31, మార్చి 2016, గురువారం

పద్యరచన - 1188

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

47 కామెంట్‌లు:

  1. 1.
    పరమ పావని శ్రీవాణి పరవ శమున
    వీణమీటిన చందాన విశ్వమందు
    గానమొనరించ మురిపించె కలికి పాట
    చెప్పగవశమౌనె యిల సుశీల ఘనత.

    2.
    గాన కోకిల బిరుదమ్ము గలిగి నట్టి
    తెలుగు తల్లికి బ్రియపుత్రి ధీరవనిత
    విశ్వకీర్తిని బడసిన విమల చరిత
    సాటి లేనట్టి సంగీత సవ్యసాచి

    3.
    పూతరేకులరిశ పూర్ణంపు భక్ష్యాలు
    పాలకోవ లడ్డు బాదుషాల
    కన్న మధుర మైన గాత్రమే కలిగున్న
    మధురగాయనియని మహిని వెలిగె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      చివరిపద్యంలో ‘కలిగి+ఉన్న’ అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘కలిగిన’ అన్నా సరిపోతుంది కదా!

      తొలగించండి
    2. ధన్యవాదములండి సరిచేసుకున్నాను

      తొలగించండి
    3. పరమ పావని శ్రీవాణి పరవ శమున 
      వీణమీటిన చందాన విశ్వమందు
      గానమొనరించ మురిపించె కలికి పాట
      చెప్పగవశమౌనె యిల సుశీల ఘనత.

      2.
      గాన కోకిల బిరుదమ్ము గలిగి నట్టి
      తెలుగు తల్లికి బ్రియపుత్రి ధీరవనిత
      విశ్వకీర్తిని బడసిన విమల చరిత
      సాటి లేనట్టి సంగీత సవ్యసాచి

      3.
      పూతరేకులరిశ పూర్ణంపు భక్ష్యాలు
      పాలకోవ లడ్డు బాదుషాల
      కన్న మధుర మైన గాత్రమే కలిగిన
      మధురగాయనియని మహిని వెలిగె.

      తొలగించండి
  2. పాటల గంధివి నీవని
    మాటలలో చెప్ప లేను మణి మౌక్తికమౌ
    సాటెవరు నీకటంచును
    మేటివి గదగాన రసఫణి మేలిమి పైడీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది.
      చివరిపాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. క్షమించాలి గణదోషం నాకు తెలియటల్లేదు
      " రసజ్ఞ " అంటే కుదురుతుందేమొ అని

      తొలగించండి
    3. అక్కయ్య గారు "మేటివి గదగా నరత్న మేలిమి పైడీ" అనండి. మీ పాదములో "న" ఒక లఘువు ఎక్కువ ఉంది.

      తొలగించండి
    4. ‘రసఫణి’ అన్నచోట ఒక లఘువు ఎక్కువ. ‘రసజ్ఞ’ అన్నాకుదరదు. ‘మేటివి గద కన రసఫణి...’ అనండి.

      తొలగించండి
    5. పాటల గంధివి నీవని
      మాటలలో చెప్పలేను మణి మౌక్తికమౌ
      సాటెవరు నీకటంచును
      మేటివి గదకన రసఫణి మేలిమి పైడీ

      సోదరు లిరువురకు ధన్య వాదములు

      తొలగించండి

  3. శుభోదయం !

    చిన్ని వయసునే సినిమా
    లన్నిట పాటలు సుశీల లబ్జుగ పాడెన్
    మిన్నగ పేరును గాంచెన్
    గిన్నిసు పొత్తమున వచ్చి కీర్తిని పొందెన్ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. భక్తిపాటల విన పారవశ్యముగల్గు
    ప్రేమ గీతికవిన ప్రీతి గలుగు
    చిలిపి పాటలకును చెంగున మనసూగు
    పంచదారలు పంచు బాలగీతి
    కడువిషాదపుపాట కళ్ళనేచెమరించు
    హాస్యగీతి మనసు హాయినింపు
    వీణపాటలలోన విఖ్యాతమీగొంతు
    లాలిపాటలకును మేలుమేలు

    పీసుశీలయన్న ప్రియమైనకోయిల
    తెలుగు గాన లతకు తీపికొమ్మ
    స్పష్టమైన స్వరము సరితెలుంగు వరము
    చేరే ' గిన్నిసునను ' జేలు జేలు.

    రిప్లయితొలగించండి
  5. గాన కోకిలవు సుశీల గైకొ నుమ! న
    తులను ,నీదు గానమ్ము సం తోష బరచె
    మమ్ము లనునెం త యో ,కాన మనుగడ సుఖ
    మయము గావుత !శంకరు మహిమ వలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. మధురగీతాలతో పదునాల్గు భువనాల
    ............పరిమళములు నింపు పైడిబొమ్మ
    నవరసమ్ములొలుక నద్భుత రీతిలో
    ..............గొంతెత్తి పాడిన కోకిలమ్మ
    భాష యేదయినను బహుభక్తి తోబాడి
    .........వాసిగాంచిన మేటి వజ్రమమ్మ
    వేల పాటలు బాడి వేదికలలరించు
    .........గానకోకిల నిను గడన దరమె!


