19, మార్చి 2016, శనివారం

సమస్య – 1977 (నడుమునొప్పి తెచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నడుమునొప్పి తెచ్చెఁ గడుముదమ్ము.

34 కామెంట్‌లు:

  1. లేవ లేక బిలిచె లావణ్య సతినంట
    వేళ మించ కుండ వేచి యుండి
    ప్రేమ తోన దెచ్చె విలువైన మందులు
    నడుము నొప్పి తెచ్చెఁ గడు ముదమ్ము

    రిప్లయితొలగించండి
  2. అ.వె.
    వడ్లు దంచ కలిగె పడుచుల కెంతయొ
    నడుమునొప్పి, తెచ్చెఁ గడుముదమ్ము
    పండుగ, కలివిడిగ పని చేయ వీలుక
    లుగగ, మచ్చరమ్ములు మరచి రట
    - వెంకోరా.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారికి

    యింత నడుము నొప్పి లోనూ మీ సమస్యా సృష్టి మీకు
    తెలుగు మీదున్న తెలుగు పద్యము మీదున్న ప్రేమను చూపుతోంది ! నమస్సులు మీ సంకల్ప బలమునకు


    శంకరాభరణపు శంకరయ్య నడుము
    నొప్పి తెచ్చెనుగద నొక సమస్య
    అచ్చెరువు కవివర అందు కొమ్మ నిచట
    నడుమునొప్పి తెచ్చెఁ గడుముదమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు నమస్కారములు. “గద యొక”; “నచ్చెరువు”; “కవివర యందు” ; “కొమ్మ యిచట” అంటే బాగుంటుంది.

      తొలగించండి

    2. శ్రీ కామేశ్వర రావు గారు,

      నెనర్లు! సవరణలు ఈ 'య' 'న' ల తో మరీ బేజారై పోతోన్డండీ ! య అనుకుని వ్రాస్తే అక్కడ న వస్తోంది :)

      జిలేబి

      తొలగించండి
  4. నడుము మీదకెక్కి నానొప్పి తగ్గింప
    చెలియ తొక్కు చుండ చిన్నగాను
    తనువు పులకరించె తన పాద స్పర్శతో
    నడుమునొప్పి తెచ్చెఁ గడుముదమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాద స్పర్శ .... 'ద' గురువవుతుందేమో కదా
      నడుము మీదకెక్కి నానొప్పి తగ్గింప
      చెలియ తొక్కు చుండ చిన్నగాను
      తనువు పులకరించె తన స్పర్శ మహిమతో
      నడుమునొప్పి తెచ్చెఁ గడుముదమ్ము

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారు నమస్కారములు. “పాదస్పర్శ” లో “ద” గురువే. “తనపదస్పర్శ” లేక “తత్పద స్పర్శ” అనవచ్చు.

      తొలగించండి
    3. గురుతుల్యులు పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్కారములు...మీ సూచనకు ధన్యవాదములు...సవరించిన పూరణ

      నడుము మీదకెక్కి నానొప్పి తగ్గింప
      చెలియ తొక్కు చుండ చిన్నగాను
      తనువు పులకరించె తత్పద స్పర్శతో
      నడుమునొప్పి తెచ్చెఁ గడుముదమ్ము

      తొలగించండి
  5. నడుము నొప్పి కలిగె నాతికి,వైద్యుడు
    కట్టు మనియె నడుము చుట్టు బంధ
    మనగ భర్త కొనెను కనక కలాపమ్ము
    నడుమునొప్పి తెచ్చెఁ గడుముదమ్ము


    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    నడుము నొప్పి వలన బడికి నే సెలవిడి
    శంకరాభరణము వంకఁ జూడఁ;
    గవుల పూరణములు గలిగింప హర్ష; మీ
    నడుము నొప్పి తెచ్చెఁ గడు ముదమ్ము!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్కవీంద్రులు మధుసూదన్ గారు వందనములు. నిన్నటి పద్యము సవరించినందులకు ధన్యవాదములు.

      తొలగించండి
  7. తప్పి పోవునంచు దాయాదుల క్రికెట్టు
    చింతఁ బడుచు నుండ సెలవు కొరకు!
    సన్నిహితుడుఁ జెప్ప సాకుగా దొరికిన
    నడుము నొప్పి తెచ్చెఁ గడు ముదమ్ము!!

    రిప్లయితొలగించండి
  8. నడుము నొప్పి తెచ్చె గడుముదమ్మనుమాట
    సత్య మైన యెడల ,శంకరుండు
    కలుగ జేయు గాక ! కావలసినవార్కి
    నడుము నొప్పి యార్య !విడువ కుండ

    రిప్లయితొలగించండి
  9. తడవ తడవ హితులు తన్ను పలుకరింప
    కడగి పడతి సేవ కరము సేయ
    పడక యిల్లు వదల పనిలేదు వింతగ
    నడుము నొప్పి తెచ్చెఁ గడు ముదమ్ము.

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్య గార్కి చాల బాధాయెను
    నడుమునొప్పి వలన, నిడుమ నైన
    ముదము నరయు వారు, పూరణ కిచ్చిరి
    "నడుమునొప్పి తెచ్చెఁ గడుముదమ్ము."

