5, మార్చి 2016, శనివారం

పద్యరచన - 1184

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

38 కామెంట్‌లు:

  1. 1.
    తల్లులు చేతురు ముదముగ
    బెల్లము పాకమ్ము జేసి ప్రేమగ వీటిన్
    పిల్లల పెద్దల కొరకై
    పల్లీలును నువ్వు పుట్న పప్పుల తోడన్

    2.
    పిల్లల పెద్దల వృద్ధుల
    యుల్లములను గెల్చినట్టి యుండలు గావే
    బెల్లము తోజేసినచో
    పల్లీ పుట్నాల లడ్డు బలమునె యిచ్చున్

    3.
    నోటి లోన నీటి యూటనే బెంచుచున్
    యుల్లములను దోచె యుండ లివియె
    యొకటి దిన్న మనసు యూరుకోదింకను
    పదులు దాట నేమి వదల బోము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపద్యంలో ‘నువ్వు, పుట్ల’ అని బహువచన ప్రత్యయం లేకుండా వ్రాశారు.
      మూడవపద్యంలో ‘...బెంచుచు|నుల్లములను... దిన్నను మన సూరుకోదింకను’ అనండి.

      తొలగించండి
  2. తినుటకు రుచికర మైనవి
    కనినంతనె మదిని మెచ్చి కతికిన చాలున్
    కనుమున నోచగ తెలుగున
    అనునయముగ పూజ జేసి యాదర మొప్పన్

    రిప్లయితొలగించండి
  3. పళ్లెమున పిండి వంటలు
    కళ్లెము తీపికి జిలేబి కాలము కాదే
    నుల్లము తినుమను చున్నన్
    యెల్లలు యిచ్చకు గలదుర ? యిప్పుడు వలదే :)

    యిట్ల స్వీట్లు పెట్టి నోరూరించేస్తే ఎట్లాగండి ! ప్చ్ తినడానికి యోగము లేదే షుగరో ష్ గురో :)

    సుగురోదయం
    షుగరోదయ :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది.
      ‘కాదే| యుల్లము తినుమనుచున్న| న్నెల్లలె యిచ్చకు...’ అనండి.

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. అ.వె.
    పటము నందు గాంచి పప్పుండల గురుల
    ఘువులను మరిచితిక, గుర్తు లేదు
    గణవిభజన, నీరు గారె నోట, టపాన
    మడచి గట్టి పంపు శంకరయ్య
    - వెంకోరా.
    (ఏకవచన ప్రయోగమునకు మన్నించండి కండి శంకరయ్య గారు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలిరువురికీ నా ధన్యవాదములు. అటులే చేసెద.
      ఆ.వె.
      పటము నందు గాంచి పప్పుండల గురుల
      ఘువులను మరిచితిక, గుర్తు లేదు
      గణవిభజన, నీరు గారె నోట, టపాన
      మడచి గట్టి యంపు శంకరార్య
      - వెంకోరా.

      తొలగించండి
    2. ఆర్యా ధన్యవాదములు. నాల్గవ పాదము లో యతి లోపము గూడ గలదు. “టపా” హిందీ పదము గనుక
      కరుణ/ నింక పంప రాదె శంకరార్య! అనిన బాగుంటుంది. పరిశీలించండి.

      తొలగించండి
  6. ి
    ి
    * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆ హా ! నోరూరి౦చే లడ్డులు ! కా నీ ,
    సు గ రు రో గి తి నా ల ను కు న్నా వా టి ని తి న లే డు .
    అ లా గే , ధీ శ క్తి హీ ను డు
    చే యా ల ను కు న్న గా నీ తా ను ఏ ప ని చే య లే డు . ఇ క. వా రి ని దే వు డే కా పా డా లి !
    ………………………………………………………

    అనురక్తిన్ గని తీపి లడ్డు మధుమేహగ్రస్తు
    డత్యాశగా


    తినగా నె౦చియు మెక్క జాల | డటులే ,
    ధీశక్తి హీను౦ డిలన్


    ఘనకార్యాచర ణాభి లాషి యయినన్ ,
    నైరాశ్య భావమ్మునన్ ,


    వెనుదీయున్ గద. ! వారి (న్) రక్షణము
    గావి౦చున్ జగన్నాధుడే ! !

    రిప్లయితొలగించండి
  7. అండాకృతి దాల్చి యచట
    నిండార ఫలకమున రమణీయముగా ను
    వ్వుండలు బెల్లపు లడ్డులు
    మెండుగ నోరూరుచుండ మేమఱ పాయెన్

    రిప్లయితొలగించండి
  8. గొప్పగ నువ్వుల యుండలు
    పప్పుండలు బేర్చిరచట పళ్ళెరమందున్
    తప్పక దినుచున్న నివియె
    ముప్పుల పాల్బడక మంచి పుష్టి నొసంగున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది.
      ‘ముప్పుల పాల్సేయకుండ పుష్టి నొసంగున్’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  9. పానకమ్ముఁ జేసి నానిన బెల్లమ్ము
    పాకమోలె కాచి పాత్ర యందు
    పప్పుల రకములను బాగుగా వేయించి
    ముద్దఁగట్టి తినెడి మోజె మోజు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది.
      ‘పాకము వలె...’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:

      పానకమ్ముఁ జేసి నానిన బెల్లమ్ము
      పాకము వలె కాచి పాత్ర యందు
      పప్పుల రకములను బాగుగా వేయించి
      ముద్దఁగట్టి తినెడి మోజె మోజు!