    విజయనగరమందు విరిసిన కోయిల
    సాటి గలరె నీకు జగతి లోన!
    సురుచిరమధు దార సుస్వరాల సుశీల
    అందుకొనుమ తల్లి వందనములు!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ సీసపద్యం బాగున్నది. అభినందలు.
      మొదటిపాదంలో ‘ద-ధ’ ప్రాసయతి వేశారు.

      తొలగించండి
    2. శైలజ గారూ, మధు "ధార" అనండి లేకపోతే సమాస దోషము. “మధుర గీతగణ సంహతమున భువనాల” అనండి.“మ” కి సం“హ” కి యతి చెల్లుతుంది. (బిందు పూర్వ “హ”)

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      నేను గమనించలేదు. ధన్యవాదాలు.

      తొలగించండి
    4. శ్రీ కామేశ్వరరావుగారికి ధన్యవాదములు...

      తొలగించండి
  7. చక్కని గాత్రము శ్రోతల
    నిక్కము రంజిల్ల జేయు నీ గాన సుధల్
    దక్కెను మాకే నక్కా !
    మ్రొక్కెద, నీ కీర్తి నిలుచు భువిని సుశీలా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పద్యరచనాంశమునిప్పుడే చూచాను.

    మానవ పూజార్హ రమ
    జ్ఞానామృత మయ మనోజ్ఞ నాద భరితముల్
    గాన సుధా రస ధారల
    గాన సహస్రద సుశీల కరుణా మయియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  9. పి.సుశీలగాయినిపై పద్యములు
    1.పలుకులరాణి భావనల బంధ సుగంధమె రాగయుక్త మై
    విలువలు గూర్చు శక్తియు,వివేకమునందు “సుశీల”గానమే
    నిలిపెను మానసాన ననునిత్యము చిత్ర పరిశ్రమందునే
    నిలువల వోలె నిల్పెగద నేర్పున కూర్పున పాటలందునన్.
    2.గీత సంగీతమందు సుఖించు నట్లు
    గానమాధుర్య మందించ?కలిమి బలిమి
    రాగమనురాగమై పాడ మూగయైన
    పరవ శించును పాములా పాటవినగ|
    3.లాలిపాటను బాడ?సుశీల గొంతు
    పిల్లలేడుపు నిదురించు కల్లగాదు|
    యువత కందించు పాటలు భవితకెపుడు
    ప్రేమ పెంపొందజేయు|సంపెంగ లాగ|
    4.వృద్దు లైనచొ?భక్తి సంతృప్తి నొసగు
    పాటమాటునదాగిన పరవశంబు
    భాష లేవైన పాడ శభాషుయనగ
    పంచగలిగె సుశీల సుస్వరముమనకు|
    5.ప్రతిభను పంచి పెంచె గద భావన భాగ్యము రాష్ట్రమంతటన్
    ప్రతి శృతియందు రాగములుపంచిన పద్దతి గంట నాదమై
    బ్రతుకగ పాట పల్లవి సభా సదులందున,చిత్ర సీమలో
    ప్రతిపద మందు నేర్పు,టనురాగముబాడ?సుశీలవే సుమా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘సంపెంగ వలెను, శభాషనంగ’ అనండి.

      తొలగించండి
  10. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆ హ ! తారా శ్రుతి య౦దున రవళి౦చు
    . . మురళీ స్వనమ్మును పోలి నట్టి

    వైణికా మాధుర్య వాద్యములో పలి
    . . కి౦చు స౦గతులను మి౦చు నట్టి

    ఆ వస౦త ద్రుమ మ౦దు హాయిగ. నాల
    . . పి౦చు పికము మరపి౦చు నట్టి

    సురలోక మున నున్న సుధకన్న , భువినున్న
    . . తేనియ కన్న , బల్ తియ్య నట్టి


    మధుర గాత్రము గలిగిన. మాత వీవు
    .............................................
    గానశారదకు బ్రియ౦పు సూన వీవు
    గానశీల ! సుశీల ! తల్లీ ! నమస్సు
    దక్షిణభరత సీమ నుద్భవము గా౦చి ,
    నీవు మమ్మలరి౦చుట నిజము గాను
    మే మొనర్చుకొనిన పుణ్యమే కదమ్మ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  11. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆ హ ! తారా శ్రుతి య౦దున రవళి౦చు
    . . మురళీ స్వనమ్మును పోలి నట్టి

