంటే నా పూరణను ప్రకటించకపోయేవాణ్ణి!

  రిప్లయితొలగించండి
 13. నా పూరణ ...
  (2)
  గద్దెనెక్కియున్న కన్నతండ్రి పలుకు
  బడియె తనకు పెట్టుబడిగ కోట్లు
  వడసి మురిసినట్టి వానికి గనులను
  దోఁచుకొన్నవాఁడె తోడు నీడ.

  రిప్లయితొలగించండి
 14. చిన్న నాటి నుండి చెలిమికి సైదోడు
  ప్రాణ మిచ్చు వాడు ప్రాణ సఖుడు
  కలిమి లేములందు గని పెట్టు కొని , మది
  దోచు కొన్న' వాడె ' తోడు నీడ

  రిప్లయితొలగించండి
 15. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, సెప్టెంబర్ 16, 2011 1:07:00 PM

  దీర్ఘ పాప ఫలము, దేహాభిమానంబు
  తొలగజేసి ముక్తి కలుగజేయ
  కొంటెతనముతోటి గోపికావస్త్రము
  ల్దోచుకొన్నవాడె తోడునీడ.

  రిప్లయితొలగించండి
 16. గురువు గారు మీ పూరణ అద్భుతం, నా ప్రయత్నం నక్క ద్రాక్షపళ్ళను
  అందుకోవాలడి దానితో సమానం. మీ స్పూర్తితో
  కన్న వారిని జూడరు కాని పుత్రులకొఱకు సంపాదింతురు.
  ----------------
  2
  కన్న వారిపైన కరుణ జూపగలేరు
  దోచు కొన్నవాడ్కి తోడు నీడ
  నిల్చి, గణన జేయు నీలపు రాళ్ళను
  పది తరముల కొఱకు పటుతరముగ|
  (నీలపు రాళ్ళ = వజ్రాలు, ఎక్కువ మొత్తములో ధనము)

  రిప్లయితొలగించండి
 17. మనసులోన నిలిచి మమకారమును పెంచి
  కలిమి లేములందు కలసి మెలసి
  కల్ల కపట మనక యుల్లమందున ప్రేమ
  దోచు కొన్న వాడె తోడు నీడ !

  రిప్లయితొలగించండి
 18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఎంకి పాటలా అందంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  మనోహరంగా ఉంది మీ పూరణ. ఆభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీరు దోచకుండా ‘కొన్నారు’. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  ఆటవెలది సమస్యను తేటగీతిగా మార్చిన మీ నైపుణ్యానికి జోహార్లు. మంచి పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  ‘వార్ని’ పదప్రయోగం, మూడవపాదంలో గణదోషం, ‘చెంతకొచ్చి’ ప్రయోగం లోపాలు. నా సవరణ ...
  ‘........ కన్న వారి
  వీడి ఖలుని జేర విచ్చేయు వారలు ....’
  రెండవ పూరణ రెండవ పాదంలో ‘వాడ్కి’ ప్రయోగం ... ? ‘దోచు కొను నతనికి తోడు నీడ’ అందాం.
  *
  పండిత నేమాని గారూ,
  మనోహరమైన పూరణ. అభినందనలు.
  *
  రాజారావు గారూ,
  మీ పూరణ నిజంగానే మది దోచించి. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరక్కయ్యా,
  సంతోషం! నిర్దోషంగా చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. గురువుగారూ ధన్యవాదాలు.
  మీ రెండవ పూరణ అదిరింది.

  రిప్లయితొలగించండి
 20. ధర్మపత్ని పతికి దగురీతిదయి మది
  దోచుకున్న, వాడె తోడునీడ
  వాడె దైవమనుచు వర్తిలుచుండగ,
  పతియు ప్రీతి చూపు పడతి పైన.

