12, మార్చి 2016, శనివారం

సమస్య – 1970 (త్రాగుఁబోతు గొప్ప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.

49 కామెంట్‌లు:

  1. గురువు గారికి కవి మిత్రులకు నమస్కారములు

    1.
    మద్యమదియు నిచ్చు మత్తుయే తలకెక్కి
    త్రాగినంత నరుడు తనని మరిచి
    తాను జ్ఞానినంచు తత్వాలె పాడడా?
    త్రాగు బోతు గొప్ప తత్వ వేత్త

    2.
    మత్తు గోరి యెపుడు మద్యాన్ని సేవించు
    త్రాగుబోతు, గొప్ప తత్వ వేత్త
    జ్ఞాన సుధలు పంచి మానవ జాతికి
    సత్యపథము జూపు నిత్యమతడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణలో 'మత్తు+ఏ' అన్నప్పుడు యడాగమం రాదు. 'తనను మరచి' అనండి.

      తొలగించండి
  2. చెలిని మరువలేక కలతచెందిన దేవ
    దాసు చివరికయ్యె త్రాగుఁబోతు -
    గొప్ప తత్త్వవేత్త - చెప్పె మైకములోనె
    జగమె మాయయనుచు చక్కగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. సాధు వేష మేసి బోధజే యునునీతి
    త్రాగుఁ బోతు గొప్ప తత్త్వ వేత్త
    కలిని కుదిపి జూడ తెలుపును కధలెన్నో
    జగతి గాంచి నంత ప్రగతి వెలుగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలిని'...?

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారూ,
      'ఏయు'ప్రయోగం కూడ సాధువే.

      తొలగించండి
    3. నమస్కారములు
      " కలిని " అంటే ఇదికలియుగం కదా .కలిపురుషుడు చేసేపన్లు కలికే తెలుసు " అని అదన్నమాట
      sOdarulu chamdra mouLi gaariki dhanya vaadamulu.

      తొలగించండి
  4. 3.
    సిద్ధుడ నని చెప్పి సిద్ధాంత మనుచును
    భక్తి మత్తు యనెడు భ్రాంతిలోన
    మునిగి జనుల తాను ముంచుచున్ గంజాయి
    త్రాగు బోతు గొప్ప తత్వ వేత్త

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘మత్తు+అనెడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘మత్తనియెడు’ అనండి.

      తొలగించండి
  5. సరుకు లోదిగినంత జగతికి మూలము
    ****నాదమె యను రీతి వాదులాడు
    తూలి క్రిందపడుచు రాలిపోయెడిదె యీ
    ****దేహ నైజంబని తెలియ పరచు
    కైపెక్కి బురదయె చాపగ పవలించు
    ****ద్వంద భావములేని తాపసి వలె
    మత్తు వదిలినను మరి నడవగ లేడు
    ****తొలిజన్మ వాసనల్ తెలిసినట్లు

    మురిసి త్రాగు వేళ గరళ కంఠుడు కాడె
    గరుడ గమన సముడె కదులు వేళ
    పడిన వేళ తాను పంకజ భవుడగు
    త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. పలికిన పలుకు మరి పలుకక పలుకుల
    పలు పలు విధ ములన పలికి అలసి
    సొలసి డస్సి యేడ్చి సొమ్ములు పోయిన
    త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      వృత్త్యనుపాసతో శోభిస్తున్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. తిరిగి లోకమంత తీరుతెన్నులెరుగు
    వారి వలెను మిగుల వాగుచుండి
    మధువు బిగియ తూలు మాటలే సూక్తులౌ
    త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. మద్యమెపుడుతాగు మత్తులో తానుండు
    తాగుబోతు;గొప్పతాత్త్వ వేత్త
    తత్త్వ విషయములను తార్కికముగ దెల్ప
    జగతి జనుల కెల్ల ప్రగతి హెచ్చు.

    రిప్లయితొలగించండి
  9. జగమె మాయ యనుచు చక్కగా బోధించె
    తాగుబోతు;గొప్ప తాత్త్వికుండు
    తాను జనుల కెపుడు దైవచింతన నేర్పి
    అగ్ర స్థాన మందు నవనియందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      ‘అగ్రస్థాన’మన్నపుడు గ్ర గురువై గణదోషం.

      తొలగించండి
  10. సమము గాదె చూడ సర్వేశు దృష్టిలో
    చిన్న చీమ మరియు చెట్టుచేమ
    శునక సామజములు శుద్ధపండితుడును
    త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కామాలు పెడితే బాగుండేది.

      తొలగించండి


  11. త్రాగుబోతుగొప్పతత్త్వవేత్తయెమరి త్రాగిపలుకునిజముధరణినెపుడు పాడుచుండునెపుడుపాటలరూపాన తత్త్వములనునెన్నొతడుముకొనక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. కర్మ భూమి బుట్టి మర్మంబు దెలియుచు
    దైవ సన్నిధి జని తనువు మరచి
    భక్తి సారమంత బాగుగ ద్రాగెడు
    త్రాగుబోతు గొప్ప తత్త్వవేత్తయె మరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. పిరికి దేవదాసు విఫలప్రేమికుండు,
    త్రాగుబోతు,గొప్ప తత్వవేత్త
    జగము,బ్రతుకు,మాయ,వగయె సౌఖ్యమ్మని
    ఘంట కొట్టి పాడె ఘంటసాల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర గణదోషం. ‘విఫల ప్రేమికుడయె’ అందామా?

