కామేశ్వర రావు గారూ, మీరు చెప్పిన తరువాత నిశితంగా పరిశీలించినప్పుడు తెలిసింది మీ పూరణలోని ‘ముక్తపదగ్రస్తం’. బాగుంది. సంతోషం! ద్వితీయార్థంలో లేదా షష్ఠ్యర్తంలో ‘రాగు, ధర్ము’ అని ‘పరుడు’ మాత్రం ప్రథమలో ఉండి అన్వయక్లేశం ఏర్పడుతున్నది. అక్కడ ‘దుర్వ్యసనపరుని’ అంటే సరిపోతుంది కదా!
ధనము వెచ్చించి నిర్మించ ఘనము గాదు
రిప్లయితొలగించండిభక్తి వినయము లేనట్టి ప్రజల కొఱకు
ధర్మ సత్రనిర్మాణముల్ దగని పనులు
బ్రతుకు సుఖమున నేతలు బాగు పడగ
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బ్రతుక సుఖముగ...’ అంటే ఇంకా బాగుంటుంది.
ధనము వెచ్చించి నిర్మించ ఘనము గాదు
తొలగించండిభక్తి వినయము లేనట్టి ప్రజల కొఱకు
ధర్మ సత్రనిర్మాణముల్ దగని పనులు
బ్రతుక సుఖముగ నేతలు బాగు పడగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపుణ్యకార్యములనగ నీ పుడమి యందు
రిప్లయితొలగించండినాలయమ్ములుకాసారమాసుపత్రి
ధర్మసత్రనిర్మాణముల్ , దగని పనులు
చోరవృత్తి గోవధయును జూదశాల
పానగృహనిర్వహణమను పాప కృతులు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొలది బుద్దితో గర్వించి కూల్చ తగునె?
రిప్లయితొలగించండిప్రజకు మేలును గూర్చును పాఠశాల
భవనముల్ వైద్యశాలలు బస్సు స్టాండు
ధర్మసత్రనిర్మాణముల్! దగని పనులు!!
జిగురు సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విటులు తిరిగెడు వేశ్యల వీధులైన
రిప్లయితొలగించండిజూద గృహములు నెలకొన్న చోటు లోన
వధ్యశాలల నడిపెడు వాడలందు
ధర్మసత్రనిర్మాణముల్ , దగని పనులు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిబుద్ధుని గనెను క్రూరుని బుద్ధి మారె
దారి వెంబడి చెట్లను దాపున మరి
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు
జేయు నొకడు కట్టెను సేవ జేతు ననుచు
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వైద్య శాలలు గలచోట వలయు దగిన
రిప్లయితొలగించండిధర్మ సత్రనిర్మాణముల్, దగని పనులు
దగినపనులేవొ వివరింత్రు ధర్మ పరులు,
నాచ రించిన చాలు ముత్యాలు రాలు !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అధమ మార్గమ్ముల ధనార్జ నాను రాగు
రిప్లయితొలగించండిరాగ మత్సర కలిత దుర్వ్యసన పరుడు
పరము విస్మరింపంగ నపగత ధర్ము
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.
పోచిరాజు కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా పూరణ లో విశేషమేమైనా గమనించారా?
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీరు చెప్పిన తరువాత నిశితంగా పరిశీలించినప్పుడు తెలిసింది మీ పూరణలోని ‘ముక్తపదగ్రస్తం’. బాగుంది. సంతోషం!
ద్వితీయార్థంలో లేదా షష్ఠ్యర్తంలో ‘రాగు, ధర్ము’ అని ‘పరుడు’ మాత్రం ప్రథమలో ఉండి అన్వయక్లేశం ఏర్పడుతున్నది. అక్కడ ‘దుర్వ్యసనపరుని’ అంటే సరిపోతుంది కదా!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరు చెప్పినది నిజమే. నేను గమనించలేదు. సరిదిద్ద గలవాడను. ధన్యవాదములు.
తొలగించండిఅధమ మార్గమ్ముల ధనార్జ నాను రాగు
రాగ మత్సర కలిత దుర్వ్యసన పరుని
పరము విస్మరింపంగ నపగత ధర్ము
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండిధర్మపరుడగు నాతని తాత . . . చేయ
ధర్మసత్ర నిర్మాణముల్ :- దగని పను ల
ట౦చు , స్థలమును లక్షల కమ్మ వచ్చు ,
లేద యేని సౌధముల నిర్మి౦చ వచ్చు
న౦చు , నె౦చిన మనుమ డొకి౦చు క౦త
నాలసి౦పక. కూల్చివేయ౦గ నె౦చె
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుణ్య కార్యాచరణంపు మూర్తి చర్య
రిప్లయితొలగించండిధర్మ సత్ర నిర్మాణముల్ - తగని పనులు
తాను జేయకుండుటెగాక, ధర్మ హీను
డగుచు నాటంకముల గూర్చి నగుచునుంట!
పుణ్య కార్యాచరణంపు మూర్తి చర్య
రిప్లయితొలగించండిధర్మ సత్ర నిర్మాణముల్ - తగని పనులు
తాను జేయకుండుటెగాక, ధర్మ హీను
డగుచు నాటంకముల గూర్చి నగుచునుంట!
పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మొదటిపాదంలో గణదోషం. ‘...కార్యాచరణపు సన్మూర్తి చర్య’ అంటే ఎలా ఉంటుంది?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి›
మంచికార్యముల్సోదర!యంచితమగు
ధర్మసత్రనిర్మాణముల్దగనిపనులు హానిగలిగించుగార్యముల్లాచరించ మంచిజేయుటశ్రేయముమందికెపుడు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేలుచేయు పథికులకు మిక్కుటముగ
రిప్లయితొలగించండిధర్మ సత్ర ని ర్మాణముల్ , దగని పనులు
పెద్ద లేర్పరచిన సత్ర మద్దెకిచ్చి
ధనము వెనకేసు కొనునట్టి దాష్టి కమ్ము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఏసుకొను’ అనడం వ్యావహారికం. ‘ధనము వెనుక వేసుకొనెడి...’ అందామా?
మంచి కార్యములనబడు మహిని గుడులు
రిప్లయితొలగించండిబడులు శరణాలయమ్ముల వాసములగు
ధర్మసత్రనిర్మాణముల్,దగని పనులు
నాసిరకముగ నిర్మించి గాసిబెట్ట !!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పల్లె,పట్నాల ప్రభుత చేపట్ట వలెను
రిప్లయితొలగించండిధర్మసత్ర నిర్మాణముల్;తగని పనులు
జూద గృహములు మధుశాల సుంకము గొన
ననుమతించుట ప్రజల కనర్ధ మొదవు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యాత్రలందు భక్తులకు –ప్రయాస మాన్ప
రిప్లయితొలగించండిధర్మసత్ర నిర్మాణముల్.”తగనిపనులు
నచట గావించి దోషంబు లంటనీక
భక్తి వేషాన లాభాలఫలము దోచ|”
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ప్రయాస మాన్చు’ అంటే బాగుంటుందేమో!
లోక కళ్యాణ కార్యములు జరుగుటకు
రిప్లయితొలగించండిమంచి బోధించుచున్నచో మహికి మేలు.
కలలనైనఁ గాదనుటయే, వలదనుటయె
ధర్మసత్రనిర్మాణముల్? దగని పనులు.
లక్ష్మీదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లోకమంతట చందాలు సేకరించి
రిప్లయితొలగించండినిధుల దుర్వనియోగము! నీతి మఱచి!
నాసిరకముగ నిర్మించ నవ్వి పోరె?
ధర్మసత్ర నిర్మాణముల్! దగని పనులు!!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పల్లె,పట్నాల ప్రభుత చేపట్ట వలెను
రిప్లయితొలగించండిధర్మసత్ర నిర్మాణముల్;తగని పనులు
జూద గృహములు మధుశాల సుంకము గొన
ననుమతించుట ప్రజల కనర్ధ మొదవు
దోచుకొని యక్రమమ్ముగ, దాచుకోనగ
రిప్లయితొలగించండికోట్ల ధనము విదేశాన గుప్త పరచి
ప్రజకు, ప్రభుతకు జూపగ ప్రకటనలిడి
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.
నిన్నటి పూరణ
దేవకీ వసుదేవుల దీప్తి యనగ
పార్థసారథి జన్మించె; భానుమతికి
సర్వ లక్షణ లక్షితుడుర్వి ననగ
లక్ష్మణకుమారు డటులె,విలక్షనుండు
దోచుకొని యక్రమమ్ముగ, దాచుకోనగ
రిప్లయితొలగించండికోట్ల ధనము విదేశాన గుప్త పరచి
ప్రజకు, ప్రభుతకు జూపగ ప్రకటనలిడి
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.
నిన్నటి పూరణ
దేవకీ వసుదేవుల దీప్తి యనగ
పార్థసారథి జన్మించె; భానుమతికి
సర్వ లక్షణ లక్షితుడుర్వి ననగ
లక్ష్మణకుమారు డటులె,విలక్షనుండు
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘విలక్షణుండు’కు టైపాటు...
మంచి పనులను చేయంగ మాధవుండు
రిప్లయితొలగించండికూడ మెచ్చుచుండునిలను కూర్మి తోడ
ధర్మసత్రనిర్మాణముల్;దగని పనులు
చేసి పరుల ముందు బ్రతుకు చెరుపుకోకు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది.
‘మెచ్చుచుండు, దగును కూర్మితోడ...’ అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.
ఆగమమ్ముల సూత్రము లర్థ మవక
రిప్లయితొలగించండికర్మ యోగపు కిటుకులు కాన లేక
మర్మ మెరుగక వాస్తుల మాయ లెల్ల
చింత దీరుట కొరకై చేసి నట్టి
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనుల
కిరువు గావె భ్రష్టుల కిల పరువు బోవ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆగమమ్ముల సూత్రము లర్థ మవక
రిప్లయితొలగించండికర్మ యోగపు కిటుకులు కాన లేక
మర్మ మెరుగక వాస్తుల మాయ లెల్ల
చింత దీరుట కొరకై చేసి నట్టి
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనుల
కిరువు గావె భ్రష్టుల కిల పరువు బోవ!