11, మార్చి 2016, శుక్రవారం

సమస్య – 1969 (చంపకమాలకు గణములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చంపకమాలకు గణములు సభరనమయవల్.

62 కామెంట్‌లు:

  1. పంపితి తెలుగు పరీక్షకు
    నింపుగ చందస్సు నేర్పి యిందులకా నీ
    దుంపతెగ వ్రాసినావట
    చంపకమాలకు గణములు సభరనమయవల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      ప్రొద్దున ప్రొద్దున్నే హాయిగా నవ్వుకునేలా చేసింది మీ పూరణ. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. చంద్రమౌళి వారు చదువంగ గుర్తుండు
      పద్యమొకటి వ్రాసి పడక నెక్కె
      చదివి నవ్వు కొనెడు చక్కిలిగింతల
      పంచుతుండె నదియె బాగు! బాగు!

      తొలగించండి
    3. దాందుంపతెగా గొప్ప పూరణ నిచ్చారు సూర్యనారాయణ గారూ!

      తొలగించండి
    4. ధన్యవాదములు మాష్టారు,సహదేవుడుగారు,గోలి వారు, మిస్సన్నగారూ, అక్కయ్య గారూ

      తొలగించండి
  2. ఇంపట నజభజ జజరలు
    చంపక మాలకు గణములు,సభరన మయవల్
    సొంపుగ నమరిన చాలును
    వంపులు దిరిగిన కరమది మత్తేభ మనన్

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి నమస్కారములు.... మీ అనారోగ్యము గురించి మీరు బాధపడడం నాకూ బాధేసింది...మీ జ్ఞాపకశక్తి అపూర్వము...దానికై చింతించకండి
    బహుజనపల్లి సీతారామా చార్యులు గారి శబ్దరత్నాకరమున శంభువు అంటే శివుడు విష్ణువు బ్రహ్మ బుద్ధదేవుడు అని వుంది ఆంధ్రభారతిలో లేదు. ....
    శంభుడు అంటే విష్ణువని అనుకుంటే నిన్నటి పద్యానికి అన్వయం కుదిరినట్టేనని అనుకున్నానండి...పొరపాటైతే మన్నించ మనవి


    ఇంపుగ నజభజ జజరలు
    చంపక మాలకు గణములు, సభరన మయవల్
    నింపారిన మత్తేభము
    సోంపగు నగలో మణివలె శోభిల్లునుగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      ధన్యవాదాలు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నింపారు’ శబ్దం ఉందా అన్న సందేహం కలిగి ఆంధ్రభారతిలో వెదికాను. ఉంది.

      తొలగించండి
  4. ఇంపగు మత్తేభములను
    సొంపుగ వ్రాయమని కోరి చూచెదవదియే
    లంపటము, నన్ను విడువుము
    చంపక, మాల! కుగణములు సభరనమయవల్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
      అయినా ఆ గణాలు కుగణాలు ఎలా అయ్యాయి? చంపకమాలకు కుగణాలు, మత్తేభానికి సుగణాలే కదా!

      తొలగించండి
    2. "మాల" అనే అమ్మాయి మత్తేభ పధ్యము వ్రాయమని కోరగ, అది వ్రాయలేని చేతకానితనాన్ని ఒప్పుకోలేక, ఆ పద్యగణములను "కుగణములు" అని అనటము

      ఇక్కడ "చంపక" అనే పదాన్ని DO NOT KILL అనే అర్థములో వాడాను. (సరి అయినదో కాదో తెలియదు)

      తొలగించండి
  5. శుభోదయం :)!

    సొంపుగ జిలేబి చెప్పెన్
    చంపకమాలకు గణములు సభరనమయవల్
    ఒంపుగ నమరెను కందము
    కొంపలు గూలున గణములు కొంచెము మారన్ :)

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఒక్క లఘువో, గురువో మారితేనే కొంపలు కూలుతాయి, మరి గణాలు మారితే ఇక అడగాలా?

      తొలగించండి

    2. కంది వారు !

      ఆరోగ్యం కుశలమేనా !

      చంద్ర మౌళి వారి పూరణ చదివాక వ్రాసా :)

      జిలేబి

      తొలగించండి
    3. ధన్యవాదాలు. ఇప్పుడు కాస్త ఫరవాలేదు.

      తొలగించండి
  6. విపరీతమైన భాషాభిమానం గలిగిన తెలుగు పంతులు పరీక్ష ప్రతులను దిద్దే సమయంలో వారి స్పందన

    కంపరమెత్తె చదువనిది
    "చంపక మాలకు గణములు సభరనమయవల్"
    చింపితి పరీక్ష ప్రతులన్
    చింపిరి వెధవకు సరిపడు శిక్ష యిదంచున్!