      తొలగించండి
    2. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
      పిరికి దేవదాసు విఫలప్రేమికుడయె,
      త్రాగుబోతు,గొప్ప తత్వవేత్త
      జగము,బ్రతుకు,మాయ,వగయె సౌఖ్యమ్మని
      ఘంట కొట్టి పాడె ఘంటసాల

      తొలగించండి
  14. పాప దుఃఖ హర మపార పారాశర్య
    వినుత సకల శాస్త్ర వేద సార
    ధరము హరికథా సుధా పాన మత్తుండు
    త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పోచిరాజ శతకము పూర్తి యయినది. ఇప్పుడు “పద్మావతీ శ్రీనివాసము” ద్విపద కావ్యము వ్రాయుచున్నాను. కానీ యిందు కృతిపతి సంబోధనా పద్యములు మాత్రము కందములో వ్రాయుచున్నాను. ఇది సమ్మతమేనా? తెలుపగోర్తాను.

      తొలగించండి
  15. బాధ్యతల నెరుగక వారుణి గొని సత
    మిల్లుగుల్లచేసి యొల్లక సతి
    ననుభవమ్ముఁబొంది యత్య కాలమునందు
    త్రాగుబోతు గొప్ప తత్వవేత్త

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...యంత్యకాలము’నకు టైపాటు.

      తొలగించండి
  16. బ్రాంది విస్కీలమత్తుడు త్రాగుబోతు.
    గొప్ప తత్వవేత్త చిలుము గొట్టమందు
    గంజ ముట్టించి దమ్మును గాఢముగను
    పీల్చి,జగమంత'మాయ' ని తల్చు వాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      తేటగీతిలో మీ పూరణ బాగుంది.
      ‘మాయ+అని’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘మాయగ దల్చువాడు’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులసూచన మేరకు సవరించిన పద్యము
      బ్రాంది విస్కీలమత్తుడు త్రాగుబోతు.
      గొప్ప తత్వవేత్త చిలుము గొట్టమందు
      గంజ ముట్టించి దమ్మును గాఢముగను
      పీల్చి,జగమంత'మాయ'గ తల్చు వాడు

      తొలగించండి
  17. . మత్తుమనసుకొసగి మర్యాదనేవీడు
    త్రాగుబోతు|”గొప్పతత్వవేత్త
    తనసుఖంబు గాక తనవారి సుఖమెంచు
    మానవత్వ మందు మసలుకొరకు.
    2.తప్ప-త్రాగుబోతు గొప్పతత్వవేత్త గాదులే
    నిప్పులాంటి నిజము యున్న?నేర్పుమీర జెప్పులే
    అప్పులెన్నియున్న మనిషి హాయిగాను –ద్రాగుచున్
    ముప్పుతిప్పలందు మునిగి మూర్ఖుడట్లుమెల్గులే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      ‘మనసున కొసగి’ అనడం సాధువు. ‘మత్తు మనసున కిడి’ అనండి.
      ‘నిజము+ఉన్న’ అన్నపుడు యడాగమం రాదు. ‘నిజము లున్న’ అనండి.

      తొలగించండి
  18. పచ్చి తాగుబోతు కచ్చితమునబల్కు
    మెట్ట వేదమైన గట్టి గాను
    మత్తు బెరుగు కొలది తత్వమంతబెరుగు
    త్రాగుఁ బోతు గొప్ప తత్త్వ వేత్త

    రిప్లయితొలగించండి
  19. సాని పొందు గోరి సరసమ్ము గావించి
    కల్లు , సార , గొనుచు కమ్మ గాను
    '' విశ్వదాభి రామ ! విను '' మను వేమన
    త్రాగుఁబోతు , గొప్ప తత్త్వవేత్త.

    రిప్లయితొలగించండి
  20. జగమె మాయ యనుచు చక్కగా బోధించె
    తాగుబోతు;గొప్ప తాత్త్వికుండు
    తాను జనుల కెపుడు దైవచింతన నేర్పి
    అవని యందు నతడుయధికుడౌను.
    2చెలిని మరువ లేక చింతతో తానయ్యె
    తాగుబోతు ;గొప్ప తాత్త్వికుండు
    మంచి విషయములను మానవాళికి దెల్పి
    సాగుచుండు గాదె సత్పథంబు/?సజ్జనుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      ‘అవనియం దతండె యధికుడౌను’ అనండి. (అతడు+అధికుడు=అత డధికుడు; యడాగమం రాదు).
      రెండవపూరణ చివరిపాదాన్ని ‘సాగుచుండు గాదె సత్పధమున/ సాగుచుం డతండె సజ్జనుండు’ అనండి.

      తొలగించండి
  21. "సర్వోపనిషదో గావో
    దోగ్ధా గోపాలనందనః |
    పార్ధో వత్స స్సుధీర్భోక్తా
    దుగ్ధం గీతామృతం మహత్ ||"

    గోవులుపనిషదుల గోపాలుడుపితికి
    పార్థునకిడెనంట పాలటంచు
    నమృత మిద్దె గీత యనుచును నాపాలు
    ద్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త :)

    రిప్లయితొలగించండి