  రిప్లయితొలగించండి
 21. శంకరార్యా ! ధన్యవాదములు.
  మీ పూరణల తో మది దోచు కున్నారు.
  తమకు తోచిన విధముగా పూరణలతో చక్కగా మది దోచిన కవి మిత్రులకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. గిరులు ఝరులు గనులు సిరులతో ధరనెల్ల
  దోచుకొన్నవాడె తోడునీడ,
  తల్లి,దండ్రి,సఖుడు,దైవసమానుండు
  రాజ కీయ మందు రాజు నేడు!!!

  రిప్లయితొలగించండి
 23. తమ్ముడూ ! నాకు బాధగా ఉంది .మీకు పని చెప్పలేదని .[ అందుకే ధన్య వాదములు ]

  రిప్లయితొలగించండి
 24. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, సెప్టెంబర్ 16, 2011 9:42:00 PM

  గురువు గారూ,
  ధన్యవాదములండీ.

  రిప్లయితొలగించండి
 25. మందాకిని గారూ,
  ఆదర్శదాంపత్యాన్ని ఆవిష్కరించారు మీ పూరణలో. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  రాజకీయపు రాజును అభివర్ణించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. దోచె కట్నమనుచు, దోచె లాంఛనమని,
  దోచె పబ్బమనుచు, దోచె నకట
  దాచు కున్నదెల్ల దశమ గ్రహంబన,
  దోఁచుకొన్నవాఁడె తోడునీడ!!

  రిప్లయితొలగించండి
 27. జిగురు సత్యనారాయణ గారూ,
  వాహ్! రకరకాలుగా దోచుకొనే అచ్చమైన తోడునీడ గురించి అద్భుతమైన పూరణ నిచ్చారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. శ్రీగురుభ్యోనమ:

  తోచకున్నదేమి దొరలాగ వ్రాయగా
  భావ కల్పనమ్ము లేవి యైన
  దోచు కొన్న వాడె తోడు నీడగ నాకు
  మార్గదర్శి యగును మాన్యు డగును

  రిప్లయితొలగించండి
 29. ఇప్పుడే మిత్రుల పూరణలు చదివాను. తెలియకుండానే చింతా వారి బాట పట్టాను.
  మూడడుగుల నేల నడిగి ముజ్జగముల
  దూరిన త్రివిక్రముడు బలిఁ దోచుకొన్న
  వాఁడె తోడునీడై మనువగుదు వంచు
  వాని వాకిట జేరెను భటునిగనట!

  రిప్లయితొలగించండి
 30. కణిమొళి గురించి ఎవరైనా ప్రస్తావించారా ?

  దోచుకొన్న యమ్మ దొరబిడ్డ యైయుండి
  దొరికి పోయె నయ్యొ ! చెరను బడెనె !
  రాచఠీవి గమలి రాజన్న దరిఁ జేర
  దోఁచుకొన్న వాఁడె తోడు నీడ !!!

  రిప్లయితొలగించండి
 31. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  సర్వం జగన్నాథం :

  01)
  _________________________________

  దొరల జేయ నాడు - దొంగల వలెమారి
  ధైర్యముగను దోచి - దాచు కొనిరి !
  ఊరి మీద నేడు - ఓదార్పు యాత్రలా ???????????????
  దోచుకొన్న వాడె - తోడు నీడ !!!!!!!!!!!!!!!!

  _________________________________

  రిప్లయితొలగించండి
 32. తప్పదు మరి , సీత గీత దాటితే :

  02)
  _________________________________

  దోర దోర వయసు - దొర బాబుతో గూడి
  దారులందు వలపు - బారు లంద
  తుంది వచ్చె నేడు - తోయజాక్షికి జూడ
  దోచుకొన్న వాడె - తోడు నీడ !
  _________________________________
  దారులందు = వీథులందు(అడ్డూ ఆపూ లేకుండా ఎక్కడబడితే అక్కడ)
  వలపుబారులు = దొంతర్లదొంతర్ల ప్రేమ బహుమతులు
  తుంది = కడుపు

  రిప్లయితొలగించండి