    రిప్లయితొలగించండి
  11. బిందె నెత్తుచుండ పిల్లదాని కపుడె
    నడుము పట్టి తాను నడువలేక
    చతికిలపడి పోగ చాలు పనులనంగ
    నడుము నొప్పి తెచ్చె గడు ముదమ్ము.
    పనికి బద్దకించి బరువుతగ్గునటంచు
    నడుము నొప్పి తెచ్చు గడు ముదమ్మ
    యనెడి మాట కాదు హర్షణీయమ్మది
    మందు వాడ కున్న కుందు కలుగు

    రిప్లయితొలగించండి
  12. పరుగు బెట్టి పనులు ప్రతిరోజుమాదిరి
    జేయకుండ సతికి సెలవు దొరికె
    పతియె వంటజేసి బ్రతిమాలి దినిపించ
    నడుము నొప్పి దెచ్చె గడు ముదమ్ము!!!

    రిప్లయితొలగించండి
  13. దినము రాత్రి కూడ స్థిరముగా పనిజేసి
    నడుము నెప్పి వచ్చి నడతడబడ
    వండిపెట్టె మగడు స్వంత హస్తమ్ముల
    నడుమునెప్పి తెచ్చె గడుముదమ్ము

    రిప్లయితొలగించండి
  14. తాత దొంగ బుద్ధి తరుణముకై వేచి
    పట్టు బట్టి లాగె బామ్మ చెంగు
    కడు ముదిమి వయసున కార్యమైన పిదప
    నడుము నెప్పి తెచ్చె కడుముదమ్ము !

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. కందిశంకరయ్య కందిన పూరణల్
    ఓర్పుమీర జూడ?ఒదిగియున్న
    నడుము నొప్పి తెచ్చె|”గడుముదమ్మునుగూర్చె
    సృష్టి జేయుకవుల దృష్టి గాంచి|”.
    2.కాలుజార? నడుము కలుకున నొప్పించ?
    ప్రక్కనున్న వనిత చక్కదనము
    పూలజడల నవ్వు పులకింత నేరువ్వ?
    నడుమునొప్పి తెచ్చె గడుముదమ్ము|

    రిప్లయితొలగించండి
  17. గురుతుల్యులకు నమస్కారాలు.

    నీరుతోడతోడనెలతికిఁగలిగెను
    నడుమునొప్పితెచ్చెఁగడుముదమ్ము
    చక్కనైనమాత్రయెుక్కటిరోగయు
    పశమనమునకిదియెపరమదారి

    రిప్లయితొలగించండి
  18. వెజ్జు వచ్చి తెలిపె విశ్రాంతి గైకొన్న
    నొప్పితీరు ననుచు చెప్పెనపుడు
    బంధు జనులు జేరి పరిచర్య లే జేయ
    నడుము నొప్పి దెచ్చె గడుముదమ్ము

    కలికి సున్నిత కర కమలాలు మృదువుగా
    మధ్యమమున తైల మర్ధనమ్ము
    చేయు వేళ మనసు చెంగలించును సుమ్ము
    నడుము నొప్పి దెచ్చె గడుముదమ్ము



    నిన్నటి సమస్య
    "అరిగణమ్ముల గెలిచె నుత్తరుడెసంగి" కి నా పూరణ

    గోగ్రహణమొనరించిన కుటిల సేన
    మదమణచగ వేగ కదలి కదన మందు
    నరిగణమ్ముల గెలిచె నుత్తరు డెసంగి
    యనుచు దలపోసె విరటుడు తనకుదాను.

    రిప్లయితొలగించండి

  19. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గురువుగారికి వ౦దనములు
    మీ నడుము నొప్పినే Subject. గా తీసుకొని
    పూరిస్తున్నాను .
    క్షమి౦చ౦డి

    శ్రీ క౦ది శ౦కరయ్య గారి స్వ గ త ము :--
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    " పద్యసేవనమ్ము పరమార్థ మనియె౦చి ,

    యనుదినము సమస్యలను కవులకు

    నొసగి , వారి నెల్ల. బ్రోత్సహి౦చుచు ను౦దు ,

    చదువులమ్మ మిగుల స౦తసి౦ప. "

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    " త్వరగ నుపశమిల్లు బాధి౦ప దిక నన్ను

    నడుము నొప్పి | తెచ్చె కడు ముదమ్ము

    మీర ల౦పుచున్న. పూరణములు | త ద్ర

    సామృతమ్ము - - వ్యధల కౌషధమ్ము ! !





    ి

    రిప్లయితొలగించండి
  20. జారి పడిన యొకడు జట్టును వీడంగ
    తలుపు తట్టు వాడు తనకు పిలుపు
    తప్పదనుచు, మదిని తలబోసె - 'నవ్వాని
    నడుము నొప్పి తెచ్చె కడు ముదమ్ము '

    రిప్లయితొలగించండి
  21. పంతగించి చేయు పర్వతారోహణ
    నడుమునొప్పి తెచ్చెఁ; గడుముదమ్ము
    నొసగె విజయు డనుచు నుర్వి కీర్తించగ
    నెవ్వరెస్టు నెక్కె నీత డనుచు

    రిప్లయితొలగించండి
  22. నిన్నటి సమస్యకు పూరణ..

    ఆముదమును దెచ్చి యరచేత నిమురుచు
    సఖియ మర్దనమ్ము సరిగ జేయ
    నా ముదమును దలువ నాగిలిగింతల
    నడుము నొప్పి దెచ్చె గడు ముదమ్ము.

    రిప్లయితొలగించండి
  23. భడవ పిల్ల లెల్ల బండ యల్లరి జేయ
    పడుచు వయసు త్వరిత మడగి పోవ...
    అడిగి యడిగి మగడు గొడవ జేసిన రాత్రి
    నడుమునొప్పి తెచ్చెఁగడుముదమ్ము :)

    రిప్లయితొలగించండి