    రిప్లయితొలగించండి
  7. చంపుచునున్నది చదువుచు
    నింపుగ మత్తేభమునకు నేవో గణముల్
    నింపాదిగ చెప్పు తల్లీ !
    చంపకమాలకు-గణములు సభరనమయవల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మూడవ పాదంలో గణదోషం. 'నింపాదిగఁ జెప్పమ్మా' అందామా?

      తొలగించండి


    2. మాస్టరుగారూ ! ధన్యవాదములు..మీ సూచనతో సరిచేశాను.

      చంపుచునున్నది చదువుచు
      నింపుగ మత్తేభమునకు నేవో గణముల్
      నింపాదిగ చెప్పమ్మా!
      చంపకమాలకు-గణములు సభరనమయవల్

      తొలగించండి
  8. ఇంపుగ నజభజజజ రలు
    చంపక మాలకు గణములు, సభరన మయవల్
    సొంపుగ మత్తేభమునకు
    చంపావతి ! తెలియు మమ్మ ,ఛందో గణముల్

    రిప్లయితొలగించండి

  9. చింపితి మరిమరి పేపరు
    అంబను గూడన్ గొలిచితి అయ్యరొ తెలియన్
    నింపను గాలే ఎటులన్
    చంపకమాలకు గణములు సభరనమయవల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      రెండవ పాదంలో ప్రాస తప్పింది. మూడవ పాదం అర్థం కాలేదు.

      తొలగించండి
  10. ఎంపిక జేయగ నడిగెను
    "హంపిని"ఛందస్సునంత హనుమాచార్యుల్
    ఒంపులుదిరుగుచు బలికెను
    చంపకమాలకు గణములు సభరనమపవల్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదాన్ని అచ్చుతో కాకుండా 'వంపులు' అని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  11. ఎంపిక జేయగ నడిగెను
    "హంపిని"ఛందస్సునంత హనుమాచార్యుల్
    ఒంపులుదిరుగుచు బలికెను
    చంపకమాలకు గణములు సభరనమపవల్ !

    రిప్లయితొలగించండి
  12. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఇ౦పుగ. నజభజ జజరల్

    చ౦పక మాలకు గణములు | సభరన మయవల్

    సొ౦పుగ మత్తేభమ్మగు |

    చ౦పును మసజస తతగల. శార్దూల మికన్

    { చ౦పును = ఎక్కువ గురువు లున్న శార్దూలము మనలను చ౦పి వేస్తు౦ది}

    రిప్లయితొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గు రు వు గా రి కి న మ స్కా ర ము లు

    నిన్నటి నా పూరణము లో వివరణ. =

    శ౦భువు = శివుడు . విష్ణువు. బ్రహ్మ.

    అని రె౦డు నిఘ౦టువులలో ఉ౦డుట చూచి

    నేను పద్యము వ్రాశాను

    నమస్తే
    ి
    .

    రిప్లయితొలగించండి
  14. ఇంపుగ నజభజ జజరలు
    చంపకమాలకు గణములు సభరనమయవల్
    సొంపగు మత్తేభమునకు
    పెంపారు కవన సుమములు పేరిమి తోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు..నిన్నటి వివరణ మరల వ్రాయుచున్నాను.
      వక్రత్రిశిఖయు, ధాత్రీ చక్రమ్మున దైత్య కంపజ, శక్రాశనితుల్య, సదృశ
      చక్రాయుధమూ త్రిశూలమ్మున్ ధరించు శంభునకు నతుల్.
      క్రూరమైన మూడు కోణాలు కలది, భూమి మీద డైత్యుల కు వణుకు పుట్టించేది, వజ్రాయుధము తో సమానమైనదీ, చక్రాయుధానితో సమానమైనదీ యయిన త్రిశూలమ్మును ధరించిన శంభునకు వందనములు.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిన్నటి పూరణకు మీ వివరణ సంతృప్తికరంగా ఉంది. సంతోషం.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీ యారోగ్యము కుదుట పడుతున్నట్లు తలుస్తాను.

      తొలగించండి
    4. నా ఆరోగ్యం కొంత నయం. పూర్తిగా కోలుకోలేదు. ధన్యవాదాలు.

      తొలగించండి
  15. రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. చివరి రెండు పాదాల భావం సందేహాస్పదం.