      తొలగించండి
  10. పల్లీ ల యుండ లచ్చట
    యుల్లము సంతోష బడగ నొప్పెను గనుమా
    మెల్లగ జని యచట కుమరి
    గుల్లగ నున్నట్టి యుండ గొనిరా పద్మా !

    రిప్లయితొలగించండి
  11. పెళ్లిపేరంటములకడ పిల్లలున్న
    తీపిపాకమునందున తిరిగినట్టి
    గుడులయందు –ప్రసాదమై కొలువుదీరి?
    నోటికందిన లడ్లన్ని చాటురుచిని|
    2.

    రిప్లయితొలగించండి
  12. బెల్లపు లడ్డుల గనుగొని
    యుల్లము తినగోరు చుండె నుత్సా హముతో
    చల్లనిసాయం కా లము
    వెళ్ళెద షాపుకు మిటాయి బ్రీతిగ గొనిరాన్

    రిప్లయితొలగించండి

  13. సెనగయుండలునికవేరుసెనగయుండ
    లచ్చటముద్దుగానుండెనునార్య!కనిరె!
    యొండుగలవటనువ్వులయుండలుమరి
    యూరుచుండెనునిపుడునానోరుమిగుల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది.
      రెండవపాదంలో గణదోషం. ‘...లచట ముద్దుగా గనుపించె నార్య కనరె’ అనండి. ‘...యూరుచుండె నివ్వేళ నా నోరు...’ అనండి.

      తొలగించండి
  14. వినగల మాటలున్ చెవుల విజ్ఞత బంచగ మానసంబుకున్
    కనులకు గానుపించగనె ?కమ్మని వాసన బట్టుముక్కులే
    తినగల లడ్డులున్గనగ?తీపిగ నూహలుబంచు నాల్కయే|
    మనుగడ మంత్రముల్ నివియె| మానవ బుద్దికిలడ్డువంటివే.

    రిప్లయితొలగించండి

  15. బలము పెరుగు ననుచు పల్లీలతో చేయ
    పాప మొదలు నింట పండు ముసలి
    వరకు నిష్ట పడుచు వడివడిగా దిను
    నుండ లివియె గనుడు నువిదలార.

    పిల్లల కొరకనుచు బెల్లము నువ్వులు
    కలిపి ప్రేమ తోడ కట్టినారు
    తీపి యుండలెల్ల తినగ రుచియుమెండు
    అమ్మ చేసె దిపుడె యలుపు లేక.

    ఆవురావు రనుచు నారగించగ రండు
    బుడ్డ విత్తనాల పుడిని చేసి
    పాకమందు పొడిని పైపైన జల్లుచూ
    లడ్డు కట్టు చుండ లగ్గు యగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పద్యాలు బాగున్నవి.
      మొదటిపద్యంలో ‘...గాంచు డువిదలార’ అనండి.
      రెండవపద్యంలో ‘తినగ మెండు రుచియు| నమ్మ చేయు నెప్పు డలుపు లేక’ అనండి.
      మూడవపద్యంలో ‘పైపైన జల్లుచున్’ అనండి.

      తొలగించండి
  16. చాయ నువ్వు పప్పు చక్కగా వేయించి
    మంచి బెల్ల మెంచి దంచి రోట
    రెండు పొడులు కల్పి యుండలుగా చేసి
    తినిన రుచికి యలరి తీరు జిహ్వ.

    వేరుసెనగపప్పు వేయించి దోరగా
    గుడము పాకముగను కూర్చి కలిపి
    యుండరీతి జేయ నుండును గుమ్ముగా
    మదిని దోచు తినిన మరల మరల.

    తియ్యటి బెల్లము నెంచుక
    చయ్యన పాకమ్ము చేసి చకచక దానన్
    వెయ్యగ వేపుడుపప్పును
    తియ్యని సెనగుండ లౌను తినుటకు మనకై.

    తురుముగ చేసిన కొబ్బరి
    నురువగు బెల్లమున కల్పి యుంచిన పాత్రన్
    సరియగు మంటను బెట్టిన
    మరి కొబ్బరినౌజు దొరకు మనకు తినంగన్.

    తీపివంటకముల తీరుకు బెల్లము
    శ్రేష్ఠమైన దగును స్వీకరింప
    దాని వాడకమ్ము తగ్గించి చక్కెర
    నమితముగను వాడ హాని కలుగు.

    రిప్లయితొలగించండి
  17. పప్పులుండ జూడ పారవశ్యమవును
    తినగ పండ్లు లేక తిప్ప లాయె
    శనగ బెల్లపుండ చక్కగానుండును
    సుగరు రోగముండ సుస్తి జేయు :(

    రిప్లయితొలగించండి