    వైణికా మాధుర్య వాద్యములో పలి
    . . కి౦చు స౦గతులను మి౦చు నట్టి

    ఆ వస౦త ద్రుమ మ౦దు హాయిగ. నాల
    . . పి౦చు పికము మరపి౦చు నట్టి

    సురలోక మున నున్న సుధకన్న , భువినున్న
    . . తేనియ కన్న , బల్ తియ్య నట్టి


    మధుర గాత్రము గలిగిన. మాత వీవు
    .............................................
    గానశారదకు బ్రియ౦పు సూన వీవు
    గానశీల ! సుశీల ! తల్లీ ! నమస్సు
    దక్షిణభరత సీమ నుద్భవము గా౦చి ,
    నీవు మమ్మలరి౦చుట నిజము గాను
    మే మొనర్చుకొనిన పుణ్యమే కదమ్మ !

    రిప్లయితొలగించండి
  12. పంచదారకన్న పాలుచక్కెర కన్న
    మధురమైన యట్డి మంచి గాత్ర
    మిలనెవరికి గలదు నింతి సుశీలకు
    గాక!వినగ రండు కాంతలార
    2.భరత మాత గన్న భవ్య చరితవీవు
    కమ్మనైన మధుర కంఠమెత్తి
    పాడు పాట వినగ పరవశాన మురియు
    బుధుల కైన వీరి పొగడ తరమె .

    3గానకోకిల ప్రశస్తి ఘనముగాను
    పొందినట్టిమహిళనీదు పుణ్యమేమొ
    కంఠమెత్తి పాడుచునుండ కరగు శిలలు
    శారదయు నిల్చె గళమున శాశ్వతముగ.

    4.భక్తి పాటలైన బరువుపాటలె యైన
    వలపు పాటలైన వరుసగాను
    అలుపు లేక తాను యాలపించుచు నుండు
    భరతజాతిగన్న భవ్య చరిత.

    5.చక్కని గాత్రముఁసతతము
    మక్కువ తోడన్ వినియెడి మనుజులు యిలలో
    పెక్కురు గలరను మాటయు
    నిక్కము,గానపుమధురిమ నెల్లెడ వినిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. కోటి రాగాల శ్రుతి నీవు కోకిలమ్మ,
    తేనె కన్న మధురమేదొ తెలిసెనమ్మ
    సుస్వరాల సుశీలమ్మ! శుభము గలుగ
    నందు కోవమ్మ గానాభి వందనాలు!

    రిప్లయితొలగించండి
  14. కోటి రాగాల శ్రుతి నీవు కోకిలమ్మ,
    తేనె కన్న మధురమేదొ తెలిసెనమ్మ
    సుస్వరాల సుశీలమ్మ! శుభము గలుగ
    నందు కోవమ్మ గానాభి వందనములు!

    రిప్లయితొలగించండి
  15. దశదిశల గానవాహిని
    యశమందుచు సాగెనమ్మ యంకిత మైనన్!
    విశదమ్మై గిన్నీసున
    సుశీల! మీ కీర్తిఁ జేరె సుస్వర జతులన్!

    రిప్లయితొలగించండి
  16. దశదిశల గానవాహిని
    యశమందుచు సాగెనమ్మ యంకిత మైనన్!
    విశదమ్మై గిన్నీసున
    సుశీల! మీ కీర్తిఁ జేరె సుస్వర జతులన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. నాగు పాము కూడ నాట్యమాడును సుమ్మ
    నీదుగళములోని నాదమునకు
    నీదు జోల పాట నిదు రబుచ్చును సుమ్మ
    చంటి పాపల కడు చక్కగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  18. తోటలో విరిసిన పారిజాతములన్ని
    సాటి యగునే నీదు పాట ముందు
    తేటగా చెవి నిండ నీ మధుర గానమ్ము
    పూట గడుచును సౌశీల్య భావమందు


    వ్రాయాలన్న తపన తప్ప తెలుగు వ్యాకరణమునందు నా జ్ఞానము
    పూజ్యము. కేవలం స్వేచ్చా రచన మాత్రమే. మీ బ్లాగులో ప్రవేశించే
    అర్హత లేకపోయినా, నా సాహసాన్ని, తప్పొప్పులను
    సహృదయంతో మన్నించ గలరు. ___/\___ ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బండి ఎన్.ఎమ్.రావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. సాధనమునఁ బనులు సమకూరు... అన్నారు కదా! స్వస్తి!
      మీ పద్యానికి నా సవరణ...
      తోటలో కోయిలమ్మల పాటలన్ని
      సాటి యగునే సుశీల నీ పాటముందు
      చెవుల నీ గాన సుధలివే చేరుకొనగ
      పూట గడచును సౌశీల్యపాటవమున.

      తొలగించండి
    2. పూజ్యులు కంది శంకరయ్య గారికి ప్రణామములు.
      సవరణకు మరియు ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
      ___/\___ ...

      తొలగించండి