      తొలగించండి
  16. పెంపొసగ స-ఖుడు,భ-ర్తయు,
    మంపుగొను ర-మణుడు న-నుపు మ-రుడును య-వను౦
    డింపుగ వ-రుడుగ భాసిల
    చంపకమాలకు.గణములు స-భ-ర-న-మ-య-వల్-.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  17. చెంపలు వా యింతు నెటుల
    చంపకమాలకు గణములు సభరన మయవల్ ?
    సొంపుగ నేర్పెదను వినుము
    పంపకవి కి శిశువు నేను వ్యాకరణములో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. ఇంపుగ నజ భజజజరలు
    చంపకమాలకు గణములు; సభరనమయవల్
    కెంపులె ! గణ సంయుక్తము
    సొంపగు మత్తేభమునకు శోభను గూర్చున్

    రిప్లయితొలగించండి
  19. ఇంపగు నజభజజజరలు
    చంపకమాలకు గణములు;సబరనమయవల్
    సొంపగు మత్తేభమునకు
    వంకర చేయక సతతము పలుకము పుత్ర !
    వంకర=వెటకారము

    రిప్లయితొలగించండి
  20. . చంపక మాలను జూచుచు {తరగతిగదియందలి చదువరి}
    చంపకమాలకు గణములు సబరనమయవల్
    పంపాపతి దెలుపగ| “గురు
    పంపా |పతిశివుడు గంగ |బదులిడునటులే|” {పంపాపతి ఉత్తరము-పంపా-పతిశివుడుగంగఅన్నరీతిఒకదానికినొకటిపొంతనలేని సమాదానం}
    2.కంపరమందునదెలిపెను
    చంపకమాలకు గణములు సబరనమయవల్
    “చంపక”సఖుడట,బలుడుగ,
    రంపు, నగవు , మర, యశము వరలగసుఖమగన్
    రంపు=గొప్పదనం;మర=గుట్టు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      ఇప్పటికీ మీ మొదటి పూరణలో భావం సందేహాస్పదమే.
      రెండవ పూరణ బాగుంది. కాని భ(గణాన్ని) బ(లుడుగ) అన్నారు.

      తొలగించండి
  21. కొంపలు మునగవు, వినగా
    నింపగు రీతినిఁ జదువవదేమీ ? వరుసల్
    తెంపితి కలుగగ భ్రమలిటు,
    చంపకమాలకు గణములు సభరనమయవల్.

    రిప్లయితొలగించండి
  22. చాలింపుమురా! చంపక
    మాలకు గణములు సభరన మయవల్లనుట
    న్నేలన్నవియే మత్తే
    భాలకు సొబగుగ పొసగును పరికింపుమురా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      సమస్యపాదాన్ని స్థానభ్రంశం చేసి చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
      ‘మయవల్+అనుట’ అన్నప్పుడు లకారానికి ద్విత్వం రాదు. అది కేవలం ద్రుతానికే (నకారానికే) పరిమితం. ‘మయవల్ గావే| యేలనన నవియె మత్తే|భాలకు...’ అనండి.

      తొలగించండి
  23. చాలింపుమురా! చంపక
    మాలకు గణములు సభరన మయవల్లనుట
    న్నేలన్నవియే మత్తే
    భాలకు సొబగుగ పొసగును పరికింపుమురా!

    రిప్లయితొలగించండి
  24. చాలింపుమురా! చంపక
    మాలకు గణములు సభరన మయవల్ గావే
    యేలనన నవియె మత్తే
    భాలకు సొబగుగ పొసగును పరికింపుమురా!

    ప్రత్యుత్తరంతొలగించు

    రిప్లయితొలగించండి
  25. చంపకు మదనపు మార్కుల
    నింపుగ కలుపుదురు బిట్టు నీయమి సరిగా
    గుంపున దొర్లిన తప్పిది
    చంపకుమాలకు గణములు సభారనమయవల్.

    రిప్లయితొలగించండి
  26. ఇంపుగ నేర్పెను గురువదె
    చంపక మాలకు గణములు సముచిత రీతిన్ !
    చంపకు సుమ్మీ వ్రాయుచు,
    చంపకమాలకు గణములు సభరనమయవల్!

    రిప్లయితొలగించండి
  27. జంపులు జగణము లిచ్చును
    చంపకమాలకు,...గణములు సభరనమయవల్
    కంపము మత్తేభమునకు,...
    చంపకు నన్నిటుల నిచ్చి చవట సమస్యల్!

    రిప్లయితొలగించండి